EDITORIAL SPECIAL
పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం.  గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
ALSO ON TELUGUONE N E W S
నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, కృష్ణభగవాన్ తదితరులు పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి మాటలు: కృష్ణభగవాన్  సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి సంగీతం: రఘు కుంచె నిర్మాత: శ్రీనివాస్ కానూరు స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి విడుదల తేదీ: 22 నవంబర్ 2019 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా' వంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, 'రాగల 24 గంటల్లో' అంటూ తొలిసారి ఓ థ్రిల్లర్ తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ మహిళా ప్రాధాన్య చిత్రం చేయడమూ ఇదే తొలిసారి. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.  కథ: మోడల్ మేఘన (ముస్కాన్ సేథీ)ని రేప్ చేసి, హత్య చేసిన కేసులో నిందితులు ముగ్గురు జైలు నుండి పారిపోతారు. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ఇండియాలో మోస్ట్ ఫేమస్ యాడ్ ఫోటోగ్రాఫర్ రాహుల్ (సత్యదేవ్) ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశిస్తారు. అక్కడ రాహుల్ చనిపోయి ఉంటాడు. 'నా భర్తను నేనే హత్య చేశా' అని రాహుల్ భార్య విద్య (ఈషా రెబ్బా) చెబుతుంది. ఆమె ఒక అనాథ. ఏరి కోరి మరీ ఆమెను రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. అటువంటి భర్తను విద్య ఎందుకు హత్య చేసింది? అంతకు ముందు విద్య స్నేహితుడు గణేష్ (గణేష్ వెంకట్రామన్)తో రాహుల్ ఎందుకు గొడవపడ్డాడు? అసలు, ఏం జరిగింది? ఈ కేసును ఎసిపి నరసింహ (శ్రీరామ్) ఎలా పరిష్కరించారు? అనేది మిగతా సినిమా.  ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, ట్విస్టులు సత్యదేవ్ నటన, అతడి క్యారెక్టరైజేషన్  ఈషా రెబ్బా రఘు కుంచె సంగీతం మైనస్ పాయింట్స్: శ్రీరామ్ నటన కథలో కొత్తదనం లేదు కథలో వేగం తగ్గింది.  థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు విశ్లేషణ & నటీనటుల అభినయం:  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లేను బాగా రాశారు. కానీ, కథలో కొత్తదనం లోపించడంతో మెయిన్ ట్విస్ట్స్ కొన్ని రివీల్ అయిన తర్వాత ప్రేక్షకులకు ఏమంత థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండవు. కానీ, మర్డర్ ఎవరు చేశారనేది చివరి వరకు ప్రేక్షకులు ఊహించలేకుండా మలుపులతో కథను నడిపించిన తీరును మెచ్చుకోవాలి. ఇదే స్క్రీన్ ప్లేకు కొత్తదనంతో కూడిన కథ అయితే ప్రేక్షకులకు కిక్ ఇచ్చేది. ముఖ్యంగా నటీనటుల్లో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ బావుంది. అతడూ అద్భుతంగా నటించడంతో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అతడిపై కోపం వచ్చేలా, విద్య పాత్రలో నటించిన ఈషా రెబ్బాపై సింపతీ వచ్చేలా ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు భలే పండాయి. ఈషా రెబ్బా స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు హెల్ప్ అవుతుంది. ఆమె నటన కూడా పర్వాలేదు. కానీ, ఈషాకు వేసిన మేకప్ అసలు సెట్ కాలేదు. సినిమాకు అది మైనస్.  ద్వితీయార్థం వచ్చేసరికి ట్విస్టులు ఆసక్తి కలిగించినా కథలో వేగం లోపించింది. థ్రిల్లర్ సినిమాల్లో సీన్స్ అన్నీ చకచకా పరుగులు తీయాలి. కానీ, నిదానంగా నత్తనడకను కొన్ని సన్నివేశాలు సాగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది. మోడల్ మేఘన హత్యకు గల కారణాలు కానీ, ఫోటోగ్రాఫర్ రాహుల్ హత్యకు గల కారణాలు గానీ ఏమంత షాకింగ్ గా అనిపించవు. రెగ్యులర్ రొటీన్ గా ఉన్నాయి. ఈ కథకు కృష్ణభగవాన్ రాసిన మాటలు సాదాసీదాగా ఉన్నాయి. గుర్తుపెట్టుకునే డైలాగ్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. రఘు కుంచె స్వరాల్లో 'నారాయణతే నమో నమో' బావుంది. ఈ పాటకు శ్రీమణి చక్కటి సాహిత్యం అందించారు. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. అంజి సినిమాటోగ్రఫీ ఓకే. సత్యదేవ్, ఈషా రెబ్బా తర్వాత కథలో ప్రాముఖ్యం గల పాత్రను రవి వర్మ చేశాడు. అతడి నటన పాత్రకు తగ్గట్టు ఉంది. గణేష్ వెంకట్రామన్ పాత్ర మూడు సన్నివేశాలకు పరిమితమైంది. మోడల్ గా ముస్కాన్ సేథీ రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ఎసిపి పాత్రలో శ్రీరామ్ ఓవర్ యాక్షన్ చేశాడు. అతడి నటనకు తోడు డబ్బింగ్ కూడా బాలేదు. 'టెంపర్' వంశీ, అతడితో పాటు నేరస్థులుగా నటించిన మరో ఇద్దరు పాత్రల పరిధి మేరకు చేశారు;.    తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: 'రాగల 24 గంటల్లో' సత్యదేవ్, ఈషా రెబ్బా... ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. ట్విస్టులతో కూడిన చక్కటి స్క్రీన్ ప్లే కూడా కుదిరింది. కానీ, కథలో కొత్తదనం లేదు. కథనంలో వేగం అసలు లేదు. అందువల్ల, తీవ్ర ఉత్కంఠభరితంగా సాగాల్సిన సినిమా సాదాసీదాగా వెళ్ళింది. ఏదో ఓ రెండున్నర గంటలు కాలక్షేపానికి సీరియస్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఓ మోస్తరుగా సంతృప్తి చెందవచ్చు. అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. రేటింగ్: 2.25/5
