Publish Date:Jul 28, 2018
Publish Date:Jul 28, 2018
Publish Date:Jul 28, 2018
Publish Date:Jul 27, 2018
Publish Date:Jul 27, 2018
Publish Date:Jul 27, 2018
Publish Date:Jul 26, 2018
Publish Date:Jul 26, 2018
Publish Date:Jul 26, 2018
Publish Date:Jul 25, 2018
Publish Date:Jul 25, 2018

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
పవన్ కల్యాణ్ 'పంజా', ఎన్టీఆర్ 'శక్తి', మంచు విష్ణు 'అస్త్రం' సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్‌కి తెలుగు సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఈ యువ హీరో తెలుగు రీమేక్‌ల‌తో హిందీలో యాక్షన్ హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయమైన 'హీరోపంతి' అల్లు అర్జున్ 'పరుగు'కు రీమేక్. తరవాత ప్రభాస్ 'వర్షం' సినిమాను హిందీలో 'బాఘీ' పేరుతో రీమేక్ చేశాడు. 'బాఘీ'కి సీక్వెల్ అంటూ అడివి శేష్ 'క్షణం'ను రీమేక్ చేశాడు. తెలుగు సినిమాల్లో, ఆయా కథల్లో మెయిన్ పాయింట్స్  తీసుకుని 'బాఘీ' సిరీస్ సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశాడు. తెలుగు ప్రేక్షకులు 'బాఘీ', 'బాఘీ 2' చూసి పెదవి విరిస్తే... హిందీ ప్రేక్షకుల్లో యాక్షన్ సినిమా ప్రేమికులు ఆదరించడంతో వసూళ్లు బాగా వచ్చాయి. తాజాగా టైగర్ ష్రాఫ్ 'బాఘీ 3' అనౌన్స్ చేశాడు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మించే ఈ సినిమా మార్చి 6, 2020న విడుదల చేస్తామని కూడా చెప్పాడు. 'బాఘీ 3' ప్రకటన తరవాత తెలుగు ప్రేక్షకులకు వచ్చిన సందేహం ఒక్కటే.. ఈసారి ఏ తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్నాడో? మరోసారి తెలుగు సినిమాను రీమేక్ చేస్తాడా? అని! వెయిట్ అండ్ సీ... టైగర్ ష్రాఫ్ ఏం చెబుతాడో? టైగర్ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుగు సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఎక్కువ!
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'పైసా వసూల్'. ఇందులో ఓ హీరోయిన్‌గా, శ్రియ సిస్టర్ క్యారెక్ట‌ర్‌లో నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు ముస్కాన్ సేథీ. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుందామె. విచిత్రం ఏంటంటే... రెండు సినిమాల దర్శకులు పేరు ఒక్కటే. 'పైసా వసూల్' తరవాత నిర్మల్ నేపథ్యంలో తెలంగాణ సంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ కొత్త దర్శకుడు శ్రీనివాస రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి ముస్కాన్ సేథీ అంగీకరించారు. తాజాగా తెలుగులో మరో సినిమా అంగీకరించిందామె. తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు  నాగార్జున 'ఢమరుకం' ఫేమ్  శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఇద్దరు శ్రీనివాసుల్లో ఒకరు దర్శకత్వానికి కొత్త అయితే... మరొకరు అనుభవజ్ఞులు. గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ జంటగా నటించే సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందట.
బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల ఎప్పుడూ  విన‌య విధేయ‌త‌ల‌తో ఉంటాడు అబ్బాయ్ రామ్ చ‌ర‌ణ్. ఏదైనా సినిమా ఫంక్ష‌న్ ల‌లో బాబాయ్ గురించి ప్ర‌స్తావించి మెగా అభిమానుల‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంటాడు. అలా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగిన వ‌రుణ్ తేజ్ న‌టించిన ` అంత‌రిక్షం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌ణ్ లో రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ...`` ఎన్నో ఫంక్ష‌న్స్ కు వెళ్తుంటాం. ఎన్నో  స్చీచ్ లు వింటుంటాం.  మ‌నకు ఇష్ట‌మైన యాక్ట‌ర్స్ గానీ, వ్య‌క్తులు గానీ చెప్పే విష‌యాలు వింటున్న‌ప్పుడు గుండెల నిండా అర‌వాల‌ని పిస్తుంది. అభిమానులు ఆ అవ‌కాశం ఉంటుంది. మాకు అర‌వాల‌ని ఉన్నా కానీ అర‌వ‌లేం. ఇటీవ‌ల బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్పీచ్ నా మ‌న‌సులోకి దూసుకుపోయింది. ``రోజూ మ‌నం భ‌య‌ప‌డే ప‌ని, భ‌యంతో ఆపేయాల‌నిపించే ఓ ప‌నిని పూర్తి చేసి స‌క్సెస్ సాధించాల‌ని చెప్పారు. అది నిజంగా నాకు చాలా ఇన్ స్పిరేష‌న్ గా అనిపించింది. యూత్ అంతా ఇలాంటి మాట‌లు ఎవ‌రు చెప్పినా ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. ఇంకా సినిమా గురించి చెబుతూ`` అంత‌రిక్షం` ట్రైల‌ర్ చూసాను. అద్భుంగా ఉంది.  ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప‌నుకుంటున్న ఈ త‌రుణంలో వ‌రుణ్ రెండు సినిమాలు చేస్తూ ఆశ్చ‌ర్య ప‌ర‌స్తున్నాడు.  రెండేసి సినిమాలు చేసి అభిమానుల ముందుకు రావాల‌ని నాకూ ఉంటుంది.  ఇంత మంచి ట్రైల‌ర్ ఇటీవ‌ల కాలంలో చూడ‌లేదు. రాజ‌మౌళి, సుకుమార్, క్రిష్ వంటి గొప్ప ద‌ర్శ‌కుల జాబితాలోకి సంక‌ల్ప్ కూడా రావాలి.  ఇక వ‌రుణ్ ఎప్పుడూ న‌న్ను షాక్ కి గురి చేస్తుంటాడు. కొన్ని సార్లు వ‌రుణ్ విష‌యంలో ఆనంద‌ప‌డ్డాను. కొన్ని సార్లు అసూయ‌పడ్డాను. అంత సెల‌క్టివ్ గా, అంత మంచి సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు`` అన్నారు.
ప్రతి సినిమా ఫంక్ష‌న్‌కీ సరికొత్త ఎజెండాతో వస్తున్నాడు అల్లు అర్జున్. ఫంక్ష‌న్ ఫంక్ష‌న్‌కీ అతడి మాట‌ల్లో ఎంతో ప‌రిణితి క‌నిపిస్తుంది. గతంలో ఒకసారి అల్లు అర్జున్ స్పీచ్ వివాదాస్పదమైంది. తరవాత కొన్ని రోజులు సోషల్ మీడియాలో కొందరు అతణ్ణి టార్గెట్ చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదే సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన సినిమా ఫంక్షన్‌లో మాట్లాడినా... ఇతర హీరోల సినిమా ఫంక్ష‌న్స్‌కి అతిథిగా వచ్చి మాట్లాడినా... ఓ మంచి విషయాన్ని అల్లు అర్జున్ చెబుతున్నాడు. 'టాక్సీవాలా' ఫంక్ష‌న్‌లో రచయితలకు గౌరవం ఇవ్వాలని చెప్పాడు. అంతకు ముందు తన సినిమా ఫంక్ష‌న్లలో కొందరు రచయితలను గౌరవించాడు. లేటెస్టుగా 'పడి పడి లేచి మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖులందరికీ గౌరవం ఇవ్వాలని చెప్పాడు. ప్రతి ఒక్కరినీ 'గారు' అని పిలవాలని కోరాడు. దీనికి కారణం టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రముఖుల్ని కొందరు వ్యక్తులు ఏక వచనంతో పిలవడం తనకు నచ్చలేదని అల్లు అర్జున్ అన్నాడు. "టీవీల్లో.. సమాజంలో... సినిమా సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను ఏక వచనంతో పిలుస్తున్నారు. ముఖ్యమంత్రులను కూడా. ఏ కేసీఆర్, ఏ చంద్రబాబునాయుడు.. అంటున్నారు. అరేయ్.. ఒరేయ్.. ఏంటిది? విమర్శించవచ్చు... తప్పు లేదు. కానీ, గౌరవించాలి. చంద్రబాబునాయుడు గారు.. కేసీఆర్ గారు.. అనాలి. 