శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం.. రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా.. ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి. - ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. - మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  - మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. - పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. - ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. -  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. - శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. - ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌ వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం.. శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు. మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC .... లవంగం: 314,446 ORAC దాల్చినచెక్క: 267,537 ORAC పసుపు: 102,700 ORAC జీలకర్ర: 76,800 ORAC తులసి: 67,553 ORAC అల్లం: 28,811 ORAC జాజికాయ : 69,640 ORAC నల్ల మిరియాలు : 34, 053 ORAC కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి. భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలను ఇంట్లో చేసుకుని రోజూ రెండు పూటలు తాగడం ఆరోగ్యకరం. తులసి ఆకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలను నీళ్లలో వేసి బాగా మరగబెట్టి బెల్లం లేదా తేనెతో.. హెర్బల్‌ టీ మాదిరిగా తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.   ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, శొంఠి సమపాళ్ళలో తీసుకుని పొడి చేయాలి. ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం, నిమ్మరసం తీసుకోవాలి. వీటిలో దాల్చిన చెక్క, నల్లమిరియాలు, యాలకులు, శొంఠి పొడి చేసుకోవాలి. ఒక లీటర్ నీటిని వేడి చేస్తూ అందులో ఎండు ద్రాక్ష, ముందుగా చేసుకున్న పొడి, తులసి ఆకులు వేయాలి. పది నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, బెల్లం కలిపి తాగాలి. ఒక లీటర్ నీటితో చేసుకునే ఈ కషాయం ఇంట్లో నలుగురికి సరిపోతుంది. అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం. రెండు గ్లాసుల వేడి నీటిలో స్పూన్ అల్లం రసం, అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేయాలి. వేడివేడిగా ఈ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో ఇంటి చిట్కాలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రధాని సైతం కషాయాలతో కరోనాను తరిమి కొట్టవచ్చని చెప్పారు. పక్కింటివారు చెప్పినా.. ప్రధాని చెప్పినా వాటిలో మనకు కామన్ గా కనిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు కరోనా మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది? వీటిని ఎందుకు ఔషధాలుగా మనం చెప్పవచ్చు. అది తెలుసుకోవాలంటే మనం మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకోవాల్సిందే... క్రీస్తు పూర్వం  2000 కన్నా ముందు బంగారం కన్న గొప్ప విలువ సంపదగా సుగంధ ద్రవ్యాలను భావించేవారు.  దాల్చిన చెక్క, నల్ల మిరియాల తదితర దినుసుల  వాణిజ్యం ద్వారా ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సుగంధద్రవ్యాల్లో 70శాతం మన దేశంలోనే పండుతాయి. వీటిని పండించే రాష్ట్రాల్లో కేరళదే అగ్రస్థానం.  క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.. అందుకు కారణం వాటిలో ఉండే  ఆక్సిజన్ రాడికల్ అబ్సర్వేషన్ కెపాసిటీ. దీన్నే మనం ఓఆర్ఏసి గా పేర్కొంటారు జింజర్, తులసి, పసుపు మొదలైనవాటిలో ఓఆర్ఏసి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  విటమిన్ సి, ఒమేగా త్రీ, విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలను మనం తీసుకున్న ఆహారం నుంచి  శరీరం గ్రహించడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.

Ginger! Ginger!