Cast: Sandeep Madhav, Muskaan Khubchandani, Devika, Manoj, Vinay Varma & others Music Director: Suresh Bobbili Cinematography: Sudhakar Editor: Pratap Kumar Co-Producer: Sanjay Reddy Producer: Appi Reddy Story, Screenplay & Direction: Jeevan Reddy Release Date:22nd Nov 2019   George Reddy has a place in history which gave birth to many Telugu Student Movements. It is known that George Reddy was extremely courageous, brave & adventures who inspired the students across the Telugu States. The story of this forgotten hero is brought to us by the Jeevan Reddy along with the national award winner Cinematographer Sudhakar.  Story:  George Reddy (Sandeep Madhav) who spent his childhood in Kerala comes to Osmania University to complete his MSC. From the childhood he has the mentality to resist injustice & gets furious seeing the sufferings of the poor students. He particularly dislikes the sufferings of poor students & lower caste students under the hands of upper class students in the university. He simply opposes the upper class student’s atrocities over the poor students. His his courage & bravery, a group of students join him. What happens later? Does George Reddy become the student party leader? Why was he assassinated? The answers to all these questions form the movie George Reddy.  Analysis:  The story of George Reddy in the movie has been compromised to a greater extent by the Producer & Director just to avoid protests & issues from certain groups. Thus we should also treat this movie as a normal one & not as the true biopic of the student leader George Reddy. It is the movie which recalls some of the incidents in George Reddy’s life. We might have read that, George Reddy had set up a union called “Progressive Democratic Students Union (PDSU)” but the movie will portray it as “PS”. It does not say clearly mention what PS means. We need to understand it as Progressive Students.   Plus Points:  Cinematography Dialogues Sandeep Madhav as George Reddy Art Direction  Minus Points:  Emotion – key of the story is missing Editing Some characters lack meaning Spirit of the story is missing   Performances:  Undoubtedly this is Sandeep Madhav’s movie. He has performed excellently as George Reddy. As far as his role is concerned, he has done 90% justice to it. The only complaint was, he was unable to deliver dialogues in a very articulate form. He excelled in all the other scenes. Finally, in the climax he gets audience’s sympathy. The other union leader characters did not have depth in their roles & thus were not given the opportunity to act. Muskaan did not impress as Maya. It is difficult to bear the Telugu she speaks. A noteworthy appreciation needs to be given for Srinivas Polke, the child artist who performed youngGeorge Reddy. He entertained the audience very well. Marathi star Devika as George Reddy’s mother has a very minimal role & has done justice to it.  TeluguOne Perspective:     “Jeena Hai Tho Marna Seekho, Kadam Kadam Par Ladna Seekho” is the only slogan on which George Reddy stood by. Though George Reddy is a very great movie as hyped but is surely a thought provoking one. Rating:2.5/5
  తారాగణం: సందీప్ మాధవ్ (శాండీ), ముస్కాన్, సత్యదేవ్, దేవిక డఫ్తర్‌దర్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహతి, శ్రీనివాస్ పోకలే సంగీతం: సురేశ్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి ఎడిటింగ్: ప్రతాప్‌కుమార్ ఆర్ట్: గాంధీ నడికుడికార్ సహ నిర్మాత: సంజయ్‌రెడ్డి నిర్మాత: అప్పిరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవన్‌రెడ్డి బ్యానర్స్: మైక్ మూవీస్, సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా విడుదల తేదీ: 22 నవంబర్ 2019 తెలుగునాట విద్యార్థి ఉద్యమానికి ఊపిరినిచ్చిన ధీరుడిగా జార్జిరెడ్డికి చరిత్రలో స్థానం ఉంది. జార్జిరెడ్డి వ్యక్తిత్వం, అన్యాయాన్ని నిలదీసే ధైర్య సాహసాలు, చావుకు వెరవని స్థైర్యం నాటి విద్యార్థులకు, యువతకు స్ఫూర్తినిచ్చిందని చదువుకున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని 'స్టోరీ ఆఫ్ ఎ ఫర్‌గాటెన్ హీరో' అంటూ తీసుకు వస్తున్నారనేసరికి 'జార్జిరెడ్డి' పేరును, అతని సాహసాలను వినివున్న వాళ్లతో పాటు, ఎవరీ జార్జిరెడ్డి అంటూ ఆసక్తి కనపర్చిన వాళ్లంతా ఆత్రుతతో ఎదురుచూసిన 'జార్జిరెడ్డి' మూవీ మనముందుకు వచ్చింది. ఇదివరకు 'దళం' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందిన జీవన్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు డైరెక్షన్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ సుధాకర్‌రెడ్డి యెక్కంటి సినిమాటోగ్రఫీ అందించాడు. కథ:-  బాల్యాన్ని తల్లితో పాటు కేరళలో గడిపిన జార్జిరెడ్డి (సందీప్ మాధవ్), ఎమ్మెస్సీ చదవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం కలిగిన అతను యూనివర్సిటీలో అగ్ర కులాల విద్యార్థుల చేతుల్లో పేద విద్యార్థులు, నిమ్న కులాల విద్యార్థులు పడుతున్న బాధలు చూసి ఆగ్రహంతో రగిలిపోతాడు. అగ్ర కులాల విద్యార్థులను ఎదిరించి, వాళ్లను చితగ్గొడతాడు. అతడి ధైర్యం, గుండె నిబ్బరం చూసి, అక్కడ అణచివేతకు గురవుతున్న ఒక వర్గం విద్యార్థులంతా అతడి పక్షం చేరతారు. అంతదాకా అక్కడ ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న రెండు పార్టీల విద్యార్థి నాయకులకు జార్జిరెడ్డి కొరకురానికొయ్యగా మారతాడు. యూనివర్సిటీలో తన తమ్ముడు లల్లన్ సింగ్ పెత్తనాన్ని సవాలుచేసి, అతడిని కొట్టిన జార్జిరెడ్డిపై లోకల్ దాదా కిషన్ సింగ్ (శత్రు) తన మనుషులతో హత్యాయత్నం చేయిస్తాడు. 22 కత్తి పోట్లకు గురై కూడా జార్జిరెడ్డి ఒక్కడే డజను మంది దాకా ఉన్న గూండాలను ఎదిరించి తరిమికొడతాడు. విద్యార్థి ఎన్నికల్లో జార్జిరెడ్డి 'పిఎస్' అనే కొత్త పార్టీపెట్టి గెలుస్తాడు. జార్జి చేసిన అవమానంతో యూనివర్సిటీలో తలెత్తుకోలేకపోతున్నానని భావించిన లల్లన్ సింగ్ (తిరువీర్) ఏం చేశాడు? జార్జిని చంపాలనుకున్న అతడి పథకం ఫలించిందా? అనేది క్లైమాక్స్. అనాలిసిస్:- జార్జిరెడ్డి బయోపిక్‌గా ఊహించుకొని వెళ్లినవాళ్లను ఆదిలోనే 'ఇది జార్జిరెడ్డి జీవితంలో జరిగిన ఘటనలను ఆధారం చేసుకొని తీసిన కల్పిత కథ. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు' అని చూపి నిరుత్సాహపరిచారు. ఇది జార్జిరెడ్డి బయోపిక్ కాదని మేకర్సే ఒప్పుకున్నాక, దీన్ని జార్జిరెడ్డి జీవితంగా ఎలా భావిస్తాం! ఎలా జార్జిరెడ్డి పాత్రతో ఎమోషనల్‌గా కనెక్టవుతాం! విడుదల విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండటానికీ, కొన్ని వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతలు, నిరసనల నుంచి తప్పించుకోడానికీ దర్శకుడు, నిర్మాతలు రాజీపడి 'జార్జిరెడ్డి'ని ఒక మామూలు సినిమాగానే మన ముందుకు తీసుకొచ్చారు!! అందుకని మనం కూడా దీన్ని ఒక సాధారణ సినిమాగానే చూడాలి, పరిగణించాలి. కాకపోతే జార్జిరెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఈ సినిమా గుర్తుచేస్తుందంతే. అప్పట్లో జార్జిరెడ్డి 'ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్' (పీడీఎస్‌యూ) అనే యూనియన్‌ను నెలకొల్పాడని మనం చదువుకున్నాం. ఆ పీడీఎస్‌యూను ఈ మూవీలో 'పీఎస్'గా మార్చారు. 'పీఎస్' అంటే ఏమిటో మాత్రం చెప్పలేదు. 'ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్' అని మనమే అర్థం చెప్పుకోవాలి. జార్జిరెడ్డిది ఎంతటి గుండెధైర్యమో చెప్పడానికి చిన్నతనం నుంచే అతడిలో ఆ లక్షణాలు కనిపించాయన్నట్లు చూపించారు. తనకంటే పెద్దవాళ్లను కొట్టడానికి కూడా అతడు వెనకాడేవాడు కాదనీ, ఆ విషయంలో అతడికి తల్లి కూడా అడ్డు చెప్పకుండా, భగత్ సింగ్, చేగువేరా కథల్ని చెబుతూ, అతడిలో విప్లవ భావాలు పెంపొందేలా చేసిందనీ చూపించారు. సినిమా పూర్తయ్యాక.. ఒక్కసారి ఏం చూశామని అవలోకనం చేసుకుంటే.. 60 ప్లస్ సన్నివేశాల్ని గుదిగుచ్చి, ఒక కథగా మనకు చెప్పడానికి డైరెక్టర్ జీవన్‌రెడ్డి ప్రయత్నించాడని అనిపిస్తుంది. చాలా సన్నివేశాల మధ్య లింకులు మిస్సయ్యాయి. చదువులో బ్రిలియంట్ అయిన జార్జిరెడ్డిని ఒక యారోగెంట్ అండ్ కరేజియస్ స్టూడెంట్ లీడర్‌గా ప్రొజెక్ట్ చెయ్యాలనే తాపత్రయంలో కథకు కావాల్సిన 'ఆత్మ'ను మర్చిపోయాడు. జార్జిరెడ్డి పాత్ర ప్రయోజనం ఏమిటి? దేనికోసం అతను పోరాడుతున్నాడు? అనే విషయాన్ని ప్రధానంగా తీసుకొని, దానిచుట్టూ కథ నడిపితే, ఆ కథలో ఒక ఎమోషన్ క్యారీ అయ్యేది. ఒక యాక్షన్‌కు జార్జిరెడ్డి తక్షణ రియాక్షన్‌ను హైలైట్ చేస్తూ, ప్రేక్షకుడిలో భావోద్వేగాలు రేకెత్తించాలనే ఉద్దేశం దర్శకుడిలో కనిపించింది. క్లైమాక్స్ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చూపి, ప్రేక్షకుడి సానుభూతిని ఆశించడం కూడా దానిలో భాగమే. సినిమా అయ్యాక మనకు ఎక్కువగా గుర్తుండేది కూడా ఆ క్లైమాక్సే.  సినిమా అంతా సీరియస్ టోన్‌లో ఉంటే కమర్షియల్‌గా ఎలా ఉంటుందని సందేహించారేమో, 'మాయ' (ముస్కాన్) అనే హీరోయిన్‌ను, ఒన్‌సైడ్ లవ్‌నూ కల్పించారు. జార్జిరెడ్డిని ఆ మాయ ప్రేమిస్తుంది. దాన్ని జార్జి దగ్గర వ్యక్తం చెయ్యాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. నిజానికి 'జార్జిరెడ్డి' కథను ప్రేక్షకులకు చెప్పేది ఆ మాయ మనవరాలు ముస్కాన్ (ముస్కాన్). అంటే అమ్మమ్మ (నాయనమ్మ కూడా కావచ్చేమో), మనవరాళ్లుగా ముస్కాన్ డ్యూయల్ రోల్ చేసిందన్న మాట. 'కల్పిత' కథ కదా.. ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు!!. ఒక అమెరికన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం జార్జిరెడ్డి జీవితాన్ని పరిశోధించడానికి ఇండియాకు ముస్కాన్ బయలుదేరడంతో 'జార్జిరెడ్డి' కథ మొదలవుతుంది. కథలో జార్జిరెడ్డి ఒక రివాల్వర్ దగ్గర పెట్టుకుంటాడు. నాలుగైదు సన్నివేశాల్ని ఆ రివాల్వర్‌పై ఫోకస్ చేశారు. ఇంతకీ ఆ రివాల్వర్ ప్రయోజనం ఏమిటి? నథింగ్. ఆ రివాల్వర్‌ను జార్జిరెడ్డి ఎక్కడా వాడడు. వాడివుంటే కథ ఇంకోలా ఉండేదని ఒక డైలాగ్ మాత్రం చెప్పించారు. కొన్ని పాత్రలు ఏమిటో, ఎందుకొస్తాయో తెలీదు. ముఖ్యంగా వినయ్ వర్మ పోషించిన పాత్ర. ఆయన ఈ సినిమాలో చేసిన పాత్ర ఏమిటి? సినిమాకి మేజర్ ఎస్సెట్ సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది.. 1960, 70 కాలాల నాటి వాతావరణాన్ని తీసుకొచ్చిన గాంధీ నడినుడికార్ కళా దర్శకత్వం. ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ కళా దర్శకత్వం డైలాగ్స్ జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటన మైనస్ పాయింట్స్: కథలో 'ఆత్మ' లోపించడం సినిమాకి కీలకమైన ఎమోషన్ క్యారీ కాకపోవడం ఎడిటింగ్ కొన్ని పాత్రలు అర్థవంతంగా లేకపోవడం నటీనటుల అభినయం:-  నిస్సందేహంగా ఇది సందీప్ మాధవ్ అలియాస్ శాండీ సినిమా. జార్జిరెడ్డిగా శాండీ చక్కని నటన కనపరిచాడు. తన పాత్రకు సంబంధించినంతవరకు అతడు నూటికి 90 శాతం న్యాయం చేశాడు. స్వతహాగా బేస్ వాయిస్ కాకపోవడంతో హైపిచ్‌లో చెప్పాల్సిన డైలాగ్స్‌ని ఆ స్థాయిలో చెప్పలేకపోవడం ఒక్కటే అతడికి సంబంధించిన ఫిర్యాదు. మిగతా అన్ని సన్నివేశాల్లో రాణించాడు. క్లైమాక్స్‌లో అతడు ప్రేక్షకుల సానుభూతిని పొందుతాడు. 'ఏబీసీడీ' యూనియన్ నేతలు సత్య, అర్జున్‌గా సత్యదేవ్, మనోజ్ నందం పాత్రల్లో డెప్త్ లేదు. అందువల్ల నటించడానికి వాళ్లకు అవకాశం రాలేదు. క్యాంటిన్ నడిపే స్టూడెంట్‌గా, ఒక వర్గం విద్యార్థులకు లీడర్ అయిన కౌశిక్‌గా పాత్ర పరిధి మేరకు నటించాడు చైతన్యకృష్ణ. జార్జిరెడ్డికి కుడిభుజంగా ఉంటూ, విపరీతంగా ఆవేశపడే రాజన్న పాత్రలో అభయ్ గుర్తించుకోదగ్గ నటన చూపాడు. ఈ పాత్ర తర్వాత అతనికి రాబోయే రోజుల్లో మంచి పాత్రలు లభిస్తాయని ఆశించవచ్చు. అలాగే లల్లన్ సింగ్‌గా నటించిన తిరువీర్ కూడా ఆకట్టుకున్నాడు. కిషన్ సింగ్ పాత్రల లాంటివి శత్రుకు కొట్టినపిండే. అలవాటైన పనిని సులువుగా చేసినట్లు అతను ఆ పాత్రను ఈజీగా చేసేశాడు. మాయ పాత్రలో ముస్కాన్ ఆకట్టుకోలేకపోయింది. ఆమె మాట్లాడే తెలుగును భరించడం కష్టం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చిన్నప్పటి జార్జిరెడ్డిగా చేసిన చిన్నారి మరాఠీ నటుడు శ్రీనివాస్ పోకలే అభినయం గురించి. ఉత్తమ స్థాయి నటనతో అలరించాడు. మౌనంగా హావభావాలు ప్రదర్శించే జార్జిరెడ్డి తల్లిగా మరాఠీ తార దేవిక సరిపోయింది. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: 'జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో' అని నినదించి, ఆ నినాదాన్నే తన జీవన విధానంగా చేసుకున్న జార్జిరెడ్డి కథను సెల్యులాయిడ్‌పై అద్భుతంగా కాకపోయినా, ఉన్నత స్థాయిలో ఆవిష్కరించి ఉంటారని ఆశించి వెళ్లినవాళ్లని పాక్షికంగా మాత్రమే సంతృప్తిపరచే సినిమా 'జార్జిరెడ్డి'. రేటింగ్: 2.5/5 - బుద్ధి యజ్ఞమూర్తి
  నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ ఆయన సినిమా 'రూలర్' టీజర్ గురువారం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రిలీజైంది. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి వచ్చి ఫర్వాలేదనిపించే స్థాయిలో ఆడిన 'జై సింహా' తర్వాత బాలయ్య, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో ఈ సినిమా తయారవుతుండటం గమనార్హం. 'రూలర్'.. బాలకృష్ణ 105వ చిత్రం. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా, సాయాజీ షిండే వంటి పేరుపొందిన నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నారని ముందు నుంచీ దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. టీజర్ కూడా ఆ విషయాన్నే తెలియజేసింది. ఒక షేడ్ పోలీసాఫీసర్ కాగా, మరొకటి హెలికాప్టర్లలో ట్రావెల్ చేసే బిలియనీర్. రెండు షేడ్లలో ఆయన రూపం కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా కనిపిస్తోంది. పోలీసాఫీసర్‌గా బుర్ర మీసాలు, గడ్డంతోనూ, బిలియనీర్‌గా వాన్ డైక్ బియర్డ్‌తోనూ ఆయన కనిపిస్తున్నారు. బిలియనీర్ గెటప్ మాత్రం అదుర్స్ అనిపించే రేంజిలో ఉంది. ఆ వేషంలో బాలయ్య యువకుడిలా మారిపోయారు. యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్, కామెడీ, శృంగారం, రౌద్రం.. వంటి అన్ని ఎలిమెంట్స్‌తో 'రూలర్' తయారవుతోందని టీజర్‌ని బట్టి ఇట్టే ఊహించవచ్చు. టీజర్ మొదట్లోనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం. ఎవరికి ఏ కష్టమొచ్చినా తనే ముందుంటాడు." అని నేపథ్యంలో వినిపించిన ఒక స్త్రీ గొంతు బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏమిటనేది తెలియజేసింది. ఊరన్నా, గ్రామమన్నా ఒకటే అనేది మనకు తెలిసిన అర్థం. కానీ ఈ మూవీ డైలాగ్ రైటర్ ఆ రెండూ వేరువేరని అనుకున్నట్లున్నాడు. అందుకనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం" అని రాశాడు. ఆ రెండింటికీ తేడా ఏమిటనేది ఆయన తెలిపితే బాగుంటుంది. "ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే." అని బాలకృష్ణ తనేమిటో తెలియజేశాడు. 1 నిమిషం 15 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో బాలయ్య చెప్పిన ఏకైక డైలాగ్ ఇదే. బాలకృష్ణ అంటే 'సింహం' అని డైరెక్టర్లందరూ ఫిక్సయిపోయింట్లున్నారు. అందుకే డైలాగ్స్‌లో సింహం అనే మాట ఎక్కడో చోట పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అలాగే టైటిల్‌లోనూ సింహం బొమ్మ ఉండేలా చూసుకుంటున్నారు. 'రూలర్' టైటిల్ లోగోలోనూ మనం మూడు సింహాలను చూడొచ్చు. మూవీలో బాలయ్య పోలీసాఫీసర్ కాబట్టి, మూడు సింహాల గుర్తును ఉపయోగించారు. శాంపిల్‌గా చూపించిన యాక్షన్ సీన్స్ చూస్తే మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనీ, ఇవి మాస్ ఆడియెన్స్‌తో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను అమితంగా అలరిస్తాయనీ ఊహించవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లలో బాలయ్య విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం. టీజర్ ప్రకారం ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక పాత్రలు సినిమాకు కీలకమనే అభిప్రాయం కలుగుతుంది. భూమిక కేరెక్టర్ సెంటిమెంట్‌ని పండిస్తుందని తెలుస్తోంది. హీరోయిన్లు.. సోనాల్ చౌహాన్, వేదిక ఇద్దరూ గ్లామర్‌ను బాగా కురిపించారు. సోనాల్ అయితే స్వింసూట్‌లో దర్శనమివ్వనున్నది. విలన్ పాత్రధారిగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు కనిపిస్తున్నాడు. మీడియాకు ఇచ్చిన కేస్టింగ్ వివరాల్లోనూ అతడి పేరు లేదు. సప్తగిరి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ధన్‌రాజ్, రఘు కారుమంచి.. నవ్వులు పూయించనున్నారు.  యాక్షన్ ఎపిసోడ్లు కానీ, హెలికాప్టర్ ఉపయోగించడం కానీ, మిగతా సీన్లు కానీ చూస్తుంటే భారీ బడ్జెట్‌తో, రిచ్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారనేది స్పష్టం. తన డ్రీం ప్రాజెక్ట్, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్.. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య పరాజయాన్ని పొందడంతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించాలనే తపనతో, కసితో 'రూలర్' మూవీని చేస్తున్నారు బాలయ్య. చిరంతన్ భట్ బ్యాగ్రౌండ్ స్కోర్, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీతో 'టీజర్' అదిరింది. ఈ డిసెంబర్ 20న వస్తున్న 'రూలర్'తో ఆయన ఏం సంచలనం సృష్టిస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి నిర్మాతలకు రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'దర్బార్', సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు', మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల... వైకుంఠపురములో', నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న 'ఎంత మంచివాడవురా' చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.  ప్రస్తుతానికి 'సరిలేరు...', 'అల...' చిత్రాలు జనవరి 12న రావడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు నిర్మాతల నుండి విడుదల తేదీ ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వస్తే, రెండు సినిమాల ఓపెనింగ్స్ తగ్గుతాయి. అదే ఒకటి ముందు రోజు వస్తే సమస్య కొంచెం తగ్గుతుంది. 'సరిలేరు...' నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, 'అల... వైకుంఠపురములో' నైజాం థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. సో... మహేష్ సినిమాను ఒక్క రోజు ముందుకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రజనీకాంత్ 'దర్బార్' నిర్మాతలు, తమ సినిమాను మూడు రోజుల ముందుకు తీసుకువెళ్లారు. రజనీకాంత్ 'దర్బార్' జనవరి 9న విడుదల చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఒకవేళ మహేష్, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 10 11, 12... ఏ తేదీల్లో వచ్చినా సమస్య ఉండదని. నందమూరి కల్యాణ్ రామ్ అయితే తన సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. సో... అతడికీ ప్రాబ్లమ్ లేదు. ఎటొచ్చి... మహేష్, బన్నీలో ఎవరు ముందు వస్తారనేది క్వశ్చన్. మ్యాగ్జిమమ్ మహేష్ బాబు సినిమా జనవరి 11న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. దాంతో రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. థియేటర్స్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. తర్వాత ఏ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది.
