పార్లమెంట్ వద్దు... కూరగాయలు ముద్దు..
Publish Date:Nov 18, 2016
మోడీ దెబ్బకు పెళ్లాం పాయే...
Publish Date:Nov 17, 2016
ఆవిడ్ని చూసి బుద్ది తెచ్చుకోండి
Publish Date:Nov 16, 2016
వెయ్యి వద్దు.. వంద ముద్దు...
Publish Date:Nov 15, 2016
ఉప్పు తెచ్చిన తిప్పలు..
Publish Date:Nov 14, 2016
పాత నోటు...పాత పెళ్లాం..
Publish Date:Nov 12, 2016
నోట్ల కోసం పాట్లు...
Publish Date:Nov 11, 2016
వారికే ఎట్రాక్ట్ అవుతారు..
Publish Date:Nov 10, 2016
నోట్లు కంటే చెత్తకే విలువ..
Publish Date:Nov 9, 2016
ఎవరు గెలిచినా..బొప్పి కట్టడం ఖాయం
Publish Date:Nov 8, 2016
అమ్మా, నాన్న ఓ పాకిస్థాన్ యుద్దం
Publish Date:Nov 7, 2016
ఇంట్లో కాలుష్యం..
Publish Date:Nov 5, 2016
చీరకు సీఎం పర్మిషన్...
Publish Date:Nov 4, 2016
ఫ్యాన్సీ నెంబర్ తెచ్చిన పాట్లు..
Publish Date:Nov 3, 2016
ఇండియా జైళ్లు మంచివి..
Publish Date:Nov 2, 2016
దీపావళి తెచ్చిన కష్టాలు...
Publish Date:Nov 1, 2016
టీవీలో పదవి బాంబు...
Publish Date:Oct 29, 2016
ఉన్నా ఒకటే.. పోయినా ఒకటే..
Publish Date:Oct 28, 2016
అక్కడా తప్పదు...ఇక్కడా తప్పదు
Publish Date:Oct 27, 2016
పప్పు కాదు పవర్ ఫుల్ లీడర్! వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.. సంపాదనే పరమావధిగా పాలిటిక్స్ చేసేవారు మరికొందరు. ప్రస్తుత రాజకీయాల్లో మొదటి రకంలో కొందరే ఉంటారు. అలాంటి వారిలో టాప్ గా నిలుస్తారు నారా లోకేష్. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్.. ఎమ్మెల్సీగా, మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అనునిత్యం ప్రజల కోసమే పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వైసీపీ నేతలు తనను పప్పు పప్పు అని అవహేళన చేస్తున్నా .. ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవలో ముందుంటూ తానొక ఫర్ ఫెక్ట్ లీడరని నిరూపించుకున్నారు. తండ్రి ఎమ్మెల్యే అయితేనే అక్రమ దందాలు చేస్తూ అతని కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకునే కాలమిది. తండ్రి వైఎస్ సీఎం అయితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు ప్రజాధనం దోచుకుని 31 కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి వైఎస్ జగన్‌రెడ్డి. కాని తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేసినా.. నారా లోకేష్‌పై ఇప్పటివరకు ఒక్క కేసు లేదు. తాత తారకరామారావు ఆరేండ్లు, తండ్రి చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాప్రభుత్వ వ్యవహారాలలో తలదూర్చలేదు. అందుకే ఒక్క కేసులేని మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నారు చినబాబు. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక కేసు పెట్టాలని చూసినా వారి కుట్రలు ఫలించలేదు. ఇసుక సైట్ హ్యాక్ చేశారని, డేటా చోరీ అంటూ చిల్లర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.చివరికి అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపారని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసులు బనాయించి కామెడీ పీసైపోయారు సర్కార్ రెడ్డి పోలీసులు. మంత్రిగా పనిచేసి రూపాయి అవినితి ఆరోపణలు నారా లోకేష్ పై రాలేదు. అంతేకాదు తన పనితీరుతో ఏపీని దేశంలోనే టాప్ లో నిలిపారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను లోకేష్ నిర్వహించగా.. ఈ రెండు శాఖలకు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ ఘనత సాధించామని అధికారులే స్వయంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించి పేదలకు బాసటగా నిలిచారు నారా లోకేష్. అవినీతి అంతమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఏకరవు పెడుతూ వారికి కొరకరాని కొయ్యలా మారారు నారా లోకేష్. టీడీపీకి కులం రంగు అంటించి విషప్రచారం చేస్తోంది వైసీపీ. అయితే లోకేష్ ను దగ్గరనుంచి చూసిన వారికి తెలుసు అతను ఏమాత్రం క్యాస్ట్ పట్టింపులేని వజ్రమని. ప్రస్తుత సీఎం జగన్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ నుంచి అధికారుల వరకు అంతా ఒకే కులం. సీఎంవో మొత్తం ఆయన సామాజికవర్గమే. నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గర పనిచేసిన వారంతా ఇతర సామాజిక వర్గాల వారే. