Publish Date:Jul 25, 2018
Publish Date:Jul 25, 2018
Publish Date:Jul 24, 2018
Publish Date:Jul 24, 2018
Publish Date:Jul 24, 2018
Publish Date:Jul 23, 2018
Publish Date:Jul 23, 2018
Publish Date:Jul 23, 2018
Publish Date:Jul 21, 2018
Publish Date:Jul 21, 2018

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
ప్రతి సినిమా ఫంక్ష‌న్‌కీ సరికొత్త ఎజెండాతో వస్తున్నాడు అల్లు అర్జున్. ఫంక్ష‌న్ ఫంక్ష‌న్‌కీ అతడి మాట‌ల్లో ఎంతో ప‌రిణితి క‌నిపిస్తుంది. గతంలో ఒకసారి అల్లు అర్జున్ స్పీచ్ వివాదాస్పదమైంది. తరవాత కొన్ని రోజులు సోషల్ మీడియాలో కొందరు అతణ్ణి టార్గెట్ చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదే సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన సినిమా ఫంక్షన్‌లో మాట్లాడినా... ఇతర హీరోల సినిమా ఫంక్ష‌న్స్‌కి అతిథిగా వచ్చి మాట్లాడినా... ఓ మంచి విషయాన్ని అల్లు అర్జున్ చెబుతున్నాడు. 'టాక్సీవాలా' ఫంక్ష‌న్‌లో రచయితలకు గౌరవం ఇవ్వాలని చెప్పాడు. అంతకు ముందు తన సినిమా ఫంక్ష‌న్లలో కొందరు రచయితలను గౌరవించాడు. లేటెస్టుగా 'పడి పడి లేచి మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖులందరికీ గౌరవం ఇవ్వాలని చెప్పాడు. ప్రతి ఒక్కరినీ 'గారు' అని పిలవాలని కోరాడు. దీనికి కారణం టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రముఖుల్ని కొందరు వ్యక్తులు ఏక వచనంతో పిలవడం తనకు నచ్చలేదని అల్లు అర్జున్ అన్నాడు. "టీవీల్లో.. సమాజంలో... సినిమా సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను ఏక వచనంతో పిలుస్తున్నారు. ముఖ్యమంత్రులను కూడా. ఏ కేసీఆర్, ఏ చంద్రబాబునాయుడు.. అంటున్నారు. అరేయ్.. ఒరేయ్.. ఏంటిది? విమర్శించవచ్చు... తప్పు లేదు. కానీ, గౌరవించాలి. చంద్రబాబునాయుడు గారు.. కేసీఆర్ గారు.. అనాలి. 'గారు' అన్నాక... విమర్శించండి" అని అల్లు అర్జున్ అన్నాడు. ఇంకా స్టయిలిష్ స్టార్ మాట్లాడుతూ "మొన్న ఓసారి టీవీ చూస్తుంటే ఎవడో ఒకడు 'ఏయ్... చిరంజీవిని పిలువ్' అంటున్నాడు. చిరంజీవి అనడం ఏంట్రా? చిరంజీవిగారు. అందరూ నేర్చుకోండి.. పవన్ కల్యాణ్ గారు. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు. సమాజంలో ఎవరికైనా గౌరవం ఇవ్వడంలో తప్పే లేదు. ఇష్టం వున్నా.. లేకున్నా... ఎదుటివ్యక్తిని గౌరవించాలి. వినడానికి ఆర్టిఫీషియల్ గా ఉన్నా.. మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి" అన్నాడు. ఇటీవల చిరంజీవిని, పవన్ క‌ల్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఏక వచనంతో సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. అటువంటి వీడియోలకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని ఇండస్ట్రీ గుసగుస. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదని మాట్లాడటం వెనుక అర్థం అదే అంటున్నారు. అదండీ సంగతి.
