Publish Date:Aug 9, 2018
Publish Date:Aug 8, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 2, 2018

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
కొందరి విషాదం... మరికొందరికి వినోదం అయింది. కొందరి అపజయం మరికొందరికి విజయాన్ని చేకూర్చింది. అవును విషాదకరమైన సావిత్రి జీవిత చరిత్రతో ‘మహానటి’ సినిమా చేసి వైజయంతి మూవీస్‌ మళ్లీ తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మరిన్ని చిత్రాలు   నిర్మించడానికి వైజయంతి మూవీస్‌ సన్నాహాలు  చేసుకుంటోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో పాటు సెన్సేషనల్‌ స్టార్‌ విజయదేవరకొండతో ఒక  సినిమా చేయడానికి  ఇప్పటికే ఆ హీరోలతో  ఒప్పందం కుదుర్చుకున్నారు అశ్వనీదత్‌.  అలాగే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహా లు  చేస్తున్నట్లు స్వయంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ప్రకటించారు. ప్రజంట్‌ నాగార్జున,నాని కలయికలో చేస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాసు’ చిత్రం గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ‘దేవదాస్‌’ చిత్రం  ఈనెల  27న విడుదల  కానుంది.
"కన్నడ హీరో రక్షిత్ శెట్టి, తెలుగులో 'ఛలో', 'గీత గోవిందం' చిత్రాల్లో నటించిన కథానాయిక, కన్నడ భామ రష్మిక మందన్న ప్రేమికులు" - ఇది ఒకప్పటి మాట! "రక్షిత్ శెట్టి, రష్మిక నిశ్చితార్థం జరిగింది. రెండేళ్ల తరవాత పెళ్లి చేసుకుంటార్ట‌. లేదు లేదు... రష్మిక నాలుగేళ్ల తరవాత పెళ్లి చేసుకుంటానంటోంది" - ఇదీ ఒకప్పటి మాటే! "రక్షిత్, రష్మిక మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలో బ్రేకప్ చెప్పేసుకుంటారని వార్తలు వస్తే... రష్మిక ఖండించారు" - ఆఖరికి ఇదీ ఒకప్పటి మాటే! రష్మిక ఖండనలో నిజం లేదని తెలియడానికి, వాళ్లిద్దరూ విడిపోయారనేది నిజమని ప్రేక్షకులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. మరి, ఇప్పటి మాట ఏంటి? "రక్షిత్ శెట్టితో ప్రేమ ప్రయాణానికి, నిశ్చితార్థానికి ముగింపు పలకడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ రష్మికను పక్కన పెడుతోందట. గతంలో అంగీకరించిన కన్నడ సినిమా 'వ్రిత్రా' నుంచి ఆమెను పక్కకు తప్పించారట. దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నానని ప్రకటించిందట" - ఇదీ తాజా తాజా మాట! సదరు వార్తలపై రష్మిక స్పందించారు. రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న తరవాత ఓ కన్నడ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నారు. ఆ సినిమా దర్శకుడు రక్షిత్ స్నేహితుడు కావడంతో ఆమెను తప్పించారని వార్తలొచ్చాయి. సదరు వార్తల్లో నిజం లేదని రష్మిక తెలిపారు. "సారీ... చాలా రోజుల నుంచి సైలెంట్‌గా వున్నా. కాని నా గురించి వచ్చిన కథలు, కామెంట్స్, ట్రోల్స్... అన్నీ గమనిస్తున్నా. అవి చూసి డిస్ట్రబ్ అయ్యాను. మీరు నమ్మినవి రాశారు. అందుకని, నేను ఎవర్నీ బ్లేమ్ చేయడం లేదు. ఎవరికీ సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు. నాణేనికి రెండు వైపుల ఉన్నట్టు... ప్రతి కథకి రెండు కోణాలు వుంటాయి. ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదు. దయచేసి  ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. నేను కన్నడ సినిమాల్లో నటిస్తూ వుంటాను. ఏ భాషలో నటించినా నా బెస్ట్ ఇస్తాను" అని రష్మిక ఒక ట్వీట్ చేశారు. నిశ్చితార్థం రద్దు అయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఆ బాధ నుంచి తేరుకోక ముందు ఇటువంటి వార్తలు వస్తే బాధ ఎక్కువ అవుతుంది. ఈ బాధలను భరిస్తూ ప్రేక్షకులకు స్పష్టత ఇచ్చారు రష్మిక. ఈమె నటించిన కొత్త తెలుగు సినిమా 'దేవదాస్' ఈ నెల 27న విడుదల కానుంది.