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా జవహర్‌రెడ్డి, గ్రామీణనీటిసరఫరా శాఖలో భరత్‌గుప్తా, స్వచ్ఛభారత్ కార్పొరేషన్ ఎండీ గా మురళీధర్‌రెడ్డి ఉండేవారు. ఐటీ శాఖలో జయచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు (ఎస్సీ) మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా రంజిత్ భాషా(ముస్లిం), శ్రీనివాస్ (బీసీ), పీఎస్ అర్జున్ (ఎస్సీ) ప్రైవేట్ పీఏ నరేష్ (గౌడ) పీఆర్వోగా చైతన్యరెడ్డి పని చేశారు. లోకేష్ ఐటీ మేనేజర్ గా శ్రీనివాస్ (బ్రాహ్మిన్). వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ జిజూ జోసెఫ్ (క్రిస్టియన్ కేరళ) పర్సనల్ డ్రైవర్ సతీష్ (ఎస్సీ). ఇలా ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీలోనూ నారా లోకేష్ కులం వారు ఒక్కరూ లేరు. నారా లోకేష్ కు తెలుగు మాట్లాడటం రాదని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. తాను చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మీడియం కావడం వల్ల తెలుగు మాట్లాడేటప్పుడు తడబడతానని నిజాయితీగా ఒప్పుకున్నారు లోకేష్. పదాలు తడబడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు వాటినే వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నా.. ఆయన ప్రజాబాట మరవలేదు. లైవ్‌లో మాట్లాడటం ఆపేయలేదు. మీడియా మిత్రులని కూడా ఏమైనా ప్రశ్నలున్నాయా అంటూ అడిగి మరీ ప్రెస్మీట్లు ముగిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవలేక తెలుగుని ఖూనీ చేస్తూనే వున్నాడు. చివరికి లైవుల్లో దొరికిపోతున్నామని రికార్డెడ్‌కి వెళ్లి అక్కడా తప్పుడు లెక్కలు, పదాల్ని పలకలేక నానా అవస్థలు పడుతున్నారు. పప్పు అని జగన్‌రెడ్డి అండ్ కో గేలి చేసిన నారా లోకేష్ ప్రజల్లో వుంటూ, లైవుల్లో పంచ్ డైలాగులు విసురుతుంటే.. జగన్‌రెడ్డి మాత్రం మీడియా ముందుకి కూడా రాలేక తాడేపల్లి నుంచి రికార్డెడ్ ప్రెస్మీట్లు వదులుతూ జీరో అయిపోయారు. తెలుగుదేశం పార్టీకి సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కుటుంబం. తమ్ముళ్ల కోసం లోకేష్ ఆలోచనల కార్యరూపమే కార్యకర్తల సంక్షేమ నిధి. జెండా మోసే కార్యకర్తకి అండగా నిలిచేందుకు నారా లోకేష్ ఆరంభించిన ఈ విభాగం ఇప్పటికే వేలాది కుటుంబాలకు చేయూతనిచ్చింది. టిడిపి సభ్యత్వం తీసుకున్న 80 లక్షలమంది కార్యకర్తలకు బీమా ప్రీమియం కట్టి, వారి భద్రతకు భరోసానిచ్చారు నారా లోకేష్. ఎటువంటి ఆర్థిక ఆసరాలేని సీనియర్ కార్యకర్తలకు ప్రతి నెలా 1500 వారి ఖాతాల్లో వేస్తూ చేదోడుగా నిలుస్తున్నారు లోకేష్. నిరుపేద టీడీపీ కార్యకర్తలు, ప్రత్యర్థి పార్టీల దాడుల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉచిత విద్యనందిస్తున్నారు. నిరుపేదలైన కార్యకర్తల వైద్య, విద్య, వివాహ అవసరాలకు సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తున్నారు. ప్రాణాంతక క్యాన్సర్ సోకిన పార్టీ కుటుంబ సభ్యులకు బసవతారకం క్యాన్సత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. పేద కార్యకర్తల పిల్లల వివాహాలకు పార్టీ నుంచి పెళ్లికానుక అందిస్తున్నారు నారా లోకేష్. పార్టీ కార్యకర్తల్ని కుటుంబసభ్యుల్లా భావించి వారి సంక్షేమానికి పాటుపడుతూ కార్యకర్తల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న నారా లోకేషే అసలు సిసలు ప్రజానాయకుడని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. ప్రజలే దేవుళ్లని భావించే కుటుంబం నుంచి వచ్చిన లోకేష్.. వాళ్ల స్పూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కొద్ది కాలంలోనే రాజకీయంగా రాటు దేలి, ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తూ.. అవినీతికి అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఏపీకి భవిష్యత్ ఆశాకిరణంలా మారిపోయారు చినబాబు.