  రోబో.. ఫస్ట్ వెర్షన్. '2.ఓ'.. రోబోకి అడ్వాన్స్డ్ వెర్షన్. 'రంగస్థలం'లో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు క్యారెక్టర్ ఫస్ట్ వెర్షన్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేయ‌బోయే క్యారెక్టర్ చిట్టిబాబుకు అడ్వాన్స్డ్ వెర్షన్ అట. అంటే... లేడీ చిట్టిబాబు '2.ఓ' అన్నమాట! రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్. గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసిన విఐ ఆనంద్... రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో పాయల్ క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారట.     ఒక్క ముక్కలో ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే... అమ్మాయికి సరిగా కనపడదు, సరిగా వినపడదు. చూపు మందగించడంతో పాటు వినికిడి సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ కనిపిస్తారు. 'రంగస్థలం'లో చిట్టిబాబు సమస్య ఏంటి? అతడికి వినికిడి లోపం. రవితేజ సినిమాలో హీరోయిన్‌కి వినికిడి లోపంతో పాటు చూపు సమస్య కూడా ఉంది. చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ సౌండ్ ప్లస్ లుక్ ఇంజినీర్. మొదటి సినిమా 'ఆర్.ఎక్స్ 100'లో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ మరో ప్ర‌యోగానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న మాట‌!
సాయి పల్లవి అభిమానుల్లో ఓ పెద్ద స్టార్ హీరో ఉన్నార‌ని 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పారు. సదరు స్టార్ హీరో ఎవరు? అనేది మాత్రం చెప్పలేదు. "సాయి పల్లవికి చాలామంది అభిమానులు ఉన్నారు. పబ్లిక్‌లోనే కాదు... ఆమెకు ఓ పెద్ద స్టార్ హీరో పెద్ద ఫ్యాన్. నన్ను అడగొద్దు.. అతను ఎవరో నేను చెప్పను" అని అల్లు అర్జున్ సెలవిచ్చారు. అందర్నీ స‌స్పెన్స్‌లో పడేశారు. అందువల్ల, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ప్రస్తుతం ప్రేక్షకులకు ఇదో పజిల్. అల్లు అర్జున్‌నీ, సాయి పల్లవినీ అభిమానించే ప్రేక్షకులకు శుభవార్త ఏంటంటే.. సాయి పల్లవికి అల్లు అర్జున్ కూడా ఫ్యాన్. ముఖ్యంగా 'ఫిదా' పోరి డ్యాన్సులకు. 'వచ్చిండే.. మెల్లగ వచ్చిండే' పాటను బన్నీ విపరీతంగా చూశాడట. సాయి పల్లవి కంటే తనే ఆ పాటను ఎక్కువసార్లు చూసి ఉంటానని స్టయిలిష్ స్టార్ చెప్పాడు. సాయి పల్లవితో సినిమా చేసే అవకాశం వస్తే.. సన్నివేశాల కంటే సాంగులో డ్యాన్స్ చేయాలని ఎక్కువ ఎదురు చూస్తున్నానని తన మనసులో మాటను అల్లు అర్జున్ బయట పెట్టాడు. బన్నీ అంత డైరెక్టుగా చెప్పాడు కనుక.. త్వరలో అతడి పక్కన కథానాయికగా నటించే అవకాశం సాయి పల్లవికి ఖాయం అనుకోవచ్చు. సాయి పల్లవికి ఓ స్టార్ హీరో అభిమాని అని చెప్పిన అల్లు అర్జున్.. హీరో శర్వానంద్‌కి కామెడీ చేయడం రాదని ఓ పెద్ద దర్శకుడు తనతో అన్నాడని అల్లు అర్జున్ మరో పజిల్ ఇచ్చారు. 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శర్వానంద్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ "శర్వా అంటే నాకు ఇష్టం. తను మంచి నటుడు. బెస్ట్ పెర్ఫార్మర్. ఇదే మాట ఓ దర్శకుడితో అంటే 'శర్వా చేయడం రాదు' అన్నారు. ఇప్పటివరకూ శర్వా కామెడీ, ఎంటర్టైన్మెంట్ రోల్స్ చేయలేదు. వస్తే బాగా చేస్తాడు' అన్నాను. ఆ దర్శకుడు చేయలేదని అన్నారు. 'రన్ రాజా రన్' విడుదల తరవాత అతడికి ఫోన్ చేసి.. 'శర్వాకు కామెడీ చేయడం రాదని అన్నారుగా' అన్నాను. తనది తప్పని దర్శకుడు ఒప్పుకున్నారు. మేమంతా సినిమా నేపథ్యం నుంచి వచ్చాం. శర్వా తనకు తానుగా ఎదిగాడు. సెల్ఫ్ మేడ్ హీరో" అన్నారు. శ‌ర్వానంద్‌ని విప‌రీతంగా పొగిడారు అల్లు అర్జున్. హీరో శర్వానంద్ విషయంలో కూడా అల్లు అర్జున్. కానీ, ఆ దర్శకుడు పేరు మాత్రం చెప్పలేదు. శర్వాకి కామెడీ చేయడం రాదని ఎవరు అన్నారో మరి! అసలు విషయం చెప్పి.. సదరు విషయం ఎవరన్నారో చెప్పకపోతే ఎలా? వాళ్లు ఎవరో కనిపెట్టాలని మీడియాతో పాటు ప్రేక్షకులు ప్రిపేర్ అవుతున్నారు.
