EDITORIAL SPECIAL
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా‘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుపడ్డ రాజశేఖర్... పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కుని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలను బయటపెట్టాడు. వేదికపైనున్న అందరి కాళ్లు మొక్కుతూ రాజశేఖర్ వింతగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కారణంగా తన ఫ్యామిలీలో గొడవులు జరుగుతున్నాయని, తన కారు ప్రమాదానికి కూడా ‘మా‘ గొడవలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పు ఉన్నప్పుడు... దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పొగ రాకుండా ఆపలేమన్నారు. అయితే, వేదికపైనున్న మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ తదితరులు ఆపేందుకు ప్రయత్నించినా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు రాజశేఖర్. అయితే, హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచిని మైకులో చెబుదాం... చెడుని చెవిలో చెప్పుకుందామని తాను విజ్ఞప్తి చేసినా... రాజశేఖర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. వేదికపైనున్న పెద్దలను రాజశేఖర్ అవమానించారని మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో క్రమశిక్షణాసంఘం ఉంటే... రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని చిరంజీవి సూచించారు. రాజశేఖర్ ప్రవర్తన, వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ ది చంటి పిల్లాడి మనస్తత్వమని, ఆయన ఏదీ దాచుకోడని, మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడతాడంటూ వాతావరణాన్ని కూల్ చేసేందుకు జీవిత ప్రయత్నించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ అడ్డుపడటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చిరంజీవి పీఆర్పీని ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి-రాజశేఖర్ మళ్లీ కలిసినా.... ఇప్పుడు ‘మా‘ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిని మళ్లీ టార్గెట్ చేయడం వెనుక ఏదో గొడవ ఉందంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  లేటెస్టుగా 'అల.. వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ సంక్రాంతి సినిమా అందించిన టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2020 జూన్‌లో మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. ఈలోగా రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌ను తారక్ పూర్తిచేయనున్నాడు. కొంత కాలంగా విభిన్న టైటిల్స్‌తో, అందులోనూ 'అ' అక్షరంతో మొదల్లయ్యే టైటిల్స్‌తో సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్న త్రివిక్రమ్, ఈ సినిమాకు 'అయినను పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు కూడా.  గతంలో తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ' మంచి విజయం సాధించింది. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో సీరియస్ సినిమాగా తయారైన ఈ మూవీ తారక్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఒక సోషల్ ఎలిమెంట్ నేపథ్యంలో లైన్‌ను తారక్‌కు త్రివిక్రమ్ వినిపించాడనీ, తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలిసింది. 'అల వైకుంఠపురములో' సినిమా చూసిన తారక్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బన్నీ, త్రివిక్రమ్ లను ప్రశంసించిన విషయం తెలిసిందే. త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రెండోసారి నటించేందుకు అతను ఉత్సాహం చూపిస్తున్నాడు.
  అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర ఆశ్చర్యకరమైన ఫలితాలతో దూసుకుపోతోంది. బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిలింగా నిలిచేందుకు ఉరకలు వేస్తోంది. గతానికి భిన్నంగా ఓవర్సీస్‌లోనూ కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. జనవరి 19న వైజాగ్‌లో ఈ విజయోత్సవం జరుగుతుందని నిమ్రాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచి, సినిమా 2020 ఫస్ట్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచేందుకు దోహదపడింది. తొలిసారి బన్నీ చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న ఈ మూవీలో బన్నీ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్‌లో బన్నీ అందించిన వినోదం ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తున్నాయని వసూళ్లు తెలియజేస్తున్నాయి.    