శివగామి అంటే రమ్యకృష్ణ... రమ్యకృష్ణ అంటే శివగామి. అందులో మరో సందేహం లేదు. అసలు శివగామి పాత్రలో మరొకర్ని ఊహించుకోలేనంతగా 'బాహుబలి'లో రమ్యకృష్ణ అద్భుత నటన కనబరిచారు. అంత బాగా నటించిన రమ్యకృష్ణను శివగామి కాదంటారేంటి? అనుకుంటున్నారా!! అసలు విషయంలోకి వెళితే... మ్యాటర్ అర్థమవుతుంది. 'బాహుబలి'లో శివగామిగా రమ్యకృష్ణ నటించారు. బాహుబలి రెండు భాగాలు విడుదలయ్యాయి. భారీ విజయాలు సాధించాయి. 'బాహుబలి' విజయాల స్ఫూర్తితో 'ద రైజ్ ఆఫ్ శివగామి' అని ఓ పుస్తకం వచ్చింది. బాహుబలిలో ప్రేక్షకులకు చూపించిన కథకు ముందు శివగామి రాజమాత ఎలా అయ్యింది? ఆమె ప్రస్థానం ఏమిటి? నేపథ్యం ఏమిటి? అనేది ఆ పుస్తకం రాశారు. దాన్ని ఆధారం చేసుకుని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. దేవకట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న 'ద రైజ్ అఫ్ శివగామి' వెబ్ సిరీస్‌లో శివగామిగా హిందీ నటి మృణాల్ ఠాకూర్ నటించనున్నారు. అదండీ సంగతి!! హిందీ సీరియల్ 'కుంకుమ్ భాగ్య'తో ప్రేక్షకుల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్, ఇటీవల విడుదలైన ఇండో అమెరికన్ ఫిలిం 'లవ్ సోనియా'తో వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతో చక్కటి పేరు తెచ్చుకున్నారు.
ఎన్టీఆర్ లైఫ్ హిస్ట‌రీ ఆధారంగా బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం `ఎన్టీఆర్‌`. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ శ‌ర‌శేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ చిత్రానికి డైర‌క్ష‌న్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి ప‌లు పాత్ర‌ల‌కు పేరున్న హీరోలు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు బ‌ట‌య‌ట‌కు వ‌స్తూ ఈ చిత్రం రోజూ వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వార్తొక‌టి సోష‌ల్ నెట్ వర్క్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.   అదేంటంటే... ఈ చిత్రంలో తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాత్ర కూడా చూపించ‌నున్నాన్నార‌ట‌.  లేటెస్ట్ వార్త‌ల ప్ర‌కారం ఇప్పుడు కేసీఆర్ క్యార‌క్ట‌ర్ లో క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఆ పాత్ర‌కు విజ‌య్ అయితే స‌రిగ్గా సూట‌వుతాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.  ఎన్టీఆర్ కి వీరాభిమాని కేసీఆర్‌. ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి కూడా కార‌ణం ఎన్టీఆర్‌. అందుకే కేసీఆర్ క్యార‌క్ట‌ర్ కూడా ఉంటే బావుంటుంద‌ని యూనిట్ ఆలోచిచ‌న చేసి  ఆ పాత్ర‌కు విజ‌య్ దేవ‌రకొండ‌ను తీసుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్ కూడా దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ చిత్రానికి సంబ‌ధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కీర‌వాణి సంగీత సార‌థ్యంలో ప్రారంభ‌మైనట్లు తెలుస్తోంది.
