Publish Date:Jul 5, 2017
Publish Date:Jun 29, 2017
Publish Date:May 24, 2017
Publish Date:May 8, 2017
Publish Date:May 3, 2017
Publish Date:May 2, 2017
Publish Date:Apr 29, 2017

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
ఎంతో కష్టపడి తీసిన సినిమాను ప్రమోషన్ చేసుకోవడంలోనే విజయం ఆధారపడి ఉంటుందన్నది సినీజనాల మాట. కంటెంట్ ఎంత బాగున్నా ప్రమోషన్ లేకపోతే అది జనాల దాకా వెళ్లక ఫ్లాపైన ఉదాహరణలు ఎన్నో.. అయితే ప్రమోషన్ బాగున్నా.. కథలో దమ్ము లేకపోతే జనాలు పక్కనపెట్టేయం కూడా చూశాం. ఇప్పుడు ఘట్టమనేని మంజుల తీసిన మనసుకు నచ్చింది రెండో కోవలోకి వస్తుందంటున్నారు క్రిటిక్స్. తొలిసారి మెగాఫోన్ పట్టడంతో.. తన సినిమాకు జనాల్ని రప్పించడానికి ఆమె చేయగలిగిందంతా చేసింది. తమ్ముడు మహేశ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించడంతో పాటు ప్రమోషన్‌లో కూడా సూపర్‌స్టార్‌ను వాడుకుంది. అక్కడితో ఆగకుండా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని మెప్పించడం కోసం ఆయన ప్రస్తావన తీసుకువచ్చింది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కోసం తాను ఒక కథ రాసుకున్నానని.. కల్యాణ్ అయితేనే దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని చెప్పింది. పవన్-మహేశ్ మంచి ఫ్రెండ్సని.. అర్జున్ సినిమా పైరసీ విషయంలో పవర్‌స్టార్ ఎంతో హెల్ప్ చేశారని ఓ రేంజ్‌లో మోసేసింది. మంజుల ఈ రేంజ్‌లో భజన చేయడానికి కారణం లేకపోలేదు.. పవన్, మహేశ్‌ అభిమానులు తన సినిమాను సూపర్‌హిట్ చేస్తారని ఆమె ప్లాన్ కాబోలు. తీరా సినిమా రిలీజైంది.. మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో.. డిజాస్టర్‌గా నిలిచింది. ఇక్కడ తేలింది ఎంటంటే.. కంటెంట్‌లో విషయం లేకపోతే.. ఎంతపెద్ద సూపర్‌స్టార్లు అండగా నిలబడినా ప్రేక్షకులు పక్కనపెట్టేస్తారు.
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ‌ దేశవ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ సినిమాలో చూపించిన అశ్లీలత పరిధి దాటిందని.. మహిళల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు చిత్రీకరించారని.. మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. ఇది చాలదు అన్నట్లు ఒక మీడియా సంస్థ లైవ్ షోలో పాల్గొన్న వర్మ.. ఒక సామాజిక కార్యకర్తతో అసభ్యకరంగా మాట్లాడటంతో రచ్చ రచ్చ అయ్యింది. దీనిపై మహిళా సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపడంతో.. ఆర్జీవీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మపై పది ప్రశ్నలు వదలగా... ఎప్పటిలాగే తనదైన శైలిలో సమాధానం చెప్పాడు ఈ సెన్షేషనల్ డైరెక్టర్. ఆ పది ప్రశ్నలు ఏంటంటే   1. జీఎస్టీని ఎందుకు తీశారు...? 2. మియా మాల్కావాతో సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది..? 3. ఈ సినిమాకు పెట్టుబడి ఎక్కడిది.. పెట్టుబడి పెట్టిన వారెవరు..? 4. ఈ సినిమాకు పనిచేసిన వారికి ఏ విధంగా చెల్లింపులు చేశారు..? 5. సినిమాను ఎక్కడ తీశారు..? ఎక్కడ అప్‌లోడ్ చేశారు..? 6. మీ ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లోని మాల్కోవా ఫోటోలు ఎక్కడివి..? 7. ఒక మహిళ మీద అభ్యంతరకరంగా చేసిన కామెంట్‌పై మీ అభిప్రాయం..? 8. భారతీయ చట్టాలకు జీఎస్టీ సినిమా వర్తించదు అంటున్నారు.. అందుకు తగిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా.? 9. విమియో వెబ్‌సైట్‌కి ఈ సినిమాను ఎంత ధరకు అమ్మారు..? 10. ఈ సినిమాకు వాడిన ఎక్విప్‌మెంట్ ఎక్కడిది..?