'గారు' అన్నాక... విమర్శించండి" అని అల్లు అర్జున్ అన్నాడు. ఇంకా స్టయిలిష్ స్టార్ మాట్లాడుతూ "మొన్న ఓసారి టీవీ చూస్తుంటే ఎవడో ఒకడు 'ఏయ్... చిరంజీవిని పిలువ్' అంటున్నాడు. చిరంజీవి అనడం ఏంట్రా? చిరంజీవిగారు. అందరూ నేర్చుకోండి.. పవన్ కల్యాణ్ గారు. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు. సమాజంలో ఎవరికైనా గౌరవం ఇవ్వడంలో తప్పే లేదు. ఇష్టం వున్నా.. లేకున్నా... ఎదుటివ్యక్తిని గౌరవించాలి. వినడానికి ఆర్టిఫీషియల్ గా ఉన్నా.. మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి" అన్నాడు. ఇటీవల చిరంజీవిని, పవన్ క‌ల్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఏక వచనంతో సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. అటువంటి వీడియోలకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని ఇండస్ట్రీ గుసగుస. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదని మాట్లాడటం వెనుక అర్థం అదే అంటున్నారు. అదండీ సంగతి.
  రోబో.. ఫస్ట్ వెర్షన్. '2.ఓ'.. రోబోకి అడ్వాన్స్డ్ వెర్షన్. 'రంగస్థలం'లో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు క్యారెక్టర్ ఫస్ట్ వెర్షన్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేయ‌బోయే క్యారెక్టర్ చిట్టిబాబుకు అడ్వాన్స్డ్ వెర్షన్ అట. అంటే... లేడీ చిట్టిబాబు '2.ఓ' అన్నమాట! రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్. గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసిన విఐ ఆనంద్... రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో పాయల్ క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారట.     ఒక్క ముక్కలో ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే... అమ్మాయికి సరిగా కనపడదు, సరిగా వినపడదు. చూపు మందగించడంతో పాటు వినికిడి సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ కనిపిస్తారు. 'రంగస్థలం'లో చిట్టిబాబు సమస్య ఏంటి? అతడికి వినికిడి లోపం. రవితేజ సినిమాలో హీరోయిన్‌కి వినికిడి లోపంతో పాటు చూపు సమస్య కూడా ఉంది. చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ సౌండ్ ప్లస్ లుక్ ఇంజినీర్. మొదటి సినిమా 'ఆర్.ఎక్స్ 100'లో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ మరో ప్ర‌యోగానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న మాట‌!
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 
  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 
  ఆయనో పేరు మోసిన వైద్యుడు. ఏదో కాన్ఫరెన్సులో పాల్గొనేందుకని దేశ రాజధానికి బయల్దేరాడు. కానీ అంత వైద్యుడిని కూడా దురదృష్టం వెన్నాడింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో విమానం కాస్తా మధ్యలోనే మరో ఊరిలో ఆగిపోయింది. ఒక పక్క చాలా అత్యవసరమైన కాన్ఫరెన్స్‌, మరో పక్క వాతావరణం చూస్తే ఇలా! దాంతో వైద్యునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆ ఊరిలో తనకు తెలిసిన మిత్రులని వాకబు చేసి ఒక కారుని అద్దెకు తీసుకున్నాడు. ఏదైతే అదయ్యిందనుకుంటూ ఆ కారులోనే తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు బయల్దేరాడు.   