"చూడండి బాబూ చూడండి... సిల్క్ స్మిత నటించిన 'రాగ తాళంగల్'. త్వరలో విడుదల చేస్తాం" అంటూ తమిళనాడులో ఓ దర్శకుడు టముకు వేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకున్న సిల్క్ స్మిత అర్ధాంతరంగా తనువు చాలించి రెండు దశాబ్దాలు దాటుతోంది. అయినా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ తగ్గలేదు. సిల్క్ స్మిత జీవితకథతో హిందీలో 'డర్టీ పిక్చర్' సినిమా తీశారు. మరికొన్ని సినిమాలు వచ్చాయి. 'కబాలి', 'కాలా' సినిమాల దర్శకుడు పా రంజిత్... దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి... ఆయన పర్యవేక్షణలో సిల్క్ స్మిత వెబ్ సిరీస్ తీయనున్నట్టు ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఒరిజినల్ సిల్క్ స్మిత నటించిన సినిమా అనగానే అందరిలో ఆసక్తి మొదలైంది.     అసలు వివరాల్లోకి వెళితే... సిల్క్ స్మిత జీవించిన రోజుల్లో తిరుపతి రాజన్ అనే దర్శకుడు ఆమెతో ఓ సినిమా తీశారు. ఆర్థిక సమయాలు కావొచ్చు... మరొకటి కావొచ్చు... కారణాలు ఏవైనా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అప్పటి నుంచి నాలుగు గోడల మధ్య ల్యాబుల్లో మగ్గిన ఆ సినిమా రీళ్లకు పట్టిన దుమ్ము దులిపి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట! అంటే... సిల్క్ స్మిత నటించిన సన్నివేశాలు యథాతథంగా ఉంచి, ఇప్పటి నటీనటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి ఓ సినిమా బయటకు తెస్తారన్నమాట. రెండున్నర దశాబ్దాల క్రితం తిరుపతి రాజన్ తీసిన 'తంగ తమరై' అనే సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఆ సినిమాను 'రాగ తాళంగల్' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్.
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల వేడి పెంచారు.. దీంతో విపక్షాలు కూడా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి.. అయితే ఒక పార్టీ తీరు మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు.. అదే జనసేన పార్టీ.. ప్రశింస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపారు.. తరువాత వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఒంటరిగా అడుగులు మొదలు పెట్టారు.. ఏపీలో ఐతే పవన్ పర్యటనలు, ప్రభుత్వం మీద విమర్శలతో ప్రజల్లోకి వెళ్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.     తెలంగాణలో అసలు ఇంతవరకు జనసేన బలపడే ప్రయత్నమే మొదలు పెట్టలేదు.. నాయకులు కూడా లేరు.. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంటే.. జనసేన మాత్రం ఆ ఊసే లేదు.. ఇలానే ఉంటే ముందస్తు వస్తే తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ప్రశ్నార్ధకం అవుతుందనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇంతవరకు వరకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టలేదు.. ముందస్తు వస్తే తక్కువ సమయంలో పార్టీ నిర్మాణం, బలోపేతం కష్టమవుతుంది.. కొందరైతే అసలు జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. అయితే కార్యకర్తలు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జనసేన అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుంది అంటున్నారు.     మరోవైపు జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే సీపీఎం పార్టీ జనసేనతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది.. మరో వైపు విపక్షాలు కూడా ఏ పార్టీ వచ్చినా కలుపుకొని పోవాలని చూస్తున్నాయి.. కానీ జనసేనాని మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు.. ఓ వైపు ముందస్తు వేడితో మిగతా పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలు పెడితే జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయింది.. దీన్నిబట్టే చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బరిలోకి కష్టమనే విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరి జనసేన మౌనానికి అసలు కారణం ఏంటి?.. మౌనంగా ఉండి వ్యూహాలు రచిస్తోందా?.. ఒంటరిగా బరిలోకి దిగుతుందా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా?.. లేదా అసలు బరిలోకి దిగదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జనసేన మౌనం వీడాలి లేదా ఎన్నికలు రావాలి.. చూద్దాం ఏం జరుగుతుందో.
