Publish Date:May 22, 2018

LATEST NEWS
It is a known fact that most of us communicate with our near and dear ones via social network. And this communication generally includes a lot of smiles known as “emojis”. In total there are 2,666 emojis in the Unicode Standard as of June 2017. The first emoji was created in 1999 in Japan by Shigetaka Kurita. These emojis have become so common in our lives that we have dedicated a special day for them. Well after having read that “World Emoji Day” is celebrated on 17th July every year - I was very curious to know how many and which emojis are used every day on an average.    Facebook – to which each one of us are addicted says that more than 60 million emojis are used on Facebook each day while more than 5 billion emojis are used via messenger.  Whether we want to convey that we’re extremely excited or really sad about something, we somehow find it easier to use an emoticon that describes the way we feel instead of trying to find the words to express it. Happy face emoji account for about 44 percent of all that are used, followed by sad faces at 14 percent, hearts at 13 percent, hand gestures at 5 percent, and the rest at very small percentages. Agree? Then let’s have a look at the 5 emojis which we all use often.     Laughing with Tears of Joy  We cannot describe in words how expressive this emoji is. This emoji can be used in multiple situations. Maybe something made you laugh so hard that you started to tear up. Or maybe you’re so happy about something that you can’t help but shed a few tears. When was the last time you used this “emoji”? Smiling with Heart Shaped eyes  Are you in love? Then what will be a better way of letting them know that you love them the most, even when you are extremely busy at work. This emoji has a look of complete and utter adoration on its face. Though this emoji is generally used to express love to your dear one, it can also be used to express love towards something like your pretty wedding gown or a birthday celebration which you cannot forget. Already started thinking of when had you used this emoji? Thumbs Up  This is a self-explanative emoji and can be used in many situations. We use it to express approval of something or encourage someone for having done a great job. So when did you give a “Thumbs-up” for encouraging your friend? The winking face  Are you the naughty one in the gang? Then the most obvious emoji you might have used would be a winking face. The winking face emoji implies that someone is just joking around in a playful way.  Loudly Crying While no one wants to be this sad, sometimes, people need to express how bad a situation makes them feel. This is the perfect emoji for that. When was the last time you used this “emoji”? We hope you found these emojis both entertaining and expressive. If yes – then do let us know which one is your favorite emoji!!!  
Uttar Pradesh under the aegis leadership of Adityanath has achieved a record. The Amnesty International India has released a data showing UP as topper in hate crimes. In the first six months of 2018, 100 hate crimes were registered in UP. The data is collected on the basis of crimes committed against  Dalits, Adivasis, members of racial or religious minority groups, transgender people, and other marginalised people, reported in mainstream English and Hindi media. Incidents such as Dalits being attacked for riding horses indicate the deteriorating tolerance in the biggest state of India. However hate crimes are not new for UP. People often get assaulted on the name of cows and inter caste marriages. From Spetember 2015 more than 600 hate crimes were recorded on the website of Amnesty. Many crimes might have gone unrecorded.
Don’t worry. The news isn’t from India. The villagers in an Indonesian village has killed almost 300 crocodiles in a sabotage. Reason! A crocodile has killed one of the villagers. The incident took place in Sorong district. There was a corcodile breeding centre in the district. However a nearby villager has entered the centre to collect the grass. The animals has of course had no mercy on the intruders. However the villagers got angry at this incident. They took every weapon sighted into their hands and entered the breeding centre. There they killed almost 300 crocodiles in vengeance. “Crocodiles are god's creatures that need to be protected too,” bursted one of the government official reacting to the incident. But who could save the animals from the human wrath!
ALSO ON TELUGUONE N E W S
తమిళ్ లో గొప్ప కథానాయకుడిగా పేరు ఉన్న విజయ్ తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన మురుగదాస్‌ దర్శకత్వంలో ‘సర్కార్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్‌ టాక్.చూడబోతే హీరోలంతా ముఖ్యమంత్రి పాత్రలపై మనసు పారేసుకున్నట్లు ఉన్నారు.ఇటీవల ‘భరత్‌ అనే నేను’లో మహేష్‌బాబు సీఎంగా కనిపించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. త్వరలో విజయ్‌ దేవరకొండ కూడా ‘నోటా’లో సీఎం పాత్రలో కనిపిస్తారని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రం లో విజయ్ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నేత కళ కరుప్పయ్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
విద్యాబాలన్, సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో  విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’లో నటించనున్నారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఆయన సతీమణి  బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ గురించి ఎంతోకొంత ఎవరికైనా తెలుస్తుంది కానీ ఆయన భార్య బసవతారకం గురించి ఎవరికీ పెద్దగా తెలిసే ఆస్కారం లేదు.     ఈ పాత్రలో నటించేందుకు ఓ నటిగా ఇదే నాకు ఆసక్తిని పెంచిందని,ఆమె పాత్ర కథలో చాలా కీలకం అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నా అని విద్యా బాలన్ తెలిపారు. ఎన్టీఆర్ జీవితం సినిమా ,రాజకీయాలకు ముడిపడి ఉంది.అందుకే ఇందులో అనేక మంది నటీనటులకు, రాజకీయ నాయకులకు చోటుంది. ఇప్పటికే కృష్ణ పాత్ర కోసం మహేశ్‌బాబును, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించినట్లు సమాచారం. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. రాజశేఖర్‌, మోహన్‌బాబుతో పాటు పలువురు నటీ,నటులు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా విద్యాబాలన్‌పై వచ్చే ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
There is no doubt that Rangathalam is a huge hit. It was placed at no.3 position regarding the box office collections of Tollywood. The music of Devi Sri Prasad has of course played a major role in the movies success. However Devi was highly criticised for his attitude towards the folk singers. Firstly it was singer Siva Nagulu who sang the original version of `Aa gattununtava’. His voice was removed from the movie without notice and Devi Sri himself sang the song. Secondly it was `Ganta Venkata Lakshmi’ who sang `Jigelu Rani’. Lakshmi has recently vented her frustration that not even a single rupee was given to her by the mediator who arranged for her singing. The team of Rangasthalam as usual stayed silent on the issue.