  2024 నాటికి ఇటు తెలంగాణలోనూ... అటు ఏపీలో కూడా బలపడాలనుకుంటోంది బీజేపీ. అయితే, తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు అంత ఆశాజనంగా లేవు. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క శాతం ఓట్ షేర్ కూడా రాలేదు. అయితే, ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసలు పెరగడం... నలుగురు టీడీపీ ఎంపీలు... పార్టీలో చేరడంతో... ఏపీ బీజేపీలో కొంత ఊపు వచ్చింది. ఇక, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు... ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. అయితే, పవర్ ఫుల్ మాస్ లీడర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు పవన్ ను సంప్రదించినా... జనసేనాని నో చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినా ఆయనా సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఎన్నికల తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో... ఇప్పుడే పవనే... బీజేపీ వైపు చూస్తున్నాడని అంటున్నారు. ఇక, బీజేపీకి ఎలాగూ పవన్ లాంటి క్రౌడ్ ఫుల్లర్ అవసరం ఉంది. ఉందుకే వీళ్లిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఆమధ్య అమెరికాలో పర్యటనలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్... జనసేనాని పవన్ కల్యాణ్ చర్చలు జరిగాయట. బీజేపీ-జనసేన కలిసి పనిచేయడంపైనే వీళ్లిద్దరి మధ్య చర్చలు సాగాయి. అయితే, ఇప్పుడు జగన్ లక్ష్యంగా పవన్ విరుచుకుపడటం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇసుక ఇష్యూ... ఆ తర్వాత ఇంగ్లీష్ వివాదంపై విమర్శలు ఎలాగున్నా... మతపరమైన అంశాలను తెరపైకి తేవడం వెనుక మాత్రం బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే ప్రస్తావించడం... తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం.... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో వినిపించాలనడం వెనుక కాషాయ వ్యూహం ఉందంటున్నారు. జగన్ అసలు తిరుమల లడ్డూ తింటారా అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించడం వెనుక బీజేపీ మత రాజకీయం ఉందని అంటున్నారు. మతపరంగా జగన్ ను టార్గెట్ చేయడం వెనుక జనసేన-బీజేపీ ఉమ్మడి వ్యూహం ఉందంటున్నారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా జగన్ ను మతపరంగానే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ ను మతపరంగా విమర్శిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం బీజేపీ అజెండానే అమలు చేస్తున్నారనే మాట గట్టిగా వినబడుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే తెరపైకి తీసుకొచ్చి హిందువులను తమవైపు తిప్పుకోవాలన్నదే బీజేపీ-జనసేన వ్యూహంగా తెలుస్తోంది. అందుకే అదేపనిగా జగన్ పై మతపరంగా అటాక్ చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్... కాషాయ పెద్దలను కలిసి ఇదే అంశంపై చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం లేకపోయినా, పదేపదే జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తేవడం ద్వారా 2024 నాటికి ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి, బీజేపీ మతపరమైన అజెండాను జనసేనాని నెత్తిన పెట్టుకుని మోస్తారా? లేక విధానపరమైన అంశాలపై మాత్రమే పోరాడతారో చూడాలి. అయితే, ఉత్తరాది తరహా మతతత్వ ఫార్ములా ఏపీలో వర్కవుట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ఏపీ సర్కారు వెనుకడుగు వేస్తుంది. డీసిల్ బస్సుల నిర్వహణ ఖర్చుల కంటే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చులే ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఎందుకు ఆహ్వానించి రద్దు చేశారనేది ప్రశ్నగా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై ఏపీఎస్సార్టీసీ వెనకడుగు వేసింది. కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ధర.. డీజిల్ బస్సులతో పోల్చితే నిర్వహణ వ్యయం ఎక్కువ. అలాంటప్పుడు కొనుగోలుకన్నా వదులుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అద్దెకు తీసుకుందామని అనుకున్నా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సుల అద్దె ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు తాత్కాలికంగా ఆపేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసే రవాణా సంస్థలకు.. ప్రైవేటు వ్యక్తులకు భారీ సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని భావించింది.  మొదటి విడతలో భాగంగా 350 బస్సులు కొనాలనుకుంటే బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టులో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్కో బస్సు ధర రూ.కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. ఇది ఎంతో భారమని భావించిన ఉన్నతాధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి అద్దెకు తీసుకోవాలనుకున్నారు. కర్ణాటక , తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె కిచ్చిన సంస్థలను ప్రీపెయిడ్ కు ఆహ్వానించి చర్చలు జరిపారు.కిలో మీటరుకు రూ.60 రూపాయల వరకు ఇవ్వాలని కొన్ని కంపెనీలు అంతకు ముందే చెప్పడంతో అందుకు అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ససేమిరా అన్నారు. తాము బస్సు నడిపితే కిలోమీటరుకు వచ్చే ఆదాయమే రూ.32 రూపాయలకు మించదని.. అలాంటప్పుడు రూ.60 రూపాయలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.  