ఓ వైపు ముందస్తుతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్.. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే హీట్ పెంచుతున్నారు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆరే హాట్ టాపిక్ అయ్యారు.. ఓ వైపు అసెంబ్లీ రద్దు, 105 మంది అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీలోని పార్టీలకు కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం.. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళతానని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ మేరకు కేసీఆర్ ఏపీలో వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.     చాలాకాలం నుండి వైసీపీతో, తెరాసకు సత్సంబంధాలు ఉన్నాయి.. తెలంగాణలో వైసీపీ కాంట్రాక్టర్లు పనులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో కేసీఆర్ ఏపీలో ఎన్నికల వార్తలకు బలం చేకూరుతుంది.. అయితే కొందరు మాత్రం 'చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. బాబుకి బ్రేకులు వేసేందుకే కేసీఆర్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తారన్న ప్రచారానికి తెరలేపినట్టు' భావిస్తోన్నారు.. ఈ ప్రచారంతో బాబుని భయపెట్టి, తెలంగాణలో ప్రచారానికి వెళ్లకుండా నిలువరించటమే అసలు లక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     మరికొందరు మాత్రం కేసీఆర్ ఏపీలో ప్రచారం వార్త నిజమే.. బీజేపీ ఆదేశాల ప్రకారమే కేసీఆర్, జగన్ సహకరించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.. టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ కేసీఆర్ అనే అస్త్రాన్ని సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.. తెరాస వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తోందట.. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలలో తెరాస కొంతమంది అభ్యర్థులను నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న కొందరు తమకు తెరాస టిక్కెట్లు కావాలని కోరుతున్నట్టు సమాచారం.. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. కేసీఆర్ నిజంగా ఏపీలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా?.. ఏపీలో తెరాస తరుపున కొందరు అభ్యర్థులు బరిలోకి దిగుతారా? ఇవి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  గత కొంతకాలంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.. ఇంకేముంది ఏపీలోని ప్రతిపక్షాలు, అధికార పార్టీ టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అంటూ విమర్శించాయి.. ఇంకా కొందరైతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమవటం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.. ఇక ఈ పొత్తు గురించి టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కొందరు కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.. ఇక యనమల, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కాంగ్రెస్ తో పొత్తు అంటే ఒంటికాలు లేచారు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేసారు.. అయినా కాంగ్రెస్ - టీడీపీల పొత్తు గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పొత్తు వార్తలను ఖండించారు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.. దీంతో ఏపీలో కాంగ్రెస్- టీడీపీల పొత్తు వార్తకు తెరపడేలాగానే ఉంది.     అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఏపీలో అంటే టీడీపీ అధికారంలో ఉంది.. పార్టీ బలంగా ఉంది.. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదు.. నిజం చెప్పాలంటే పొత్తు కంటే ఒంటరిగా బరిలోకి దిగితేనే ఎక్కువ లాభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉంది కానీ రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది.. మెజారిటీ నాయకులు పార్టీని వీడి తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. కొన్ని చోట్ల కేడర్ అయితే ఉంది కానీ వాటిని ఓట్లుగా మలిచి గెలిపించే నాయకులు కావాలి.. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే ముందు పార్టీ నిలదొక్కుకోవాలి.. దానికి బలమైన పార్టీ మద్దతు ఖచ్చితంగా కావాలి.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని, అందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని చూస్తోంది.. ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశపడుతోంది.. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.. తెలంగాణలో ఈ రెండు పార్టీ పొత్తుపెట్టుకుంటే.. అధికారం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ కి టీడీపీ బలం కూడా తోడైతే విజయావకాశాలు ఎక్కువుంటాయి.. అదే విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్ మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకొని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి బాటలు వేసుకున్నట్టు అవుతోంది.. ఈ విధంగా తెలంగాణలో రెండు పార్టీలకు పొత్తు లాభించే అవకాశాలు ఉన్నాయి.. మొత్తానికి కాంగ్రెస్ - టీడీపీల పొత్తు 'ఏపీలో వద్దు.. తెలంగాణలో ముద్దు' అన్నట్టుగా ఉంది.. మరి ఈ పొత్తుపై అసలు ఈ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది కానీ ఏపీలో ఆ ఊసే లేదు.. అయినా ఏపీలో కూడా అప్పుడే ఎన్నికల సెగ మొదలైంది.. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే అభ్యర్థుల వేట మొదలైంది.. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రజల్లోకి వెళ్తూ మళ్ళీ అధికారం చేపట్టే దిశగా దూసుకువెళ్తుంది.. రోజంతా అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు.. పార్టీ నేతలు, అధికార వర్గాలతో సమావేశమవుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు.. లోటుపాట్లు ఎక్కడున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే కోణంలో దృష్టి పెట్టారు.     క్రింది స్థాయిలో బూత్ కమిటీలు మొదలుకొని, పై స్థాయిలో తనవరకు అందరూ ప్రజల మధ్య ఉండేలా చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెంచారు.. గతంలో అరగంట, గంటతో సరిపెట్టే రాజకీయ సమీక్షలను ఇప్పుడు రెండు మూడు గంటలు నిర్వహిస్తున్నారు.. అదే విధంగా వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామదర్శిని అమలు చేస్తున్నారు.. పార్టీపరంగా ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.. సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం చూపుతున్నారు.. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. నేతలు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.     గ్రామదర్శినిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఒక్కోవారం రెండు నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని అక్కడ ప్రజలను కలుస్తున్నారు.. ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామదర్శినిలో చురుకుగా పాల్గొనడంలేదని సమాచారం అందితే నేరుగా చంద్రబాబు లైన్ లోకి వస్తున్నారు.. వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.. ఇప్పటికే 'దళిత తేజం', 'నారా హమారా- టీడీపీ హమారా' పేరిట రెండు సభలు ఏర్పాటు చేసారు.. త్వరలో గిరిజన గర్జన పేరుతో మరో సభ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.. తద్వారా ఆయా వర్గాల వారిని సమీకరించే కృషిలో పార్టీ నేతలు భాగస్వాములవుతారని, ఈ కార్యక్రమాలు, పథకాలు టీడీపీ అమలుచేస్తుందన్న ముద్ర వస్తుందని భావిస్తున్నారు.. అలాగే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపటానికి ప్రతిజిల్లాలో ధర్మ పోరాట సభలు నిర్వహిస్తున్నారు.     అదేవిధంగా కింది స్థాయిలో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటానికి ప్రభుత్వం కొత్తగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది.. అలాగే బూత్ స్థాయిలో టీడీపీ కార్యకర్తలను కూడా ఎన్నికల మూడ్ లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.. పార్టీ బూత్ లో కన్వీనర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు.. మొత్తానికి చంద్రబాబు పూర్తిస్థాయిలో ఎన్నికల వ్యూహ రచనలోకి వచ్చేసారు.. ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు చూస్తూనే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.. మళ్ళీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
  నందమూరి కుటుంబానికి అభిమానగణం ఎక్కువ.. అభిమానులు ఆ కుటుంబం మీద ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటారు.. నందమూరి హీరోలు కూడా అభిమానుల మీద అంతే ప్రేమ చూపిస్తూ, అభిమానుల బాగు కోరుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై పదే పదే ఓ విషయం గుర్తు చేసేవారు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటి దగ్గర మీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అభిమానులను సున్నితంగా హెచ్చరించేవారు.. అయితే 2014 లో నందమూరి కుటుంబంలోనే ఓ విషాదం జరిగింది.     హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ సంఘటనతో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.. అన్న మృతితో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కృంగిపోయారు.. ఇలాంటి బాధ అభిమానులకు రాకూడదని, ఈసారి అభిమానులను ఇంకాస్త గట్టిగా హెచ్చరించారు.. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం అంటూ ఆయన సినిమా మొదలయ్యేటప్పుడు చూపించేవారు.. అదే విధంగా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వేగంగా వెళ్ళకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ వేదికపై కూడా పదే పదే గుర్తుచేసేవాడు జూనియర్ ఎన్టీఆర్.. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోతాడని ఎప్పుడూ ఊహించి ఉండడు.     హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి అతి వేగం మరియు జాగ్రత్తలు పాటించకపోవటమే కారణంగా తెలుస్తోంది.. హరికృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, అతి వేగంగా వెళ్తూ.. వెనకనున్న వాటర్ బాటిల్ తీసుకోబోతుండగా క్షణాల్లో అంతా తారుమారైపోయింది.. ఆయన కుటుంబంతో పాటు, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది.. ఆయన కుటుంబంలో జరిగిన విషాదం వేరే కుటుంబంలో జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి అందరికీ గుర్తుచేశారు.. కానీ అదే కుటుంబంలో మరో విషాదం జరిగింది.. అందరూ బాగుండాలని కోరుకున్న కుటుంబానికి ఇలాంటి కష్టం రావటం చాలా బాధాకరం.. కానీ హరికృష్ణ మరణం మనకొక పాఠం నేర్పుతుంది.. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. మీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పొతే అది మీ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు.. ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించండి.. ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండి మీ జీవిత ప్రయాణానికి అర్దాంతరంగా ముగింపు పలకకండి.