Publish Date:Jul 1, 2020

Ginger belongs to the same family of Turmeric which is ‘Zingiberaceae`. Probably that has something to do with the medicinal properties of ginger. Ginger is said to have originated in china. But Indians are the ones who have used it in huge proportions for culinary as well as the medicinal purpose. Even today India is the leading producer of ginger. The contents such as Gingerol are responsible for its pungent smell as well as the herbal properties. The day to day ailments like cough and cold are always treated with the extracts of ginger in our society. Some of the other well known and well proved medicinal qualities of ginger are as follows. For Digestion:     Ginger is known for thousands of years for its positive effect on our digestion. The taste of ginger itself would provoke the digestive juices. Having a ginger tea after meals would certainly aid the digestive process. It’s antibacterial and anti fungal properties would keep the intestines safe from the foreign bodies. However people with stomach ailments like ulcers are not advised to take huge quantities of raw ginger without the advice of a professional. Against Tumors:     Even The American Cancer Society has agreed that the extract from ginger has either slowed down or prevented the growth of cancerous tumors in the animals. In another study it was found that the cancer cells died when they came into contact with the ginger solution. Ginger was found to be helpful against ovarian, breast and colon cancers. In Nausea:     The feeling of sickness associated with vomiting sensation is called nausea. It might occur during pregnancy, while travelling on bus, while being on ship, while undergoing chemotherapy… The smell of ginger itself can relieve much of nausea. Ginger when taken during such situation is found to act as good as a medicine available in the drugstore. Even the Naval cadets were found to be relived from sea sickness after consuming ginger. Anti inflammatory:   The ingredient of Gingerol mentioned before is found to be anti-inflammatory as well as analgesic (that reduces pain). That is the reason why ginger is advised frequently for the patients suffering from rheumatoid arthritis and Osteoarthritis. In a few studies, when the patients suffering from the above ailments were regularly given the supplements extracted from ginger… the mobility of their joints seems to have improved and the pain associated with stress on joints seems to have been relived. Ginger is found to work as analgesic in migraines and menstrual pain as well. Diabetic and cardiovascular diseases:     No health article can be complete without mentioning these two ailments that are associated with our day to day lifestyle and are major causes for our health troubles. Ginger was proved to encourage the intake of insulin into muscles thereby decreasing the levels of glucose in bloodstream. Regular intake of ginger was also associated with the decrease of triglycerides and LDL cholesterol levels which are major culprits for diabetics as well heart diseases. Besides minerals like Magnesium, Manganese, Phosphorus, Potassium and Zinc would ensure a free flow of blood towards the heart. As the herbal values associated with ginger seems to be elevating day by day, the saying in future might be as follows - `A pinch of ginger a day keeps the doctor away`     --Nirjara
  రోజులు మారిపోతున్నాయి. రోజులతో పాటుగా అలవాట్లూ మారిపోతున్నాయి. కాస్త ఆకలి వేసినప్పుడు ఇడ్లీలో, పకోడీలో తినే పరిస్థితి దాటిపోయి... బ్రెడ్డు మీద వెన్న రాసుకునే అలవాటు మొదలైంది. కానీ ఇలా దేని మీద పడితే దాని మీద వెన్నని రాస్తే ఆకలి తీరడం మాట అటుంచి అనారోగ్యం పాలవుతామని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెన్న భారతీయులకి కొత్తేమీ కాదు. మన రోజువారీ జీవితంలో పాలు, వెన్న, నెయ్యి శుభ్రంగా కలిసిపోయాయి. ఈ పదార్థాలు లేనిదే మన ఆహారాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ కొద్ది రోజులుగా వెన్న మీద పరిశోధకుల కన్ను పడింది. ఇందులో ఉండే విపరీతమైన కొవ్వు వల్ల గుండెపోటు, చక్కెర వంటి సమస్యలు ఏర్పడతాయంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇలాంటి మాటలు విన్న భారతీయులు కూడా అనాదిగా వస్తున్న తమ అలవాట్లలో లోపం ఏదన్నా ఉందేమో అని భయపడి అసలు వెన్నకే దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు వెన్న జోలికే పోవడం మానుకున్నారు. నిజానికి ఆయుర్వేదం ప్రకారం వెన్నకి అద్భుతమైన గుణాలెన్నో ఉన్నాయి. ఆకలిని పెంచడంలోనూ, వాతపిత్త దోషాలను నివారించడంలోనూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలోనూ, శక్తిని అందించడంలోనూ... వెన్నకు తిరుగులేదంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక పిల్లలపాలిట అయితే ఇది అమృతంలా పనిచేస్తుందట. మరి అలాంటి వెన్నకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారేంటా అని జనం సందిగ్థంలో పడిపోయారు. కానీ బోస్టనుకు చెందిన డా॥లారా చేసిన ఒక పరిశోధనతో అసలు విషయం బయటపడింది. వెన్నకీ గుండెజబ్బులు, చక్కెర వంటి వ్యాధులకీ పెద్దగా సంబంధం లేదని తేల్చిపారేశారు లారా. నేరం వెన్నది కాదనీ, దాంతో పాటుగా పుచ్చుకునే బ్రెడ్‌, బంగాళదుంపలు వంటి పదార్థాలదే అంటున్నారు ఈ పరిశోధకురాలు. దేని మీద పడితే దాని మీద వెన్నని పూసేసుకొని, ఆ తరువాత వచ్చే అనారోగ్యాలకు వెన్నను దోషిగా నిలబెట్టడం మంచిది కాదంటున్నారు. లారా తన పరిశోధన కోసం దాదాపు ఆరు లక్షలమంది ఆరోగ్యవిధానాలను నిశితంగా పరిశీలించారు. అదీ విషయం! రోజుకి కాస్తో కూస్తో వెన్నని మితంగా పుచ్చుకోవడంలో తప్పులేదనీ... అయితే ఆ వెన్నని దేని మీద పూస్తున్నారో కూడా గమనించుకోవాలని ఈ పరిశోధనతో తేలుతోంది. పైగా వెన్న పేరుతో బయట లభించే కృత్రిమ వెన్న (margarine) పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కృత్రిమ వెన్నని తయారుచేసేందుకు రకరకాల నూనె పదార్థాలని ఉపయోగిస్తారనీ, ఇవి శరీరంలోనే పేరుకుపోతాయని చెబుతున్నారు. అచ్చు వెన్నలాగే ఉండే ఈ margarineని బేకరీలలో విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. సహజమైన వెన్నని చూసి భయపడేకంటే ఇలాంటి కృత్రిమ పదార్థాలకు, బేకరీ ఆహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.
  ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్‌, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్‌ స్టైల్‌, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్‌ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్‌ కథ ఏంటో మీరే చూడండి...   ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్‌ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్‌ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు.   ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది.   వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్‌ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్‌, గ్యాస్ట్రిక్‌ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్‌. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో!  https://www.youtube.com/watch?v=UFOfu35n7l8 - నిర్జర.  
నొప్పి రానివాడు, వచ్చాక అది త్వరగా తగ్గిపోతే బాగుండు అనుకోనివాడు ఈ ప్రపంచంలో ఉండడు. కానీ బజారులో దొరుకుతున్నాయి కదా అని ఎడాపెడా నొప్పిమందులను వాడేస్తే అవి మన గుండెకే చేటు అని చెబుతున్నారు ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు.  తరచూ తీసుకునేవే నొప్పి నివారణ కోసం రోగులు సాధారణంగా రెండురకాల మందులను వాడతారు. ఒకటి- అనాదిగా వాడుతున్న Non-selective non-steroidal anti-inflammatory drugs (NSAID). ఇబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. రెండు- COX-2 inhibitors. సెలకోక్సిబ్‌, రెఫెకోబ్సిబ్‌ వంటి మందులు ఈ విభాగంలోకి వస్తాయి. వినడానికి ఈ మందుల పేర్లనీ మనకి అయోమయంగా ఉండవచ్చు. కానీ బ్రూఫిన్, వోవరాన్‌ వంటి వందలాది బ్రాండ్ల పేరుతో అవి మనకు సుపరిచితమే! ఇంకా మన నోటి మీదే నిత్యం ఆదే ‘కాంబిఫ్లామ్‌’ వంటి కాంబినేషన్‌ మందులలో కూడా వీటి ఉనికి ఉంటుంది. లక్షలమంది మీద పరిశోధన మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేసే ఈ నొప్పి మందులు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకొనేందుకు, ఐరోపాలోని కోటిమందిని పరిశీలించారు పరిశోధకులు. 2000 నుంచి 2010 సంవత్సారాల వరకూ ఈ నొప్పి నివారణ మాత్రలను వాడుతూ వస్తున్న రోగులను ఇందుకోసం ఎంచుకొన్నారు. కీళ్లనొప్పులు వంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వీరంతా కూడా నొప్పి మాత్రలను వాడుతూ వస్తున్నారు. వాపులతో కూడిన నొప్పులని నివారించేందుకు వైద్యులు ఈ మందలును తప్పకుండా సూచిస్తూ ఉంటారు.  గుండెజబ్బులు నొప్పి నివారణ మాత్రలను వాడుతున్నవారిలో 92,163  మంది గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడాన్ని గమనించారు పరిశోధకులు. వీరిలో 19 శాతం మంది ఓ రెండువారాలు నొప్పి మాత్రలను వాడగానే, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఎంత వృద్ధులైనప్పటికీ మరీ 19 శాతం మంది మాత్రలను వాడిన కొద్దిరోజులకే ఆసుపత్రిలో చేరడం అనేది ఆలోచించాల్సిన విషయమే! పైగా వాడుతున్న మాత్రనిబట్టి 16 శాతం నుంచి 83 శాతం వరకూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటోందని తేలింది. సాధారణంగా పెద్దవారిలో కీళ్లనొప్పులు సాధారణం కాబట్టి, వీటి కోసం వాడే మందులు వారి ఆయుష్షునే దెబ్బతీయడం బాధాకరం. తగిన జాగ్రత్తలు చాలావరకు నొప్పినివారణ మాత్రలు మార్కెట్లో ఎడాపెడా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి, ఇవి సురక్షితమే అన్న అపోహలో ఉంటారు ప్రజలు. కానీ దుష్ఫలితాలు లేని మందులంటూ ఉండవన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. రక్తపోటు, గుండెజబ్బులు వంటి అవకాశాలు ఉన్నవారు ఈ మందులను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా మెలగాలి. ఎప్పుడన్నా మరీ భరించలేని నొప్పి ఉన్నప్పుడు, అది కూడా తగిన మోతాదులోనే... నొప్పి మాత్రలను వేసుకోవాలి. అన్నింటికీ మించి ఇటు వైద్యులూ, అటు ఆరోగ్య సంస్థలూ ఇలాంటి దుష్ఫలితాలు గురించి మరింత అవగాహన కల్పించాలి.   - నిర్జర.

The Doctor Foods!!