అక్కినేని నాగార్జునకి  టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది. హిందీ లో ఆయన పలు సినిమాలలో నటించారు.దాదాపు 15 ఏళ్ల తరువాత మళ్ళీ ఒక హిందీ చిత్రంలో నటించనున్నారు.‘బ్రహ్మాస్త్రా’ అనే చిత్రంలో నాగ్,అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.నాగ్ కి ,బచ్చన్ కి మంచి స్నేహం ఉందని అందరికి తెలిసిందే. ఈ చిత్రం రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కనుంది. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నాగార్జున కి జోడిగా నటి డింపుల్‌ కపాడియా నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.ఒకవేళ డింపుల్‌ నటిస్తున్న మాట నిజమే అయితే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె నటించే సినిమా ఇదే అవుతుంది. బల్గేరియాలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రెండో షెడ్యూల్‌లో  నాగార్జున నటించనున్నారు.ఇందులో నాగ్‌ది ప్రత్యేకమైన పాత్ర అని, ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని ఈ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
Remember the pics of Naga Sadhu’s often seen at Kumbha Melas. Yes! You are right... they won’t wear anything on their body. It’s interesting to hear that Bollywood hero Saif Ali Khan is playing the role of a Naga Sadhu. He will be portraying the role in a movie titled Hunter. Hunter is said to be a movie set in 1780. Said has pierced his ears and grown his hair long for the character. But here is the relief- he is not going to appear nudely. "I wear clothes even though I shouldn't be because Naga means 'nanga'. My character is a failed Naga sadhu, who has strong notions of revenge. The film is a drama set in Rajasthan," said Saif to the leading daily. So, after the success of his role in the web series `Sacred Games’, Saif seems to be all set for another set of acclaims.
అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు! అద్భుతం జరిగాక ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు! భారత్ కు అధ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించి పెట్టిన హిమ దాస్ … అలాంటి ఓ అద్భుతం! ఆమె తమ వరి పొలాల్లో తెల్లెవారుఝామున చెప్పులు సైతం లేని అరికాళ్లతో పరుగులు పెడుతుంటే… దేశంలో ఎవ్వరూ ఆమెని గుర్తించలేదు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ పొటీల్లో స్వర్ణం సాధించింది. మనతో సహా అందరం తెగ మాట్లాడుకుంటున్నాం! కానీ, అవేవీ ఆమెకు పెద్దగా ఉపయోగపడేవి కావు. స్వంతంగా ధగధగ మెరిసే తారజువ్వలా ఆకాశానికి ఇప్పటికే ఎగిసిపోయింది!     హిమ దాస్ ఈ మద్య కాలంలో భారతదేశం నుంచి తళుక్కున మెరుస్తోన్న క్రీడాకారిణుల్లో ఒకరు! అంతే అయితే ఇంతగా మాట్లాడుకోవటం అనవసరం. సంవత్సరంలో జరిగే అనేక క్రికెట్ టోర్నమెంట్లలో అడపాదడపా కొత్త క్రికెటర్లు వస్తూనే వుంటారు. అభిమానుల్ని తమ విన్యాసాలతో కట్టిపడేస్తుంటారు. అలాగే, సానియా, సైనా, సింధూ ఇలా బోలెడు మంది ఇతర క్రీడల్లోని ఛాంపియన్స్ కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తుంటారు. కానీ, హిమ దాస్ విజయం కేవలం క్రీడలకు సంబంధించిన అద్భుతం కాదు. అదీ ఇక్కడి ప్రత్యేకత! కేవలం పట్టుదలనే తన కాలికి బూట్లుగా తగిలించుకుని దీక్ష అనే ట్రాక్ పై రన్నింగ్ చేసింది హిమ! అందుకే, ఆమె జీవితంలో ఏ రంగంలో ప్రయత్నం చేస్తోన్న వారికైనా అద్భుతమైన ప్రేరణ! ఆమె ఆటల్లో విజయం సాధించి వుండవచ్చు. కానీ, హిమ దాస్ విజయం మాత్రం ఓ ఆట కాదు!     హిమ దాస్ ఏ ముంబై, దిల్లీ లాంటి సకల సౌకర్యాలున్న మహానగరంలోనో పుట్టలేదు. ఈశాన్య భారతదేశంలో మారుమూలన వున్న ఆసోంలో పుట్టింది. ఆమె ఊరు థింగ్. తండ్రి వరి పండించే రైతు. పొలంలో పండేది అన్నమే అయినా వారికి కడుపునిండా ఆహారం వుండేది కాదు. అలాంటి రైతులు మనకు కొత్తేం వుంది? ఏ రాష్ట్రంలో చూసినా రైతులు ఎలా ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ఓ సగటు భారతీయ రైతే హిమ దాస్ తండ్రి. కానీ, ఆయన కూతురు మాత్రం సగటు భారతీయ అమ్మాయి కాదు. సగటు భారతీయ అమ్మాయిలో పట్టుదల భగ్గుమంటే ఎలా వెలిగిపోతుందో కళ్లారా చూపించిన వెలుగు దివ్వె! మొదట ఫుట్ బాల్ బాగా ఆడిన హిమ తండ్రితో పాటూ పొలంలో నేల దున్నేది, విత్తనాలు వేసేది, ట్రాక్టర్ నడిపేది. కానీ, ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు బంతి వెంట సుడిగాలిలా దూసుకుపోతోన్న ఆమె వేగాన్ని ఓ ఉపాధ్యాయుడు గమనించాడు. అథ్లెటిక్స్ కి మారి పరుగు పందంపై దృష్టి పెట్టమన్నాడు! అదే హిమ దాస్ ని రైట్ ట్రాక్ పైకి తీసుకొచ్చింది.       తమ స్వగ్రామం నుంచీ అసోం రాజధాని గువాహటీకి చేరుకుని ఓ దాత ఇచ్చే డబ్బులతో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విజయాలు నమోదు చేసింది. హిమ దాస్ ని ఇంటి నుంచి గువాహటీకి పంపేటప్పుడు ఆమె తండ్రి అంతర్జాతీయ స్వర్ణాలు ఆశించలేదు. నలుగురు సంతానంలో ఆమె అన్నా ఇంటికి దూరంగా వుంటూ మూడు పుటలా సరిగ్గా అన్నం తింటుందని భావించాడు! అలాంటి పేదరికం వారిది! అయినా, భూమిపై కదిలే మానవ రాకెట్ లా దూసుకుపోయే హిమని దారిద్ర్యం అడ్డుకోలేకపోయింది. పైగా అదే ఇంధనంలా మారి ముందుకు తోసింది. ప్రపంచ అథ్లెటిక్స్ లో మన దేశం మొత్తాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది!     