  రాజకీయ పరంగా కడప జిల్లా పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబానికి మొదటి నుండి జిల్లాలో మంచి పట్టుంది.. వారు రాష్ట్ర రాజకీయాలు కడప కేంద్రంగా చేసేవారు.. ఇప్పుడు వైఎస్ వారసుడిగా, ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు.. అయితే కడపలో ఒకప్పటిలా వన్ సైడ్ వార్ కనిపించట్లేదు.. జగన్ కి కడపలో కూడా కష్టాలు మొదలయ్యాయి.. దానికి కారణం అధికార పార్టీ టీడీపీ.. టీడీపీ, ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. అక్కడ పాగా వేయాలని చూస్తోంది.. దానికి తగ్గట్టే అక్కడి ప్రజల్లో మార్పు కనిపిస్తుంది.. టీడీపీ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు పైన వారు సానుకూలంగా ఉన్నారు.. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో మార్పు స్పష్టం కనిపిస్తుంది.. దీంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.. ఈ జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కడపలో ఏదైనా జరగొచ్చు అనిపిస్తోంది.     అయితే ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న కడపలో జగన్ ప్రభ తగ్గటానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తోన్నారు.. ముఖ్యంగా జగన్ స్వయంకృతాపరదాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ జిల్లా ప్రజల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, నియోజక వర్గాల్లో పర్యటించకపోయినా పర్వాలేదు.. కడపలో మాకు తిరుగులేదు.. ఓట్లన్నీ మాక్ పడతాయి అని జగన్ ధీమాగా ఉంటున్నారట.. ఈ భావనతోనే ఆయన సొంత జిల్లాని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారట.. దీంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది.. దీన్ని టీడీపీ క్యాష్ చేసుకుంది.. కడప జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. జిల్లా ప్రజల మనస్సు దోచుకునేలా పలు వరాలు కురిపించారు.. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తానని చంద్రబాబు గతంలో వాగ్దానం చేసారు.. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలు వెటకారం చేసారు.. కానీ చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్ట్ కు రప్పించి పులివెందులకు పుష్కలంగా తాగు, సాగు నీరు అందించారు.. దీంతో నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేయలేని పనిని చంద్రబాబు చేసి చూపించారని స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు.. కలలో కూడా నీళ్లొస్తాయని ఊహించలేదు, అలాంటిది చంద్రబాబు నిజం చేసి చుపించారంటూ స్థానికులకు చంద్రబాబు మీద అభిప్రాయం ఏర్పడింది.     అదే విధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం చేసిన పోరాటంలో కూడా టీడీపీకి మంచి మార్కులు పడ్డాయి.. నిజానికి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్టీల్ ఫ్యాక్టరీ కోసం బలంగా పోరాడాలి, కేంద్రాన్ని నిలదీయాలి.. కానీ వైసీపీ ఆ విషయంలో విఫలమైంది.. కానీ చంద్రబాబు ఆలా కాదు టీడీపీ నేత సీఎం రమేష్ తో దీక్ష చూపించారు.. అంతేకాదు కేంద్రం ఏర్పాటు చేయకపోతే స్టీల్ ఫ్యాక్టరీనే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు కడప మీద ప్రత్యేక శ్రద్ద చూపారు.. అక్కడ ప్రజల మనస్సు గెలుచుకున్నారు.. ఫలితంగా అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో కడపలో టీడీపీ పాగా వేసిన ఆశ్చర్యంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. మొత్తానికి జగన్ కి సొంత జిల్లాలో కష్టాలు తప్పేలా లేవు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
We all know, Love Is Blind. But do you know, touch can make a person with pain feel better? Confused? Research says that, when your loved ones are with you and support you during acute pains, pain reduces and in certain cases pain completely gets cured. https://www.youtube.com/watch?v=lRjVrNLhsCE  