ప్రీ బిడ్ సమావేశానికి ముందు రోజు ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంచార్జి ఎండీగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబును నియమించింది. దీని పై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్ అనే శీర్షికతో సెప్టెంబర్ 25 న ఒక కథనం ప్రచురించింది. దీనిని ప్రభుత్వం ఖండించింది. అనంతరం అద్దె ప్రాతిపదికన 1350 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ లు పిలిచింది. ఈ నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అయితే రాష్ట్రంలో వంద కోట్ల రూపాయల దాటిన పెద్ద టెండర్లన్నీ జుడిషియరీ కమిషన్ కు పంపి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెండర్ లను 4వ తేదీనే రద్దు చేశారు. ఈ నెల ( నవంబర్ ) 15 లోపు మళ్లీ టెండర్ లు పిలుస్తామని అధికారులు చెప్పిన అలాంటిదేమీ జరగలేదు. ఎలక్ట్రిక్ బస్సులు కొనడమో అద్దెకు తీసుకోవడమో చేసే కంటే డీజిల్ బస్సులు కొనడం మేలని రవాణామంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది. 4వ తేదీన టెండర్ లు రద్దు చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఎలక్ట్రిక్ బస్సులు అంశంపై సమీక్షించారు. ఈ బస్సుల ధర కోట్లల్లో ఉండటం.. నిర్వహణ డీజిల్ కన్నా భారంగానే ఉండటం.. రీచార్జి స్టేషన్ ల ఏర్పాటుకు రూ.200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఉన్నతాధికారులు చెప్పడంతో కొనుగోళ్లు వద్దని సీఎం అన్నట్లు తెలిసింది. అద్దెకు తీసుకున్న భారమేనని చెప్పడంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలిసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ప్రభుత్వం ప్రస్తుతానికి ఆసక్తిగా లేదని మంత్రి మంగళవారం ( నవంబర్ 19న) తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ కు పంపిన తరవాతే తక్కువకు ఎవరూ ముందుకు వస్తారో వాళ్లకు అవకాశమిస్తామని తెలిపారు.ఈ నెల 23 లోపు ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు ఇన్ చార్జ్ ఎంటీ కృష్ణబాబు.
  నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది. మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు. ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
  ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు. అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
  ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.  మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.  ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.
  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.
        All that heart-healthy advice about eating the right foods, exercising and losing weight pay off in real life for both men and women, two new studies show. The reports, both originating at Brigham and Women's Hospital in Boston and published in the July 22/29 issue of the Journal of the American Medical Association, focused on different aspects of cardiovascular risk in two large groups: the 83,882 women in the second Nurses' Health Study, and the 20,900 men in the Physicians' Health Study I. Both arrived at the same conclusion: Do the right things, and you get measurable benefits. In Men The study in men looked at the relationship between the lifetime risk of heart failure and six lifestyle factors: obesity, exercise, smoking, alcohol intake, consumption of breakfast cereals, and consumption of fruits and vegetables. That look found a straight-line relationship between adherence to healthy lifestyle factors and the risk of heart failure, the progressive loss of ability to pump blood that is often a prelude to death. The lifetime risk of heart failure in the 22-year study was about one in five in men who ignored the advice about all beneficial lifestyle factors and one in 10 for those who adhered to four or more of the factors. "The one with a huge difference was adiposity," Djousse said. "The risk of heart failure was 17 percent in men who were overweight or obese, and about 11 percent in those of normal weight." Exercise was the next most important. Heart failure occurred in 11 percent of the men who exercised five or more times a week and in 14 percent of those who did not exercise, Djousse said. Smoking played a surprisingly small role, probably because its incidence was not high among the participants. " In Women The women's study looked at the association between high blood pressure -- a significant risk factor for heart disease, stroke and other cardiovascular problems -- and six lifestyle factors: obesity, exercise, alcohol intake, use of non-narcotic painkillers, adherence to a diet designed to prevent high blood pressure and intake of supplemental folic acid. All six were found to be associated with the risk of developing high blood pressure in the 14-year study, and the association was cumulative. Women who followed advice on all six factors had an 80 percent lower incidence of high blood pressure than those who followed none of the rules. Obesity was the most important risk factor.   While the clear message of both studies is that a healthy lifestyle prevents a number of illnesses, what is often overlooked is that the choice of a healthy lifestyle is not a purely individual decision. SO make that healthy choice for a healthy Lifestyle.  