Publish Date:Jun 22, 2020

    There are certain foods are having the innate ability to cure some particular illness. By including these to your daily routines you can cure the illness and believe it or not these are the prescribed foods, thus having a full-proof recovery!! Memory loss, for this illness a quarter cup of sunflower seeds daily will be drug. These seeds are loaded with Vitamin-E which protects our neurons from oxidative stress. This memory boosting little ones can make our lives a lot easier! Well, all of us would like to freeze our age at the moment! As that is impossible, we can slow the process by the intake of one full orange a day. Vitamin-C and proteins help in healthy production of collagen and keep our skin youthful and graceful! Puffy Eyes, mostly seen when over-slept! This is due to the retention of fluids around the eye; these can also lead to dark circles! A cup of refreshing Green tea post-meal daily can reduce the puffiness and other unwanted swelling over the body. When you enter a new environment, the first organ to detect is the stomach! Stomach gets upset as it is away from its comfort-zone. Peppermints aid in digestion and also soothe the inflammatory pain through out the gut. One or two post dinner is more than enough! Lacking energy after a long day? Then grab a Banana, this energy rich fruit is packed with potassium and magnesium which are the key for energy production and storage! Instead of popping in the chemically loaded capsule try these! Take Care!! ....SIRI
అవునండి కూర్చుంటే ముప్పే అంటున్నారు పరిశోధకులు. మారుతున్న జీవనశైలి,పనిచేసే పద్ధతి మనని కదలనీయకుండానే అదే పనిగా కూర్చొబెట్టేస్తున్నాయి. దీర్ఘకాలం కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులకు గుండె జబ్బులే కాదు ఊబకాయంతో పాటు వెన్నుకి సంబందించిన సమస్యలు చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఒకొక్కరు ఆఫీసుకి వెళ్ళిన దగ్గరనుంచి వచ్చేదాకా పని వల్ల ఆ ప్లేస్ నుంచి కదలలేకపోతారు. వారికి కావాల్సిన చిన్న చిన్న పనులకి కూడా ప్యూన్ ల మీద అధారపడుతూ ఉంటారు. నిజానికి అదే పనిగా ఎక్కువ సేపు కూర్చోవటం మన మన ఒంటికి సరికాదు అంటున్నారు మన వైధ్యులు. ఎందుకంటే కూర్చున్న సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్ లైపేజ్(L P L )అనే ఎంజైమ్ యొక్క పనితీరు మందగిస్తుందిట. దాని వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను పీల్చుకుని కండరాలలోకి మార్చే ప్రక్రియకు అంతరాయం కలుగుతుందిట. దానితో రక్తం లోని కొవ్వు ప్రతి అవయవం దగ్గరా పెరిగిపోయి చివరకు అది గుండెపోటుకు మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందిట. ఇలా కూర్చోవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ తెచ్చుకోవటం అవసరమా. అందుకే కొన్ని పద్ధతులు పాటించి వాటిని మన దగ్గరకి రాకుండా జాగ్రత్త పడదాం. *  అదేపనిగా కూర్చోకుండా ప్రతి 20 నిమిషాలకి ఒకసారి లేచి నిలబడి అటు ఇటు  తిరిగితే మంచిది. *  ఒత్తిడిగా అనిపిస్తే భుజాలకి విశ్రాంతి ఇచ్చేందుకు మధ్య మధ్యలో వాటిని పైకి కిందకి లేపుతూ ఉండాలి.  ఒక రెండు నిమిషాలు ఇలా చెయ్యటం వల్ల మెడ నొప్పికూడా  రాకుండా ఉంటుంది.   *  మనం  పనిచేసే సమయంలో మన మెదడుతో పాటు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవి మన కళ్ళు. ఒక్క రెండు నిమిషాల వ్యవధి రాగానే కళ్ళకి చిన్నపాటి ఎక్సరసైజ్ చెయ్యటం మంచిది. దూరంగా ఉన్న వస్తువుని చూడటం, మొహం తిప్పకుండా కళ్ళని కుడి వైపు ఎడమ వైపు తిప్పటం ఇలాంటివి చెయ్యాలి. ' *  ఆఫీసు లో ఫోన్ మాట్లాడేటప్పుడు నుంచుని మాట్లాడటం అలవాటు చేసుకున్నా మంచిదే. *  రోజులో కనీసం 40 నిమిషాలపాటు నడిస్తే కీళ్ళకు బాగా పనిచేస్తాయట. *  మనం పనిచేసే ప్లేస్ లో కూర్చునే కుర్చీ,ఎ దురుగా ఉండే టేబుల్ సరైన హైట్ లో ఉన్నాయో లేదో గమనించుకుంటూ ఉండాలి. వాటిలో ఏ మాత్రం తేడ ఉన్న మీకన్నా ముందు మీ నడుముపై  ఆ ప్రభావం   కనిపిస్తుంది.   *  ఆఫీసులో మిగిలిన వారితో పని ఉంటే ఫోన్లు వాడకుండా లేచి వెళ్లి వస్తూ ఉండటం కూడా మంచిది. *  కాళ్ళు ఎక్కువసేపు కిందకి పెట్టి కూర్చోవటం వల్ల రక్తం మొత్తం కిందకి దిగి కాళ్ళు బరువెక్కి తిమ్మెరలు వస్తూ ఉంటాయి. దీనిని నివారించేందుకు కాళ్ళ కింద కాస్త ఎత్తుగా చిన్న స్టూల్ పెట్టుకోవటం మంచిది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరీ ఏదో ఒక పద్దతి మొదలుపెట్టేద్దామా. ...కళ్యాణి  
  మనకి కాఫీయో, టీనో తాగాలనిపిస్తే కాస్తో కూస్తో వేడిలో తాగం. సలసల కాగిపోతూ, పొగులు కక్కేలా ఉన్న పానీయాన్ని తాగితే కానీ తృప్తిగా ఉండదు. ఇంట్లో కాస్త తక్కువ వేడిలో తాగే అలవాటు ఉన్నవారికి కూడా, బయట టీస్టాల్ దగ్గర ఉండే పేపరు కప్పులో ఉన్న వేడివేడి టీని రుచి చూడక తప్పదు. కానీ ఇలా వేడి వేడి పానీయాలను తాగడం ప్రాణాంతకం అంటున్నారు నిపుణులు. అలా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేడి పానీయాలకు సంబంధించిన ఈ పరిశోధన ఎవరో చిన్నా చితకా శాస్త్రవేత్తలు చేసింది కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (WHO) చెందిన కేన్సర్‌ పరిశోధనా సంస్థ (IARC) వెలువరించిన ఫలితం ఇది. IARC ప్రకారం 65 డిగ్రీల సెంటీగ్రేడులకి పైగా వేడి ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు అన్నవాహిక కేన్సర్‌ ఏర్పడే ప్రమాదం 20 శాతం దాకా పెరుగుతుందట. చాలా సందర్భాలలో మనం ఈ పరిమితిని పట్టించుకోం. ముఖ్యంగా వాతావరణం కాస్త చల్లగా ఉంటే చాలు... పొగలు కక్కే కాఫీ తాగేందుకు సిద్ధపడిపోతుంటాం. అయితే IARC చెబుతున్న వాస్తవాలు శాస్త్రలోకానికి కొత్తేమీ కాదు. బ్రిటన్‌కు చెందిన రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ... కాఫీని 65 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత వద్దే తాగాలంటూ ఈపాటికే కాఫీప్రియులకు సూచించింది. ఇక కాఫీకి సంబంధించిన పలు నిపుణులు కూడా పానీయాన్ని 40-60 డిగ్రీల మధ్యే సేవించడం మంచిదంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిమితులు దాటడం వల్ల ఏకంగా కేన్సర్‌ బారిన పడతామన్నదే ఇప్పుడు కొత్తగా తేల్చిన ప్రమాదం. కాఫీ, టీలను మరీ వేడివేడిగా తాగకూడదని తేలిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయడం? అన్న సమస్యకు కూడా నిపుణులు సలహాను అందిస్తున్నారు. కాఫీ, టీలు వేడిగా ఉన్నాయని గుర్తించినప్పుడు కనీసం 5-6 నిమిషాల పాటు వేచి ఉండమని చెబుతున్నారు. వేడి పానీయాలకు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాటలు అటుంచితే కాఫీ ప్రియుల కోసం ఆ సంస్థ ఓ తీపి కబురును కూడా అందించింది. అదేమిటంటే... కాఫీని వేడిగా తాగితే తప్ప కాఫీ వల్ల ఇతరత్రా ఏదో ఒక కేన్సర్‌ వస్తుందన్న భయాలకు తగిన ఆధారం దొరకలేదంటూ తేల్చి చెప్పింది. దాంతో కాఫీ ప్రియులు తెగ మురిసిపోతున్నారు. కాఫీ వల్ల గుండె జబ్బులు, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు తగ్గిపోతాయని తెలిసినా కూడా కాఫీ అనేక కేన్సర్లకు దారి తీస్తుందన్న భయంతో దానికి దూరంగా ఉండేవారమనీ, ఇప్పుడు తమ భయాలు తీరిపోయాయని సంతోషపడుతున్నారు. ఇటు తేనీరు ప్రియులు కూడా టీని కాస్త చల్లార్చుకుని తాగితే ఏ ప్రమాదమూ ఉండదు కదా అని భరోసాగా ఉన్నారు. మితంగా తీసుకోవడం, సరైన ఉష్ణోగ్రత వద్ద తాగడం చేస్తే కాఫీ అయినా, టీ అయినా మేలే చేస్తాయన్నమాట. మరి సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పిన ఈ విషయాన్ని ఖండించేలా మరో పరిశోధన ఏదన్నా వెలికివస్తుందేమో చూడాలి!   - నిర్జర.
  * జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. * పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. * తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం. * అజీర్ణం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటే... పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు జీలకర్ర పొడి, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపు కుని తాగాలి. ఇలా వారం రోజులు చేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. * గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.  
  ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే...   ఇదీ లిమిట్‌ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్‌ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం.   గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్‌ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు.   పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్‌ తీసుకోకూడదన్నమాట.   మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్‌తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక.   చివరగా చిన్న మాట... కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్‌ ఉండదు. టీ, కూల్‌డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్‌ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే! - నిర్జర.
  భారతీయుల వంటకాల్లో ఆవాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి రోజువారీన జీవితంలో ఆవనూనెకీ అంతే ప్రాధాన్యత ఉండేది. పసిపిల్లల ఒంటికి మర్దనా చేయాలన్నా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా ఆవనూనెకే తొలి ఓటు వేస్తారు భారతీయులు. ఉత్తరభారతదేశంలో అయితే ఒకప్పుడు వంటనూనెగా సైతం ఆవనూనెను వాడేవారు. ఆవనూనెని ఆహారంగా తీసుకుంటే, ఇందులోని Erucic acid వల్ల దుఫ్పలితాలు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలుస్తుంటే, ఆవనూనెలోని Alpha-linolenic acid వల్ల గుండెకు మేలే జరుగుతందని మరికొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజుకొకటిగా వెలువడే పరిశోధనల మాట అటుంచితే... జానపదుల వైద్య విధానంలో అనాదిగా ఆవనూనెను వాడుతూనే ఉన్నారు. వాటిలోంచి కొన్ని ఉపయోగాలు ఇవిగో...   ఒత్తయిన జుట్టు కోసం ఆవనూనెతో కనుక తలకి మర్దనా చేస్తే జుత్తు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటారు పెద్దలు. ఆవనూనెతో తలకి మసాజ్‌ చేయడం వల్ల కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపడటమే కాదు... ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఎ, ఇ, కేల్షియంలు జుత్తు ఎదుగుదలకు తోడ్పడతాయి. పైగా ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల అది చుండ్రుని నివారించడంలో తోడ్పడుతుంది.   మిలమిలా మెరిసే పళ్లు కాస్తంత ఉప్పు, వీలైతే నిమ్మరసం కలిపిన ఆవనూనెతో కనుక పళ్లను, చిగుళ్లను రుద్దితే... పంటి సమస్యలెన్నింటి నుంచో ఉపశమనం లభిస్తుందంటారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, వయసుతో పాటుగా పళ్లు బలహీనపడిపోవడం, గారపట్టడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు.   చర్మానికి చర్మానికి సంబంధించినంత వరకు, ఆవనూనె అద్భుతాలు చేస్తుండనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆవనూనెతో చర్మాన్ని మర్దనా చేయడం వల్ల స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయి. చర్మంలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు ఆవనూనెలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని తీసుకువస్తాయి. ఇక శనగపిండి, పెరుగు, నిమ్మరసం వంటివి కలిపిన ఆవనూనెను కనుక చర్మానికి కాసేపు పట్టించి ఉంచితే... ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయన్నది నిపుణుల మాట.   శ్వాసకోశ వ్యాధుల్లో దగ్గు, జలుబు మొదలుకొని ఆస్తమా, సైనసైటిస్‌ వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల్లో ఆవనూనె ఉపశమనం కలిగిస్తుందన్నది ఓ నమ్మకం. విక్స్‌ బదులు కర్పూరం కలిపి ఆవనూనెను ఛాతీకి పట్టించడమే మంచిదంటారు. ఇక రోజుకి మూడు స్పూన్లు, తేనె కలిపిన ఆవనూనెను కనుక తీసుకుంటే... కఫం ఇట్టే కరిగిపోతుందంటున్నారు.   జీర్ణం జీర్ణం కొంతమందికి అసలు ఆకలి వేయనే వేయదు. ఇలాంటివారు కనుక కాస్త ఆవనూనెను పుచ్చుకుంటే, శుభ్రంగా ఆకలి వేస్తుందంటున్నారు పెద్దలు. ఆవనూనెకు మన జీర్ణాశయంలో ఉన్న రసాయనాలను ప్రేరేపించే గుణం ఉండటంతో... ఆకలి వేయడం మొదలుకొని, తిన్న ఆహారం పక్వం కావడం వరకూ అన్ని చర్యలూ సాఫీగా సాగిపోయేలా తోడ్పడుతుంది. అజీర్ణం చేసినవారి పొట్ట మీద కాస్త ఆవనూనెను మర్దనా చేసినా కూడా తగిన ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు! ఆవనూనె ఓ గొప్ప క్రమిసంహారిణి కూడా. అందుకే శరీరంలోనూ, చర్మం మీదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు చోటు చేసుకున్నా కూడా.... వాటిని ఆవనూనె ఇట్టే అరికట్టేస్తుంది. ఆవనూనెతో వెలిగించే దీపం ఆఖరికి దోమలను కూడా తరిమికొడుతుందంటే, దాని ప్రభావం గురించి అంతకంటే రుజువేముంటుంది! - నిర్జర.
కొందరు చేయి పైకెత్తితే చాలు భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతారు. మరికొందరు నాలుగడుగులు వేయగానే నడుము నొప్పంటూ కూర్చుండిపోతారు. ఇక మోకాలి నొప్పి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అది ఇంటింటి బాధగా మారిపోయింది. అందరు మనుషుల్లోనూ ఒకే తీరున ఈ బాధలు ఎందుకు కనిపిస్తున్నాయి? మనిషి పరిణామక్రమానికీ, ఈ నొప్పులకీ మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అన్న అనుమానం వచ్చింది ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులకి. దాంతో ఆ నొప్పుల వెనుక ఉన్న రహస్యం కాస్తా బయటపడిపోయింది.   నాలుగు నుంచి రెండుకి మనిషి కూడా మొదటి మిగతా జంతువులగానే నాలుగుకాళ్ల మీదే నడిచేవాడన్న విషయం తెలిసిందే! క్రమేపీ రెండుకాళ్ల మీద నిలబడటంతో అతని మేధస్సు కూడా పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇలా రెండు కాళ్ల మీద నడిచే క్రమంలో అతని కీళ్ల మధ్య కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులను తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 300 అస్థిపంజరాలను గమనించారు. వీటిలో 40 కోట్ల సంవత్సరాల నాటి మనుషుల ఎముకలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ సంస్థ సేకరించిన ఈ పురాతన ఎముకలకి సంబంధించిన స్కాన్లను పరిశీలించి ఆనాటికీ, ఈనాటికీ మన ఎముకల తీరులో వచ్చిన మార్పులను పోల్చి చూశారు.   బోలెడు మార్పులు మనిషి నిలబడి నడిచేటప్పుడు మరింత బరువుని మోసేందుకు వీలుగా, అతని తుంటి ఎముక దిగువ భాగం కాస్త వెడల్పుగా మారిందట. దీని వలన అది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఆ కారణంగానే మనలో ఆర్థ్రైటిస్ సమస్యలు తలెత్తుతున్నాయట. ఇక భుజం కీలు దగ్గరేమో దీనికి విరుద్ధమైన మార్పు కనిపించింది. నడిచేటప్పుడు భుజాల మీద భారం తగ్గడం వల్లనో ఏమో... అక్కడి కీలు ఎముక మధ్య ఉన్న ఖాళీ తగ్గిందని తేలింది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే రక్తనాళాలు, కండరాలు నొక్కుకుపోతున్నాయని గమనించారు. చేతిని పైకెత్తగానే ఒక్కసారిగా భుజం కండరాలు విలవిల్లాడిపోవడానికి కారణం ఇదే కావచ్చు. మనుషుల మోకాళ్లు త్వరగా అరిగిపోవడానికి కూడా పరిణామక్రమంలో వచ్చిన ఈ మార్పులే కారణమని బయటపడింది.   ఆరంభం మాత్రమే అసలే పరిణామక్రమంతో మన శరీరంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని బాధపడుతుంటే... ఇది మున్ముందు మరింత తీవ్రం కానుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 4000 ఏళ్ల తరువాత మోకాలు, తుంటి, భుజానికి సంబంధించి మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే తగినంత వ్యాయామం చేయడం, నిటారుగా నడవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లోపాలను కొంతవరకు ఎదుర్కోవచ్చునని సూచిస్తున్నారు.   - నిర్జర.