ఒక సానియా, ఒక సైనా, ఒక సింధూ విజయాలు సాధించనప్పుడు ఎలాంటి హంగామా చేశారో ఇప్పుడూ అదే చేస్తున్నారు పొలిటీషన్స్. మీడియా కూడా హిమ దాస్ అంటూ జపం చేస్తోంది. కానీ, అసలు గుర్తించాల్సింది హిమ దాస్ ని కాదు! ఆమె ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లని! ఈ దేశంలో అడుగడుగునా హిమ దాస్ లే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్త శుద్ధి వుండాలే కానీ ఎక్కడ పిడికెడు మట్టి తీసినా… మాణిక్యాలే బయటపడతాయి. అంత జనాభ, అంత శక్తి, సామర్థ్యాలు, అంతటి అవకాశాలు వున్నాయి. అయినా ఒలంపిక్స్ వచ్చిన ప్రతీసారి ఒకటి , అరా మెడల్స్ కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తూ వుంటాం. కారణం … హిమ దాస్ లాంటి వార్ని పట్టించుకోకపోవటమే. డబ్బున్న సంపన్నలు, ఎంతో కొంత ఖర్చు చేయగలిగే మధ్య తరగతి వారు డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు అయిపోయి మరింత డబ్బు సంపాదిస్తున్నారు. మిగతా అన్ని రంగాల్లో దేశాన్ని సగర్వంగా నిలపగలిగే వారు ఊళ్లలో, నగరాల్లోని మురికి వాడల్లో మగ్గిపోతున్నారు. వారంతా హిమ దాస్ లాంటి తారజువ్వలే! కావాల్సింది వారికి సౌకర్యం, అవకాశం అనే అగ్గిని అందించటమే! ఒక్కసారి గ్రామ గ్రామంలోని హిమ దాస్ లాంటి లెక్కలేనంత మందికి ప్రభుత్వాలు ప్రొత్సాహమనే నిప్పుని తాకిస్తే ఆకాశాన్ని అంటుకుంటారు! ఓ అంతర్జాతీయ విజయం సాధించి వచ్చిన వారికి కోట్లు గుమ్మరించటం కాకుండా కోట్ల మంది అంతర్జాతీయ విజయాలు సాధించేలా ఏం చేయాలో ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి!
దేశ రాజధానిలో వేడి పుట్టనుంది. గడచిన కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వర్షాలతో సతమతమైంది. అక్కడి ప్రజలు వర్షాలతో చలి కాచుకున్నారు. బుధవారం నుంచి వారే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేడి పుట్టించే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం లోక్‌సభ సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధికార భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించింది.     ఇందుకోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పవన్ కల్యాణ‌ జనసేన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల పాలైన తమను ఆదుకుంటామని, ప్రత్యేక హోదాతో అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడం తెలుగు ప్రజలను వంచించడమే. గడచిన ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతూండడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వారి మాయలో పడ్డారు. ప్రధానమంత్రిని నమ్మినందుకు నాలుగేళ్ళ తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అది వేరే సంగతి. నాలుగేళ్ల పాటు హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మంచిదని నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం వంచించిందంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై నాలుగేళ్ల పాటు పార్లమెంటులో మాట్లాడని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పుడే ఈ అంశంపై పోరాటం చేయడం రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలి.     ఈ మొత్తం వ్యవహారంలో సమిధులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మూడు పార్టీల మూడు ముక్కలాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్‌లుగా మిగిలారు. లోక్‌సభ సభ్యత్వాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాజనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది. దీంతో బుధవారం నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులే. బుధవారం నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో  ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ బద్ద శత్రువుగా చూసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి అమరావతిలో భేటీ అయ్యారు. ఇది మంచి పరిణామం. కొంతకాలంగా ఉంవడల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదాపై పలు సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికల ద్వారా సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికే నేరుగా చెప్పారు.      ఈ సూచనల్లో ప్రధానమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే తెలుగు వారికి ఆయుధాలని చెప్పడం ప్రధానం. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ సమావేశాల్లో మన వాదనను వినిపించ వచ్చునన్నది ఉండవల్లి సూచన. అయితే దీనికి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు రాకపోవచ్చు. వారు వ్యతిరేకించకపోయినా సభలో ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్నది అధికార తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం లోక్‌సభ ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుల దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, జితేందర్ రెడ్డిలను  దగ్గరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల కలిసారు. తెలుగు వారి ఇబ్బందులపై కలసి పోరాడాలన్న వారి వినతికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సానుకూల స్పందన రావడం ముదావహం. మొత్తానికి బుధవారం నుంచి రాజధాని ఢిల్లీలో  తెలుగు వారి వాడీ, వేడీ ఎలా ఉంటుందో చూడాలి...!?