మేం కేసులు పెడతాం.. మీరు లాగేసుకోండి! ఏపీలో టీడీపీ టార్గెట్ గా జాయింట్ స్కెచ్
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాలకు అయితే మరింతగా దగ్గరగా ఉంటుంది. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శత్రువులు ఉండరంటారు. కలిసున్న నేతలు విడిపోతుంటారు.. బద శత్రువులుగా ఉన్నవారు ఏకమవుతుంటారు. తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి మరో ప్రత్యర్థితో రాజీ చేసుకుంటూ ఉంటారు పొలిటికల్ లీడర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు చూస్తున్న వారికి ఇది ఇట్టే అర్ధమవుతోంది. కేంద్రం డైరెక్షన్ లోనే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. టీడీపీ బలహీనం అయితేనే అది సాధ్యమని భావిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో తమతో విభేదించి.. ప్రధాని మోడీ. అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ఇంకా మర్చిపోలేకపోతోంది. అందుకే పార్టీ బలోపేతంతో పాటు చంద్రబాబుపై ప్రతీకారం తీసుకోవాలనే కసితో ఉంది కమలం పార్టీ. అందుకే టీడీపీని టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందు కోసం కొత్త ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సహకారం తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసుల పెట్టి వేధించడం.. తర్వాత బీజేపీ ఎంటరై తమ పార్టీలో చేరితే రక్షణ కల్పిస్తామని వారికి హామీ ఇవ్వడం... ఇది ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహమని తెలుస్తోంది. టీడీపీని బలహీనం చేయాలని బీజేపీ చూస్తుండగా... టీడీపీ తమకు కూడా ప్రధాన ప్రత్యర్థి కావడంతో వైసీపీ కూడా అందుకు సరే అన్నదని తెలుస్తోంది. ఏపీలో టీడీపీని ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, వైసీపీలు ఈ తరహా రాజకీయాలకు తెర తీశాయనే చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహంలో భాగంగానే పోలీసు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయన్నది టీడీపీ నేతల మాట. బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేతలే ... ఇటీవల పోలీసు కేసుల బాధితులుగా ఉంటుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చాకా ఎక్కువ టార్గెట్ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయితే జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి వెళుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు జేసీ బ్రదర్స్ తో మాట్లాడారని కూడా చెప్పారు. కాని వాళ్లెవరు బీజేపీలోకి చేరలేదు. అందుకే వాళ్లపై పార్టీ మారేలా ఒత్తిడి పెంచడానికే కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. కళా వెంకట్రావును బీజేపీలోకి రావాలని సోము వీర్రాజు ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఈ అరెస్ట్ జరిగింది. దీంతో కళా వెంకట్రావును టీడీపీ నుంచి బయటికి లాగేందుకే అరెస్టు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి భారీగా తమ పార్టీలోకి వలసలుంటాయని భావించారు కమలం పార్టీ నేతలు. అయితే అలాంటేది లేదు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుండగా ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఒకరిద్దరు పేరున్న నేతల తప్ప మిగిలిన వాళ్లు కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అమిత్ షా ఆదేశాలతో టీడీపీ నుంచి నేతలను ఆకర్షించేందుకు ఏపీ బీజేపీ నేతలు నయా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి చెరితే వైసీపీ నుంచి వేధింపులుండవని, పార్టీలో చేరితే చాలు వైసీపీ అసలు పట్టించుకోదని రహాస్య మీటింగ్స్ లో చెబుతున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీదీ వెంకటేష్ తో పాటు ఆదినారాయణ రెడ్డి, రావేల కిషోర్ బాబు, వరదాపురం సూరి వంటి నేతలు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి వాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మీరు కూడా పార్టీలోకి వస్తే మీకు ఏ ఇబ్బందులు ఉండవని అభయం ఇస్తోన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలను ఇలాంటి ఆఫర్లతోనే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సోమువీర్రాజు అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చేరికలే లేకపోవడంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టార్గెట్స్ సెట్ చేసి మరి పార్టీలోకి అవకాశం ఉన్న నేతలందరి చేర్చుకోవాలని వీర్రాజుపై ఒత్తిడి చేస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే సోమువీర్రాజు కూడా గ్రౌండ్ వర్క స్టార్ చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నేతలతో నేరుగా ఫోన్ సంభాషణలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీ వద్ద ఉన్న ఆఫర్స్ వాళ్ల ముందు పెట్టి ఆలోచించుకోమని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన కళా వెంకట్రావుతో నేరుగా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది.