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.

చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.

ట‌ర్కీలో ఆమిర్ ఖాన్‌.. అల్ల‌రి పెట్టిన‌ ఫ్యాన్స్‌!

  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్  చేయ‌డానికి టాప్ స్టార్స్ ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేదు. అదే బాలీవుడ్‌లో ఒక్క‌రొక్క‌రుగా త‌మ సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి రెడీ అంటున్నారు. ఇప్ప‌టికే 45 రోజుల షూటింగ్ కోసం అక్ష‌య్ కుమార్ స‌హా 'బెల్ బాట‌మ్' మూవీ యూనిట్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇప్పుడు 'లాల్ సింగ్ చ‌డ్ఢా' షూటింగ్ నిమిత్తం ట‌ర్కీకి వెళ్లాడు ఆమిర్ ఖాన్‌. సెట్స్ మీద ఆమిర్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అయితే ట‌ర్కీలోని ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఆమిర్‌తో సెల్ఫీలు తీసుకోవ‌డానికి ఎగ‌బ‌డుతుండ‌టంతో సోస‌ల్ డిస్టాన్సింగ్ పాటించ‌డం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఫ్యాన్స్ ఆయ‌న‌ను చుట్టుముట్టి అల్ల‌రి చేస్తున్న అనేక వీడియోలు, ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. ఈ వీడియోల‌లో వైట్ టి-ష‌ర్ట్‌, జీన్స్‌, ఫేస్ మాస్క్‌తో క‌నిపిస్తున్నాడు ఆమిర్‌. ఏదేమైనా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నార‌నే విష‌యం ట‌ర్కీ ఫ్యాన్స్‌తో అర్థ‌మైంది. 'లాల్ సింగ్ చ‌డ్ఢా' షూటింగ్ 2019 అక్టోబ‌ర్‌లో స్టార్ట్ అయ్యి, 2020 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు జ‌రిగింది. అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ వ‌చ్చే క్రిస్మ‌స్‌కు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడాది పాటు విడుద‌ల వాయిదా ప‌డి 2021 క్రిస్మ‌స్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ చిత్రంలో క‌రీనా క‌పూర్ ఖాన్‌, విజ‌య్ సేతుప‌తి, మోనా సింగ్‌, శ‌ర్మాన్ జోషి కీల‌క పాత్ర‌ధారులు.  

'అన్‌ఫినిష్డ్' జీవిత చ‌రిత్ర‌ను ఫినిష్ చేసిన ప్రియాంక‌!

  2018లో 'అన్‌ఫినిష్డ్' పేరిట త‌న జీవిత చరిత్ర‌ను రాస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఎట్ట‌కేల‌కు ఇప్పుడు దానిని పూర్తి చేసింది. ఈ గుడ్ న్యూస్‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా నెటిజ‌న్ల‌కు షేర్ చేసిన ఆమె ఆ పుస్త‌కంలోని ప్ర‌తి ప‌దం త‌న జీవితంలోకి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవ‌డం ద్వారా, మ‌న‌నం ద్వారా వ‌చ్చింద‌ని తెలిపింది. 2019 ఫిబ్ర‌వ‌రిలో 'ద టునైట్ షో'లో ద‌ర్శ‌న‌మిచ్చి టైటిల్ గురించి వివ‌రించింది ప్రియాంక‌. "దీనికి 'అన్‌ఫినిష్డ్' అని పేరు పెట్టాను. ఎందుకంటే నా జీవితంలో నేను చేయాల‌నుకుంటోంది చాలా ఉంది. పైగా దీన్ని నేనింకా రాయ‌లేదు" అని చెప్పింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ పుస్త‌కాన్ని పెంగ్విన్ రాండ‌మ్ హౌస్ ప‌బ్లిష్ చేయ‌నుంది. పుస్త‌కం గురించి మాట్లాడుతూ, "నా మాదిరిగానే నిజాయితీగా, ఫ‌న్నీగా, ఉత్తేజంగా, బోల్డ్‌గా, విప్ల‌వాత్మ‌కంగా ఉంటుంది ఈ పుస్త‌కం. నేనెప్పుడూ ఒక ప్రైవేట్ ప‌ర్స‌న్‌ని. నా జీవిత ప్ర‌యాణంలో నేనెప్పుడూ నా భావాల గురించి మాట్లాడ‌లేదు. ఇప్పుడు ఆ ప‌ని చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పింది ప్రింయాక‌.

అందులో నాని పేషెంట్‌ కాదట!

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా సినిమాల్లో ‘టక్‌ జగదీష్‌’ ఒకటి. అతడితో ‘నిన్ను కోరి’ వంటి సూపర్‌ హిట్‌ తీసి, తరవాత ‘మజిలీ’తో మలి విజయం అందుకుని విజయవంతంగా ద్వితీయవిఘ్నం దాటిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లు. కరోనాకి ముందు కొంత షూటింగ్‌ చేశారు. ‘టక్‌ జగదీష్‌’లో హీరోది బైపోలార్‌ డిజార్డర్‌ పేషెంట్‌ క్యారెక్టర్‌ అని వచ్చిన వార్తలను నాని ఖండించారు. ‘ఎవరు చెప్పారు?’ అని రాసినవాళ్ళను ఎదురు ప్రశ్నించారు. అది నిజం కాదని స్పష్టం చేశారు. దాంతో ఆ వార్త పూర్తిగా అబద్ధమని తేలింది. యాక్చువల్లీ... ‘మహానుభావుడు’లో మతిమరుపు పేషెంట్‌గా నాని నటించారు. ఆ తరవాత పేషెంట్‌ రోల్‌ చేయలేదు. ‘టక్‌ జగదీష్‌’ కాకుండా... ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమాకి నాని సంతకం చేశాడు. అందులో సాయి పల్లవి హీరోయిన్‌. కరోనా ప్రభావం తగ్గిన తరవాత మళ్లీ ఆయన షూటింగ్స్‌ స్టార్ట్‌ చేయనున్నారు.