  ప్రపంచంలో మనకి ఇష్టంలేని వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరిని మనం తప్పించుకుని తిరగలేని పరిస్థితి. అది ఆఫీసులో అధికారి కావచ్చు, పక్కింటి సుబ్బారావు కావచ్చు. ఇలా మనసుకి నచ్చనివారితో కలిసి రోజుని గడపాలంటే కష్టమే! కానీ వారితో ఉన్నంత సేపూ ముళ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా గడపడం వల్ల... మన మనసు చెడిపోతుంది, బంధమూ చిక్కుముడిగా మారిపోతుంది. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి!   పని గురించి :- ఏ పని మీదైతే మీరిద్దరూ కలిసి ఉన్నారో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత స్థాయి నుంచి కాస్త ఎదిగి మాట్లాడండి. అధికారితో అయితే సంస్థ లక్ష్యాల గురించి, పక్కింటి సుబ్బారావుతో అయితే స్ట్రీట్ లైట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫలితం మీకే కనిపిస్తుంది.   అహాన్ని బుజ్జగించండి :- వ్యక్తిగత అహాలే ఇద్దరు వ్యక్తులను దూరం చేస్తాయి. అవసరం అనుకున్నప్పుడు మన అహాన్ని తగ్గించుకుని అవతలి వ్యక్తికి కాస్త విలువ ఇచ్చినట్లు ప్రవర్తించడంలో తప్పు లేదు. ‘ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు!’, ‘మీ సలహా ఏమిటి!’... లాంటి మాటలతో వారికి విలువ ఇచ్చనట్లు అవుతుంది. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను పొగిడితే అసలు తిరుగే ఉండదు.   మంచి మీద దృష్టి పెట్టండి :- రావణాసురుడు అంతటి వాడిలో సైతం ఏదో మంచి లక్షణం ఉంటుంది. ఇక సాధారణ మనుషులలో మంచి లక్షణాలకు కొదవేముంటుంది? వారు చిన్నప్పుడు కష్టపడి పైకి వచ్చి ఉండవచ్చు, కంప్యూటర్ మీద మంచి పట్టు ఉండవచ్చు, ఏదీ కాకపోతే కనీసం ఆహారపు అలవాట్లన్నా మంచిగా ఉండవచ్చు. ఇలా ఎదుటి మనిషిలో ఉండే మంచి లక్షణాల మీద దృష్టి పెడితే అతని మీద కోపం ఉపశమిస్తుంది.   పట్టించుకోవద్దు :- మనకి ఇష్టమైనవారి గురించి కాసేపు మాత్రమే ఆలోచిస్తాం. కానీ ద్వేషించే వ్యక్తుల గురించి నిరంతరం ఆలోచిస్తుంటాం. దాంతో మన సమయమూ, లక్ష్యమూ వృధా అయిపోతుంటాయి. అతని దృక్పథంలో లోపం ఉంది కనుక, వారినే జపిస్తూ ఉంటే మనం కూడా వారిలా మారిపోవడం ఖాయం. కాబట్టి అతనికంటే విలువైన మీ జీవితానికీ, వ్యక్తిత్వానికీ, లక్ష్యాలకీ ప్రధాన్యతని ఇచ్చే ప్రయత్నం చేయండి.   రెచ్చగొట్టవద్దు :- అహంకారం, ఆత్మన్యూనత వంటి లోపాలు ఉన్నవారిని రెచ్చగొడితే వారి ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉంటుంది. అందుకని వివాదంతోనో, వాదనతోనో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ’ అని పెద్దలు ఊరికే అనలేదు కదా!   ఎందుకని ఇష్టం లేదు? :- చాలా సందర్భాలలో మనం ఎలాంటి బలమైన కారణం లేకుండానే అవతలి వ్యక్తి మీద అయిష్టత ఏర్పరుచుకుంటాం. కానీ కాసేపు మన విచక్షణకు పదునుపెట్టి, అతన్ని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మొదలైతే... చాలామంది మీద ద్వేషం నిష్కారణం అని తేలిపోతుంది.   చివరగా మరో చిన్న చిట్కా! మీరు ఎవరితో అయితే ఇష్టం లేకుండా గడపాల్సి వస్తోందో.... అంతకంటే దుర్మార్గులూ, నీచులూ... ఈ లోకంలో చాలామంది ఉన్నారని గ్రహిచండి. అలాంటివారు మీ జీవితంలో లేనందుకు సంతోషించండి. అప్పుడు మీ ముందు ఉన్నవారంతా పరమ సాధుజీవులుగా కనిపించక మానరు. - నిర్జర.  
ఫేస్బుక్! ఒక పదేళ్ల క్రితం చాలామందికి పరిచయం లేని పదం. కానీ ఇప్పుడో! ఫేస్బుక్ అకౌంటు లేకపోతే అదో లోపంగా భావించే తరుణం. ఫేస్బుక్తో అటు లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. ఆ చర్చ సంగతి పక్కన పెడితే అడపాదడపా ఫేస్బుక్లో కనిపించే వీడియోలని చూసి, ఓ లైక్ పడేసి.... ‘అబ్బా! ఈ వీడియో మన సొంతం అయితే ఎంత బాగుండో,’ అనిపించక మానదు. దానికేం చేయాలో మీరే చూడండి.   మనమే అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు- ఒకోసారి ఫేస్బుక్ అకౌంట్లో మనమే ఏదో వీడియో పోస్ట్ చేస్తాం. కానీ దాని తాలూకు కాపీ ఎక్కడో పోతుంది. అలాంటి సందర్భాలలో మన పాత పోస్టుల్లో ఉండే వీడియోని అతి సులభంగా తిరిగి పొందవచ్చు. దీనికి చేయాల్సిందల్లా... - ఫేస్బుక్లో మీ పేరు, ఫొటో ఉన్న ప్రొఫైల్ సెక్షన్ని క్లిక్ చేయండి. - అందులో ఫొటోస్ అన్న సెగ్మెంట్ కనిపిస్తుంది. - ఫొటోస్ని క్లిక్ చేయగానే మీరు పోస్ట్ చేసిన ఫొటోస్, మూవీస్, బుక్స్... అన్నింటితో పాటుగా వీడియోస్ అనే సెగ్మెంట్ కూడా కనిపిస్తుంది. - వీడియోస్ సెగ్మెంట్లో మీరు కాపీ చేసుకోవాలని అనుకున్న వీడియోని ఎంచుకొని ప్లే చేయండి. - వీడియో ప్లే అవుతున్న సమయంలో కింద ఆప్షన్స్ అన్న పదం కనిపిస్తుంది. - ఆప్షన్స్ని క్లిక్ చేయగానే ‘Download SD’ అన్న ఎంపిక కనిపిస్తుంది. - Download SDని క్లిక్ చేయగానే మరోసారి వీడియో ప్లే అవుతుంది. అలా ప్లే అయ్యే సమయంలో కింద మెనూ బార్లో ఉన్నా డౌన్లోడ్ ఐకాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. వీడియో మీ సిస్టమ్లో ఫైల్ సేవ్ అయిపోతుంది. స్నేహితులు అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు-   ఇతరుల వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఫేస్బుక్ నేరుగా అవకాశం ఇవ్వదు. అయితే ఇందుకో సులువు ఉంది. అదేమిటంటే... - మీకు నచ్చిన వీడియో ప్లే అవుతుండగా దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే show video URL అనే ఎంపిక కనిపిస్తుంది. - ఆ URL అడ్రెసుని అలాగే కాపీ చేసుకోండి. గూగుల్ క్రోమ్లో కొత్త విండోని ఓపెన్ చేసి ఆ అడ్రస్బార్లో మీరు కాపీ చేసిన URLని పేస్ట్ చేయండి. - అడ్రస్ బార్లో పేస్ట్ చేసిన URLకి చిన్న మార్పు చేయవలసి ఉంటుంది. అడ్రెస్లో ఉండే WWWని తీసివేసి ఆ స్థానంలో M అనే అక్షరాన్ని ఉంచండి. ఇది మొబైల్ యూజర్స్ కోసం కనిపించే ఫేస్బుక్ వెర్షన్. - ఇప్పుడు వీడియో ప్లే అవుతుండగా, దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే save video as అనే ఎంపిక కనిపిస్తుంది. అంతే దాన్ని క్లిక్ చేయగానే సిస్టిమ్లో మీరు కోరుకున్న చోటుకి వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. - నిర్జర.  
  అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసారు.. కర్నూల్ పర్యటనలో భాగంగా బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు.. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక సాయం అందాలన్నారు.. అదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. మరోవైపు బహిరంగ సభలో కూడా రాహుల్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు.. మోదీలా తాను అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు.. హోదా విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఏపీలో అడుగుపెట్టనని రాహుల్ ప్రకటించారు.. 2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.. ప్రత్యేక హోదా అమలుపైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు.. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని అన్నారు.
  చదువుకుంటూ, తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ సాగిపోవాల్సిన ఆ పసి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది.. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పదో తరగతి చదువుతున్న బాలుడు ప్రాణత్యాగం చేసాడు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు.. మహేంద్ర ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.. అసెంబ్లీలో సంతాపం తెలిపారు.. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా కోసం ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు.. ప్రాణం చాలా విలువైనది.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు.. పోరాడి సాధించుకుందామని అన్నారు.
  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసం, వ్యాపార సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.. హైదరాబాద్‌లో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.. ఖమ్మం నగరంలోని ఎంపీ నివాసంలో ఉదయం 9 గంటల నుంచి సోదాలు చేపట్టారు.. అదే విధంగా బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందించారు.. ఇవి సాధారణ సోదాలేనని స్పష్టం చేశారు.. అయితే ఇప్పుడు ఈ సోదాలు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారాయి.. తెరాస పార్టీకి చెందిన ఎంపీ ఇంట్లో సోదాలు జరగడం ఏంటి అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ అనేది కామన్‌గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాఢపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలు.. లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. అందుకే డయాబెటిస్ అంటే చాలు జనం హడలిపోతారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, స్థూలకాయం, స్మోకింగ్ తదితర కారణాలు షుగర్ రావడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత అది తినకూడదు. ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చట. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Alzheimer – Is it curable? What are its stages? Is Alzheimer caused because of insufficient sleep? Are some of the questions people generally ask? Dr. P Ranganadham, the Neurosurgeon from Sunshine Hospital explains. https://www.youtube.com/watch?v=snj8rqAsWc4&t=139s  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.