గులాబీ పార్టీలో కేటీఆర్ సీఎం గోల! రాజకీయ డ్రామాలంటున్న విపక్షాలు
కేటీఆర్ సీఎం కావాలంటూ టీఆర్ఎస్లో గొంతులు పెరుగుతున్నాయి. పోటీపడి మరీ గులాబీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మంత్రులు అదే పాట పడుతున్నారు. కేటీఆర్ సీఎం ఐతే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కు అనుకూలంగా మూడు రోజుల క్రితం సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడగా.. బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ కూడా ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు జై కొట్టారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్ని విధాలా అర్హుడని మంగళవారం కామెంట్ చేశారు. నేతల వరుస ప్రకటనలతో టీఆర్ఎస్ లో కేటీఆర్ అంశమే హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండటం, తాజాగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో కేటీఆర్ పట్టాభిషేకం ఖాయమే అన్న చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ పై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పలితం రాకపోవడానికి అదే కారణమని కూడా తేలింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను కూడా క్యాన్సిల్ చేశారు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి నిఘా వర్గాల నివేదికలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీలో ఎలా ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించారట కేసీఆర్ . అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది. కేసీఆర్ పరిధిలో ఉండే రాష్ట్ర సంస్థలే కాదు కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయని చెబుతున్నారు. కేంద్ర సంస్థల సర్వే ఫలితాలు తెలుసు కాబట్టే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కచ్చితంగా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు. అందుకే సర్వే నివేదికలు, పార్టీ ముఖ్యల సూచనలతో కేటీఆర్ ను సీఎం చేసే అంశంలో వెనక్కి తగ్గిన కేసీఆర్.. విపక్షాలను గందరగోళం పరిచేలా కొత్త డ్రామా అమలు చేస్తున్నారని చెబుతున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాన్ని లైవ్ గా ఉంచుతూనే .. మరికొంత కాలం సాగదీయాలనే ఎత్తుగడను గులాబీ బాస్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రకమైన ప్రచారం వల్ల పార్టీకి కూడా ప్రయోజనాలు ఉంటాయని గులాబీ బాస్ లెక్కలు వేస్తున్నారట. కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారంతో పార్టీ కేడర్ లో జోష్ వస్తుందని.. అది త్వరలో జరగనున్న ఖమ్మం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పార్టీకి ఫ్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లను నియమిస్తారని జరుగుతున్న ప్రచారం వెనక కూడా గులాబీ అధినేత ఉన్నారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. హరీష్ రావు, ఈటెలకు ఉద్యమకారుల మద్దతు ఉంది. ఇలా వారిని కూల్ చేయవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం కేటీఆర్ ఇప్పట్లో ముఖ్యమంత్రి కావడం ఉండకపోవచ్చన్నదే ప్రగతి భవన్ వర్గాల సమాచారంగా ఉంటోంది.
మహేష్ చిత్రంలో బ్లాక్ రోజ్ బ్యూటీ?
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్.. నేటి నుంచి దుబాయ్ లో మొదలైంది. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు - తమన్ కాంబినేషన్ లో వచ్చిన దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు చిత్రాల తరహాలోనే సర్కారు వారి పాటలోనూ ఓ ప్రత్యేక గీతానికి స్థానముందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ ఐటమ్ నంబర్ లో బ్లాక్ రోజ్ తో తెలుగు తెరకు నాయికగా పరిచయమవుతున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చిందులేయబోతోందట. త్వరలోనే సర్కారు వారి పాటలో ఊర్వశి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సర్కారు వారి పాట థియేటర్స్ లో సందడి చేయనుంది.
అంధాధున్ రీమేక్‌లో రాశీఖన్నా?
వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయని ఉత్తరాది భామ రాశీఖన్నా.. ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తుగ్లక్ దర్బార్, సైతాన్ కా బచ్చా, మేథావి, అరణ్ మణై 3.. పేర్లతో రూపొందుతున్న ఈ నాలుగు కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. ఇదిలా ఉంటే.. మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం విలన్ లో ఓ నాయికగా నటించిన రాశీఖన్నా.. తాజాగా మరో మాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సారి మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కి జోడీగా రాశి దర్శనమివ్వనుందట. అంతేకాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాధున్ కి రీమేక్ గా ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కె. చంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారని, ఇందులో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్ దాస్ కనిపించే అవకాశముందని సమాచారం. మరి.. అంధాధున్ రీమేక్ తరువాత రాశీఖన్నా మలయాళ చిత్ర సీమలోనూ బిజీగా మారుతుందేమో చూడాలి.