ప్రతి ఒక్కరికి వయసుతోపాటు పద్ధతులు, అలవాట్లు మారుతూ ఉంటాయి. కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలను సైతం మన సమాజం మార్చుకుంటూ ఉంది. ఈ కాలంలో పెద్దల సలహాలను ఎంతమంది తు.చ తప్పకుండా పాటిస్తున్నారో తెలియదు. కానీ, విక్టరీ వెంకటేష్ మాత్రం ఇప్పటికీ ఓ విషయంలో తండ్రి సలహానే పాటిస్తున్నారు. ప్రతిరోజు ఫ్యామిలీతో కలిసే లంచ్, డిన్నర్ ఆయన చేస్తున్నారు. దీనికి కారణం వెంకటేష్ తండ్రి, మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు ఇచ్చిన సలహానే. "ప్రతి రోజు మా ఇంట్లో అందరం కలిసే లంచ్, డిన్నర్ చేస్తాం. అది కంపల్సరీ. నాన్నగారు 'మీరు ఎక్కడైనా తిరగండి. ‌ ఎక్కడికైనా వెళ్లండి. లంచ్ టైం కి, డిన్నర్ టైంకి ఇంట్లో ఉండాలి. దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోండి' అని చెప్పారు. దాంతో అది మాకు ఒక అలవాటు అయ్యింది. ఇప్పటికీ అలవాటును కొనసాగిస్తున్నాం. కుటుంబంతో కలిసి భోజనం చేస్తుంటాను. నా జీవితంలో ప్రతిరోజు అదొక బ్లాక్ బస్టర్ మూమెంట్"  అని వెంకటేష్ అన్నారు. ఒకప్పుడు అన్ని రకాల వంటలను చాలా ఇష్టంగా తినే వాడిని అనీ, ఇప్పుడు వయసును దృష్టిలో పెట్టుకొని ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను అని ఆయన చెప్పారు. తనకు వంట చేయడం చాలా ఇష్టం అన్నారు.
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న బయోపిక్స్ లో ‌‌‌‌‌'తలైవి' ఒకటి. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ప్రస్తావన లేని జీవితం అసంపూర్ణం. జయలలితకు ఆయనే రాజకీయ గురువు. నటిగా ఆమె ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి ఎంజీఆర్ పాత్రకు తలైవి చిత్రబృందం అరవిందస్వామిని తీసుకుంది. నేడు (శుక్రవారం) ఎంజీఆర్ 103 వ జయంతి సందర్భంగా అరవిందస్వామి లుక్ ను విడుదల చేశారు. ‌ఆ లుక్ చూస్తే అచ్చం ఎంజీఆర్ లా అరవిందస్వామి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. సినిమాలో ఆయన లుక్ పేలిపోయింది. సూపర్ హిట్ అన్నమాట. అయితే... జయలలిత లుక్ మాత్రం ఇప్పటికీ విమర్శల పాలవుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఆల్రెడీ ఆమె లుక్ ను విడుదల చేశారు. జయలలిత బొద్దుగా, లావుగా ఉండేవారు. ఆమె లా కనిపించడం కోసం బక్క పలచటి కంగనా రనౌత్ ప్రొస్థెటిక్ మేకప్ ను ఆశ్రయించారు. జయలలితగా కంగన లుక్ అసలు ఏమాత్రం బాలేదని ఇప్పటికీ విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ ఏడాది జూన్ 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో కంగనా రనౌత్ ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.
  సంక్రాంతి పందెం కోళ్లు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' ఒకదానితో ఒకటి బాక్సాఫీస్ దగ్గర భీకరంగా ఢీకొంటున్నాయి. సూపర్ స్టార్ మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'కి క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్ 'అల వైకుంఠపురములో'కు క్రిటిక్స్ బ్రహ్మరథం పట్టారు. దేశభక్తి మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందిందితే, 'అత్తారింటికి దారేది' తరహాలో అమ్మవారింటికి కొడుకు వచ్చే కథతో 'అల వైకుంఠపురములో' సినిమా తయారైంది. ఈ రెండు సినిమాలతో పాటు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'దర్బార్', నందమూరి కల్యాణ్ రామ్ మూవీ 'ఎంత మంచివాడవురా' సినిమా సైతం సంక్రాంతి బరిలో నిలిచాయి. 'దర్బార్' మూవీ తెలుగు వెర్షన్ హక్కులు 15 కోట్లకు అమ్ముడుపోగా తొలివారం ఆ సినిమా సాధించిన షేర్ 8.25 కోట్ల రూపాయలుగా పేరుపొందిన బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ తెలియజేసింది. అంటే 55 శాతమే రికవర్ అయ్యిందన్న మాట. ప్రస్తుతం దానికి వస్తున్న వసూళ్ల సరళిని పరిగణనలోకి తీసుకుంటే, బయ్యర్లు నష్టపోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్ హవా తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ తగ్గిపోతూ వస్తున్నదని వాళ్లు తెలియజేస్తున్నారు. పైగా 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు 'దర్బార్'ను బాగా దెబ్బకొట్టాయి. అలాగే కల్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా'కు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించే స్థాయిలో వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో తయారైన ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రి బిజినెస్ విలువ సుమారు 10 కోట్ల రూపాయలు కాగా, మొదటి రోజు దీనికి 2 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ వచ్చింది. జనవరి 15న ఈ సినిమా విడుదలవడం వల్ల సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకోవడంలో ఈ సినిమా వెనుకబడిందనే చెప్పాలి. ఇక ఒకరోజు తేడాతో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు అత్యధిక సంఖ్యలో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తున్నాయి. మహేశ్ మూవీ బీ, సీ సెంటర్లలో భారీ వసూళ్లను సాధిస్తుంటే, అర్బన్ ఏరియాల్లో అల్లు అర్జున్ మూవీ ఎదురులేని రీతిలో దూసుకుపోతోందని వసూళ్లు తెలియజేస్తున్నాయి. జనవరి 11న రిలీజైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నమ్మదగ్గ బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ల ప్రకారం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 33.38 కోట్ల రూపాయల షేర్ సాధించి మహేశ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 25.32 కోట్లు. అయితే నిర్మాతలు దీనికి భిన్నంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 46.77 కోట్ల రూపాయల షేర్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు. ఈ నంబర్లకు మహేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాళ్ల లెక్కల ప్రకారం ఈ మూవీ మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 52.01 కోట్లు, 5 రోజులకు 69.21 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రి బిజినెస్ విలువ 103 కోట్ల రూపాయలు. అంటే ఐదు రోజుల్లో 67 శాతం పెట్టుబడిని వసూలు చేసింది. మిక్స్డ్ టాక్‌లోనూ ఈ మూవీ ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన పాత్రలో మహేశ్, ఎమోషనల్‌గా కొనసాగే క్యారెక్టర్‌లో విజయశాంతి ప్రదర్శించిన పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాని నిలబెట్టాయి. మరోవైపు నిర్మాతలు ఈ సినిమా ఆరు రోజులకు ఏపీ, తెలంగాణలోనే 77.94 కోట్ల రూపాయల షేర్ సాధించిందని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. వాళ్లు తమ ప్రకటనల్లో 'బ్లాక్‌బస్టర్స్ కా బాప్' అంటూ ఈ మూవీని పేర్కొంటూ వస్తున్నారు. మరోవైపు జనవరి 12న విడుదలైన బన్నీ సినిమా 'అల వైకుంఠపురములో' తొలిరోజు మహేశ్ సినిమా కంటే తక్కువ వసూలు చేసినా, ఆ తర్వాత సూపర్బ్ మౌత్ టాక్‌తో సరికొత్త రికార్డుల్ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ అనూహ్య వసూళ్లను నమోదు చేస్తోంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 29.17 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 20.3 కోట్ల రూపాయలు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో టాప్. అయితే 'సరిలేరు నీకెవ్వరు' తొలి రోజు వసూళ్లతో పోలిస్తే ఇది తక్కువే. దీనికి కారణం మొదటి రోజు ఆ సినిమా కంటే థియేటర్లు తక్కువ సంఖ్యలో లభించడమేనని విశ్లేషకులు తెలిపారు. ఏదేమైనా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆహ్లాదపరచడంతో పాజిటివ్ టాక్ విస్తరించి రెండో రోజు నుంచీ మహేశ్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తూ రావడం గమనార్హం. ఈ సినిమా మూడు రోజులకు 55.06 కోట్ల షేర్ సాధించింది. అంటే 'సరిలేరు నీకెవ్వరు' కంటే 3 కోట్ల రూపాయలు ఎక్కువన్న మాట. ఈ సినిమా 5 రోజుల వసూళ్ల లెక్కలు ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఆన్‌లైన్‌లో ఈ మూవీ టికెట్లకు కనిపిస్తోన్న భారీ డిమాండ్ చూస్తుంటే, బన్నీ సినిమాల్లో టాప్ పొజిషన్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశాలూ ఈ సినిమాకు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ రెండో రోజు నుంచే 'సంక్రాతి విన్నర్' అంటూ తమ ప్రకటనల్లో ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు తొలి మూడు రోజుల్లో సంయుక్తంగా 107 కోట్ల షేర్ సాధించడం పెద్ద విశేషం. వీటిలో ఏది అసలు విజేతో మొదటివారం వసూళ్లతో తేలనున్నది.
కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తుండటంపై.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ అమరావతి ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే బాగా దూరం అవుతుందనే అసంతృప్తి ఉంది. రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుండి సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే గొప్ప నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా బీజేపీ నుండి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవట్లేదు. దీనినిబట్టి చూస్తుంటే.. అసలు జగన్ ఇంత దూకుడుగా వెళ్లడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ లేకుండా అంత తేలికగా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. దీంతో ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ఒకేఒక బలమైన శత్రువు కాంగ్రెస్. కాబట్టి  కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే పని బీజేపీ ఎప్పటికీ చేయదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. టీడీపీ కేవలం అమరావతి ప్రాంతానికి చెందిన పార్టీ అనే ముద్ర వేసి.. మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలపడాలని చూస్తోందట. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమి నుండి టీడీపీని కోలుకోకుండా చేసి.. టీడీపీ ప్లేస్ ని బీజేపీ భర్తీ చేయాలని అనుకుంటుందట. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అసలు టీడీపీ, చంద్రబాబు వంటి మాటలు భవిష్యత్తులో వినపడకూడదు అనేలా చేయాలనుకుంటోంది. దానిలో భాగంగానే జగన్.. రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టారు అంటున్నారు. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేసి, దానిని ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేసేలోపే ఆయనకు అధికారం దూరమైంది. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన అమరావతిని ఎంత బాగా డెవలప్ చేసినా.. ముందుగా జనాలకు గుర్తొచ్చే పేరు మాత్రం చంద్రబాబు. అందుకే ఆ పేరు వినపడకూడదనే రాజధాని తరలింపు లాంటి పెద్ద నిర్ణయం జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని తరలింపు వెనుక కారణం ఏదైనా.. పైకి మాత్రం రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని, ఒక కులానికి చెందిన రాజధాని అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. గతంలో విశాఖ, కర్నూల్ తుఫాను-వరదలతో అల్లాడిపోయాయి కానీ అమరావతి కాదు. ఇక CRDA భూ యజమానులు లిస్ట్ చూస్తే అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. అయినా కుల ముద్ర వేస్తున్నారు. నిజానికి అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దానినో పవిత్ర ప్రాంతంగా భావిస్తున్నారు. అదీగాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరం ఉంది. ఇలా అనేక కారణాల చేత అప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎంపికే తప్పు అంటున్నారు. నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. రాజధానితో పాటు కొన్ని నగరాల్ని అభివృద్ధి చేయవచ్చు. తమిళనాడులో రాజధాని చెన్నైతో పాటు.. కోయంబత్తూర్, సేలం, వెల్లూర్ వంటి ఎన్నో నగరాలను అభివృద్ధి చేశారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రాజధాని తరలించడం, విడదీయడమే అభివృద్ధి అనుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఏపీకి అంటూ ఒక పెద్ద నగరం లేకుండా పోతుంది. ఇదంతా చూస్తుంటే.. కేవలం అమరావతి అంటే చంద్రబాబు బ్రాండ్ అనే ముద్ర ఉంటుందనే కారణంతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రాజధాని తరలింపుతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో ప్రజలు రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ ప్రజలు కూడా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకి బాగా దూరమవుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని తరలింపు వార్తలను జీర్ణించుకోలేక పలువురు రైతులు గుండె పోటుతో మరణించారు కూడా. ఇంత జరుగుతున్నా బీజేపీ నుండి సరైన స్పందన లేదు. రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశమని ఒకరు, మూడు రాజధానులు వస్తే మంచిదే అని మరొకరు.