Superstar Krishna’s daughter and Mahesh Babu’s sister Manjula Ghattamaneni made her directorial debut with Manasuku Nachindi starring Sundeep Kishan, Amyra Dastur, Adith Arun and Tridha Choudhury. The production team tried all possible things to generate buzz on the film prior to its theatrical release. Manjula along with her lead cast promoted her film vigorously. She told in few media interactions to have prepared an outstanding political subject for Pawan Kalyan. Perhaps, she thought of pleasing Pawan Kalyan fans with the statement. Manjula even roped in her brother Mahesh Babu to attend few interviews. Just a day before release of Manasuku Nachindi, they released new trailer with Mahesh Babu’s voiceover. Mahesh Babu gave voice for nature in the film. Shockingly, Manasuku Nachindi botched to rake even decent numbers on day one. Negative talk further damaged the film’s fortune.
సమ్మర్‌లో ఏప్రిల్ 27కి తమ సినిమా రిలీజ్ డేట్‌ను ముందే లాక్ చేసి పెట్టుకున్నారు మహేశ్, బన్నీ. కానీ ఊహించని విధంగా సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా అదే రోజు తన సినిమాను విడుదల చేస్తానని ప్రకటించడంతో.. సూపర్‌స్టార్, స్టైలిష్ స్టార్లు ఉలిక్కిపడ్డారు. ఒకేరోజు ముగ్గురు సూపర్‌స్టార్లు థియేటర్లలోకి వస్తే.. పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు.. ఎంతో నమ్మకంతో సినిమాను కొన్న బయ్యర్లకు ఇన్వెస్టిమెంట్ వెనక్కి వస్తుందా...? అన్న భయం వెంటాడుతోంది. నిర్మాత క్షేమాన్ని కోరి మహేశ్, బన్నీల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలానా డేట్‌కి తమ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన వాళ్లు.. అదే తేదీకి మరో చిత్రం వస్తే తమ సినిమాను పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. రజనీ రాకతో వారం గ్యాప్ తీసుకుంటారని ట్రేడ్ పండితులు భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇద్దరు ఏప్రిల్ 26కి సినిమా పక్కా అంటూ అనౌన్స్ చేశారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇరు వర్గాల మధ్య పంతానికి దారి తీస్తోంది. మీ సినిమాను వెనక్కి జరపొచ్చు కదా అని నా పేరు సూర్య నిర్మాతలు.. భరత్ అనే నేను నిర్మాతలను అడిగితే.. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా అని వీళ్లు అంటున్నారు. బాహుబలి టైంలో శ్రీమంతుడు సినిమాని వెనక్కి జరిపి మహేశ్ పక్కా జెంటిల్మెన్‌గా ప్రశంసలు పొందాడు.. అలాంటి ప్రిన్స్ కూడా ఈసారి ఎందుకో మరి తగ్గనంటే తగ్గను అంటున్నాడు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఇంతవరకు వెనక్కి తగ్గిన చరిత్ర తనకు లేదంటున్నాడు. పైగా ఏప్రిల్‌ నెల బన్నీకి బాగా కలిసిరావడంతో.. దానిని సెంటిమెంట్‌గా భావిస్తుండటంతో.. ఏ మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేడు. ఇద్దరు సై అంటే సై అంటుండటంతో ఏం జరుగుతుందోనని బయ్యర్లు వణికిపోతున్నారు. 
