ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాజ్ జంగ్ పిలుపు మేరకు హర్షవర్దన్ గురువారం సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు.తగిన బలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదన్న పార్టీ వైఖరిని హర్షవర్ధన్ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీ అయిన ఆమ్ ఆద్మీకి గవర్నర్ ఆహ్వానం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం వచ్చిందని ఏఏపీ అధికార ప్రతినిధి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. అయితే ఏఏపీ మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవ్వరి మద్దతూ తీసుకోకూడదన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ని కలవనున్న ఆమ్ ఆద్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడొనన్న ఆసక్తి ఢిల్లీ ప్రజల్లో నెలకొంది.   
      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుట్టిన రోజునే తెలంగాణ బిల్లుకు 'లైన్ క్లియర్' చేసినట్లు ఢిల్లీలోని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పేందుకు శాసనసభకు ఆరు వారాలు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతుండగా... అందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ముసాయిదా బిల్లు రాజ్‌భవన్ చేరినట్లు తెలియడం గమనార్హం. విభజన ముసాయిదా బిల్లును కేంద్రమంత్రివర్గం ఈనెల 5న ఆమోదించింది. ఆ మరుసటి రోజే దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంతాప సభలో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లిన రాష్ట్రపతి... బుధవారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే బిల్లు ముసాయిదాను 'క్లియర్' చేసినట్లు తెలిసింది. అయితే, తమకు రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అందలేదని హైదరాబాద్‌లోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా దీనిపై ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశాయి. గురువారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు... రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని వివిధ అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ నిపుణులతో నిశితంగా చర్చించినట్లు తెలిసింది. తన కార్యాలయం నుంచి అసెంబ్లీకి వెళ్లే బిల్లు పూర్తిస్థాయిలో పక్కాగా ఉండాలని, అందులో ఎలాంటి న్యాయపరమైన లొసుగులు, ఇబ్బందులు ఉండరాదనే భావనతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
    కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలిచినందుకు సంతోషపడాలో లేక నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయినందుకు ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందిప్పుడు. అలాగని మిజోరాంలోనయినా  సంతోషించదగ్గ గొప్ప విజయమేమీ కాదు. క్రిందటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు వస్తే, ఈ సారి కేవలం 22మాత్రమే వచ్చాయి. అక్కడ ఎటువంటి బలమయిన ప్రతిపక్షమూ, పోటీ గానీ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా నూకలు చెల్లిపోతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః రానున్న సాధారణ ఎన్నికలలో ఆ సంగతి స్పష్టమయిపోవచ్చును.   ఈసారి మిజోరం ఎన్నికలలో కాంగ్రెస్ చిహ్నంతోనో లేకపోతే సోనియా, రాహుల్ పేరు చెప్పుకోనో గెలవలేదు. వరుసగా తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా వ్యక్తిగత ప్రభావము, పేరు ప్రతిష్టలతోనే ఈసారి కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలవగలిగింది, లేకుంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయేదే.   ఇక ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే దేశంలో దాదాపు అన్ని ముఖ్యమయిన రాష్ట్రాలలో ఓడిపోతూ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ కుచించుకు పోయినట్లు అర్ధం అవుతోంది. దక్షిణాదిన రెండు దశాబ్దాల తరువాత బీజేపీ తప్పిదం వలన కర్ణాటకలో మళ్ళీ అధికారం దక్కించుకొన్నపటికీ, అంతకంటే విలువయిన, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన కారణంగా పోగొట్టుకోబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమవుతోంది. ఏవిధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇక గడ్డు కాలం మొదలయినట్లే కనిపిస్తోంది.   అయితే సరిగ్గా రాహుల్ గాంధీ ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనుకొనే సమయంలో దేశమంతటా ఈవిధంగా ఎదురుగాలులు వీయడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియాగాంధీకి చాలా ఆందోళన కలిగించే విషయమే. అయితే అందుకు ఎవరినో నినదించనవసరం లేదు. అంతా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ తప్పిదాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చివేయడమే దురదృష్టకరం.