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కాని ఇది ప్రధాని మోడీ భూమి పూజ చేసిన రాజధాని అంటూ.. అమరావతి కోసం ఒక్కరు కూడా బలంగా పోరాడటం లేదు. బీజేపీ మౌనంగా ఉండటం చూస్తుంటే.. ఈ రాజధాని మార్పు వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై ఇంత రగడ జరుగుతుంటే స్పందించని బీజేపీ.. మత పరమైన రాజకీయాలు అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీపై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, దేవాలయాల సొమ్ముని పాస్టర్లకు దోచి పెడుతున్నారని ఇలా రకరకాలుగా వైసీపీ మీద విమర్శలు చేస్తోంది. అయితే ఇలా కావాలనే వైసీపీ పై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోందని అంటున్నారు. ఈ ప్రచారం వల్ల క్రిస్టియన్స్ అందరూ వైసీపీకి దగ్గరైతే.. నార్త్ ఇండియాలో జరిగినట్టుగా.. హిందువులు బీజేపీ వైపు వస్తారని బీజేపీ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ రిలీజియన్ సెంటిమెంట్ తో అటు వైసీపీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు లాభపడి.. టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి అంటున్నారు. మొత్తానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జగన్ నడుస్తున్నారని.. ముగ్గురూ కలిసి ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంటూ.. అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్దతుగా నిలుస్తూ పోరాడుతోంది. ఈ పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాలుపంచుకున్నారు. తాజాగా భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపటమే కాకుండా, రైతుల కోసం అమరావతి పరిరక్షణ సమితికి ఖరీదైన తన బంగారు గాజులు విరాళంగా కూడా ఇచ్చారు. అయితే భువనేశ్వరి ఉన్నట్టుండి.. ఇలా రైతుల కోసం ప్రత్యక్షంగా పోరాటంలో పాలుపంచుకోవడం వెనుక.. రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు లోకేష్ టీడీపీని నడిపిస్తారని మొదట్లో పార్టీ శ్రేణులు భావించాయి. కానీ లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులకు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ముఖ్యంగా మాటతీరు లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది. ఆయన తెలుగు పదాలు పలకడంలో కాస్త ఇబ్బందిపడతారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు పప్పు అంటూ ఆయనను బాగా టార్గెట్ చేశాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో, ప్రత్యర్థి పార్టీల మీద ఎదురుదాడి చేయడంలో లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో కూడా లోకేష్ వెనకబడిపోయారు. ఒకరిద్దరిని పక్కన తిప్పుకోవడం తప్ప.. భవిష్యత్తు నేతనన్న భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనస్సు గెలుచుకోలేకపోయారు. ఇలా పలు కారణాల వల్ల చంద్రబాబు తరువాత టీడీపీ ని నడిపించే నేత లోకేష్ అనే భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో కలగలేదు. దీంతో చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత పార్టీ నడిపించేది ఎవరనే ప్రశ్న పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే చంద్రబాబు.. భువనేశ్వరిని రంగంలోకి దింపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరి అంటే తెలుగు ప్రజలకు గౌరవముంది. ఆమె మంచి వాగ్దాటి కూడా. గతంలో ఆమె పలు సందర్భాల్లో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తాజాగా అమరావతిలో కూడా ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. మాకు కుటుంబం కంటే.. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల క్షేమమే ముఖ్యమంటూ సెంటిమెంట్ ని రగిల్చేలా మాట్లాడారు. ఆమె ఇలానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపిస్తూ ఉంటే.. టీడీపీ భవిష్యత్తు సారథిగా ఆమెపై పార్టీ శ్రేణులకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఎన్టీఆర్ కుమార్తెగా, ఇటు చంద్రబాబు సతీమణిగా.. ఆమెకు కార్యకర్తలు బ్రహ్మరధం పట్టే అవకాశముంది. అంతేకాదు ఆమె ప్రసంగం మహిళలను కూడా ఆకట్టుకునేలా ఉంది. అదీగాక ఆమె మీద గౌరవంతో అంత త్వరగా ప్రత్యర్థులు విమర్శలు కూడా చేయకపోవచ్చు. ఇలా ఆమెకి పలు అంశాలు కలిసొస్తున్నాయని అంటున్నారు. అందుకే, ఆమె ఇలాగే ముందుకెళ్తే టీడీపీ భవిష్యత్తు సారధి అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పై వస్తున్న విమర్శలకు బ్రేకులు వేయాలన్నా, పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తల్లో భరోసా కల్పించాలన్నా.. భువనేశ్వరిని తెరపైకి తీసుకురావడం కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఆమె అమరావతి రైతుల తరపున పోరాటంలో పాలుపంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో టీడీపీని నడిపించే బాధ్యతని భువనేశ్వరి తీసుకుంటారేమో చూడాలి.