బ్రేకింగ్‌... అమృత... ఆర్జీవీ... మధ్యలో కరోనా!

దర్శకుడు, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది నల్గొండలోని కోర్టుకు తెలిపారు. కొవిడ్‌–19 వైరస్‌ సోకడంతో అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని న్యాయవాది అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువుహత్య కేసు ఆధారంగా ‘మర్డర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రణయ్‌ భార్య అమృత, అతని తండ్రి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాను అడ్డుకోవాలని కోర్టులో కేసు వేశారు. అది మంగళవారం విచారణకు వచ్చింది. వర్మ హాజరు కాలేదు. కరోనా కారణంగా విచారణకు వర్మ రాలేకపోయారని, అందువల్ల విచారణ వాయిదా వేయాలని కోర్టును న్యాయవాది కోరారు. దాంతో ఈ నెల 14కు విచారణ వాయిదా వేశారు. కోర్టుకు రామ్‌గోపాల్‌ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత, అతని న్యాయవాది అంటున్నారు. రెండు రోజుల క్రితం వర్మకు జ్వరం వచ్చిందనీ, కరోనా కావచ్చునని ఒకరు వార్త రాయగా, తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వర్మ ఒక వీడియో విడుదల చేశారు. ఆ ట్వీట్‌, వీడియో కోర్టు ముందు పెడతామని అమృత అంటున్నారు. కోర్టు విచారణ తప్పించుకోవాడానికి వర్మ కరోనా నాటకం ఆడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ‘మర్డర్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన వర్మ, ఇటీవల రెండు పాటలు విడుదల చేశారు. ఇప్పుడు వర్మకు కరోనా సోకిందా? లేదా? అనేది పజిల్ గా మారింది. స్వయంగా వర్మ తనకు ఏమి లేదని ట్వీట్ చేయడం, తరవాత కోర్టులో ఆయనకు కరోనా అని న్యాయవాది చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. 

10 ఫేమ‌స్‌ కొరియ‌న్ ఫిమేల్ స్టార్స్‌.. ప్రపంచ‌వ్యాప్తంగా ఫ్యాన్స్‌!

  కొరియ‌న్ (సౌత్‌) సినిమా పాపులారిటీ ఆ దేశ హ‌ద్దులు దాటి ప్ర‌పంచ‌మంతా విస్త‌రిస్తోంది. మ‌న‌దేశంలోనూ కొరియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ ల‌క్ష‌ల్లో ఉన్నారు. ఆఖ‌రుకి తెలుగులోనూ కొరియ‌న్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అంతేనా.. ఆ దేశానికి చెందిన తార‌లు అనేక‌మంది ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఫ‌లితంగా వారి ఆరాధ‌కులూ అన్ని దేశాల్లో క‌నిపిస్తున్నారు. వారిలో బాగా ఫేమ‌స్ అయిన ప‌ది మంది కొరియ‌న్ ఫిమేల్ యాక్ట‌ర్లు ఎవ‌రో తెలుసుకుందాం... 1. బే సుజీ హాంకాంగ్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైన‌పు విగ్ర‌హాన్ని క‌లిగిన తొలి కొరియ‌న్ న‌టిగా రికార్డుల‌కెక్కిన బే సుజీ ఎనిమిదేళ్ల క్రిత‌మే ఆర్కిటెక్చ‌ర్ 10 అనే మూవీతో ప‌రిచ‌య‌మై, అనేక అవార్డుల‌ను కొల్ల‌గొట్టింది. దాన్ని బ‌ట్టి ఎంత స్వ‌ల్ప కాలంలో ఆమె టాప్ యాక్ట్రెస్‌గా, కొరియ‌న్ల ఆరాధ్య తార‌గా అవ‌త‌రించిందో ఊహించ‌వ‌చ్చు. 2. కిమ్ గో-ఎన్‌ తొలి సినిమా ఎ మ్యూజ్‌తోటే కొరియ‌న్ ఆడియెన్స్ ఆరాధ్య తార‌గా అవ‌త‌రించిన కిమ్ గో-ఎన్ పాపులారిటీని వ‌ర్ణించ శ‌క్యం కాదు. ఇటు సినిమాలు, అటు టీవీ సిరీస్‌తో విల‌క్ష‌ణ న‌టిగా రాణిస్తూ వ‌స్తోన్న ఆమెను చాన‌ల్ అనే ఫ్రెంచ్ ఫ్యాష‌న్ హౌస్ సౌత్ కొరియాకు త‌న బ్రాండ్ అంబాస‌డ‌ర్‌గా నియ‌మించింది. 3. పార్క్ షిన్‌-హ్యే ప‌ద‌మూడేళ్ల వ‌య‌సులోనే న‌టిగా ప‌రిచ‌య‌మైన పార్క్ షిన్‌-హ్యే యు.ఎస్‌.లోని కొరియ‌న్ వేవ్ నిర్వ‌హించిన పోల్‌లో అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన కొరియ‌న్ తార‌గా నిలిచింది. త‌న దేశంలోనూ టాప్ యాక్ట్రెస్ హోదాని అనుభ‌విస్తున్న ఆమెకు అక్క‌డి ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసాప‌త్రం కూడా ల‌భించింది. 4. ఐయు సౌత్ కొరియాలో అత్య‌ధికంగా ఆర్జిస్తున్న సెల‌బ్రిటీల్లో ఒక‌తిగా అశేష అభిమానుల‌ను సంపాదించుకున్న ఐయు కేవ‌లం న్యూ జ‌న‌రేష‌న్ యాక్ట్రెస్ మాత్ర‌మే కాదు.. సింగర్‌, లిరిక్ రైట‌ర్ కూడా. న‌టి కాక‌ముందు సింగ‌ర్‌గా ఫేమ‌స్ అయిన ఆమె ఫోర్బ్స్ ఏషియాస్ 2019 హీరోస్ ఆఫ్ ఫిలాంత్ర‌ఫీ లిస్ట్‌లో యంగెస్ట్ సెల‌బ్రిటీగా నిలిచింది. 5. జున్ జి-హ్యున్‌ 2001లో వ‌చ్చి ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కొరియ‌న్ మూవీస్‌కు పాపులారిటీ తీసుకొచ్చిన‌ రొమాంటిక్ కామెడీ మై సాసీ గాళ్ మూవీలో హీరోయిన్‌గా న‌టించి యూత్ డ్రీమ్ గాళ్‌గా మారిన‌ జున్ జి-హ్యున్‌.. హాలీవుడ్ మూవీ బ్ల‌డ్‌: ద లాస్ట్ వాంపైర్‌లో హీరోయిన్‌గా న‌టించేంత‌గా పాపులారిటీని సంపాదించింది. 6. లీ యంగ్‌-ఏ మోడ‌ల్ నుంచి న‌టిగా మారిన లీ యంగ్‌-ఏ విభిన్న ర‌కాల సినిమాలు, టీవీ సీరియ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డ‌మే కాకుండా, అనేక అవార్డుల‌ను సొంతం చేసుకుంది. అంత‌ర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ఆమెను సౌత్ కొరియ‌న్ ప్ర‌భుత్వం మెడ‌ల్ ఆఫ్ క‌ల్చ‌ర్ మెరిట్‌తో స‌త్క‌రించింది. 7. బే డూనా అసాధార‌ణ ప్ర‌తిభ ఉన్న న‌టిగా అంత‌ర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన కొరియ‌న్ తార బే డూనా. టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించ‌డం ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ త‌ర్వాత హాలీవుడ్ నుంచి పిలుపు అందుకునే స్థాయికి వెళ్లింది. 8. ఇమ్ యూన్‌-అ ఇటు యాక్ట‌ర్‌గా, అటు సింగ‌ర్‌గా పాపుల‌ర్ అయిన ఇమ్ యూన్‌-అ టీనేజ్‌లో ఉండ‌గానే 2007లో యూనా మూవీలో న‌టించి, ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా పాపుల‌ర్ అయిపోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాల్లో ఆమె హీరోయిన్‌. 9. చోయ్ జి-వూ కొరియ‌న్ తార‌ల్లో గొప్ప అంద‌గ‌త్తెగా కీర్తి పొందిన చోయ్ జి-వూ వింట‌ర్ సొనాటా మూవీతో పాన్‌-ఏషియ‌న్ తార‌గా అవ‌త‌రించింది. 2008లో స్టార్ చాన‌ల్‌లో ప్ర‌సార‌మైన ల‌వ‌ర్ సిరీస్‌లో స్టార్ అట్రాక్ష‌న్‌గా మారి ఆ టైమ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకున్న కొరియ‌న్ తార‌గా నిలిచింది. 10. జియోన్ డు-యెవాన్‌ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక కొరియ‌న్ తార‌గా జియోన్ డు-యెవాన్ పేరు పొందింది. అయితే ఆమె కొరియాలో టాప్ ఫిమేల్ యాక్ట‌ర్ కాదు. కానీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్న కొరియ‌న్ తార‌ల్లో ఆమెది టాప్ ప్లేస్‌.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