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఫుట్‌బాల్ అభిమానుల కేరింతలతో నెల రోజులు జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అంచలంచెలుగా ప్రత్యర్ధులను తమ గోల్స్‌తో మట్టి కరిపించిన ఫ్రాన్స్ ఫైనల్ ప్రత్యర్ధి క్రొయేషియాపై 4 - 2 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. నెల రోజులుగా ఆశగా చూస్తున్న  ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు ఆ జట్టు ఆటగాళ్లు. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచ కప్ విజయం. తొలిసాకి 1998 సంవత్సరంలో తొలిసారి ప్రసంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆ కల ఈడేరడం కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.  ఇరవై సంవత్సరాల తర్వాత తీరిన కలతో ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. మన దేశంలో కూడా ఫుట్‌బాల్‌ పట్ల ఎంతో ఆదరణ ఉంది.     క్రికెట్‌ను మాత్రమే ఆదరిస్తారని ఇన్నాళ్లూ అన్నుకున్న భారత క్రికెట్ అభిమానులకు ఈ ఫుట్‌బాల్ అభిమానులు చూపించిన ఆదరణకు అదిరిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పట్ల ప్రజల్లో ఎంత క్రేజ్ ఎంతో ఉందో ఈసారి పోటీలు మళ్లీ మరోసారి నిరూపించాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్ పోటీలు అన్నీ ఉత్కంఠగా జరిగినవే. చివరికి అతి చిన్న జట్టుగా అసలెలాంటి అంచనాలు లేని క్రొమేషియా ఫైనల్‌కు రావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఫైనల్‌పై పడింది. జయపజయాల మాట పక్కన పెడితే ఫుట్‌బాల్ క్రీడ మనుషుల్లో ఉన్న ఓ పట్టుదలను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది.     అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లేని క్రేజ్ ఈ ఫుట్‌బాల్ పట్ల చూపిస్తారు అభిమానులు. క్రికెట్ పట్ల కేవలం పది పన్నెండు దేశాలు మాత్రమే ఆసక్తి చూపిస్తే ఫుట్‌బాల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. దానికి కారణం ఈ పోటీ గంట లోపే ఫలితం తేలడంతో పాటు బరిలో ఇరు జట్లు చూపించే వ్యూహప్రతివ్యూహాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందుకే కోట్ల మంది ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో నూ, కేరళలోనూ మాత్రమే ఫుట్‌బాల్ పట్ల క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రాల నుంచే భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడాకారులు ఎంపికవుతారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడపై ఆసక్తి పెంచేందుకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. దే:శంలో ఇంతకు ముందు ప్రపంచం గర్వించే ఫుట్‌బాల్ క్రీడాకారులున్నారు.     వారిలో అగ్రగణ్యుడు నివీల్డి డిసౌజా. భారత ఫుట్‌బాల్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన క్రీడాకారుడు డిసౌజా. 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అనూహ్య విజయాన్ని అందించింది డిసౌజానే. ఆయన తర్వాత భారత ఫుట్‌బాల్‌‌కు దేవుడిచ్చిన వరంగా చెప్పుకునే బైచుంగ్ భాటియా. ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో బ్రెజిల్ క్రీడాకారులు పీలే, అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మరడోనాలు ఎంత గొప్పవారు మన దేశానికి భాటియా కూడా అలాంటి క్రీడాకారుడే.     దేశంలో క్రికెట్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు ఇతర క్రీడలపై కూడా ఆదరణ చూపిస్తే మనకు పీలేలు, డిగో మరడోనాలు తయారవుతారు. భారత జాతీయ క్రీడ హాకీని పట్టించుకోకపోవడం వల్ల ఆ క్రీడ దాదాపుగా కనుమరుగవుతోంది. క్రికెట్ ఒక్కటే మన క్రీడగా మిగులుతున్న దశ ఇది. ఈ జాడ్యం పోతే హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కో కో వంటి క్రీడల్లో భారత్ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఎంతటిదో చూపిస్తాయి.
కుమారస్వామి కంటతడి పెట్టారు. ఇది నిజంగా షాకింగే! మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమూ కానప్పటికీ… 2019లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం కంటతడి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయమే. అసలింతకీ ఆయనెందుకు ఏడ్చారు? నలభై సీట్లు కూడా లేని జేడీఎస్ నేత నక్క తోక తొక్కినట్టు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ భయంతో కాంగ్రెస్ అతడ్ని బంపరాఫర్ ఇచ్చి రథ సారథని చేసింది. యడ్యూరప్ప సీఎం అవ్వకుండా ఆపగలిగింది. మరో రాష్ట్రం మోదీ వశం కాకుండా అడ్డుకుంది. కానీ, కాంగ్రెస్ మార్కు రాజకీయం నిత్యం భరిస్తూ ముళ్లపాన్పు లాంటి సీఎం కుర్చీపై కూర్చోటం కుమారస్వామికి ఎంత కష్టమో త్వరగానే తెలిసిపోయింది!     చరిత్రలో అనేక సార్లు కాంగ్రెస్ సంకీర్ణ  ప్రభుత్వాల్లో వుంటూ వచ్చింది. కానీ, ఎప్పుడూ కూడా తాను ప్రధాన పార్టీగా వుంటేనే ఆ గవర్నమెంట్లు అయిదేళ్లు నెగ్గుకొచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తూ మరో పార్టీ ప్రభుత్వం నడుపుతుంటే … ఆ సర్కార్ అయిదేళ్లు నడవటం అసాద్యమే. ఇది పదే పదే హస్తం నేతలు నిరూపించారు. కాంగ్రెస్ వ్యవహారంతో కొందరు ప్రధాని పదవులు కోల్పోతే అనేక మంది సీఎం పదవులు కోల్పోయారు. ఇప్పుడు కుమార స్వామి వంతు అన్నట్టు కనిపిస్తోంది పరిస్థితి. తనకు విషం తాగుతున్నంత కష్టంగా వుందని పార్టీ నాయకులు, కార్యకర్తల ముందు ఏడ్చేశాడు దేవెగౌర రాజకీయ వారసుడు. ఆ విషం తాగిస్తున్నది సంకీర్ణంలోని కాంగ్రెస్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఒకవైపు నుంచీ మాజీ సీఎం సిద్దరామయ్య, మరో వైపు నుంచీ డాక్టర్ శివ కుమార్, మధ్యలో మల్లిఖార్జున ఖర్గే… ఇలా ఎవరికి వారు కన్నడ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు. కుమార స్వామి ఫ్రస్ట్రేషన్ కి కారణం అదే! ఆయన నిమిత్తమాత్రుడైన సీఎంలా మిగిలిపోయే ప్రమాదం పొంచి వుంది. అలా రబ్బర్ స్టాంప్ లా వుండటం ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడైన కుమార స్వామికి రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అదే ఆయన దుఃఖానికి కారణం!     