విశాఖకు రాజధాని మార్పు అన్న విషయం కొందరికి ఆనందాన్ని ఇస్తే, మరికొందరికి తీవ్ర నిరాశను ఇస్తొంది. రాజధాని ప్రకటన రాగానే విశాఖలో భూముల మాయాజాలం మొదలైంది. నిషేధిత 22 ఎ జాబితాలో ఉన్న భూములకు రెక్కలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కాదని కొత్తగా వచ్చిన అభ్యర్థులకు ల్యాండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. జిల్లా యంత్రాంగం కాదూ కూడదు అని స్పష్టం చేసినా ఏకంగా సచివాలయం స్థాయి నుంచే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సర్కార్ కు సన్నిహితులైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు లభిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఐదారు దరఖాస్తులను నేరుగా అమరావతి నుంచే పరిష్కరించినట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో ఇద్దరు నేతలకు లబ్ధి చేకూరినట్టు సమాచారం. జిల్లాలో 22ఎ జాబితాలో నమోదైన భూములపై సుమారు 2,200 దరఖాస్తులొచ్చాయి.2018 నుంచి ఇప్పటి వరకు వస్తున్న దరఖాస్తులను జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఆధారాలు ఉంటేనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఒక 1,800 దరఖాస్తుల పరిష్కరించినట్టు సమాచారం. 22 ఏ లో చేర్చిన వాటిలో ఎక్కువ భాగం భూ సేకరణలో ఉన్న స్థలాలే ఉన్నాయి. ప్రజావసరాలకు సేకరించిన భూమికి సబ్ డివిజన్ చేయాలి. లేకపోతే సర్వే నెంబరు మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదు అవుతుంది. జిరాయితీ భూమికి ఆనుకొని గోర్జి, గెడ్డ పోరంబోకు చెరువులను ఆక్రమించుకుని కొందరు విక్రయాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భూములను కూడా 22 ఏ కింద చేర్చుతుంటారు.వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించాలంటే ఆక్రమణకు గురై భూమిని సర్వే చేసి మిగిలిన జిరాయితీ భూమిని యజమానికి బదలాయిస్తారు. జిల్లాలో భూములకు విలువ పెరగటంతో 22ఏ కింద చేర్చిన భూములకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.వీటి విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తుంటారు.  నగరంతో పాటు విశాఖ రూలర్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక,పరవాడ, అనకాపల్లి మండలాల్లో 22 ఏ దరఖాస్తుల అధికారుల పై తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22ఎ జాబితాలో నమోదైన భూముల మినహాయింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన సమాచారం కోరినపుడు అదే విషయాన్ని నివేదించారు. అయితే అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అమరావతి నుంచి ఫైళ్లను పంపించినట్లు సమాచారం.రెండో సారి కూడా అధికారులు సదరు ఫైళ్లను తిరస్కరిస్తూ మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఉన్నత స్థాయి వ్యక్తులు రంగ ప్రవేశం చేసి 22 ఏ నుంచి మినహాయించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆ ఆదేశాలను అమలు చేయటానికి అధికారులు నానా అవస్తలు పడుతున్నట్టు సమాచారం.ముడసర్లోవ, మర్రిపాలెం, మాధవధార, పెదవాల్తేరు, పోతినమల్లయ్యపాలెంతో పాటు రెండుచోట్ల ఇరవై రెండు ఏళ్ల ఉన్న భూముల కు మినహాయింపు సాధించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పై స్పందించేందుకు జిల్లా అధికారులు ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు. ఒకటి రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తులను కాదని ఇటీవల వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి, ఇరవై రెండు ఏ లో చేర్చిన భూములు రాయితీలో ఉన్నాయా లేదా అనేది బహిరంగం గా విచారణ చేపట్ట కుండా హడావిడిగా ఫైళ్లు తప్పించుకోవటం వెనుక ఏం జరిగింది ఇప్పుడు ఇదే చర్చ నీయాంశంగా మారింది.అసలు అత్యవసరంగా విశాఖ భూముల పై ప్రభుత్వానికి దృష్టి ఎందుకు మళ్లిందో వేచి చూడాలి.
      "The hardest arithmetic to master is that which enables us to count our blessings." — Eric Hoffer   For many people life means - struggle, lack of money, hardships, insecurity, stress, and the inability to see what we already have in life. And the age of recession and down-turning adds more to it. The fact is we don’t recognize or see what life has given us and we still look for something more. We don’t count our blessings as in what we already have, like our job, our loving parents, our home, the vehicle we drive, the beautiful sky and probably everything under the sun that makes you happy.   It's important to recognize and express gratitude for the fact that “everything” in your life is a miracle, a creation that you created.   The Power of Gratitude is an extremely important aspect of attracting the Abundance and Happiness that you desire and deserve in your life.   How does the Power of Gratitude work?   When you are in a sincere state of gratitude your energy (vibrational resonance) is one of acceptance and harmony. You resonate and as a result project a much higher vibrational frequency which is exactly what attracts to you the events, conditions, and circumstances that you desire. In other words gratitude puts you in a harmonious vibrational resonance which attracts additional energies   When you are able to fully develop that awareness, (and with a little practice, you will) not only is it an extremely freeing experience, but you are setting your self up for a much greater flow of Abundance and Happiness being attracted and coming into your life. When the Universe sees that you are grateful for what you have, it will send you more.     Gratitude Journal   Just a mere thank you would not suffice to be unconditional gratitude. Express it. Tell the person who has helped you with something how grateful you are. You must feel the gratitude from within the heart.   Another wonderful method of expressing gratitude would be to maintain a journal where you can write   the things you are grateful for on a daily basis. Try writing five things every night for a start. As the months pass and you fill your journal with blessings and thankfulness, an inner shift in your reality will occur. As you focus on the abundance rather than on the lack in your life, you will be designing a wonderful new blueprint for the future. This sense of fulfillment is gratitude at work, transforming your dreams into reality.   Begin the day to explore and integrate this beautiful, life-affirming principle into your life and the miracle you have been seeking will unfold to your wonder and amazement. If you have a desire to consistently attract desired outcomes; it's essential that you developing an attitude of gratitude for attracting and manifesting the things that you desire into your life.   Gratitude- the gateway to abundance & happiness !