అంతరంగంలోనే సంతోషాల నిధి...

  సంతోషంగా వుండాలి. ఇదే అందరి కోరిక. అలా సంతోషంగా వుండాలంటే ఏమి కావాలి? ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఏవేవో సూత్రాలు, ప్రణాళికలు చెబుతారు, వింటారు. సంతోషంగా వుండటం ఎలా అని నాలాగా ఎవరైనా వాళ్ళకి తోచింది రాస్తే అర్జెంటుగా చదివేస్తారు ఏమన్నా సీక్రెట్ తెలుస్తుందేమో అని. సంతోషపు నిధి తాళం దొరుకుతుందేమో అని. కానీ, దానికి యూనివర్సల్ సూత్రాలు అంటూ ఏవి వుండవు. వ్యక్తికీ వ్యక్తికి అవి మారిపోతుంటాయి. వాళ్ళవాళ్ళ మనస్తత్వాల బట్టి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, లోపలి నుంచి నమ్మనిది ఏదీ ఆచరణలో కలకాలం నిలవదు. అందుకే ఒక్కసారి లోపలి నుంచి తర్కించి చూసుకోండి, అంతర్ముఖులుగా మారండి, మీతో మీరు వాదించుకోండి. ఏది నిజంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నది తెలుసుకోండి. గుర్తించండి.  అర్జెంటుగా ఈ విషయం కోసం ఇంత ఆలోచించాలా? అనిపిస్తే ఒక్క ప్రశ్న వేసుకోండి! ఇప్పుడు నేను సంతోషంగా వున్నానా? దానికి సమాధానం టక్కున అవును అని వస్తే సరే. లేదంటే తరచి చూసుకునే పని మొదలు పెట్టండి. "సంతోషం గా ఉండటానికి చాలా చాలా కావాలి, అవన్నీ వుంటే అప్పుడు పూర్తి సంతోషం నా స్వంతం" అంటూ చాలా లిస్టు చెబుతారుచాలా మంది. కానీ ఓటి కుండ ఎప్పుడూ నిండదు  అంటారే అలానే సంతోషంగా ఉండటమన్నది మన ఛాయస్ తప్ప అది ఛాన్స్ కానేకాదని తెలియని వారికి ఇప్పుడే కాదు వాళ్ళు కోరినవన్నీ దొరికినా సంతోషం మాత్రం దరిచేరదు. జీవితాన్ని జీవించటం అంటారు చూసారా? అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ , ఆనందిస్తూ, ఆ ఆనందాన్ని వేరొకరికి కూడా పంచుతూ అలా జీవించే వాళ్ళకి సంతోషం ' ఐ లవ్ యు ' అంటూ తోడుగా నిలిచిపోతుంది. అంతర్ముఖులు కావటం అవసరం అని ఇందాక చెప్పుకున్నాం కదా ! ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక్కరే కూర్చుని, ప్రకృతితో మమేకం అవుతూ, ఏ ఆలోచనలూ లేకుండా ఒక్క రెండు నిముషాలు గడిపి చూడండి. మన లోపలకి మనం చేసే జర్నీనే అతి కష్టమయినది. అది చేయగలిగితే చాలు జీవిత ప్రయాణం ఏంతో  సులువు. ఆ జర్నీలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి., జవాబులు ఎలా అనుకోవద్దు, ఎందుకంటే మన లోపలి శక్తికి అన్ని ప్రశ్నలకి సమధానం తెలుసు. కళ్ళు మూసుకోగానే నిజనిజాలని మన ముందు ఉంచుతుంది. మనం చేయాల్సిందల్లా ఆ లోపలి శక్తిని పలకరించటమే. ఒక్కసారి ఆ లోపలిదాకా  ప్రయాణం చేసి వస్తే చాలు. ఏవీ సమస్యలుగా కనిపించవు, ఎవరూ శత్రువులుగా తోచరు. ఈ రెండు లేకపోతే చాలు సంతోషం పరిగెట్టుకు వచ్చేస్తుంది. చకచకా పరుగులు పెడుతూ, బడ బడా మాట్లాడేస్తూ , ప్రపంచంతో ఎంతో మమేకం  అయిపోతూ మనకి మనం దూరం అయిపోతున్నాం.  మన లోపలి మనిషిని ఒంటరిని చేసేస్తున్నాం. సంతోషం చిరునామా తెలియలేదంటూ వాపోతున్నాం. మనలోనే వున్న దాని కోసం బయటి ప్రపంచమంతా వెతుకుతున్నాం. -రమ

ఈ చిన్న చిట్కాతో ఆరోగ్యం బాగుపడుతుంది!