కుమార స్వామిని ముఖ్యమంత్రిగా జనం ముందు పెట్టి తరువాత అతడ్ని ఏమీ చేయకుండా అడ్డుకుంటున్నారు కన్నడ హస్తం నేతలు. వాళ్లు అలా చేస్తుండటంతో చెడ్డ పేరంతా కుమార స్వామి భరించాల్సి వస్తుంది. ఇది ముందు ముందు జేడీఎస్ పై జనం ఆగ్రహించే స్థితి తీసుకు రావచ్చు. అదే సమయంలో మరింత మంది ఓటర్లు బీజేపి వైపు మొగ్గ చూపవచ్చు. కాంగ్రెస్ ఆకతాయితనం వల్ల పార్లమెంటు ఎన్నికల ముందో తరువాతో మళ్లీ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వస్తే కమలానికి జనం స్పష్టమైన మెజార్టీ ఇవ్వొచ్చు. ఇదే కుమార స్వామి భయమంతా! అయినా కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతల మాటలు ఆందోళనకరంగా వుంటున్నాయి. కుమార స్వామి కంటతడిపై కామెంట్ చేసిన మల్లిఖార్జున ఖర్గే… ఆయన ఇబ్బందుల్ని పరిష్కారిస్తామని అనలేదు. కాంగ్రెస్ మరింత సహకరిస్తుంది అని కూడా అనలేదు. సంకీర్ణంలో ఇలాంటి ఒత్తిళ్లు సహజం. తట్టుకుని ముందుకు సాగాలి అని సెలవిచ్చారు! అంటే, తమ వైపు నుంచి పెద్దగా మార్పుండదని చెప్పకనే చెప్పేశారు!     జేడీఎస్ కి, కర్ణాటక కాంగ్రెస్ కి మధ్య గొడవ నిజానికి జాతీయ సమస్య కాదు. అది ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, త్వరలోనే పార్లెమంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక పరిణామాలు దిల్లీపై కూడా ప్రభావం చూపుతాయి. ఎలాగంటే, ఏ క్షణమైనా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలితే అది మోదీ, షాలకు బంగారు ఆవకాశం. జనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే జై కొట్టే చాన్స్ వుంటుంది. కాంగ్రెస్ , జేడీఎస్ లను నమ్మకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూలకపోయినా… కుమారస్వామి చేత నిత్యం విషం తాగిస్తూనే కాంగ్రెస్ వారు ఇబ్బంది పెడితే… అది కూడా రెండు పార్టీలకు నష్టమే. ఎన్నికల్లోపు ఎంతో కొంత మంచి చేస్తేనే ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. లేదంటే, రాహుల్, కుమారస్వామి, సిద్దరామయ్య లాంటి వారి కంటే మోదీనే బెటర్ అని ఆయన వైపు మొగ్గు చూపుతారు.పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఛరిష్మా కూడా పని చేస్తుంది. ఇలా ఎలా చూసినా కుమార స్వామి కంటతడి… యడ్యూరప్ప ఆనందభాష్పాలుగా మారే సూచనలు పుష్కలంగా వున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఇంకా కాస్త పట్టుమిగిలిన కన్నడ నాట… హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా వుంటే తప్ప మోదీని నిలువరించటం సాద్యం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుని రాహుల్ కన్నడ కాంగ్రెస్ నేతల్ని నియంత్రించి కుమారస్వామి కళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి! లేదంటే… మోదీకి కావాల్సిన ఎంపీ సీట్లు, యడ్యూరప్పకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రెండూ త్వరలోనే కమలం ఖాతాలో పడిపోవచ్చు! 
అతి సర్వత్రా వర్జయేత్. ఈ నానుడి సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది. ఏ అంశంలోనూ ఎక్కువగా ఆలోచించకూడదని, దేని పైనా ఎక్కువ ప్రేమను కాని, ద్వేషాన్ని కాని పెంచుకోకూడదని కూడా ఈ ఆర్యోక్తి ప్రతిసారీ రుజువు చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బీదర్‌‌లో జరిగిన సంఘటన. అక్కడున్న తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంపై గ్రామస్థులు కిడ్నాపర్లు అనే అనుమానంతో దాడి చేశారు. దాదాపు రెండు వందల మంది గ్రామస్థులు విక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో మహ్మద్ అజాం అనే యువకుడు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి కారణం ఒకవైపు అనుమానాలైతే... మరోవైపు దావానలంలా వ్యాపించిన వాట్సప్ మెసేజ్‌లు.     ఇది ప్రపంచంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యం చెబుతున్నా.... మరోవైపు సోషల్ మీడియా మరో రూపాన్ని కూడా చాటుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి బీదర్‌లో వ్యవసాయ క్షేత్రముంది. వారాంతపు సెలవులు కావడంతో ఆ కుటుంబంలో నలుగురు తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు తమ కారులో బీదర్ వెళ్లారు. వీరిలో ఒకరు గూగుల్ ఉద్యోగి కాగా మరొకరు ఖతర్ దేశంలో పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ సలాం. ఆయన ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఖతర్ నుంచి వచ్చిన మహ్మద్ సలాం వరుసకు సోదరులైన మహ్మద్ అజం, మ‌హ్మద్ సల్మాన్, నూర్ మహ్మద్ నలుగూరూ తమ సొంత వాహనంలో బీదర్‌ జిల్లా హండీకేరాలో ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముర్కి గ్రామ పరిథిలోని టోకుల్లా బ్యాండ్ వద్ద వీరి కారు నిలిపారు. అక్కడికి సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్ధినులకు ఖతర్ నుంచి తీసుకువచ్చిన చాక్లెట్లు పంచిపెట్టారు.      అదే వీరు చేసిన నేరం. వీరిని కిడ్నాపర్లుగా భావించిన ఉమేష్ బరాద్ అనే యువకుడు పిల్లలకు చాక్లెట్లను ఎందుకు పంచుతున్నారని ఓ వైపు ప్రశ్నిస్తూనే గ్రామస్థులకు తన వాట్సప్ ద్వారా గ్రామంలోకి కిడ్నాపర్లు వచ్చారనే సమాచారాన్ని అందించారు. అంతే ఒక్కసారిగా వందలాది మంది గ్రామస్థులు పాఠశాల సమీపానికి చేరుకుని నలుగురు యువకులపైనా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా పడింది. గ్రామస్ధుల విచక్షణారహిత దాడిలో గూగుల్ ఉదో్యగి మహ్మమద్ అజీం ప్రాణాలు కోల్పోయారు.     ఈ సంఘటన రెండు వాస్తవాలను చెబుతోంది. ఒకటి విచ్చలవిడిగా.... అడ్డూ అదుపు లేకుండా వాడకంలోకి వచ్చిన సోషల్ మీడియా అయితే మరొకటి దేశంలో పిల్లలకు భద్రత లోపించిందనే అంశం. ముందుగా సోషల్ మీడియా విస్తరణ కారణంగా సమాజంలో నేరాలు... ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్ ప్రేమలు... వివాదాలు.... దొంగ మెసేజ్‌లతో డబ్బులు దొంగిలించడం... చివరకు ఆధార్ కార్డుల రూపకల్పన, సెల్‌ఫోన్ సిమ్‌ల తయారీ వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. ఏ బస్సులో చూసినా... ఏ రైలులో చూసినా... పది మంది కూడిన ఏ ప్రదేశంలో చూసినా మాటల్లేవు... మాటాడుకోవడాల్లేవ్... అందరిదీ ఒకే బాట... వాట్సప్‌ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో సందేశాలు. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్దా విచక్షణ లేదు.     ఈ సోషల్ మీడియా కారణంగా రోజురోజుకూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నా ప్రజల్లో దీని పట్ల మమకారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఒక్క మేసేజ్‌తో వందల మంది గ్రామస్థులు ఒక చోట చేరి ఈ ఘోరం చేశారంటే  సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాణానికి మరోవైపు అన్నట్లుగా దీని వల్ల కొన్ని చోట్ల మంచి జరుగుతున్నా అది చాలా తక్కువ సందర్భాల్లోనే. దీనిపై స్వీయ నియంత్రణే చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు, మంత్రులు, సినీ స్టార్లు, క్రికెటర్లు... ఇలా సమాజంలో పెద్దవారు అనుకునే వారంతా ఈ సోషల్ మీడియాకు దాసులైపోయారు.     ఇక దేశంలో చిన్నారుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు ఎక్కువయ్యాయి. వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా దేశంలో ఉన్న చట్టాలు నేరం చేసిన వారిని సునాయాశంగా జైళ్ల నుంచి విడుదల చేయిస్తున్నాయి. దీంతో ఈ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తే ఈ దారుణాలకు స్వస్తి పలకవచ్చు. ముందుగా వ్యక్తిలో మార్పు రావాలి. అందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు క్రషి చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. దేనిని ఎంత వరకూ ఉపయోగించాలో కూడా ఎరుకలో ఉండాలి.
పొరుగు దేశం పాకిస్తాన్ సంక్షోభంలో పడింది. అగ్ర నాయకుల అరెస్టులు ఒకవైపు... ఉగ్రవాదుల పంజా మరోవైపు పాకిస్తాన్‌ను  కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌ను, ఆయన కుమార్తె మరియంలను లాహోర్ విమానాశ్రయంలో పాకిస్తాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్‌లో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు షరీఫ్ తన కుమార్తె మరియంతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ చేరుకున్నారు. వారిద్దరు అబుదాబీ మీదుగా లాహోర్ చేరుకోగానే అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశంలో సంచలనం రేపుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కు తాను అరెస్టు అవుతానని ముందుగానే తెలుసు. అయినా ఆయన వాటి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది ఆయనలో ఉన్న ధైర్యానికి ప్రతీక.     నవాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతి సొమ్ముతో లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న అవెన్‌ఫీల్డ్‌లో నాలుగు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారని అభియోగం. ఈ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు.  అయితే ఈ అపార్ట్‌మెంట్లేవీ నవాజ్ షరీఫ్ పేరిట లేకపోవడం గమనార్హం. తన ఎన్నికల అఫిడివిట్‌లో ఈ ఆస్తులను చేర్చలేదని పాక్ ప్రభుత్వం షరీఫ్‌పై కేసులు పెట్టింది. ఈ అక్రమాస్తుల విలువ 65 కోట్ల రూపాయలు.పాకిస్తాన్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంతో పోలీస్తే 65 కోట్ల రూపాయల అక్రమార్జన ఏమంత పెద్దది కాదు. ఇంతటి అవినీతి భారత్‌లో సాధారణ గ్రామ లేదూ పట్టణ స్ధాయి నాయకులు చేస్తారు. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇది పెద్ద నేరంగానే పరిగణించడం విశేషం.     నవాజ్ షరీఫ్ అరెస్టును అవినీతి కోణం నుంచి కాకుండా రాజకీయ కోణం నుంచి మాత్రమే చూడాలి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కుట్రగానే సభ్య దేశాలు చూస్తున్నాయి. తనను అరెస్టు చేస్తారని ముందుగానే తెలిసినా... ఆ సమయానికి షరీఫ్ లండన్‌లో ఉన్నా ఆయన పారిపోవడానికి కాని, మరోచోట తలదాచుకోవడానికి కాని ప్రయత్నించలేదు. భార్య ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూపి.. ఆమెను సముదాయించి కుమార్తెతో సహా స్వదేశానికి బయలుదేరారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. అయితే భారత్‌తో పోలిస్తే మాత్రం అరెస్టు అవుతానని తెలిసీ ఇలా రావడం మాత్రం ఆశ్చర్యమే. పాకిస్తాన్‌లో  ఒకవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్టు అయితే మరోచోట పెషావర్‌లో విషాదం చోటుచేసుకుంది. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ ఉగ్రవాదులు మానవబాంబుతో ఓ పార్టీ చేపట్టిన ర్యాలీపై దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 128 మంది అమాయకులు బలైపోయారు.     పాకిస్తాన్‌లో అంతో ఇంతో పేరున్న పార్టీగా పేరున్న బలూచిస్థాన్ అవామీ పార్టీ నాయకుడు సిరాజ్ రైసానీ మరణించారు. నిజానికి ఉగ్రవాదుల దాడి ఆయన లక్ష్యంగానే జరిగిందని అంటున్నారు. ఎవరిది ఏ లక్ష్యమైనా జరిగింది మాత్రం మహా ఘోరం. దారుణం. వందల మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమం వల్ల ఏమి సాధించారో మాత్రం అర్ధం కాదు. ఒకరినో.. పదిమందినో.. వందల మందినో హతమార్చడం ద్వారా అధికారంలోకి వస్తామని కాని, ఆ దేవుడు కరుణిస్తాడని కాని అనుకోవడం ముమ్మాటికి ముర్ఖత్వమే. ఇలాంటి చర్యలకు వారి దేవుడే కాదు... ఏ దేవుడైనా హర్షించడు. ఈ సత్యం ప్రపంచంలోని ఉగ్రవాదులందరికీ ఎంత త్వరగా తెలిస్తే మానవాళి మనుగడకు అంత ప్రశాంతత దొరుకుతుంది.
