EDITORIAL SPECIAL
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
ALSO ON TELUGUONE N E W S
  లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో టైమ్‌పాస్‌ కోసం సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చ‌ట్లు పెడుతుండ‌టం గ‌మ‌నిస్తున్నాం. అలాంటి ముచ్చ‌ట్లు 'బంగారం' ఫేమ్‌ మీరా చోప్రాకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌ను ప్ర‌శ్న‌ల‌ను సంధించ‌మ‌నీ, వాటికీ ఆన్స‌ర్లు ఇస్తాన‌నీ చెప్పిన ఆమె, ఆ సంద‌ర్భంగా ఓ ప్ర‌శ్న‌కు ఇచ్చిన ఆన్స‌ర్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్‌కు గురైంది. "ఆయ‌న (తార‌క్‌) ఎవ‌రో నాకు తెలీదు.. నేను ఆయ‌న ఫ్యాన్‌ని కాదు" అని ఆమె చెప్పిన స‌మాధాన‌మే దీనికి కార‌ణం. త‌న‌ను దూషిస్తూ పెట్టిన పోస్టుల‌పై ఆమె హైద‌రాబాద్ పోలీసుల‌కు సైబ‌ర్ వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. అయితే తార‌క్ ఫ్యాన్స్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆమె పెట్టిన పాత పోస్టుల‌ను బ‌య‌ట‌కు లాగి, సోష‌ల్ మీడియాలో ఆమెపై దాడి చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఫైర్‌బ్రాండ్ సింగ‌ర్ చిన్మ‌యి మీరాకు మ‌ద్దతుగా నిల‌బ‌డింది. ఆమెను ట్రోల్ చేస్తోన్న తార‌క్ ఫ్యాన్స్‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయాల్సిందిగా మీరాకు సూచించింది. కాగా త‌మ హీరోను కించ‌ప‌రిచే పోస్టుల‌ను, సెటైరిక‌ల్ ట్వీట్స్‌ను ఎందుకు లైక్ చేస్తోందో మీరా చోప్రా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ తార‌క్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి త‌న పోస్ట్ ద్వారా మీరా కాంట్ర‌వ‌ర్సీ సృష్టించ‌డ‌మే కాకుండా, అన‌వ‌స‌రంగా తార‌క్‌ను ఈ గొడ‌వ‌లోకి లాగింద‌ని కొంత‌మంది అంటున్నారు.
  త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విక్ర‌మ్ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒక‌టి - అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్ట్ చేస్తోన్న 'కోబ్రా' కాగా, ఇంకొక‌టి మ‌ణిర‌త్నం రూపొందిస్తోన్న మెగా మ‌ల్టీస్టార‌ర్ 'పొన్నియ‌న్ సెల్వ‌న్' మూవీ. 'కోబ్రా'లో విక్ర‌మ్ ప‌లు పాత్ర‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక 'పొన్నియ‌న్ సెల్వ‌న్'‌లో జ‌యం ర‌వి, కార్తీ, త్రిష‌, ఐశ్వ‌ర్యా రాయ్ వంటి స్టార్ల‌తో క‌లిసి ఆయ‌న స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. వీటి త‌ర్వాత ఆయ‌న కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇది ఆయ‌న‌కు 60వ చిత్రం. విజ‌య్ టైటిల్ రోల్ చేస్తోన్న మాస్ట‌ర్ మూవీని నిర్మిస్తోన్న సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించ‌నున్న‌ది. ఇక ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్ ఏమంటే.. విక్ర‌మ్ కుమారుడు ధ్రువ్ ఈ సినిమాలో తండ్రితో క‌లిసి తెర‌ను పంచుకోనున్నాడు. ఈ తండ్రీకొడుకులు క‌లిసి తొలిసారి న‌టించ‌నున్నార‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ మూవీలో ఇద్ద‌రివీ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌ని వినిపిస్తోంది. 'అర్జున్‌రెడ్డి' త‌మిళ రీమేక్ 'ఆదిత్య‌వ‌ర్మ' ద్వారా ధ్రువ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించ‌క‌పోయినా అందులో టైటిల్ రోల్‌లో ధ్రువ్ ఇచ్చిన ప‌ర్ఫార్మెన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌ట‌న‌లో ఈజ్‌తో తండ్రికి స‌రైన వార‌సుడ‌నిపించుకున్నాడు. ఆ తండ్రీకొడుకుల‌ను తెర‌పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఎలా చూపిస్తాడా అని అంద‌రూ ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు.
  పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న‌ '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా' పాట యూట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్‌ రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆద‌ర‌ణ‌తో 150 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న‌ సినిమాల పాట‌ల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా స‌రికొత్త చ‌రిత్ర‌ను సాధించింది. సుకుమార్ ద‌గ్గ‌ర 'ఆర్య 2', '1.. నేనొక్క‌డినే' చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, 'నీలి నీలి ఆకాశం' పాటతో స‌హా చిత్రంలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌రించిన‌ 'నీలి నీలి ఆకాశం' పాట 150 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర బృంద‌మంతా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆద‌ర‌ణ ల‌భించ‌డం అపురూప‌మైన విష‌యంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన విన‌సొంపైన బాణీల‌కు చంద్ర‌బోస్ రాసిన క‌మ‌నీయ సాహిత్యం, సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీత సుమ‌ధ‌ర గానం తోడై ఈ పాట‌ను ఇంత బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశాయ‌ని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సంద‌ర్భంగా సంగీత ప్రియుల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఒక సింగ‌ర్‌ను ఐదేళ్లు బ్ర‌తికించ‌డానికి ఒక పాట చాల‌నీ, 'నీలి నీలి ఆకాశం' అలాంటి పాట‌నీ గాయ‌ని సునీత అన్నారు . త‌న కెరీర్‌లో ఈ పాట ఓ మ‌ధుర‌మైన మ‌లుపుగా నిలించింద‌ని ఆమె అమితానందం వ్య‌క్తం చేశారు. ఈ పాట విజ‌యోత్స‌వంలో తాను భాగ‌స్వామినే కాకుండా భావ‌స్వామిని కూడా అయినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని లిరిసిస్ట్ చంద్ర‌బోస్ చెప్పారు. ఈ పాట‌ను అమ‌లాపురం నుంచి అమెరికా దాకా అంద‌రూ పాడుకుంటున్నార‌ని డైరెక్ట‌ర్ మున్నా సంతోషం వ్య‌క్తం చేశారు. తాను ఇప్ప‌టివ‌ర‌కూ కంపోజ్ చేసిన సాంగ్స్‌లో ఏ పాట‌నీ విన‌న‌న్ని సార్లు ఈ పాట‌ను విన్నాన‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రెబెన్స్ అన్నారు. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' సినిమా ఔట్‌పుట్ చూసి న‌చ్చ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లతో జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకోవ‌డం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌ల స‌పోర్ట్ ల‌భించ‌డం సినిమాకి ప్ల‌స్ అవుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌నీ, ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న సంక్షోభ ప‌రిస్థితులు స‌మ‌సిపోయి, సాధార‌ణ ప‌రిస్థ‌తి నెల‌కొన్న త‌ర్వాత చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌నీ నిర్మాత ఎస్వీ బాబు చెప్పారు.