  ఒకప్పుడంటే ఫోన్లో మాట్లాడటం విలాసం. కానీ ఇప్పుడో! పక్క ఇంట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి వాడకంలోని లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా కళే అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఫోన్లో చెలరేగిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో కొన్ని కనీస మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు...   ముందుగానే నిర్ణయించుకోండి ఏదన్నా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు, ఓ నిమిషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దానిని అవతలివారికి ఎలా తెలియచేయాలనుకుంటున్నారు? అన్న అంశం మీద దృష్టి పెట్టండి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది! దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా లేదా! అన్నది తరచి చూసుకోండి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.   పరిచయంతో మొదలు మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్‌ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. ‘నేనే మాట్లాడుతున్నాను’, ‘ఏంటి విశేషాలు’... అంటూ నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు, ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది.    కనీస మర్యాదలు ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమసమాచారాలు అడగడం కనీస మర్యాదు. ఫోన్‌ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు! అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయాన్నే మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   సాఫీగా సంభాషణ ఫోన్లో మన వాదనని వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటని వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏదిపడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదన్నా ముఖ్య విషయం మాట్లాడలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్‌ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.   సమయం కొంతమందికి ఫోన్‌ చూస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ‘సరే అయితే!, ‘ఇక ఉంటాను’ లాంటి సూచనలు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు, ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ముగించడం మేలు. - నిర్జర.
సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్‌ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని...   పౌష్‌ సంక్రాంతి (పశ్చిమబెంగాల్) - పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్‌ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు.   పంజాబ్‌ (మాఘి) – తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్‌ చేసుకుంటారు.   ఘుఘుటి (ఉత్తరాఖండ్‌) – ఉత్తరాఖండ్‌లోని కుమావ్‌ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది.   సుగ్గి (కర్ణాటక) – కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు.   మాఘ బిహు (అసోం) – అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు.   పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది.   - నిర్జర.
కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పీసీసీకి నూతన సారథిని నియమించింది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ అంశం మళ్లీ తెరపై కి వచ్చింది. తెలంగాణలోని పలు సమీకరణాల నేపథ్యంలో పార్టీ విధేయతకు ప్రాధాన్యమివ్వాలా లేక ప్రజాకర్షణకు పెద్ద పీట వేయాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్య దర్శి సంపత్ కుమార్, తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఏపిసిసి అధ్యక్ష పదవి కోసం గిడుగు రుద్రరాజు ,పల్లం రాజు తోపాటు పలువురి పేర్లు చర్చకు వచ్చినా అధిష్ఠానవర్గం తమ సొంత నిర్ణయం మేరకు శైలజానాథ్ ను నియమించిందని.. అదే దృక్పథంలో టిపిసిసి అధ్యక్షుడు కూడా నియమిస్తారని.. రాజకీయ వర్గాలు అంటున్నాయి.  కాగా వరుస ఎన్నికల్లో డీలా పడిన పార్టీకీ నూతన నాయకత్వం ఉత్తేజాన్నిచ్చేదిగా ఉండాలన్న అంశంపైన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన నేపథ్యంలో పార్టీ పట్ల విశ్వాసం పై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి నూతన సారథిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తే రేవంత్ రెడ్డి , చిన్నారెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. విశ్వాసానికి ఓటు వేస్తే చిన్నారెడ్డికి అవకాశం దక్కవచ్చని పార్టీకి నూతనోత్తేజం అందించాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికే పట్టం కట్టవచ్చని అంటున్నారు. రెడ్డి ఇతర వ్యక్తికి ఇవ్వాలని భావిస్తే శ్రీధర్ బాబు పేరే ఖరారవుతుందని అనుకుంటున్నారు. ఇటు పార్టీ పట్ల విశ్వాసం వివాదరహితుడు కావడం ఆయనకు కలిసి వస్తుందంటున్నారు మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే నూతన సారథిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. నిజానికి వీరికి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ... సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో... వీరికి ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని నిర్ణయించారు.