నందమూరి హరికృష్ణ మరణం తరవాత... ముఖ్యంగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్ర విజయోత్సవం తరవాత... బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని, జూనియర్‌ని బాలయ్య దగ్గర తీశాడని ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు భావించారు. కానీ, ఇద్దరి మధ్య దూరం తగ్గలేదని నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్  'యన్.టి.ఆర్' ఆడియో వేడుక అతిథుల జాబితా చూస్తే అర్థమవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నెల 21న 'యన్.టి.ఆర్' ఆడియో విడుదల చేయనున్నారు. భారీ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ ఎన్టీఆర్ సన్నిహిత నిర్మాతలు, దర్శకులు, నటీనటుల్ని పిలవాలని బాలకృష్ణ నిర్ణయించారు. నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు అందరికీ ఆహ్వానాలు అందాయట. ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కి తప్ప. అతణ్ణి ఆహ్వానించే విషయంలో బాలకృష్ణ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నటనలోనూ, పేరుతోనూ తాతయ్యకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియ‌ర్‌... తాతయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో కనిపించడం దాదాపుగా అసాధ్యమని ఇండస్ట్రీ టాక్.... ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో బాలయ్య మనసు మారితే తప్ప!
యంగ్ రెబ‌ల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు, భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సాహో'. ఎందుకంటే... 'బాహుబలి 2' తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా. అంతే కాదు... హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్. 'సాహో' మేకింగ్ వీడియో విడుదల తరవాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే... చాలా రోజుల నుంచి ఈ సినిమా మేకింగ్‌లోనే ఉంది. ప్రభాస్ అభిమానులు మేకింగ్ వీడియోతో సంతోషపడినా... సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ముందు 2019 వేసవిలో సినిమా విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. సమ్మర్‌లో 'సాహో ' విడుదల కావడం లేదు. స్వాతంత్ర్య దినోత్సవానికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు, యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఈ రోజు ప్రకటించారు. ఆగస్టు 15, 2019న 'సాహో' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. హిందీతో పాటు దక్షిణాది నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, మందిరా బేడీ, ఎలివీన్ శర్మ తదితరులు సినిమాలో నటిస్తున్నారు.
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 
  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 
  జపాన్ ఈ పేరు వినగానే ముందుగా కళ్లేదుట కనిపించేది హిరోషియా, నాగసాకి అణు విలయం. జపానికి లొంగిపోవడానికి సిద్ధపడింది. అయినా అమెరికా అత్యంత అమానవీయ పద్ధతిలో ఈ రెండు నగరాలపై అణుబాంబులు వేసింది. ఈ దాడులలో దాదాపు 2 లక్షలకు పైగా చనిపోయారు. ఆ దాడుల దుష్ఫరిణామాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంటే నాటి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నిత్యం భూకంపాలతో సహవాసం, అగ్నిపర్వతాల విస్పోటనాలు, కబళించే సునామీలు అలాంటి దేశం ఆత్మవిశ్వాసంతో, ప్రజల శ్రమశక్తితో, దేశభక్తితో అభివృద్ధి విషయంలో అగ్రరాజ్యాల సరసన నిలబడింది.                 ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్ పౌరుడు. ఆయన తొంభై సంవత్సరాల వయసు వరకు పనిచేస్తూనే ఉన్నాడు. అంతే కాదు జపనీయుల సగటు జీవిత కాలం 86.3 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో జపాన్‌కు అది ఎలా సాధ్యమైంది అంటే అందుకు కారణం వారి శ్రమ శక్తి, ఆహారపు అలవాట్లు.   * వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరిఅన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా        తీసుకుంటారు.   * మన దేశాల్లో వృద్ధులంటే చిన్పచూపు. ఎప్పుడెప్పుడు వారిని వదిలించుకుందామా అంటూ ఎదురుచూస్తారు వాళ్ల పిల్లలు.    కాని జపాన్‌‌లో వృద్ధుల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వైద్య  సదుపాయం తేలిగ్గా అందుబాటులో  ఉంటుంది.   * జపాన్ ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల మీద మంచి    ప్రభావాన్ని చూపుతోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వీటన్నింటిపై వారి శ్రద్ధ కనిపిస్తోంది.  దానికి తోడు అక్కడ షింటో అనే సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా  ఉండాలని జపాన్ వారు నమ్ముతారు.   * వీరిలో ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలల్లోనూ..కర్మాగారాలు, కార్యాలయాల్లో ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది.   * ఆహారాన్ని పీకల దాకా తొక్కకుండా, 80 శాతం పొట్టనిండగానే తినడం ఆపేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు.   సో..జపాన్ చాలా గొప్పదేశమండీ..నాశనం అయినా ఎంత గొప్పగా డెవలప్ అయ్యిందో చూశారా..? అని స్టాటిస్టిక్స్ చూసి ముఖం చిట్లించుకోనక్కరలేదు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమి ఓవర్ టైం చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. మొత్తానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే  జపాన్‌ని ప్రపంచంలో అత్యున్నత  స్ధితిలో నిలబెట్టింది.