Just see how majestic it sounds!! That is my college. I was extremely excited about getting into it before. I have heard lots of success stories of people connected with BITS. What more interesting is that, its right in my hometown.  Although it’s a residential college, I never feel homesick!! There is lots to tell about my campus!  So tighten up your seat belts. Cause I am going to take you on an amazing tour around my campus. It’s a 200 acre campus with lots of greenery. Away from the city’s hustle, it’s very peaceful. There are lots of hostel rooms and academic blocks obviously! And when you see, it seems like they are just near-by. But when you walk from one to the other, that’s when you know they are tiresomely far. But for a lazy person like me, It’s some kind of exercise. The food is alright. How does it even matter when you have a chat bhandar and an ice-cream parlour.?  ;) There are lots of other activities involved other than just academics.  And when I say lots, I mean lots and lots and lots!!! There are clubs, MUN’s, departments, NGO’s. This is the place where I get to decide what I am actually interested in and what I am actually capable of.  This is where I am going to explore the complete me! What I really like is that people from all over India come here. There is so much diversity just inside the campus , that it is like a mini India in here!! Also there are students who are of an Indian origin but had been born in foreign countries studying here. I get to make friends from every corner of the world and I am pretty sure, this friendship is going to last long. Coming to the best part, every single detail here is planned and maintained by students. Lecturers are here only to teach,clarify doubs,evaluate and mentor which they do best. Everything else, right from printing our identity cards to getting sponsorship for fests and conducting them is done by students only!! The students here are so dedicated that it is amazing to see them work! Pearl, is our cultural fest and one of its kind. We have international bands playing for us and professionals entertaining us. We have dj-nights, music nights, dance nights, drama nights and what not!! We have ngo’s that help children from rural background choose their career and also help women. What more is that you are encouraged to have your own start-ups, rather than running behind companies to offer you a job. It’s a chance to be an employer rather than an employee. There have been students passed out from this campus who have started their own companies and are now coming back to recruit new people into their companies. How cool is that!!   I have been here now, for only around 10 days and I already feel so emotionally attached and protective about my campus that it is intimidating. Because I might never want to leave.  Even after four years! Anyways!! I welcome myself to the best four years of my life! -Sanjana Kunde
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం జంట నగరాల్లో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే. రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమానులు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనల తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.వాహన దారుల పరిస్థితి గమనించి అమ్ముతానంటున్నారు.  పెట్రోల్ ను బాటిళ్లో తీసుకెళ్లి  ఎమ్మార్వో హత్య చేశారు. పెట్రోల్ బంకు డీలర్లు అందరం కలసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఇలా అమ్మడం వల్ల జరగకూడనివి జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీగా ఎవరికైతే అవసరముందో వాళ్లకే బాటళ్లో ఇవ్వబడుతుందన్నారు. మామూలుగైతే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిచేశామని.. ఇంకా ఏమైనా ఆదేశాలు వస్తే మొత్తంగా ఆపేస్తామన్నారు. కేవలం కస్టమర్ ని  దృష్టిలో పెట్టుకొని వాళ్ల ఇబ్బంది తొలగించటానికి మాత్రమే ఒక సహాయక రూపంలోనే ఇవ్వడం జరుగుతుందని ఏ యజమాని వెల్లడించారు.మరోవైపు బంక్ యజమానుల ఆదేశాలనుసారం తాము బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం లేదని.. అది ఎప్పటి నుంచో అమల్లో ఉందని బంక్ లో పని చేసే ఉద్యోగులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోయడం వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
  ప్రత్యేక హోదా, విభజన హామీలపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతోన్న పక్షపాత వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడాన్ని గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ స్వయంగా శంకస్థాపన చేసిన విషయాన్ని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు.  
  ప్రతిపక్షాలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాయానే వార్త ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించన కొందరు నేతలు ఈ ప్రశ్న సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో ప్రతిపక్షాల పడ్డాయనేది వీరి అనుమానం. దానికి ఉదాహరణగా చ ఆర్టీసీ సమ్మెను చూపిస్తున్నారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పథకాలు ప్రవేశపెట్టలేదు. పాత స్కీములు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. ఆర్థిక మాంద్యం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ జారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. యాభై ఏళ్లకే పెన్షన్, కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి వాటికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైతుబంధు కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఐదు ఎకరాలు దాటిన రైతులకు చాలా మందికి ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బులు పడలేదు. ఇలా చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యల పై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలను సక్సెస్ ఫుల్ గా ఆర్టీసీ బస్ ఎక్కించారు కేసీఆర్. దాదాపు గా యాభై రోజులుగా ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ చుట్టే తిరుగుతున్నాయి. మరి కొన్ని రోజులు కూడా ఆర్టీసీ వివాదం చుట్టే ప్రతిపక్షాల తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆర్టీసీ వివాదం చుట్టూ ప్రతిపక్షాలను పంపించి కేసీఆర్ వ్యూహం అమలు చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రెడీమేడ్ గా వచ్చిన సమ్మెతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రతి పక్షాలు భావించి.. అసలు సమస్యలు వదిలేస్తున్నారని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలతో పాటు జనం కూడా ఒకే సమస్య పై ఫోకస్ పెట్టేలా సీఎం చూశారని అందులో సక్సెస్ అయ్యారని అంటున్నారు. రేపో మాపో సమ్మె ముగుస్తుంది.. ఆ తరువాత అందరూ ఆ సమస్య మరిచిపోతారని విశ్లేషిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రతిపక్షాలు రెండు నెలల పాటు ఏ సమస్య వైపు దృష్టి పెట్టకుండా కేసీఆర్ చూశారని.. ఈ విషయాన్ని పసిగట్టలేకపోవటం వల్ల ఫెయిల్యూర్ గా కొంత మంది నేతలు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల టైంలో కూడా సీపీఐ తో పొత్తు అంటూ అటు కమ్యునిస్టు పార్టీలను కూడా కన్ఫ్యూస్ చేశారు కేసీఆర్. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ప్రతి పక్ష పార్టీలు అన్నింటిని ఆర్టీసీ బస్సు ఎక్కించి తిప్పుతూ అసలు సమస్యల జోలికి రాకుండా దారి మళ్లిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తాయో చూడాలి.  