జనసేన-బీజేపీ కలయికపై మౌనం వహించాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ పరిణామం పై స్పందించరాదని నిర్ణయించింది. అయితే వాటి చెలిమి సీఎం జగన్ మోహన్ రెడ్డికే తలనొప్పులు తెచ్చిపెడతుందని అంచనా వేస్తోంది. రాజధాని తరలింపు.. అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయనకు ఇబ్బందులు ఎదురుకావచ్చు అని భావిస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో జనసేన బిజెపి పొత్తు ప్రస్తావనకు వచ్చింది. అయితే జరగబోయేది కొంత కాలం వేచి చూద్దామని అప్పటి వరకు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించాలని సమావేశంలో అభిప్రాయపడింది. రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పడుతుందని భావించి.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్టు టిడిపి నేతలు చెబుతున్నారు.  అమరావతి విషయంలో జనసేన, బిజెపి కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బిజెపి సొంతంగా ఉద్యమం చేపట్టటమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లేనని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని మార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదని చాలా అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతుందని టిడిపి సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. జగన్ కేసుల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని మరో టీడీపీ నేత అన్నారు. తన కేసులో విచారణ జాప్యం కావడానికి జగన్ ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం పొందారని.. ఆ సహకారం ఆగిపోతే కేసుల విచారణలో వేగం పెరిగే అవకాశముందన్నారు. విచారణ త్వరగా ముగిస్తే శిక్షలు కూడా ఖాయం. జనసేనతో కలిసి బలపడాలనుకునే రాజకీయ పార్టీగా బిజెపి ఈ దిశగా పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతుంది.
  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.     ఉసిరితో ఉపయోగాలు : 1. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 2. కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. 3. ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. 4. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. 5. మధుమేహం రాకుండా నివారిస్తుంది. 6. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Myocardial Infarction (MI) is the medical term for an event commonly called heart attack in layman's language. MI occurs when there is inadequate supply of blood to a part of heart, the heart muscles are injured as they do not receive required oxygen. It usually occurs due to the blockade of the coronary arteruies by unstable mass of white blood cells, cholesterol and fat, these coronaries arteries are the ones supplying the heart muscles and enabling them to ensure circulation and oxygen supply.   MI presents as sudden chest pain usually behind the sternum, which may radiate to left arm or left side of the neck. In addition, Shortness of breath, profuse sweating, nausea, vomitting, abnormal heatbeats and anxiety may be seen.In many cases, the person does not have chest pain or other symptoms,these are called "silent" myocardial infarctions.   The risk factors for heart attacks are modifiable, and thus heart attacks are preventable!   The causes of Heart Attacks can be broadly categoriesed into:   Lifestyle - Smoking, obesity, lack of exercise and high stress levels play pivaot role in the causation of heart attacks. While, exposure to air pollution, alcohol consumption and increased consumption of trans-fat increase the risk of MI!   Disease - Diseases like Diabetes Mellitus type 1 or 2, hypertension, hypercholestetolemia, high levels of triglycerides and obesity also aid in MI.   Genetic - About 27 genes have been discovered whose mere presence in your genome can put you at the risk of heart attack!
The society that we live in today, is effected by a lot of bad habits. One such habit is - Smoking! Though we all know the ill effects of allowing tobacco into our body, many of us are unable to get rid of the long term addiction. Those who want to give de addiction a try, are struggling to find the best way to do so.   If you are one of them, you have come to the right place. This article will take you through simple and healthy habits, that will give you a gift of a healthy life in just 3 days. To start with, there is a precondition before you can start detoxing your body. That is, keep away from diary products two days before you start cleaning up your lungs. This will remove the toxins from your body and start your journey on a healthy path. The next step in the purification process is to drink a cup of herbal tea before you retire for the day. This will prevent the lungs from being over loaded with work for other parts of the body. Taking two lemons in 300ml of water everyday, before breakfast is the best way to start a healthy day. Similarly 300ml of grape juice or pineapple juice improves your respiratory system with the antioxidants they contain. 300ml of carrot juice between breakfast and lunch is advised to alkalize your blood in these 3 days. Apart from this, 400ml of juice rich in potassium can work wonders in the cleansing process. It is advised to be taken during lunch. To help your body fight bacteria, make sure you sip some cranberry juice before you go to bed. Other things you need to take care of is adequate exercise and a warm bath for 20 minutes. The exercise will drain out some more toxins from you body in the form of sweat. The last activity in this process is to inhale steam with a clean cloth over your head, after putting 5-10 drops of eucalyptus oil in boiling water. Following this routine and meet a new you after 3 days! .......Kruti Beesam
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.