మెగాస్టార్ అల్లుడితో చిన్నారి పెళ్ళికూతురు!
అనువాద ధారావాహిక 'చిన్నారి పెళ్ళికూతురు'తో తెలుగువారికి చేరువయ్యింది అవికా గోర్. ఆపై 'ఉయ్యాల జంపాల'తో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలతో అలరించింది. 'రాజుగారి గది 3' తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించని ఈ టాలెంటెడ్ బ్యూటీ.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్, ఏఏఏ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఇందులో నాయికగా అవికా ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ అమ్మడు. మరి.. ఈ సినిమా తరువాత మరిన్ని మెగా కాంపౌండ్ మూవీస్ ఈ ముద్దుగుమ్మ చెంతకు చేరుతాయేమో చూడాలి.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు అనూహ్యమైన ఘటన ఎదురైంది. రైతుల నుంచి "జాన్వీ కపూర్ గో బ్యాక్" అనే నిరసనలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె హీరోయిన్గా నటిస్తోన్న 'గుడ్ లక్ జెర్రీ' మూవీ షూటింగ్ పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ రైతుల బృందం నుంచి ఆమెకు నిరసనలు ఎదురయ్యాయి. పాటియాలాలోని భూపింద్ర రోడ్లో షూటింగ్‌ను నిర్వహించడానికి 'గుడ్ లక్ జెర్రీ' యూనిట్ నానా తిప్పలూ పడింది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు ఆ లొకేషన్ బయట నుంచి రైతులు "జాన్వీ కపూర్ గో బ్యాక్" అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి కేకలు మిన్నుముట్టడం, అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొనేలా కనిపించడంతో చేసేదేమీ లేక, షెడ్యూల్ టైమ్ కంటే ముందుగానే అక్కడ షూటింగ్‌ని నిలిపివేసింది యూనిట్. అయితే రైతులు అంతటితో ఆగలేదు. జాన్వీ బస చేసిన హోటల్ ముందు వారు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని, అక్కడ ఎలాంటి గొడవలూ జరగకుండా అడ్డుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది పంజాబ్ వారే కావడం ఇక్కడ గమనార్హం. నయనతార హీరోయిన్గా నటించగా సూపర్ హిట్టయిన తమిళ చిత్రం 'కొలమావు కోకిల' (2018)కు రీమేక్‌గా 'గుడ్ లక్ జెర్రీ' రూపొందుతోంది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకుడు.
జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ రంగస్థలం కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రత్యేక గీతం పాడుకున్న పూజా హెగ్డే.. త్వరలో అతనికి జోడీగా నటించబోతోందట. అంతేకాదు.. ఇంతవరకు పోషించని సరికొత్త పాత్రలో కనిపిస్తుందట. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అతని పాత్ర పేరు సిద్ధ. ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యారు కూడా. ప్రస్తుతం చిరు, చరణ్ కాంబోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. కాగా, ఇందులో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ కి జంటగా పూజా హెగ్డేని ఎంపిక చేశారట కొరటాల. పాత్ర పరిధి తక్కువే అయినా నటనకు అవకాశమున్న రోల్ లో పూజ సందడి చేయనుందని.. ట్రైబల్ గాళ్ గా ఆమె వేషం ఉంటుందని టాక్. అదే గనుక నిజమైతే.. పూజని సరికొత్త భూమికలో చూడబోతున్నట్టే. త్వరలోనే ఆచార్యలో పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్న ఆచార్య వేసవి కానుకగా మే 9న విడుదల కానుందని సమాచారం.
రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...
* దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో.... * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా.... * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు.. * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం .... జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి , ఇలా మాయమైపోయే జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్ ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు. ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు బీ జె పి, జన సేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి. ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం. ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.
కవిత, షర్మిలా రాజ్యసభకు వెళ్తారా?
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే హరిష్‌రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్ కె.ఆర్.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. షర్మిల ఆపద సమయంలో జగన్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు. సరైన శ్వాస: ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిదానంగా: భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది. రికార్డు చేసుకుని: ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది. గొంతు తెరచి: చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం. వ్యాయామం: సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు. - నిర్జర.