  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara
  Facebook is the new mantra in our social relations. While it can turn strangers into best friends, or bring back the lost friendships… it can also turn out to be disastrous if mishandled. A few tips to avoid the perils of facebook…   Mutual friends! Be careful whom you are making friends. We often respond to the requests of the unknown. Having a mutual friend is not at all a safe criterion to accept a stranger as a friend. Being a mutual friend is often a safest ploy sinners use to make friends. One friend among your circle who has dumbly responded for his request would turn out to be `mutual` to assure the rest.  So never respond to the friend’s request of a stranger until and unless you are sure of his personality! Be sure of your actions: Once we are on the Facebook, we feel like free birds! We hit the `like` buttons, we use the `share` options, and we make `comment`s. Be aware that most our actions might go public. Friends from other circles would always have a chance to watch your actions and react!  A word that was said might be compensated, but an action on Facebook might be irreversible. So please be assured while you get active on Facebook! Rude, obscene, offensive and sensitive posts and comments on Facebook might prove disastrous.  Never cross the limit: Remember that Facebook is a public dais. What you share with others might be recorded. So never lose your privacy on Facebook. Don’t share your personal information with friends and never with strangers on FB. The photos you send and the chat you have made can always be stored in digital formats by the receivers. Whatever your age is and whatever your circumstances are… never ever share private moments on Facebook until and unless you are ready for the consequences. Logging out: Be sure that you’ve logged out of the Facebook on all the devices, when you’ve completed the session. Someone might use your open account either to hack your information or to tease your friends. If you are not sure that you have logged out of all devices, go to the `settings` menu in the Facebook and select the `Security` option. Select `Where you are logged in` option to know your browsing activities. Click on `End all activity` to close all the sessions of your Facebook that are presently active. Privacy settings: Facebook indeed has many settings that assure our privacy. But most of the users are either careless or ignorant of such settings. We can always change our settings for a safer perspective. Go to the `Privacy` option in the `Settings` menu and choose the best options to suit your privacy. Options like `Who can see my stuff? `, `Who can contact me? `, `Who can look me up? `… can be changed as per your wish.   - Nirjara
  తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై సినీ హీరో సుమన్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టంకట్టడం సంతోషకరమని సుమన్ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం తనకు మొదట నుంచి ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు సొంతం చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు కష్టపడి పని చేసి ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే.. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఒక టర్మ్ సరిపోదని. పదేళ్లు కావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, టీఆర్ఎస్ మెజారిటీ ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోరితే టీఆర్ఎస్ పార్టీతో కలసి పనిచేయటానికి సిద్ధమని సుమన్ స్పష్టం చేశారు.  తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని సుమన్ అన్నారు. కేసీఆర్ .. తన పిల్లలకు రాజకీయాలపై మంచి తర్ఫీదు ఇచ్చారని చెప్పారు. కేటీఆర్‌కు వయస్సుకు మించిన పరిపాలనా అనుభవం ఉందని, ఆయనకు ముఖ్యమంత్రిగా పనిచేసే సమర్థత ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం సహజమని, కేసీఆర్, చంద్రబాబు విమర్శలను కూడా అలానే చూడాలని సుమన్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలపై ఒక్కొక్కరది ఒక్కో ఆలోచన అని.. ఎవరు ఏ ఫ్రంట్‌కు మద్దతిచ్చినా తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
  తెలంగాణలో కూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటా అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. దీంతో బండ్ల కోసం మీడియా వెతుకులాట మొదలెట్టింది. ఎక్కడా బండ్ల కనిపించిన దాఖలు లేవు. ఫలితాలపై మాట్లాడింది లేదు. ఎట్టకేలకు తాజాగా ఆయన తన వ్యాఖ్యలపై స్పందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన బండ్ల గణేష్ అక్కడ మీడియాతో మాట్లాడారు. 'అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. నేనేం అజ్ఞాతంలో లేను. మేము ఊహించని విధంగా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా బాధతో ఉన్నాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాంలే.. ప్రజలు మనల్ని తిరస్కరించారు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి. మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని ఊరుకున్నా' అని చెప్పుకొచ్చారు. నేటి ఓటమే రేపటి విజయానికి పునాది అని బండ్ల అనటం కొస మెరుపు. గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రస్తావించగా.. ‘‘కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది.’’ అని బదులిచ్చారు.