Recent outing Tholi Prema is unstoppable at box office. The film has collected a share of Rs 14.11 crores alone in Telugu states. This is turning out to be second biggest grosser in Varun Tej’s career. Fidaa which raked 50 Cr share is highest grosser in Varun’s career so far. Tholi Prema is also doing remarkable business. But it will only end as second highest grosser for him since it is tough to break Fidaa records. Here is Tholi Prema AP and Nizam first week shares list: Area    Shares (In Crores) Nizam - 5.56 Ceded - 1.66 Vizag - 2.16 Guntur - 1.15 East- 1.14 West - 0.93 Krishna - 1.07 Nellore - 0.44  Total - Rs 14.11 Cr
ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.   పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.   రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. విజయవాడలో చంద్రబాబును కలిసి వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ.. రాజీనామా సమర్పించినట్టు ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు కూడా.. అంతకు పార్టీలు మారినవారంతా తమ తమ పదవులకు రిజైన్ చేయలేదు.. కానీ రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారని అందరూ ఆయనను అభినందించారు. కానీ.. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కూడా రాజీనామా విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన రిజైన్‌ లెటర్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు కానీ.. స్పీకర్‌కు పంపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.   మరి ఇంత జరిగినా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం. రేవంత్ అనర్హత గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక కేసీఆర్‌ది ఇదే రకమైన పరిస్దితి.. తన అధికారం చెక్కుచెదరకుండా ఉండేందుకు.. ఎవ్వరూ తనకు పోటీకాకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను నామ రూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్. ఆ వ్యూహాంలో చాలా వరకు విజయం సాధించారు. అలా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఒకవేళ రాజీనామాలు చేయిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 ఉపఎన్నికలు ఖాయం. ఈ తలనొప్పంతా ఎందుకని.. రేవంత్‌ విషయంలో ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అంటోంది.   ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ కాంగ్రెస్. కొడంగల్‌లో హస్తం పార్టీ ఉపఎన్నికలకు వెళ్లిందే అనుకున్నాం.. కానీ అక్కడ కేసీఆర్ వదులుతాడా..? సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే.. రేవంత్‌ను అడ్డుకుంటాడు.. కాంగ్రెస్ గెలిస్తే మంచిదే. ఒకవేళ అటు ఇటైతే మాత్రం ఎన్నికల వేళ శ్రేణుల మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్లే. ఉపఎన్నికల్లోనూ.. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. ఇంకేదైనా బైపోల్ వచ్చినా.. ఇదే రిజల్ట్ ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో.. కాంగ్రెస్ హైకమాండ్ సాహసం చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. రేవంత్‌ను కదిపేవారు కానీ.. ఇదేంటని అడిగేవారు కానీ లేరని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
’పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు...‘ కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసే మాట.  ’కమలహాసన్ ఇక నటించడు...‘ యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట.  ’సూపర్ స్టార్ రజనీకాంత్... ఇక తెరపై కనిపించడు...‘ దేశవ్యాప్త తలైవా ఫ్యాన్సును విషాదంలో ముంచెత్తే మాట.  నిజానికి రాజకీయాల్లోకెళ్తే.. చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే... ఎన్టీయార్ ‘నా దేశం’ సినిమా చేసేవారు కాదే. అలా అయితే... ఎన్టీయార్ నుంచి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర’ సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే... ముఖ్యమంత్రిగా ఉంటూనే  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఎందుకు చేస్తాడు ఎన్టీయార్? ఓ వైపు ప్రతి పక్షనేతగా ఉంటూ.. మరో వైపు ఏకంగా సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు?    ఎన్టీయార్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో.. ప్రచారంలో ఉండగా చేసిన సినిమా ‘నాదేశం’. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘అజ్ఙాతవాసి’... ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు... రోబో2, కాలా.. ఇవి సమకాలీన సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు కావు. మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు     అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురూ ఎన్టీయార్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజికాంశాలు మేళవించిన కథలను ఎంచుకొని... జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ... ఓ వైపు నటులుగా.. మరో వైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్ల కూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చాతకాని వీరు.. రేపు రాజకీయాలేం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు.    సూపర్ స్టార్, వపర్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ.. రచయితలు కానీ ఇప్పుడు లేరా? అనే అనుమానాలను కూడా జనాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ ‘నా దేశం’ స్థాయి సినిమాను తీసే దర్శక, రచయితలు నేడుంటే... దేశ రాజకీయ చిత్రాన్ని.. వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే... దేశ రాజకీయాల్లో వేడి మొదలవ్వడం ఖాయం. జనాల్లో కొత్త కదలక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయం.  ఏమంటారు ఫ్రెండ్స్. 