ఆకాశమే కారుమబ్బులతో కమ్ముకుపోయి ఉంటే... నేల మీద మాత్రం వర్షం కురవకుండా ఉంటుందా! వైద్యుడు కారులో బయల్దేరిన కాసేపటికే హోరున గాలి, జోరున వర్షం మొదలైంది. ఓ రెండు గంటలలో గమ్యం చేరుకుందామనుకున్న వైద్యుడి ఆశ నిరాశగా మారిపోయింది. ఎడతెరిపిలేని ఆ వర్షంలో ఆయన కారు ఎటుపోతోందో కూడా అర్థం కావడం లేదు. అటుతిరిగీ ఇటుతిరిగీ చివరికి ఆ కారు ఓ పల్లెటూరికి చేరుకుంది. వర్షం తగ్గేదాకా తాను ప్రయాణం కొనసాగించడం అసాధ్యమని తేలిపోయింది వైద్యుడికి. దాంతో ఆ పల్లెటూరి చివర ఉన్న ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ తలుపు తెరుచుకుని వచ్చిన యువతికి వైద్యుడిని చూడగానే పరిస్థితి దాదాపుగా అర్థమైపోయింది. వెంటనే అతడిని లోపలికి ఆహ్వానించింది. యువతి ఇచ్చిన వేడి వేడి టీ తాగి, చలిమంట దగ్గర కాసేపు సేదతీరి... చలి నుంచి, వర్షం నుంచి హాయిగా కోలుకున్నాడు వైద్యుడు. ‘భగవంతుడు దయతలిస్తే త్వరలోనే వర్షం తగ్గిపోతుంది. మీరు ఎలాంటి ఇబ్బందీ లేకుండా గమ్యం చేరిపోతారు,’ అంటూ ఊరడించింది ఆ యువతి. ‘ఇందులో భగవంతుడు దయతలిచేది ఏముంది. మన జీవితం మన చేతుల్లో అన్నా ఉంటుంది లేకపోతే ప్రకృతి చేతుల్లో అన్నా ఉంటుంది. మధ్యలో భగవంతుడు ఎవరు?’ అంటూ కాస్త చిరాకుపడ్డాడు వైద్యుడు.   వైద్యుని మాటలకు ఆ యువతి ఏం బదులు చెప్పలేదు. నిశ్శబ్దంగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది. లోపలకి వెళ్లిన యువతి ఎంతకీ రాకపోవడంతో ఆమె ఏం చేస్తోందో చూడాలనిపించింది వైద్యుడికి. ఓ నాలుగడుగులు వేసి లోపల గదిలో అడుగుపెట్టిన అతనికి ఓ ఊయల పక్కనే మోకరిల్లి భగవంతుని ప్రార్థిస్తున్న యువతి కనిపించింది. ఆమె ఛాదస్తానికి మరోసారి నవ్వుకొని- ‘ఎందుకలా ఊయల పక్కనే ఉండి ప్రార్థిస్తున్నారు? భగవంతుడికీ ఊయలకీ ఏంటి సంబంధం?’ అని అడిగాడు వైద్యుడు.   వైద్యుని మాటలలో వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు ఆ యువతి. ‘ఈ ఊయాలలో ఉన్న పిల్లవాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్నాను. వీడు పుట్టగానే వాళ్ల నాన్న చనిపోయాడు. ఇప్పుడు వీడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది,’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది.   ఆ మాటలు వినగానే వైద్యుడిలో ఆసక్తి మొదలైంది. చటుక్కున ఊయల దగ్గరకి వెళ్లి బాబుని చూస్తూ ‘ఏమైంది బాబుకి!’ అంటూ ఆదుర్దాగా అడిగాడు. ‘బాబు గుండె చాలా బలహీనంగా ఉందట. పిల్లలకి సంబంధించి ఎవరన్నా హృద్రోగ నిపుణుడు మాత్రమే వీడికి వైద్యం చేయగలడట. నేనా పేదరాలిని. అలాంటి నిపుణుల ఖర్చుని నేను ఎలా భరించగలను. అందుకే ఏదో ఒక మార్గం చూపమని ఆ దేవుడిని నిరంతరం వేడుకుంటూ ఉంటాను. నా ప్రార్థనలు ఫలిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తుంటాను,’ అంటూ చెప్పుకొచ్చింది.   ఆ యువతి చెప్పిన మాటలు విన్న వైద్యుడికి మతిపోయినంత పనయ్యింది. అప్రయత్నంగా అతని కంటివెంట నీరు రాలింది. ‘నా పేరు డా॥ అబ్రహాం. పిల్లలకి సంబంధించిన గుండెజబ్బులను నయం చేయడంలో నిపుణుడిని. నీ ప్రార్థనలే ఫలించాయో, లేక నాకు నీ సేవ చేసుకునే అదృష్టమే వరించిందో.... దేశమంతా తిరిగి చివరికి నీ ఇల్లు చేరుకున్నాను. నీ పిల్లవాడికి ఉచితంగా చికిత్స చేసే బాధ్యత నాది,’ అంటూ ఆ పిల్లవాడిని చేతులలోకి తీసుకున్నాడు.   మనం మానవ ప్రయత్నాన్ని ఎన్నడూ విడనాడకూడదన్నది మంచిమాటే! కానీ పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు... ఒకోసారి ప్రార్థనలు బలాన్ని చేకూరుస్తాయి. భగవంతుడే పలుకుతాడో లేకపోతే మన మనసులోని శక్తే దారిచూపుతుందో... కారణం ఏదైతేనేం, అసాధ్యం అనుకున్న సమస్యకి అనుకోని సులువు లభిస్తుంది. భగవంతుడే లేడనుకుంటే అది వేరే విషయం. కానీ అతని అస్తిత్వాన్ని నమ్మినప్పుడు మాత్రం ప్రార్థన తప్పకుండా ఫలితాన్ని అందిస్తుంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.