  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా, గ‌త వారం జ‌ర‌గాల్సిన స్క్రిప్స్ నేష‌న‌ల్ స్పెల్లింగ్ బీ పోటీ క్యాన్సిల్ అయ్యింది. బ‌హుశా వ‌రుస‌గా 13వ ఏడాది ఒక ఇండియ‌న్ అమెరిక‌న్ అభ్య‌ర్థి ఈ పోటీని గెలుచుకొనే అవ‌కాశాన్ని కోవిడ్‌-19 అడ్డుకుంద‌ని భావించాలేమో. అమెరికా జ‌నాభాలో భార‌త సంత‌తికి చెందిన వాళ్లు మ‌హా అయితే 1 శాతం ఉంటారు. కానీ గ‌త స్క్రిప్స్ బీ 31 మంది విజేత‌ల్లో 26 మంది వాళ్లే కావ‌డం విశేషాల్లో కెల్లా విశేషం. ఈ టోర్న‌మెంట్‌లో ఇండియ‌న్ అమెరిక‌న్ల ఆధిప‌త్యం గురించీ, వాళ్ల సాంస్కృతిక విలువ‌ల గురించీ నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంట‌రీ 'స్పెల్లింగ్ ద డ్రీమ్' మ‌న క‌ళ్ల‌ముందుంచుతుంది. ఈ డాక్యుమెంట‌రీని 'లీగ్ ఆఫ్ మిలియ‌న్స్' ఫేమ్ సామ్ రేగా రూపొందించాడు. అత‌ను 2017 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీలో 7 నుంచి 14 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య ఉన్న న‌లుగురు ఆశావ‌హుల క‌థ‌ను ఈ డాక్యుమెంట‌రీలో పొందుప‌రిచాడు. ఈ పోటీలో పాల్గొన‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి 14 ఏళ్లు. 83 నిమిషాల నిడివి క‌లిగిన ఈ డాక్యుమెంట‌రీని చూసిన‌వాళ్లు ఆశ్చ‌ర్య చ‌కితులు కాక‌మాన‌రు. పోటీలో పాల్గొనే పిల్ల‌ల త‌ల్లిదండ్రుల భావోద్వేగాలు, వాళ్లందించే మ‌ద్ద‌తు వంటివాటిని ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియ‌న్ అమెరిక‌న్ ఫ్యామిలీల గురించి ఏ మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లోనూ మ‌నం చూసి ఉండం. వ‌ల‌స నిబంధ‌న‌ల స‌ర‌ళీక‌ర‌ణ‌తో అమెరికాకు భార‌తీయుల వ‌ల‌స 1965లో మొద‌లైంది. విద్యావంతులైన, వ్యాపార‌వేత్త‌లైన భార‌తీయులు అనేక‌మంది యు.ఎస్‌.కు త‌ర‌లివెళ్లారు. స‌హ‌జంగానే వారు త‌మ పిల్ల‌లు అన్నింటా స‌క్సెస్ కావాల‌ని కోరుకున్నారు. ఈఎస్‌పీఎన్‌లో స్క్రిప్స్ బీ ప్ర‌సారం కావ‌డం 1994లో మొద‌లైన‌ప్ప‌ట్నీంచీ, ఇండియ‌న్ అమెరిక‌న్ పిల్ల‌లు తొలిసారిగా త‌మ‌ను తాము తెర‌పై చూసుకుంటూ వ‌చ్చారు. ఇది మిగ‌తా పిల్ల‌ల‌కు ప్రేర‌ణ‌నిచ్చింద‌నీ, అందుకే ఈ పోటీలో ఇండియ‌న్ అమెరిక‌న్ పిల్ల‌ల డామినేష‌న్ క‌నిపిస్తుంద‌నీ ఈ డాక్యుమెంట‌రీ విశ్లేషిస్తుంది.