ఫేస్బుక్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది... కొందరు శాస్త్రవేత్తలు ఐదు కోతులను ఒకే గదిలో పెట్టారట. ఆ గది మధ్యలో ఓ పెద్ద బల్లని ఉంచారు శాస్త్రవేత్తలు. ఆ బల్ల మీద వాళ్లు రోజూ ఒక తాజా అరటిపండుని ఉంచేవారట. గదిలో ఉన్న కోతుల్లో ఒకటి ఆ అరటిపండు కోసం బల్ల ఎక్కేందుకు ప్రయత్నించగానే... కింద ఉన్న మిగతా కోతుల మీద చల్లటి నీళ్లను కుమ్మరించేవారు శాస్త్రవేత్తలు. అంటే అరటిపండు కోసం పైకి వెళ్లే కోతి వల్ల కింద ఉన్న కోతులకి శిక్షపడేదన్నమాట. దాంతో కొన్నాళ్లకి ఆ కోతులు పైకి ఎక్కేందుకు సాహసించడం మానేశాయి. ఒకవేళ ఏదన్నా కోతికి నోరూరి బల్లని ఎక్కేందుకు ప్రయత్నించగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని లాగిపారేసేవి. కొద్ది రోజుల తరువాత ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఓ చిన్న మార్పుని తీసుకువచ్చారు. ఆ అయిదు కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసుకువెళ్లిపోయి, దాని స్థానంలో ఒక కొత్త కోతిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త కోతి అరటిపండుని చూడగానే గభాలున బల్లని ఎక్కేందుకు సిద్ధపడిపోయింది. కానీ వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన మిగతా కోతులు, దాన్ని దబదబా కిందకి లాగేశాయి. ఇలా రెండు మూడుసార్లు తన్నులు తిన్న తరువాత, కొత్త కోతి కూడా మిగతా కోతులలాగానే నిమ్మళంగా ఉండిపోయిది. ఒకో వారం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఒకో పాత కోతికి బదులుగా మరో కొత్త కోతిని గదిలో ఉంచసాగారు. కొంతకాలం గడిచేసరికి కొత్త కోతులు అక్కడి వాతావరణానికి, మిగతా కోతుల స్వభావానికి అలవాటుపడిపోయాయి, తాము కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించడం నేర్చుకునేవి. కొన్నాళ్లకి ఆ గదిలో పాత కోతులేవీ లేకుండా పోయాయి. కొత్త కోతులకి చన్నీళ్లతో విధించే శిక్ష అసలేమాత్రం అనుభవం లేదు. అయినా కూడా ఎప్పుడన్నా ఓ కోతి ఆదమరచి అరటిపండు కోసం బల్ల దగ్గరకు చేరుకోగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని కరిచి పారేయడం మానలేదు!!! కొందరు మనుషులు కూడా బహుశా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారేమో! ఒక పనిని తాము ఎందుకు చేస్తున్నామో చాలా మంది ఆలోచించరు. దాని వల్ల తనకు ఎలాగూ నష్టం కలుగుతుంది. ఇతరులకు కూడా తన చర్య వల్ల నష్టం కలుగుతున్నా, వీళ్లు తమ తీరుని మార్చుకోరు. ఒక్కసారి మన మొండివైఖరిని పక్కకి పెట్టి విచక్షణకు పదును పెడితే, జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కథ చెబుతోంది. ఆ పరిష్కారం వల్ల మనం ముందుకు సాగడమే కాదు, ఇతరులను కూడా విజయం వైపుగా నడిపించేందుకు దోహదపడిన వారమవుతాం. లేకపోతే... ..Nirjara
బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?
ప్రపంచంలో యువతరం నేడు ఆత్మహాత్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా పోటీ తత్వాన్ని అంగీకరించకపోవడం, ఆత్మన్యూనతా భావం వెంటాడుతూ ఉండడంతో ఒక వైపు ఉద్యోగభధ్రత లేకపోవడం ఆర్ధిక సమస్యలు మరోవైపు కరోనా యువతను కుంగ దీస్తూ ఉండడంతో బతుకు పోరాటం చేయలేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి ఓర్పు సహనం లేని కుర్రకారు యదార్ధ గాధ మీ ముందు ఉంచుతున్నాను. అతను ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతం అయినా పెళ్ళిచేసుకున్నాడు. భార్య గర్భవతి. ప్రసవం ఎలా చేయించాలి అన్న దగ్గర నుంచి అంతా ఏమౌతుందో అన్న స్ట్రెస్. ఎలాగో ఒకలా బాబు పుట్టాడు అంతా బాగుంది అనుకున్నారు. బారసాలకు ఊరు వెళ్ళారు. పూజా పునస్కారం బాగానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు కథ. పిల్లాడికి డాక్టర్ చెప్పిన విధంగానే పాలపొడి డబ్బాలు కొనాలని గట్టిగా చెప్పాడు. అసలు మీరు ఏ డబ్బాలు కొన్నారో నాకు వాట్సాప్ చెయ్యాలంటాడు. రోజూ వీడియో కాల్ చెయ్యాలి అన్నాడని అమ్మాయి అంటుంది. అలాకాకపోతే నాతో మాట్లాడవద్దని అంటూ అత్తామామతో గొడవకు దిగాడు. బావమరిదిని సైతం వదలలేదు నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. నీ అంతు చూస్తానంటూ అనుకున్నారు. కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది అనుకున్నారు. ఊరినుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. తన భార్య ఫోన్ మాట్లాడలేదని, మామ తనను అవమానించాడని మనసులో పెట్టుకున్న అతగాడు అంతా నిద్రపోయాక తనదగ్గర ఉన్న సానిటైజర్ తీసుకున్నాడు. మొబైల్ ఫోనులో నా చావుకు అత్త మామ భార్య కారణమంటూ పేస్ బుక్ లో పెట్టాడు. ఆఘమేఘాల మీద వెళ్లిన బావమరిది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే వచ్చిన పోలీసులను చూసి మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ సానిటైజర్ తీసి పోలీసుల ముందు తాగే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి పంపారు. అసుపత్రి ఫీజ్ 15000 పైమాటే. అసలు సమస్య పక్కకి పోయింది. ఉరిలో పరువుపోయింది, చుట్టాల్లో ఉన్నగౌరవం పోయింది. కేవలం ఒక పట్టుదల మనిషిని చావువరకూ తీసుకెళ్ళింది. అన్నిసమస్యలకి చావు ఒక్కటే పరిస్కారం కాదన్న విషయం ఎందుకు గ్రహించరు. స్త్రీలకంటే ముందు పురుషులే ఆత్మహత్య చేసుకుని తనువు చలిస్తున్న వారి సంఖ్య 3.5% ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడించింది. నానాటికీ పెరుగుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సహజంగా ఇతరులపై ఆధారపడని, సహాయం తీసుకోకపోగా ఇతరుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనికితోడు మొండితనం కూడా తోడవ్వడంతో తను అనుకున్నది జరగలేదన్న సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుందని ఆందోళనతోనే ఆత్మాహాత్యలకు పాల్పడుతూ ఉంటారని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశంపై పరిశోదన చేయడమంటే సవాళ్ళతో కూడుకున్నదని న్యూయార్క్ చెందిన ఫోర్ దానా విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ కు చెందిన కాల్ మాన్ ఈ విషయం వెల్లడించారు. చావు అన్నింటికీ పరిస్కారం కాదు. బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?
స్నేహం నటిస్తూనే సరిహద్దులో చైనా కుట్ర ! నాకులా దగ్గర దళాల మధ్య ఘర్షణ!
స్నేహంగా ఉంటామని చెబుతూనే కుట్రలు కొనసాగిస్తోంది చైనా. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చర్చలు జరుగుతుండగానే సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర సిక్కింలోని నాకులా వద్ద.. భారత్ చైనా సైన్యాల మధ్య మూడు రోజుల క్రితం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరుదేశాలకి చెందిన సైనికులు గాయపడినట్లు సమాచారం. గల్వాన్ ఘటన తరహాలోనే ఇరుదేశాలు బాహాబాహికి దిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత బలగాలు దీటుగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు గాయపడగా, చైనా సైనికులు 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే... సరిహద్దుల్లో సమర్థవంతంగా మన సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారత్ చైనా మధ్య నాకులా ప్రాంతం సరిహద్దుగా ఉంది.
పేదలకు మరింత పేదరికం.. కుబేరుల ఆస్తి డబుల్ ! కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కరోనా దెబ్బకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అగ్ర దేశాలు సైతం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొన్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంపై తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసినా.. ప్రపంచ కుబేరులకు మాత్రం కలిసి వచ్చిందట. కరోనా కాలంలో కుబేరుల సంపాదన మరింత పెరిగిందని.. అదే సమయంలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని తేలింది. కరోనా ప్రభావంపై తాము నిర్వహించిన సర్వేలను ఆక్స్ ఫామ్ గ్రూప్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న దావోస్ సమ్మిట్ లో విడుదల చేసింది. విద్య, ఆరోగ్యం, వైద్య రంగాల్లో లక్షాధికారులుగా ఉన్న వారు వ్యాపారులు.. కరోనా మహమ్మారి తర్వాత కోటీశ్వరులుగా మారిపోయారని ఆ స్పష్టమైంది. ప్రజలంతా మరింత మెరుగైన ఆరోగ్య జీవనాన్ని కోరుకోవడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆక్స్ ఫామ్ గ్రూప్ ఆ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత అంటే మార్చి 18 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రపంచ బిలియనీర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్ల వరకూ పెరిగిందట. టాప్ 10 అత్యధిక ధనవంతుల సంపద 540 బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడైంది. కరోనా సమయంలో కుబేరులు మరింత కుబేరులు కాగా.. కోట్లాది మంది పేదలు మరింత పేదలుగా మారారని ఆక్స్ ఫామ్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కాటుకు ప్రపంచంలోని పేదల జనాభా 20 నుంచి 50 కోట్ల వరకూ పెరిగిందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రపంచంలోని అత్యధికులపై ప్రభావం చూపిందని.. రోజుకు కేవలం 2 నుంచి 10 డాలర్ల మధ్య వెచ్చిస్తూ జీవనం గడుపుతున్న వారిపైనే ఈ ప్రభావం అధికంగా ఉందని ఆ సర్వేలో వెల్లడైంది. వాణిజ్య రవాణా వ్యవస్థలు నిలిచిపోయిన వేళ, వీరి జేబుల నుంచి ఎన్నో వందల కోట్లు ఆవిరై పోయాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాలలో కలకలం.. వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్ల మృతి..