  జపాన్ ఈ పేరు వినగానే ముందుగా కళ్లేదుట కనిపించేది హిరోషియా, నాగసాకి అణు విలయం. జపానికి లొంగిపోవడానికి సిద్ధపడింది. అయినా అమెరికా అత్యంత అమానవీయ పద్ధతిలో ఈ రెండు నగరాలపై అణుబాంబులు వేసింది. ఈ దాడులలో దాదాపు 2 లక్షలకు పైగా చనిపోయారు. ఆ దాడుల దుష్ఫరిణామాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంటే నాటి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నిత్యం భూకంపాలతో సహవాసం, అగ్నిపర్వతాల విస్పోటనాలు, కబళించే సునామీలు అలాంటి దేశం ఆత్మవిశ్వాసంతో, ప్రజల శ్రమశక్తితో, దేశభక్తితో అభివృద్ధి విషయంలో అగ్రరాజ్యాల సరసన నిలబడింది.                 ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్ పౌరుడు. ఆయన తొంభై సంవత్సరాల వయసు వరకు పనిచేస్తూనే ఉన్నాడు. అంతే కాదు జపనీయుల సగటు జీవిత కాలం 86.3 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో జపాన్‌కు అది ఎలా సాధ్యమైంది అంటే అందుకు కారణం వారి శ్రమ శక్తి, ఆహారపు అలవాట్లు.   * వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరిఅన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా        తీసుకుంటారు.   * మన దేశాల్లో వృద్ధులంటే చిన్పచూపు. ఎప్పుడెప్పుడు వారిని వదిలించుకుందామా అంటూ ఎదురుచూస్తారు వాళ్ల పిల్లలు.    కాని జపాన్‌‌లో వృద్ధుల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వైద్య  సదుపాయం తేలిగ్గా అందుబాటులో  ఉంటుంది.   * జపాన్ ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల మీద మంచి    ప్రభావాన్ని చూపుతోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వీటన్నింటిపై వారి శ్రద్ధ కనిపిస్తోంది.  దానికి తోడు అక్కడ షింటో అనే సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా  ఉండాలని జపాన్ వారు నమ్ముతారు.   * వీరిలో ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలల్లోనూ..కర్మాగారాలు, కార్యాలయాల్లో ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది.   * ఆహారాన్ని పీకల దాకా తొక్కకుండా, 80 శాతం పొట్టనిండగానే తినడం ఆపేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు.   సో..జపాన్ చాలా గొప్పదేశమండీ..నాశనం అయినా ఎంత గొప్పగా డెవలప్ అయ్యిందో చూశారా..? అని స్టాటిస్టిక్స్ చూసి ముఖం చిట్లించుకోనక్కరలేదు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమి ఓవర్ టైం చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. మొత్తానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే  జపాన్‌ని ప్రపంచంలో అత్యున్నత  స్ధితిలో నిలబెట్టింది.