  హిమదాస్‌. నిన్నమొన్నటి వరకు ఆ పిల్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడూ... ఆపేరు వినని వాళ్లు చాలా రేర్‌గా కనిపిస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు హీనాది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ అంతర్జాతీయస్థాయి పరుగుపోటీల్లో బంగారుపతకం సాధించలేదు. పీటీ ఉష, అశ్వనీ నాచప్పలాంటి వాళ్లు కూడా సాధించలేనిది ఈ హీనా ఎలా గెల్చుకుందో తెలుసుకోవాలంటే... ఆమె జీవితాన్ని ఓసారి చూడాల్సిందే! హిమదాస్‌ది అసోంలో శివసాగర్‌ అనే పల్లెటూరు. అక్కడ హిమ వాళ్ల నాన్న చిన్న రైతు. తన పిల్ల ఏదో కాస్త చదువుకుంటే చాలనుకునే మనస్తత్వం. హిమకి మాత్రం అటు చదువు, ఇటు వ్యవసాయం కంటే ఆటల మీదే శ్రద్ధ ఉండేది. ఎంత శ్రద్ధ అంటే మగపిల్లలతో కలిసి పొలాల పక్కనే ఉండే బురదలో తెగ ఫుట్‌బాల్‌ ఆడేది. ఆటలో పడితే ప్రపంచాన్నే మర్చిపోయేది. అలాంటి సమయంలో ఓ లోకల్‌ కోచ్‌ హీనాని చూశాడు. తను ఫుట్‌బాల్లో కంటే రన్నింగ్‌లో మరింత బాగా రాణించగలదనుకున్నాడు. వెంటనే హీనాని ఒప్పంచి రన్నింగ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వసాగాడు.   హిమ క్రమంగా రన్నింగ్‌లో రాటుదేలింది. జిల్లా స్థాయిలో మెడల్స్ తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఆ సమయంలోనే నిపాన్‌ అనే కోచ్‌ దృష్టి హిమ మీద పడింది. చవక బూట్లు వేసుకుని కూడా, హిమ గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం చూసి ఆశ్చర్యం వేసింది. తను ఇంతకుముందు ఎప్పుడూ చూడని టాలెంట్‌ హిమలో ఉందని నిపాన్‌ గ్రహించాడు. వెంటనే హీనాకి ప్రభుత్వ కోచింగ్‌ ఇప్పించాలని అనుకున్నాడు.   గవర్నమెంట్‌ కోచింగ్‌ తీసుకోవాలంటే అసోం రాజధాని గువాహతికి పంపించాలి. అది హిమ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల, అందులోనూ ఆరుగురు పిల్లల్లో అందరికంటే చిన్నది. అందుకే హిమని అంతదూరం పంపడానికి వాళ్ల మనసు ఒప్పలేదు. కానీ హీనాని వాళ్లు గువాహతికి పంపేదాకా నిపాన్‌ ఊరుకోలేదు. తీరా గువాహతికి వెళ్లాక అక్కడ అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచింగ్‌ లేదని తెలిసింది. అయినా హిమ వెనక్కి రాలేదు. ఆమె ప్రతిభ చూసిన అధికారులు కూడా హిమని అకాడెమీలోకి తీసుకోక తప్పలేదు. ఓ రెండేళ్లు తిరిగేసరికి... ఇదిగో ఇలా చరిత్రి సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరిగిన ‘world championships’లో గోల్డ్‌ మెడల్‌ కొట్టింది.   హిమ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సంపాదిస్తుందని ఆమె కోచ్‌ నిపాన్‌కు ఎప్పుడూ తెలుసు. ‘చాలా కొద్దిమందిలోనే టాలెంట్‌ ఉంటుంది. అలాంటి వాళ్లలో హీనా ఒకరు. అందుకే ఆమెను ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోవద్దని చెబుతూ ఉంటాను,’ అంటాడు నిపాన్‌. మనకి నచ్చిన రంగం ఏదైనా సరే... దాని మీదే effort పెడితే ఎప్పటికైనా విజయం తప్పదని హీనా నిరూపిస్తోంది. దేని మీదైనా మనకి విపరీతమైన dedication ఉంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తాయని హీనా కథతో తెలుస్తోంది. - Nirjara  
  చాలామంది ఏదో ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలుకదా అనుకుంటారు. మరికొందరు అవసరం కదా అనుకుని ఇంగ్లీష్ వంటి మరో భాషని నేర్చుకుంటారు. కానీ భాష అంటే కేవలం ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు కదా! అది ఒక కొత్త ప్రపంచానికి ప్రతీక. భాష వెనుక ఏకంగా ఒక సంస్కృతే దాగి ఉంటుంది. అంతేకాదు! కొత్త భాషలని నేర్చుకోవడం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని... ఆత్మవిశ్వాసం: ఒకటికి మించిన భాషలు నేర్చుకున్నవారిలో తాము ఇతరులకంటే ఏమాత్రం తీసిపోమన్న విశ్వాసం ఉంటుంది. భాష అనేది జ్ఞానానికి సూచన కాబట్టి, తాము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సమర్థులం అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా తాము నేర్చుకున్న భాష అవసరమయ్యే పరిస్థితులలో, తమ సహచరులకంటే వారే దూకుడుగా ఉండగలుగుతారు. మెదడు పనితీరు: ఎక్కువ భాషలను నేర్చుకున్నవారి మెదడులో రకరకాల సానుకూల చర్యలు జరుగుతూ ఉంటాయి. అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధులు ఇలాంటివారికి దూరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతేనా! వీరిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనీ, మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది. అటు వినికిడి కూడా మెరుగుపడుతుందట! అదనపు అర్హత: కొత్త భాష అనేది ఎప్పుడూ ఒక అదనపు అర్హతే! కొత్త భాషతో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పరిధి విస్తరిస్తుంది. ఉదాహరణకు హిందీ వచ్చినవాడు, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక అర్హతను సాధిస్తాడు. అంతేకాదు! యాజమాన్య సంస్థలు ఎప్పుడూ కూడా ఒకటికి మించి భాషలు వచ్చినవారికి అదనపు ప్రాధాన్యతని ఇస్తాయి. భిన్నమైన పనులు: పరుగులెత్తే ఈ జీవితంలో