ప్రముఖ జ్యువెలరీ కంపెనీ అధినేత 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అని ఒక వాణిజ్య ప్రకటనలో చెబుతారు. నిజమే, డబ్బులు ఎవరికీ ఊరికే రావు. అందులోనూ కథానాయికలకు అయితే అసలు రావు. సినిమాల కంటే షాప్ ఓపెనింగులు, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ హీరోయిన్లు డబ్బులు వెనకేసుకుంటారని టాక్. అయితే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి హీరోయిన్ కి ఊరికే డబ్బులు ఇవ్వరు. వాళ్లకు ఎంతమంది ఫాలోయర్లు ఉన్నారు? ఏయే భాషల ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు? వంటివి పరిగణలోకి తీసుకుంటారు. అందుకే, హీరోయిన్లు సోషల్ మీడియా సైట్లలో యాక్టివ్ గా ఉంటూ ఉనికి నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాకి దూరంగా ఉండడమంటే సంపాదనకు దూరంగా ఉండడమే. ఇన్ డైరెక్టుగా వింక్ బ్యూటీ ప్రియా వారియర్ ఈ సంగతి చెప్పింది.  పదిహేను రోజుల క్రితం ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది పబ్లిసిటీ కోసం చేసిందని కామెంట్స్ చేశారు. మళ్ళీ ఎకౌంటు యాక్టివ్ చేసిన ప్రియా వారియస్... లైకులు, ఫాలోలు, డిస్ లైకులు వంటి ప్రెజర్ భరించలేక సోషల్ మీడియాకి దూరంగా ఉన్నానని చెప్పింది. తర్వాత ఎక్కువ రోజులు దూరంగా ఉండే స్థోమత తనకు లేదని, ప్రొఫెషనల్ గా తప్పదని పేర్కొంది. స్థోమత అంటే డబ్బే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు ప్రియా వారియర్ లక్షల్లో డబ్బులు తీసుకుంటుందని టాక్. అంత సంపాదనను ఎవరు వదులుకుంటారు?
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
At a restaurant, a cockroach suddenly flew from somewhere and sat on a lady. She started screaming out of fear. With a panic stricken face and trembling voice, she started jumping, with both her hands desperately trying to get rid of the cockroach. Her reaction was contagious, as everyone in her group also got panicky. The lady finally managed to push the cockroach away but it landed on another lady in the group. Now, it was the turn of the other lady in the group to continue the drama. A waiter rushed forward to their rescue. In the relay of throwing, the cockroach next fell upon the waiter. The waiter stood firm, composed himself and observed the behaviour of the cockroach on his shirt. When he was confident enough, he grabbed it with his hand and threw it out of the restaurant. Sipping my coffee and watching the amusement, the antenna of my mind picked up a few thoughts and started wondering, was the cockroach responsible for their histrionic behaviour? If so, then why was the waiter not disturbed? He handled it near to perfection, without any chaos. It is not the cockroach, but the inability of the ladies to handle the disturbance caused by the cockroach that disturbed the ladies. I realized that, it is not the shouting of my father or my boss or my wife that disturbs me, but it’s my inability to handle the disturbances caused by their shouting that disturbs me. It’s not the traffic jams on the road that disturbs me, but my inability to handle the disturbance caused by the traffic jam that disturbs me. More than the problem, it’s my reaction to the problem that creates chaos in my life. Lessons learnt from the story: I understood, I should not react in life. I should always respond. The women reacted, whereas the waiter responded. Reactions are always instinctive whereas responses are always well thought of, just and right to save a situation from going out of hands, to avoid cracks in relationship, to avoid taking decisions in anger, anxiety, stress or hurry. (Most People attribute this anecdote to Sundar Pichai, the CEO of Google... though no one is sure of the narrator. But everyone who has read this story is certainly sure of its worth!) ..Nirjara
తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...     మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి. రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!     - నిర్జర.
టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీ విమర్శలు గుప్పించారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని మండిపడ్డారు. "మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక, సీఎం వైస్ జగన్ ని కోతలరాయుడుతో పోలుస్తూ.. ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శలు చేశారు. "వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆరోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి... 'మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను.' అన్నాడంట. ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?" అంటూ జగన్ సర్కార్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఏపీ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు.  నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున ఆమె పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. ఈ ఏడాది పాలనలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని, వెంకటగిరి నియోజకవర్గాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప, ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించానని చెప్పిన ఆయన.. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
కళ్లు మూతలు పడిపోయేలా నిద్ర వస్తుంటేనో, ఏమీ తోచకుండా నిస్సారంగా ఉంటేనో ఆవలింతలు రావడం సహజం. కానీ అవతలివారు ఆవలించినప్పుడు మనకి కూడా ఆవలింత రావడంలో ఆంతర్యం ఏమిటి! ఒకోసారైతే ఆవలిస్తున్న ఫొటోని చూసినా, ఆవలింత అన్న మాట విన్నా కూడా మనలో ఆవలింత వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి చర్య వెనుక కారణం ఏమిటి! శరీరం నిద్రాణంగా ఉన్నప్పుడు మనలోని శ్వాస కూడా నిదానిస్తుంది. ఇలాంటి సమయంలో ఒంటికి తగినంత ప్రాణవాయువు లభించదు. దాంతో అవసరమైనంత ఆక్సిజన్‌ని గ్రహించేలా ఎక్కువ గాలిని పీల్చుకునే ప్రయత్నం చేస్తాము. అదే ఆవలింత! ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఒకరి ఆవలింత మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నకు అవతలివారితో మనకి ఉన్న అనుబంధమో, వారి పట్ల సహానుభూతి చూపడమో కారణం అనుకునేవారు. కానీ ఈ చర్య వెనుక భావోద్వేగాలు ఏమాత్రం కారణం కాదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.   -ఒకరిని చూసి వేరొకరు ఆవలించడం వెనుక మన జన్యువులే కారణం అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఆ కారణంగానే కొంతమంది ఎదుటివారు ఆవలించిన వెంటనే నోరుతెరిస్తే, మరికొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉండగలుగుతారు. అంతేకాదు! ఈ ఆవలింతను నియంత్రించే జన్యువు మామూలు వ్యక్తులలో ఒకలా ఉంటే... ఆటిజం, స్కిజోఫ్రీనియా వంటి మానసిక వ్యాధులు ఉన్నవారిలో మరోలా ఉంది. కాబట్టి ఇదేదో అల్లాటప్పా జన్యువు కాదనీ, దీన్ని ఛేదిస్తే కనుక చాలా మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనీ భావిస్తున్నారు.   -ఆవలించడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రాణవాయువు లభిస్తుంది కాబట్టి హాయిగా ఉంటుంది. మొహంలోని కండరాలన్నింటికీ ఓసారి పని చెప్పినట్లు ఉంటుంది. అందుకనే ఆవలింత అన్న విషయం గుర్తుకురాగానే మనిషి అందుకు సిద్ధపడిపోతాడన్నది కొందరు శాస్త్రవేత్తల మాట. ఇంత విచక్షణ పిల్లలలో ఉండదు కాబట్టే వారిలో ఒకరిని చూసి మరొకరు ఆవలించడం తక్కువని కూడా తేల్చేశారు.   - ఆవలించడం వల్ల శరీరం నిస్సత్తువని వదిలి అప్రమత్తమవుతుంది. కాబట్టి ఇది మనం అడవులలో బతికిన రోజుల నుంచి వచ్చిన అలవాటన్నది మరి కొందరి విశ్లేషణ. గుంపులో ఉన్నవారిలో ఒకరు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల, వారిలో అప్రమత్తని పెంచేందుకు శరీరం ఆవలిస్తుంది. ఈ విషయాన్ని అతని చుట్టుపక్కల వారు కూడా అనుకరించడం వల్ల, వారు కూడా ప్రమాదం వస్తే ఎదుర్కొనేందుకో, పారిపోయేందుకో (fight or flight) సిద్ధపడిపోతారు.   -ఎదుటివారి మనసుని మెప్పించేందుకు తమకి తెలియకుండా వారిని అనుకరించే ప్రయత్నంలో కూడా ఆవలించవచ్చని అంటున్నారు. దీని వలన ఇద్దరు మనుషులూ ఒకే తరహాలో ప్రవర్తిస్తున్న భావన కలుగుతుంది కదా!   ఇన్ని కారణాలు చెప్పుకొన్నా కూడా ఆవలింతకు సంబంధించి ఇంతవరకూ స్పష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆవలించేందుకు ఖచ్చితమైన కారణాన్ని కనుక్కొనేందుకు తీవ్రమైన పరిశోధనలు జరగాల్సి ఉందట!!!       - నిర్జర.
  చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  
  ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మేఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.