  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara
  దేశం దాటి వెళ్లిన నల్ల ధనాన్ని భాజపా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని ఇప్పటివరకూ నెరవేర్చకపోవడంతో ప్రతిపక్షాలు  ప్రభుత్వంపై రకరకాల విమర్శలు చేస్తున్నాయి. రూ.15 లక్షలు ప్రతి ఖాతాలో జమ చేస్తానన్న ప్రధాని.. ఇప్పటివరకూ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే స్పందించారు. మహారాష్ట్రలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేయడం అనేది ప్రజలకు నెమ్మదిగా చేరువవుతుంది. అయితే అంతా ఒకేసారి కుదురదు.. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. నిధులు కావాలని ఆర్బీఐని అడిగాం. కానీ వారు ఇవ్వట్లేదు. అందువల్లే నిధులు సమకూర్చుకోలేకపోయాం. దీనిపై కొన్ని సాంకేతిక పరమైన సమస్యలున్నాయి.’’ అని రామ్‌దాస్‌ అథవాలే వ్యాఖ్యానించారు. రామ్‌దాస్‌ అథవాలే వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు కూడా సాధించటం మొదలుపెట్టారు. అథవాలేను అర్జెంట్ గా కేంద్ర ఆర్థికమంత్రిగా గానీ… ఆర్బీఐ గవర్నర్ గా గానీ నియమించాలంటూ ఛలోక్తులు విసురుతున్నారు.
  ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని 170 (3)వ ఆర్టికల్ ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాల పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏపీలో 175 నుంచి 225కు, 119 నుంచి 153కు పెంచాలని పొందుపరిచారు. మరోవైపు విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌ అంశాలన్నీ దాదాపు అమలులోకి తెచ్చామని గంగారాం స్పష్టం చేశారు. ఈ మేరకు మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు గంగారాం సమాధానమిచ్చారు.
  ఏపీ సీఎం చంద్రబాబు స్వంతగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్ స్థాపించిన తర్వాత జరిగిన 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గల్లా అరుణకుమారి నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి పోటీచేసిన గల్లా అరుణకుమారిని ఆయన ఓడించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరటంతో స్థానికనేతలు ఆమెకు సహకరించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయ్యింది. దీంతో గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.   ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ దఫా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. గత అనుభవం పునరావృతం కాకూడదని భావించారు. అందుకే చంద్రగిరిలో ముందస్తుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.  గల్లా అరుణకుమారి కూడా వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీచేయడానికి ససేమిరా అనటంతో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అనేక కోణాల్లో బాబు ఆలోచించారు. చివరికి జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయినుంచి ఎదిగారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయనపై చంద్రబాబు దృష్టిపడింది. పైగా మంత్రి నారా లోకేశ్‌కు నాని వీరవిధేయుడు. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ అర్హతల రీత్యా చంద్రబాబుకు నానిపై నమ్మకం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డిపై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. చంద్రగిరి అభ్యర్థిగా బాబు తన పేరు ప్రకటించటంతో నాని తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో చంద్రన్న నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూద్దాం...!!