  2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వున్నాయా? దేశ రాజకీయాలను శాశించగల వ్యక్తులు చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి వ్యూహ రచన ఇప్పటికే ప్రారంభమైందా? తాజాగా జరిగిన పరిణామాలు ఇలాంటి సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మంగళవారం నాడు అమరావతిని సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న పరిపాలన కార్యక్రమాలను చూసి ఆయన చంద్రబాబును అభినందించారు. ‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ అని ముకేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా దేశ రాజకీయాలను శాశించే శక్తి వున్న వ్యక్తి ముకేష్ అంబానీ... ఆయన నోటి వెంట వచ్చిన ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.   చంద్రబాబుకు ప్రధానమంత్రి సీటు మీద కూర్చోవాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. గతంలో  ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన ఎగిరి గంతేసి ప్రధాని కుర్చీ మీద కూర్చోలేదు. ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడమే తనముందు వున్న ఏకైక లక్ష్యమని అప్పట్లో ఆయన ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా నవ్యాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించే పనిలో ఆయన తలమునకలుగా వున్నారు. నిధులు లేని రాష్ట్రం ఏ విషయంలోనూ వెనుకబడకుండా వుండేందుకు ఆయన తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చి హైదరాబాద్ నుంచి తరిమేసిన ఆంధ్రులను గౌరవప్రద స్థానంలో నిలబెట్టడానికి తపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కృషిని గమనించే ముకేష్ అంబానీ చంద్రబాబుకు ‘పెద్ద హోదా’ రావాలని భావించారేమో!   2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం మరోసారి లభిస్తే ఆయన ఈసారి దానిని సున్నితంగా తిరస్కరించరనే భావించవచ్చు. నిజంగానే చంద్రబాబు ఉండాల్సిన స్థాయి ప్రధానమంత్రి స్థాయే. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి చంద్రబాబు లాంటి ప్రధానమంత్రి అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రధానమంత్రి స్థానాన్ని చేపడితే అది ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేసే అంశం అవుతుంది. అందుచేత.. ఈసారి చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుందాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ముమ్మరం చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా వున్నవారికి ఆయన ఇప్పుడు కల్పవృక్షంలా కనిపిస్తున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు జనసేన నీడన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ పార్టీకి సన్నిహితంగా వుండాలా అని ఎదురుచూస్తున్న ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్‌కి చేరువవుతున్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌ని కలసి మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రముఖులు తమ నాయకుడికి చేరువ కావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమాన జనాలు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇలా హ్యాపీగా ఫీలవటం సూది దొరికిందన్న ఆనందంలో గడ్డపలుగు పోయిందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి దగ్గరవుతున్నారు ఓకే.. బాగానే వుంది.. కానీ మరో ప్రముఖుడు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారు.. ఆ విషయాన్ని జనసేన వర్గాలు లైట్‌గా తీసుకుంటున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువ. గతంలో ఈ సామాజికవర్గం వారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మీద ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. ఇప్పుడు పవన్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా తమను భంగపడేలా చేస్తాడా అనే అనుమానాలు వీరిని బలంగా పీడిస్తున్నాయి.   అలా అనుమానిస్తూనే, పవన్ వెంట నడుస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ముద్రగడ పవన్ కళ్యాణ్‌తో కలసి నడవటానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల ఒక బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ వుండదని, కాపులకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే న్యాయం చేస్తారన్న నమ్మకం వుందని ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ చేసిన ఈ ప్రకటన కాపు సామాజిక వర్గం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి, జనసేన వర్గాలకి ఇంకా అర్థమైనట్టు లేదు.
గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో అగ్గిని రాజేసిన అంశం విభజన హామీల అమలు. ఈ సెగ ఎప్పటి నుంచో మనసులో ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న సాకుతో.. ఏపీ విభజన చట్టంలో హామీల సాధన అంశం తెరపైకి వచ్చి.. ఆంధ్రలో మళ్లీ అలజడి రేపింది. దానికి ముందు నాలుగు రోజుల పాటు ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన విన్యాసాలతో జనం ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రాష్ట్రానికి చెందిన పార్టీల ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకున్నప్పటికీ.. దానికి బీజం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ సభ్యులే. వీరిని చూసే మిగిలిన వారు.. తాము వెనుకబడిపోతామని.. క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందని భయపడి ఆందోళన బాట పట్టారు.   రాజ్యసభ వేదికగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో.. తాము చేయగలిగింది చేశామని టీడీపీ సభ్యులు అనుకుంటున్నారు. వారి భావనలో తప్పు లేదు.. అంతకు మించి వారు చేయలేరు కూడా. ఏం జరిగినా.. జరగకున్నా.. తెలుగుదేశం ఎంపీల పట్ల రాష్ట్రంలో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. లోక్‌సభలో పదిహేను నిమిషాల స్పీచ్‌తో.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. బెజవాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గుంటూరు వరకు జయదేవ్‌కి జనం నీరాజనాలు పట్టారు. ఇలాంటి టైంలో టీడీపీ ఎంపీలు వారు చేస్తున్న పోరాటం.. ఆ పోరాటం వల్ల టీడీపీకి జరుగుతున్న నష్టం... తదితరాలపై చాలా ఘాటుగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. టీడీపీ నేత – చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణలో పార్లమెంటు ఆవరణలో.. తనదైన శైలిలో విచిత్ర నిరసన వ్యక్తం చేస్తుండగా – ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు మురళీమోహన్ – గల్లా జయదేవ్ – రామ్మోహన్ నాయుడులు నిలిచి ఉన్న ఫొటోను తన పోస్ట్ లో పెట్టిన వర్మ… చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. "ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ విలువైన ఓటుతో ఇలాంటి జోకర్ల లాంటి ఎంపీలనా ఎన్నుకుంది.. ఇలాంటి జోకర్లను చూసి మోడీ కూడా ఏపీని ఓ జోక్‌గానే తీసుకుంటున్నారు. కనీసం వీరు జోకర్లుగా కూడా పనికి రారు. జోకర్లకు తక్కువ.. ఇంకా దేనికో ఎక్కువ" అంటూ ఏకీ పారేశారు.   ఇది జరిగిన కాసేపటికి వర్మ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు కత్తి మహేశ్. ఆ ఫోటోలో విచిత్ర వేషధారణలో కనిపిస్తున్న చిత్తూరు ఎంపీని టార్గెట్ చేస్తూ.. "మన ఖర్మ కాలి… ఈయన చిత్తూరు ఎంపీ. ఈయన ఓ డాక్టర్. యాక్టర్ కూడానూ. పార్లమెంటులో బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించాల్సింది పోయి… సభ వెలుపల నాటకాలు – డ్రామాలు చేస్తున్నారు. సిగ్గు సిగ్గు" అంటూ కామెంట్ చేశారు.. ఇక ప్రత్యేకహోదా ఆంధ్రుల జన్మహక్కు అన్నంతగా ప్రచారం చేసి మధ్యలో ఆగిపోయిన సినీనటుడు శివాజీ.. చాలా కాలం తర్వాత ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాడు..   "రోడ్లకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. 67 వేల కోట్లకే లెక్క చెప్పారు. మిగితావి ఎవరికిచ్చారు ? మీరిచ్చిన దొంగ లెక్కలు, అంకెలు కూడితే 5 లక్షల కోట్లు . స్టీల్ ప్లాంట్ , దుగరాజపట్నం పోర్టు కలిపితే 12 లక్షల కోట్లు దాటతాయి. అసలు కేంద్ర బడ్జెట్ ఎంతో మీ మట్టి బుర్రలకి తెలుసా ? అబద్ధాలు అంకెల్లో చెబితే నిజాలైపోతాయా ? హరిబాబు ఎప్పుడైనా ఆంధ్ర సమస్యలపై 10 నిమిషాలు పార్లమెంటులో మాట్లాడారా ? 27 పేజీల లేఖలో రైల్వే జోన్ మర్చిపోయావేం ? విశాఖ హరిబాబూ ?" అంటూ బీజేపీని దోషిగా తేల్చేశాడు. వర్మ, కత్తి మహేశ్‌‌లు టీడీపీ ఎంపీలను టార్గెట్ చేయగా.. శివాజీ మాత్రం తప్పు హరిబాబుదే అన్నట్లుగా ట్వీట్ చేశారు. అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు తప్పెవరిదో తేల్చేందుకు.. పవన్ జేఏసీ ఉండగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ఎంత చదవాలనుకున్నా.. మీ మైండ్ డైవర్ట్ అవుతుందా..? మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏకగ్రతతో ఎలా ఉండాలి.. డాక్టర్ పూర్ణిమా నాగరాజ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=DAZ-yKYEQ4k  