  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తున్న టీడీపీ ఎంపీలు..పార్లమెంట్ సమావేశాల్లో మరోమారు కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం కూడా మరోమారు తేల్చిచెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ.. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. 14 వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపారు.  మరోవైపు ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా  పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంట్ ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది.
  పోకెమాన్‌గో లాంటి వీడియోగేమ్స్‌తో ఇప్పటి యువత వెర్రెత్తిపోతోందని పెద్దలు తిట్టుకోవచ్చుగాక! కానీ సాంకేతికతను ఉపయోగించుకునే నేర్పు తెలియాలే కానీ ఆ వీడియోగేమ్స్‌తోనే అద్భుతమైన పరిశోధనలు చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.   దారి తప్పిపోతారు మతిమరపు అనే మాట చాలా చిన్న పదమే కావచ్చు. కానీ అది ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు జీవితం నరకప్రాయమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి మతిమరపు వ్యాధులతో మనిషి తన జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సాధారణంగా మనిషి తను రోజూ వెళ్లే చోటుకి కూడా వెళ్లలేక దారితప్పిపోతుంటే, అతనిలోని మతిమరపు తీవ్రరూపాన్ని దాల్చిందని తెలుసుకుంటారు. అందుకనే ఇలా దారి తప్పిపోవడం/ కనుక్కోవడం అన్న సూత్రం ఆధారంగా బ్రిటన్‌ శాస్ర్తవేత్తలు ఒక వీడియోగేమ్‌ను రూపొందించారు.   Sea Hero Quest   ఇదే ఈ వీడియో గేమ్ పేరు. ఇందులో ఒక వయసు మళ్లిన నావికుడు తన గమ్యాన్ని మర్చిపోతాడు. మనం అతనికి సాయపడుతూ తిరిగిన అతని దారులన్నింటినీ గుర్తుచేయడమే ఈ ఆటలోని లక్ష్యం. ఇందులో భాగంగా ద్వీపాలను చుట్టుకుంటూ, మంచుకొండలను తప్పించుకుంటూ నావని నడిపించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మన బంధువులకు నావ ఉనికి తెలిసేలా ఆకాశంలోకి తారాజువ్వలను వదలడం, కొన్ని సూచనల ఆధారంగా దిశను మార్చుకోవడం చేస్తుండాలి.   పాతిక లక్షలమంది ఆటగాళ్లు 3D టెక్నాలజీ ఏ వీడియోగేమ్‌కీ తీసిపోని విధంగా ఈ Sea Hero Quest సాగుతుంది. అందుకనే దీనిని ఏకంగా పాతిక లక్షలమంది డౌన్లోడ్‌ చేసుకుని ఆడారు. ఆటగాళ్లు ఈ ఆటని ఆడేటప్పుడు వారి ప్రతీ చర్యా రికార్డు అవుతుంది. అది పరిశోధకులకు చేరుతుంది. దాని ద్వారా వేర్వేరు వయసులవారిలో ‘సరైన దారులని కనుక్కోగలగడం’ అనే సామర్థ్యం ఎంతమేరకు ఉందో పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాదు! దారులను గుర్తుంచుకోవడంలో స్త్రీ పురుషుల మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో గ్రహించగలుగుతారు. ఇంకా వేర్వేరు దేశాల వారి మధ్య ఈ నైపుణ్యంలో ఏమన్నా తేడా ఉందేమో తెలిసిపోతుంది.   ఇవీ ఫలితాలు! మనుషులలో మతిమరపుని గమనించడం అనే అత్యంత క్లిష్టమైన పరిశోధన Sea Hero Quest ద్వారా అతి సులువుగా సాగిపోయిందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ ఆటని రెండు నిమిషాలపాటు ఆడితే అది ల్యాబొరేటరీలో 5 గంటలు పరిశోధన చేసినదానితో సమానమట. అలా దాదాపు 9,500 సంవత్సరాలతో సమానమైన ఫలితాలను శాస్త్రవేత్తలు సాధించగలిగారు. వాటిని నిశితంగా గమనించేందుకు చాలా సమయమే పడుతుంది. కానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఇవీ...   - 19 ఏళ్ల నుంచి దారిని గుర్తుంచుకొనే సామర్థ్యం నిదానంగా తగ్గిపోతుందట. 19 ఏళ్ల వయసులో 74 శాతంగా ఉన్న ఈ సామర్థ్యం 75 ఏళ్లు వచ్చేసరికి కేవలం 46 శాతమే ఉంటుంది. - దారిని గుర్తుంచుకోవడంలో ఆడవారికంటే మగవారి నిపుణుత ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది స్వతహాగా వారు బయటతిరగడం వల్ల ఏర్పడిందా లేకపోతే తరచూ వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల వాళ్లు లక్ష్యాన్ని ఛేదించగలిగారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. - నార్డిక్‌ దేశాలు అనబడే డెన్మార్క్‌, స్వీడన్‌ వంటి దేశ ప్రజలు మిగతావారితో పోలిస్తే త్వరగా దారిని పోల్చుకుంటారని బయటపడింది. బహుశా ఈ సామర్థ్యం వారి జన్యువులలోనే నిక్షిప్తం అయి ఉంటుందని భావిస్తున్నారు.   ఏది ఏమైనా ఈ Sea Hero Quest మతిమరపు మీద సరికొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. దీని ద్వారా అల్జీమర్స్‌ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటికి చికిత్సను మొదలుపెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. అసలు మతిమరపు ఎందుకు ఏర్పడుతుంది? దానిని నివారించే అవకాశం ఏదన్నా ఉందా? అనే ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నమూ ఈ పరిశోధనతో ఊపందుకున్నట్లయ్యింది.     - నిర్జర.
  క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే పరిస్థితి.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రాణాంతకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మ. మన రోజువారి ఆహారంలో దానిమ్మను చేర్చడం వల్ల క్యాన్సర్‌ దరిచేరకుండా చేయవచ్చు. ఇది ఒక్కటే కాకుండా దానిమ్మ వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  
  Do you know what it means to have weakness, fatigue or light-headedness along with rapid heartbeat, pale skin and a sore tongue? These are some symptoms of B 12 deficiency! We often don't care to check if our body is getting the right nutrition from the food we eat. This can be very dangerous. Something that can be taken care of easily could lead you to the hospital. To avoid that it is best to know the B 12 vitamins more closely. For you to understand its importance, let me first tell you what its major function is. B 12 cares for your brain and nervous system while helping in formation of blood in your body. It is advised to be taken orally for best results. Different countries have set different amounts as minimum requirements of the human body. For instance in the U.S it is suggested to have  2 to 3 µg per day where as U.K recommends 1.5 µg per day. However, the Center for Food Safety and Applied Nutrition recommends 6 µg per day, for an adult depending on his or her calorie intake each day. The nutrition measurements for an expecting mother are completely different. The recommended amount of vitamin B 12 in pregnant women is 2.6 µg per day and 2.8 µg during lactation periods. If these requirements are fulfilled, both the mother and the baby can experience the bliss of good health. Now let us see how we can prevent our body from being deprived of this essential vitamin. meat, poultry, seafood, dairy products, and eggs will not allow B 12  to escape from your body. If being a vegetarian is worrying you then I have an alternative. A bowl full of  cereal fortified with vitamin B12 for breakfast can do the magic for you! So, make B 12 you best friend and enjoy a long and healthy life.    - Kruti Beesam
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.