  డయాబెటిస్ అనగానే ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ భారతదేశమే గుర్తుకువస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ రోగులు ఉన్న దేశంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో చక్కెర వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య ఆరుకోట్లకి పైమాటే. మరో పదిహేనేళ్లు పోతే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.   డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే! ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. అందుకని ఇది చిన్నతనంలోనే దాడిచేసే ప్రమాదం ఎక్కువ. ఈ తరహా డయాబెటిస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తిలోనే లోపం ఉంటుంది. దానివల్ల మన రక్తంలోకి చేరుకున్న చక్కెర నిల్వలను శక్తిగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇక టైప్ 2 డయాబెటిస్ మన తరచూ వినే తరహా లోపం. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ, దానిని శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ రెండు రకాల డయాబెటిస్లకు ఓ చికిత్సను కనుగొన్నామంటున్నారు శాస్త్రవేత్తలు.   కాలిఫోర్నియాలోని Leonard Davis School of Gerontologyకి చెందిన పరిశోధకులు ఈ చికిత్సను రూపొందించారు. ఇందుకోసం వారు ప్రయోగశాలలోని ఎలుకలకి పదిశాతం ఆహారాన్ని మాత్రమే అందించారు. ఇలా ఓ నాలుగురోజులు చేసిన తరువాత మరో పదిరోజుల పాటు, వాటి ఇష్టారాజ్యంగా ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఓ మూడు దఫాలుగా ఆహారంలో మార్పులు చేయగానే ఎలుకలలో అద్భుతమైన మార్పులు కనిపించాయట.   ఎప్పుడైతే శరీరానికి తగినంత ఆహారం లభించలేదో... అప్పుడు అందులోని కణాలు నిశ్చలమైన స్థితికి (stand by) చేరుకున్నాయి. కొద్ది రోజుల తరువాత తిరిగి తగినంత ఆహారాన్ని అందుకోగానే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సర్దుకోవడాన్ని గమనించారు. ఉదాహరణకు డయాబెటిస్ టైప్ 1 వ్యాధిలో బీటా సెల్స్ అనే తరహా కణాలు తగినంత లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. కానీ ఉపవాసం చేయించిన ఎలుకలలో ఈ బీటా కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వడాన్ని గమనించారు. అంతేకాదు! డయాబెటిస్ టైప్ 2 బారిన పడ్డ ఎలుకలలో కూడా చక్కెర వ్యాధి తిరుగుముఖం పట్టినట్లు తేలింది. కణాలకు తమని తాము బాగుపరచుకునే ఈ అవకాశం దక్కడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు... రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. అంతేకాదు! వయసుతో వచ్చే మార్పులని నివారించడంలోనూ, కేన్సర్ ఏర్పడే పరిస్థితులను నిరోధించడంలోనూ కూడా ఈ తరహా ఉపవాసాలు లాభిస్తాయని చెబుతున్నారు. అందుకనే మనుషుల మీద కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతిని కోరుతున్నారు.   విచిత్రం ఏమిటంటే... ఏ ఎలుకల మీదా ప్రయోగం చేయకుండా, ఏ ప్రభుత్వ అనుమతీ లేకుండానే మన దేశంలోని ప్రకృతి వైద్యులు ఈ తరహా ఉపవాసాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా కుదరకపోయినా కనీసం ఏకాదశి, శివరాత్రి వంటి విశేషమైన రోజులలో అయినా ఉపవాసాన్ని పాటించమని మొత్తుకుంటున్నారు. కానీ మనం వింటేనా! అందుకే ఉపవాసానికీ, ప్రకృతివైద్యానికీ పేరొందిన మన దేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. (షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపవాసం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)   - నిర్జర.