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లలో మరణాలు నమోదవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్ వేయించుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్లు మరణించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల 108 డ్రైవర్ ఆ మరుసటి రోజే మృతి చెందారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్టుగా అయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న మరో ఇద్దరు హెల్త్ వర్కర్లు ఆదివారం నాడు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట అంగన్వాడీ టీచర్ వనిత తీవ్రమైన చాతినొప్పితో నిన్న మృతి చెందింది. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి ఆమె అస్వస్థతగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోపక్క ఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే అనారోగ్యానికి గురైనట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఆమె బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురయ్యారని తేల్చారు. మరోపక్క ఇప్పటి వరకు వ్యాక్సిన్ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరినట్లుగా జీజీహెచ్ అధికారులు తెలిపారు. 10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతోంది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడంతో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Food Check Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s. Fitness Check Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime... No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit. Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts, This keeps your workout fun and your mind motivated. Take care, Stay Healthy!!!! -Sandya Koya
పౌష్టికాహార లోపం.. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం
నేడు ప్రపంచంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు విస్తరిస్తున్నాయి. డీజనరేటివ్ డిసీజెస్ లో ముఖ్యమైనవి హృద్రోగ సమస్యలు, డయాబెటీస్. 1960 లో ఈ అంశాలపై జరిపిన పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో ఒక శాతం మాత్రమే డయాబెటీస్ తో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. డయాబెటీస్ ఇప్పుడు 20 నుంచి 30 శాతానికి చేరుకుంది. డయాబెటీస్ వచ్చే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో ఉంటుందని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో నివసిస్తున్న 40% ప్రజలు హై బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ఉండే మరో 30% మంది ప్రజలు ఊబకాయం సమస్యలతో బాధ పడుతున్నారని, దీని వల్ల వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు దురదృష్టం కొద్దీ ఈమధ్య కాలంలో పాండమిక్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కరోనా మొదటి విడత రెండవ విడత ప్రజలను మరింత భయానికి గురి చేసింది. చాలా మంది యువతీ యువకులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురి అయినట్లు, అందులో తమకూ కరోనా వచ్చిందన్న భయంతో చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ముఖ్యంగా కౌమారదశలో ఉండే పిల్లలలోను డయాబెటీస్ తో బాధపడుతున్నవారు 70% మంది ఉన్నట్లు, ఇందులో స్త్రీ పురుషులు ఉండటం గమనార్హం. ఇందులో అయితే సాధారణ, అతిసాధారణమైన పౌష్టిక ఆహారం లోపంతో పాటు హార్మోన్ లోపాలు, అనీమియా సమస్యలు అంటే రక్తహీనత వంటి సమస్యలతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు గ్యాస్ట్రో సమస్యలు, పెద్దపేగు చిన్నపేగుకు సంబందించిన సమస్యలతో బాధ పడడం సహజమని ప్రచురణలో పేర్కొన్నారు. అనారోగ్యం నాణ్యమైన జీవితాన్ని తగ్గించడమే కాదు, ఆర్ధిక సమస్యలు సృష్టించడంతో పెనుభారంగా మారుతోంది. గతంలో ఉన్న సమస్యలకు తోడు పాండమిక్స్ తో పాటు పౌష్టికాహార లోపం మరిన్ని ఆనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయని తేల్చి చెప్పారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న ఆనారోగ్య సమస్యలకు కారణం పౌష్టికాహార లోపం. అందువల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుందని, ఇవే దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మ్యాక్స్ జరసం పేర్కొన్నాడు.
భారత్ లో 63 మిలియన్ల ప్రజలకు చెవిటి సమస్యలు!!