ఒకేసారి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటి మించిన భాషలను నేర్చుకునేవారు వెంటవెంటనే వేర్వేరు పనులను చేయగలుగుతారనిన పరిశోధనలు నిరూపించాయి. పైగా వీరు కొత్త పరిస్థితులలో కూడా సులువుగా ఇమిడిపోగలుగుతారంట. అప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారట. విశాల దృక్పథం: కొత్త భాషని నేర్చుకున్న మనిషి కొత్త ప్రాంతాలలో తిరగగలుగుతాడు. ఆ భాషలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. భిన్నమైన సంస్కృతినీ, జీవన విధానాన్నీ చూసి తన అభిప్రాయాలను మెరుగుపరుచుకుంటాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు ప్రయాణాలు చేయడానికీ, ప్రపంచాన్ని అన్వేషించడానికీ ఉత్సాహం చూపుతారు. ఒక భాష తెలిసినవారికి మరో భాషని నేర్చుకోవడం మరింత సులువుగా మారుతుంది. మెదడు అప్పటికే భాషకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నమోదై ఉంటారు కాబట్టి, మరో భాషని నేర్చుకునేందుకు అది అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరింకేం... 30 రోజుల్లో ఏదో ఒక భాషను నేర్చుకునేందుకు సిద్ధపడితే పోలా!
  Description: Dr. Purnima Nagaraja beautifully answers a question asked by a young girl and in this process explains us about how marriage is just not a social obligation but a sensitive relationship. She further elaborates a few basic yet main points which must be analyzed while choosing a life partner because our life is extremely precious...  https://www.youtube.com/watch?v=u03EMjT0jzs  
  బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచారు.. తరువాత టీడీపీలో చేరారు.. ఇక అప్పటినుండి బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కోరుతోంది.. అయితే ఇప్పుడు వైసీపీకి ఓ ట్విస్ట్ ఎదురైంది.. పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు.. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. తాజాగా ఈ విషయంపై వైసీపీ నేత విజయ సాయి రెడ్డి స్పందించారు.. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అని, ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.  
రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది తెదేపా.ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెదేపా మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది.     తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.గతంలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తెదేపా, వైకాపా సభ్యులు పోటాపోటీగా పలుమార్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్‌ చెప్పడం,వాయిదాల పరంపర కొనసాగడంతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే.తాజాగా తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.  
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. టీడీపీ, వైసీపీ అధికారం మాది అంటే మాది అంటూ పోటీపడుతున్నాయి.. మరో వైపు జనసేన కూడా అధికారం మాదే అంటుంది.. అయితే ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి టీడీపీకే ఎక్కువ ఆస్కారం ఉందని విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరోవైపు సర్వేలు కూడా టీడీపీకే అనుకూలంగా వస్తున్నాయి.. అయితే ఈ అనుకూల వాతావరణానికి, చంద్రబాబు నిర్ణయాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుంది అంటూ బాబు ఎన్డీయే నుండి బయటికి రావడం.. ప్రత్యేకహోదా మరియు విభజన హామీలు నెరవేర్చాలంటూ పట్టుబట్టి కేంద్రం మీద పోరాడటం, ఇప్పుడు ఏకంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బీజేపీ మీద పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోవడం.. ఇవన్నీ బాబుకు బోలెడంత మైలేజీ తీసుకొచ్చాయని అంటున్నారు.     అయితే ప్రతిపక్ష నేత జగన్ పరిస్థితి వేరేలా ఉంది.. ఎవరి తీసుకున్న గోతిలో వారే పడినట్టుగా.. తన తీసుకున్న నిర్ణయం తనకే తలనొప్పిగా మారింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేకహోదా అన్న జగన్, తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు.. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.. దీని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.. మరోవైపు ఎంపీల రాజీనామా నిర్ణయం కూడా తప్పని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎంపీలు రాజీనామా చేయకుండా ఉంటే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉండేది.. అలానే అవిశ్వాసానికి కూడా మద్దతిచ్చే అవకాశం ఉండేది.. కాని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.. దీంతో జగన్ నిర్ణయం పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవైపు టీడీపీ, బీజేపీ మీద అవిశ్వాసం అంటూ ప్రజలకు దగ్గరవుతుంటే.. వైసీపీ మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.