కోపం అంటే ఎవరు కూడా నచ్చని, లేదా మెచ్చని అంశం. కానీ, సందర్భాన్ని బట్టి మనకు తరచుగా కోపం వస్తుంది. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది. ఎవరయినా మీ వ్యక్తిగత పరిధిలోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే వస్తుంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే కోపం అనేది ఏదో ఒక నచ్చని విషయానికి మనం ఇచ్చే రియాక్షన్. కోపం గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=uKAoOTwGR_Q
త్రిపుర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అగర్తలాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 60 శాసనసభ స్థానాలున్న త్రిపురలో 59 స్థానాలకు గానూ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 292 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
విభజన హామీలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేస్తోన్న వాదనల్లో ఎవరి వాదన సరైనదో తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జే‌ఎఫ్‌సీ అనే కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు, మేధావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీకి సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ అధికారులను నియమించింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న కమిటీకి సహకరించడంతో పాటు లెక్కలను వివరించేందుకు గానూ.. ప్రేమ్ చంద్రారెడ్డి, బాలసుబ్రమణ్యంలను ఏపీ ప్రభుత్వం పంపించింది. లెక్కలను జనసేన పార్టీకి కాకుండా త్రిసభ్య కమిటీకి సమర్పించాల్సిందిగా పవన్ అధికారులకు సూచించారు.
జీఎస్టీ సినిమాను మహిళల మనోభావాలను దెబ్బతీసేలా తెరకెక్కించారని.. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‌పై మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆయన్ను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపారు. దీనిలో భాగంగా సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు వర్మ. దాదాపు మూడున్నర గంటలపాటు ఆయన్ను విచారించిన పోలీసులు.. వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్జీవీ మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ సీజ్ చేసిన పోలీసులు సోమవారం మరోసారి హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేశారు. జీఎస్టీకి సంబంధించిన వివరాల కోసమో పోలీసులు వాటిని సీజ్ చేసినట్లు సమాచారం.
డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఆహరం విషయంలో అతి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాలు సరయిన మోతాదులో తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మిల్లెట్స్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=OnSe-wLn_XY  
లిక్విడ్ డైట్స్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది. వీరమాచినేని రామకృష్ణ గారు నాన్ వెజిటేరియన్ మాత్రం తీసుకోకూడదు అని సూచిస్తున్నారు. నట్స్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలంటున్నారు. ఆ తర్వాత గంటకి నాన్ వెజ్ తీసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. బరువు తగ్గడానికి మరిన్ని సూచనల కోసం ఈ వీడియో చూడండి....  https://www.youtube.com/watch?v=PON504-5_1A