అమరావతి రాకూడదని మూర్ఖత్వంగా కమిటీలపై క్యాంపింగ్ వేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అమరావతి ప్రాజెక్టుని చంపేశారని ఆరోపించారు. అమరావతి ఆగిపోతే తెలుగు జాతికి తీవ్ర నష్టం చేసినట్లేనని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. మీ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఆధారాలుంటే తప్ప క్యాన్సిల్ చెయ్యడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా మీ బుర్రకు ఎక్క లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికి కూడా ఎదురు దాడి చేస్తూ అమరావతి రాకూడదని.. దాని మీద కమిటీల మీద కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు. అసలు కమిటీలు దేనికంటూ.. నాకైతే అర్థం కావడం లేదన్నారు బాబు. మీరు ఎంత మూర్ఖత్వంగా ముందుకుపోతున్నారో.. సింగపూర్ గవర్నమెంట్ వెనక్కి వెళ్లినపుడే అర్థం చేసుకోవాలన్నారు. అమరావతి ప్రాజెక్టు దెబ్బతినింది, రాష్ట్ర భవిష్యత్ అంధకారమైంది. కనీసం తెలంగాణకి వెళితే ఒక హైదరాబాద్ సిటీ ఉంది.. కర్నాటకకు వెళితే బెంగళూరు సిటీ.. తమిళనాడు పోతే చెన్నై ఒక సిటీ.. ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఏముందండి ఇక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మనం ఎక్కడికో ఎందుకు పోతామని అడిగారు. అధికారం లేక పోయినా పీపీఏలను రద్దు చేయడంతో ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని విమర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు. కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రభుత్వ పరువు తీశారని మండిపడ్డారు. పీపీఏలు రద్దు చేశారు.. అలా చెయ్యడానికి అధికారం లేదు.. ఎందుకు రద్దు చేశావు అంటే కరెప్షన్ అంటాడు. ఇప్పుడు కోర్టు తనను తప్పని చెప్పే స్థాయికి వచ్చాడన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
  ప్రతి సిగరట్ ప్యాకేట్ మీద ఎంతో చక్కగా రాస్తారు స్మోకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్ అని,కాని అది ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి మరీ సిగరెట్ తో పాటు రోగాలని కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ధూమపానం వల్ల ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఒక అంచనా. ఈ రోజు No smoking day. ఈ సందర్భంగా కొంతమంది అయినా ఈ అలవాటుకి దూరమయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు.   ఈ సిగరెట్ కాల్చేవాళ్ళకి ఎంత ముప్పు ఉందో అది కాల్చకపోయిన పక్కనే ఉండి పీల్చేవాళ్ళకి దానికి రెండింతలు ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. సిగరెట్ తయారుచేయటానికి వాడే పదార్థాలలో 4000 కెమికల్స్ కలిసి ఉంటాయట.  ఒకప్పుడు ఏదైనా బాధలోంచి బైటకి రాలేనివారు ఒక మత్తు పదార్ధంగా భావించి దీనికి అలవాటు పడేవారు. కాని ఈ రోజుల్లో పొగతాగటం ఒక ఫాషన్ గా మారిపోయి ప్రాణాలని తెలియకుండానే మింగేస్తోంది.     సిగరెట్ లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం వల్ల గుండె  కొట్టుకోవలసిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుని గుండె దడకి, గుండెపోటుకి దారితీస్తాయి. పొగతాగేవారిలో 90% మంది  లంగ్  కాన్సర్ బారిన పడుతున్నారట. 70% మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. సిగరెట్ లో కలిపే తారు, నెయిల్ పాలిష్ రిమూవర్, క్రిమిసంహారక మందు మొదలైనవాటివల్ల ఆరోగ్యం విపరీతంగా క్షీణించటమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. పొగపీల్చటంవల్ల గాలిపీల్చే గొట్టాలకి కెమికల్స్ అంటుకుపోయి ఆయాసం, ఉబ్బసానికి దారి తీస్తాయి.  రక్తప్రసరణకి ఆటంకం ఏర్పడటమే కాకుండా ప్రాణవాయువు సరిగా అందకుండా చేస్తుందిట ఈ సిగరెట్.   మన దేశంలో 60 లక్షల మంది శ్రామికులు ఈ పొగాకు ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. ఒకేసారి ఈ ఉత్పత్తుల మీద నిషేదాలు విధించకుండా, వాళ్లకి వేరే ఉపాధి అవకాశాలు చూపించి ఈ పొగాకు ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పొతే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారత్ లో సిగరెట్ రేటు 10% పెంచితే వాటి వాడకం నలుగు నుంచి ఐదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు.       ఈ ధూమపానం అలవాటుకి దూరమవ్వాలనుకునేవారు ఎప్పుడైనా పొగ తాగాలనిపిస్తే నీరు ఎక్కువగా తాగటం వల్ల ఆ కోరిక తగ్గుముఖం పడుతుందిట. అలాగే పొగ తాగాలనిపించిన వెంటనే ఆ మూడ్ లోంచి బయటకి రావటానికి వాకింగ్ కి వెళ్ళటమో లేదా చూయింగ్ గమ్ లాంటిది అలవాటు చేసుకోవటమో చెయ్యాలి. అంతేకాక మెడికల్ షాపుల్లో కూడా వీటికి తగ్గ మందులు దొరుకుతున్నాయి.   ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చెయ్యకూడదని ఎన్నో రకాల ఆంక్షలు విధించినా ప్రజలలో సరైన అవగాహన లోపించటంతో ఆ చట్టాలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రజలలో చైతన్యం వచ్చిన రోజు ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.  ..కళ్యాణి
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.   నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే  అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా  తీపి  పదార్థాలు తినాలని అనిపిస్తే మరో నెలలో పులుపు లేదా కారం ఉన్నవి ఎక్కువగా తినాలనిపిస్తుందిట. మానసిక స్థితిలోని మార్పులలాగానే ఆహారపదార్థాల మీదుండే కోరిక కూడా మారుతూ ఉంటుందిట. అంతేకాదు మానసిక ఆందోళనా,టెన్షన్స్,నిరుత్సాహం ఎక్కువగా ఉన్నవారి మెదడులో కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో వారు అతిగా తినటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎంత తింటున్నదీ,ఏం తింటున్నది అస్సలు పట్టించుకోరట. కేవలం డిప్రెషన్,టెన్షన్ మాత్రమే క్రేవింగ్ కి కారణం కాదు. రక్తంలో గ్లూకోస్ నిలవలు తగ్గిపోవటం, భోజనం చేసే వేళల మధ్య మరీ ఎక్కువ గ్యాప్ రావటం, హార్మోన్ల ఇంబాలన్స్ కూడా క్రేవింగ్ కి కారణాలు అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఇలాంటి ఇలా క్రేవింగ్ బారిన పడినవాళ్లు దానిని నియంత్రిన్చుకోవటం అంత  పెద్ద పనేం కాదు. ఇది తగ్గుముఖం పట్టాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో లంచ్,డిన్నర్లాంటివి తీసుకోకుండా ప్రతి మూడు గంటలకి ఒకసారి మితాహారాన్ని తీసుకోవటం వల్ల దీనిని నివారించవచ్చు. ఇలా మితాహారం కొంచెంకొంచెంగా తినటం వల్ల గ్లూకోజ్  పర్సెంటేజ్ నిలకడగా ఉంటుంది. క్రేవింగ్ బారిన పడినవారు పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలిట. ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్,ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలిట. ఏదైనా తినాలని అనిపించినప్పుడు దాని మీద నుంచి ధ్యాస మారటానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే క్రేవింగ్ నుండి బయటపడటమే కాదు నాజుకుగా కూడా తయ్యారవుతారు. కళ్యాణి 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.