  పోకెమాన్‌గో లాంటి వీడియోగేమ్స్‌తో ఇప్పటి యువత వెర్రెత్తిపోతోందని పెద్దలు తిట్టుకోవచ్చుగాక! కానీ సాంకేతికతను ఉపయోగించుకునే నేర్పు తెలియాలే కానీ ఆ వీడియోగేమ్స్‌తోనే అద్భుతమైన పరిశోధనలు చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.   దారి తప్పిపోతారు మతిమరపు అనే మాట చాలా చిన్న పదమే కావచ్చు. కానీ అది ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు జీవితం నరకప్రాయమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి మతిమరపు వ్యాధులతో మనిషి తన జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సాధారణంగా మనిషి తను రోజూ వెళ్లే చోటుకి కూడా వెళ్లలేక దారితప్పిపోతుంటే, అతనిలోని మతిమరపు తీవ్రరూపాన్ని దాల్చిందని తెలుసుకుంటారు. అందుకనే ఇలా దారి తప్పిపోవడం/ కనుక్కోవడం అన్న సూత్రం ఆధారంగా బ్రిటన్‌ శాస్ర్తవేత్తలు ఒక వీడియోగేమ్‌ను రూపొందించారు.   Sea Hero Quest   ఇదే ఈ వీడియో గేమ్ పేరు. ఇందులో ఒక వయసు మళ్లిన నావికుడు తన గమ్యాన్ని మర్చిపోతాడు. మనం అతనికి సాయపడుతూ తిరిగిన అతని దారులన్నింటినీ గుర్తుచేయడమే ఈ ఆటలోని లక్ష్యం. ఇందులో భాగంగా ద్వీపాలను చుట్టుకుంటూ, మంచుకొండలను తప్పించుకుంటూ నావని నడిపించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మన బంధువులకు నావ ఉనికి తెలిసేలా ఆకాశంలోకి తారాజువ్వలను వదలడం, కొన్ని సూచనల ఆధారంగా దిశను మార్చుకోవడం చేస్తుండాలి.   పాతిక లక్షలమంది ఆటగాళ్లు 3D టెక్నాలజీ ఏ వీడియోగేమ్‌కీ తీసిపోని విధంగా ఈ Sea Hero Quest సాగుతుంది. అందుకనే దీనిని ఏకంగా పాతిక లక్షలమంది డౌన్లోడ్‌ చేసుకుని ఆడారు. ఆటగాళ్లు ఈ ఆటని ఆడేటప్పుడు వారి ప్రతీ చర్యా రికార్డు అవుతుంది. అది పరిశోధకులకు చేరుతుంది. దాని ద్వారా వేర్వేరు వయసులవారిలో ‘సరైన దారులని కనుక్కోగలగడం’ అనే సామర్థ్యం ఎంతమేరకు ఉందో పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాదు! దారులను గుర్తుంచుకోవడంలో స్త్రీ పురుషుల మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో గ్రహించగలుగుతారు. ఇంకా వేర్వేరు దేశాల వారి మధ్య ఈ నైపుణ్యంలో ఏమన్నా తేడా ఉందేమో తెలిసిపోతుంది.   ఇవీ ఫలితాలు! మనుషులలో మతిమరపుని గమనించడం అనే అత్యంత క్లిష్టమైన పరిశోధన Sea Hero Quest ద్వారా అతి సులువుగా సాగిపోయిందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ ఆటని రెండు నిమిషాలపాటు ఆడితే అది ల్యాబొరేటరీలో 5 గంటలు పరిశోధన చేసినదానితో సమానమట. అలా దాదాపు 9,500 సంవత్సరాలతో సమానమైన ఫలితాలను శాస్త్రవేత్తలు సాధించగలిగారు. వాటిని నిశితంగా గమనించేందుకు చాలా సమయమే పడుతుంది. కానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఇవీ...   - 19 ఏళ్ల నుంచి దారిని గుర్తుంచుకొనే సామర్థ్యం నిదానంగా తగ్గిపోతుందట. 19 ఏళ్ల వయసులో 74 శాతంగా ఉన్న ఈ సామర్థ్యం 75 ఏళ్లు వచ్చేసరికి కేవలం 46 శాతమే ఉంటుంది. - దారిని గుర్తుంచుకోవడంలో ఆడవారికంటే మగవారి నిపుణుత ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది స్వతహాగా వారు బయటతిరగడం వల్ల ఏర్పడిందా లేకపోతే తరచూ వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల వాళ్లు లక్ష్యాన్ని ఛేదించగలిగారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. - నార్డిక్‌ దేశాలు అనబడే డెన్మార్క్‌, స్వీడన్‌ వంటి దేశ ప్రజలు మిగతావారితో పోలిస్తే త్వరగా దారిని పోల్చుకుంటారని బయటపడింది. బహుశా ఈ సామర్థ్యం వారి జన్యువులలోనే నిక్షిప్తం అయి ఉంటుందని భావిస్తున్నారు.   ఏది ఏమైనా ఈ Sea Hero Quest మతిమరపు మీద సరికొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. దీని ద్వారా అల్జీమర్స్‌ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటికి చికిత్సను మొదలుపెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. అసలు మతిమరపు ఎందుకు ఏర్పడుతుంది? దానిని నివారించే అవకాశం ఏదన్నా ఉందా? అనే ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నమూ ఈ పరిశోధనతో ఊపందుకున్నట్లయ్యింది.     - నిర్జర.
  క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే పరిస్థితి.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రాణాంతకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మ. మన రోజువారి ఆహారంలో దానిమ్మను చేర్చడం వల్ల క్యాన్సర్‌ దరిచేరకుండా చేయవచ్చు. ఇది ఒక్కటే కాకుండా దానిమ్మ వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.