  రోజుల్లో మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చెప్పనవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచీ, రాత్రి పడుకునే దాకా అంతా కూర్చునే బతుకుని వెళ్లదీస్తున్నాం (sedentary lifestyle). టీవీ ముందరా, కంప్యూటర్‌ ముందరా, డైనింగ్‌ టేబుల్‌ ముందరా కూర్చుని కూర్చుని ఒంట్లో కొవ్వుని పెంచేసుకుంటున్నాం. రేపటి నుంచి వాకింగ్ చేద్దాం, వచ్చేవారం షటిల్‌ ఆడతాం అనుకోవడమే కానీ... రోజువారీ హడావుడిలో పడి అలాంటి నిర్ణయాలు ఏవీ పాటించలేకపోతున్నాం. అయితే గుడ్డిలో మెల్లగా దీనికో పరిష్కారం ఉందంటున్నారు.   ఫిన్లాండుకి చెందిన కొందరు పరిశోధకులు... కూర్చునీ కూర్చునీ ఉండే జీవిత విధానంలో ఏదన్నా మార్పు తీసుకురావడం సాధ్యమా అని ఆలోచించారు. ఇందుకోసం ఓ 133 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరి జీవిత విధానాన్ని గమనించిన పరిశోధకులకు... వాళ్లంతా రోజుకి ఇదున్నర గంటలు ఆఫీసులోనూ, నాలుగు గంటలు ఇంట్లోనూ కూర్చునే గడిపేస్తున్నారని అర్థమైంది. ఇలా కూర్చుని ఉండే సమయంతో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందేమో చూడమని సదరు అభ్యర్థులందరికీ సూచించారు.   పరిశోధకుల సూచన మేరకు అభ్యర్థులంతా తమ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసే ప్రయత్నం చేశారు. పని మధ్యలో కాస్త లేచి అటూఇటూ పచార్లు చేయడం, ఇంట్లో చిన్నాచితకా పనులలో పాల్గొనడం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం లాంటి ప్రయత్నాలు చేశారు. ఇలా నెలా రెండు నెలలు కాదు.. దాదాపు ఏడాది పాటు ఈ ప్రయత్నం సాగింది.   ఏడాది తర్వాత సదరు అభ్యర్థులు జీవితాలని మరోసారి గమనించారు పరిశోధకులు. ఆ సందర్భంగా వారు కూర్చుని ఉండే సమయం, ఓ 21 నిమిషాల పాటు తగ్గినట్లు గ్రహించారు. ఓస్‌ ఇంతే కదా! 20 నిమిషాల తగ్గుదలతో ఏమంత మార్పు వస్తుంది అనుకునేరు. ఈ కాస్త మార్పుతోనే షుగర్‌ లెవెల్స్ అదుపులోకి రావడం గమనించారు. కాలి కండరాలు కూడా మరింత బలంగా మారాయట. గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్లు బయటపడింది.   అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఓ పడీపడీ వ్యాయామాలే చేయనవసరం లేదు. ఎప్పుడో అప్పుడు వ్యాయామం చేయవచ్చు కదా అని నిర్లక్ష్యం చేసేలోగా పరిస్థితి అదుపు తప్పిపోతుంది కదా! అందుకని ఉన్నంతలోనే కాస్త కాలుని కదిపే ప్రయత్నం చేయమని ఈ పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు! ఇంట్లో పెద్దలు కనుక ఇలా చురుకుగా ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా కాస్త చురుకుగా మెదిలే ప్రయత్నం చేస్తారట. - నిర్జర.  

ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది?

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా... స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే... ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి? మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ.... ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు. ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు. ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే... అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో... కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది. ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు. - నిర్జర.

పాపం ఏపీ సర్కార్.. సుప్రీం లో మరో సారి తప్పులతో పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసందే. హైకోర్టు ఉత్తర్వు పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ లో పలు తప్పులు దొర్లడంతో అవి వెనక్కి వచ్చాయి. ఈ పిటిషన్ లో స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం పేర్లు తప్పుగా పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి కూడా సరిగా పేర్కొనలేదు. దీంతో తప్పులు సరి చేసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఇప్పటికే ఈ పిటిషన్ పై త్వరగా విచారించాలని మరో అప్లికేషన్ పెట్టగా అసలు పిటిషన్ లో తప్పులు బయట పడడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది   ఈ నెల 16న శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్న ఏపీ సర్కార్ ఇపుడు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా మరో పక్క సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. దీంతో రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. మరో పక్క ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు నిమ్మగడ్డ కేసు విషయంలో కూడా తప్పులతో కూడిన పిటిషన్లు వేయడంతో ఒక సారి వెనక్కి వచ్చాయి.

సోము వీర్రాజు స్పీడ్ కి బ్రేకులు.. హైకమాండ్ మనసులో ఏముంది?

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సోము వీర్రాజుకుకు అమరావతి అంశంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి షాకిచ్చారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండటమే మంచిదన్నారు. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో  మాట్లాడిన సోము వీర్రాజు.. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్లుగా తన వాయిస్ చెప్పారు. అయితే, ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడిన రాం మాధవ్ మాత్రం.. మూడు రాజధానులను పూర్తిగా  వ్యతిరేకించారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు లక్నో ఒక్కటే క్యాపిటల్ గా ఉందన్నారు. ఒక్క రాజధాని ఉన్న యూపీలో సరైన పాలన జరగడం లేదా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సమక్షంలోనే అమరావతిపై రాంమాధవ్ క్లారిటీ ఇవ్వడంతో ఆయన షాకయ్యారు.   ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనను రాష్ట్ర బీజేపీ గతంలో వ్యతిరేకించింది. అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అమరావతికి మద్దతుగా నిలిచారు. కన్నాతో పాటు మరి కొందరు నేతలు అమరావతి కోసం గళం వినిపించారు. అయితే సోము వీర్రాజు మాత్రం  పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు‌ మంచి జరుగుతుందన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీ కోరగా.. కేంద్రానికి సంబంధం లేదంటూ బాబుకు కౌంటర్లు ఇచ్చారు వీర్రాజు.        ఇక సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం, అమరావతికి మద్దతుగా నిలిచిన కన్నాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం, చంద్రబాబుకు వ్యతిరేకమనే అభిప్రాయం ఉన్న సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో.. అమరావతి విషయంలో జగన్ సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుకూలమనే భావన కలిగింది. రాజధాని అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్రం అఫడవిట్ ఇవ్వడంతో అది మరింత బలపడింది. దానికితోడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలను కూడా రాష్ట్ర బీజేపీ సస్పెండ్ చేసింది.   అమరావతికి మద్దతుగా మాట్లాడారని సీనియర్ నేత వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేయడంతో పార్టీలో సోము వీర్రాజుకు తిరుగులేదు అనుకున్నారు అంతా. కానీ గంటల్లోనే సీన్ మారిపోయింది. సోము వీర్రాజుకు హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. వెలగపూడి గోపాలకృష్ణకి హిందూ మహాసభ ఏపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వెలగపూడికి కీలక పోస్ట్ దక్కడం, అది కూడా బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే జరగడంతో సోము వీర్రాజు వర్గం షాకైంది. సస్పెండైన వెలగపూడికి హిందూ ఆర్గనైజేషన్ లో కీలక పదవి ఇవ్వడం సోము వీర్రాజుకు ఇబ్బందికరమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    ఇక, సోము వీర్రాజు ప్రమాణ స్వీకార వేదిక పైనే అమరావతిపై రాంమాధవ్ చేసిన కామెంట్స్ ఏపీ బీజేపీలో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో అమరావతిపై బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదని కేంద్రం చెబుతున్నా.. పార్టీ పరంగా మాత్రం బీజేపీ అమరావతికే కట్టుబడిందనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా అమరావతికి‌ భూములిచ్చిన‌ చివరి  రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాంమాధవ్ చెప్పడంతో.. రాజధాని విషయంలో బీజేపీ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి సోము వీర్రాజు ఒకలా ఆలోచిస్తే, పార్టీ పెద్దలు మరోలా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే, ముందు ముందు సోము వీర్రాజు పయనం అంత ఈజీగా ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

రికవరీ రేటు 71శాతం.. మరణాల రేటు 0.7శాతం

కరోనా అనుభవాలతో సమగ్ర వైద్య ప్రణాళిక రావాలి   గతంలోనూ ఎన్నో రకాల వైరస్ లు ప్రజలను అనారోగ్యం పాలు చేశాయి. భవిష్యత్ లోనూ ఇలాంటి వైరస్ లు దాడి చేసే ప్రమాదం ఉంది. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఎన్నో అనుభవాలను నేర్పిస్తోంది. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సమగ్ర వైద్య ప్రణాళికను రూపొందించాలని కెసీఆర్ సూచించారు.   వైద్యరంగంలో సరైన మార్పులు తీసుకురావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ల నియామకాలు ఉండాలని కెసీఆర్ అన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. రికవరీ రేటు 71శాతం ఉంది. మరణాల రేటు 0.7శాతం ఉంది. కరోనా సోకిన వారికి  మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. శక్తివంచన లేకుండా వైద్యసిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నారని ఆయన వివరించారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.