      రాష్ట్ర విభజనను ఆపేస్తాం అని స్టేట్‌మెంట్లు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టిన సీమాంధ్ర ఎంపీలు పరిస్థితిని విజయవంతంగా రాష్ట్ర విభజన ముంగిలి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త డ్రామాకి తెరతీశారు. ఆ కొత్త డ్రామా పేరు ‘అవిశ్వాస తీర్మానం’. తమ సొంత పార్టీ మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం విడిపోకుండా చూస్తామన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల వాదన. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి వీలుగా సీమాంధ్ర ఎంపీలు గతంలో స్పీకర్‌కి అందజేసిన తమ రాజీనామా లేఖల్ని ఎంచక్కా వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం, నెగ్గడం సంగతి దేవుడెరుగు గానీ, తాము గతంలో చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకునే అవకాశం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దక్కిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఎలాగూ విడిపోబోతోంది. అలాంటప్పుడు స్పీకర్ దగ్గర తమ రాజీనామాలు ఎందుకనుకున్నారో ఏమోగానీ, కొత్త పథకం వేసి రాజీనామా లేఖలు వెనక్కి తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సొంత తెలివి కాదని, దీని వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం బుర్ర కూడా వుండే వుంటుందని అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ మీదే అవిశ్వాసం పెట్టి సీమాంధ్రుల దృష్టిలో త్యాగధనుల ఇమేజ్ సంపాదించుకునే వ్యూహం కూడా ఇందులో వుండొచ్చంటున్నారు. యుపిఎ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ డిస్మిస్ చేసినట్టయితే వారికి సీమాంధ్రలో హీరో ఇమేజ్ వచ్చే అవకాశం వుంది.  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అధిష్ఠానాన్నే ఎదిరించి పదవులను త్యాగం చేసిన ఇమేజ్‌తో ఇండిపెండెంట్లుగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ సన్నిధానానికి చేరే వ్యూహం కావచ్చని కూడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని త్యాగాల బిల్డప్పులు ఇచ్చినా సీమాంధ్రలో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు ఏరకంగానూ గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
      లోక్ సభకు సెమీఫైనల్ గా భావించే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాయి. నాలుగు రాష్ట్రాలనూ కమలనాథులు దక్కించుకున్నారు. ఆ పార్టీకి కురిసిన ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ అభ్యర్ధులు కొట్టుకుపోయారు. ఉత్తరాది నుంచి మధ్య భారతదేశం వరకు కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కన్ను దక్షణాది పై పడింది. ఇక్కడ తమ పార్టీ వేళ్ళూనగొనడానికి వ్యూహాలను రచిస్తుంది.     దక్షిణాదిలో వెంకయ్య నాయుడు ప్రభావం ఆశించిన ఫలిత౦ మేరకు లేకపోవడం, యాడ్యురప్ప పార్టీ పై అవినీతి మచ్చలు ఉండడం, ఎన్డీఏ భాగస్వామైన జయలలిత తమిళనాడు కే పరిమితం కావడంతో బిజెపి అధిష్టాన౦ కన్ను చంద్రబాబు నాయుడు పై పడింది. జనాల్లో మోడీ, బాబు ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ వర్గం ఆలోచిస్తుంది. ఒక్కసారి విభజన జరిగాక సీమాంద్రలో కూడా రాజకీయాలు మారతాయి. అప్పుడు ఎవరు బాగా అబివృద్ది చేస్తారన్న అంశం ముందుకు వచ్చి, మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ జనంలో బాగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రం సమైక్యంగానే ఉన్న పక్షంలో చంద్రబాబు, మోడీల సమర్ధత పై ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలన్నది వారి ఉద్దేశంగా ఉంది.   గతంలో తన గుజరాత్ అభివృద్దికి చంద్రబాబు నాయుడు ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేకాక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ది మోడీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ప్రధాని అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడును ప్రకటిస్తే దక్షణాదిలో బిజెపికి వున్న లోటును పుడ్చుకోవచ్చునని మోడీ వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కన్వీనర్ అవుదామనుకున్న తమిళ నాయుడు ముఖ్యమంత్రి జయలలిత ను కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు ను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయం. చంద్రబాబు జాతకరీత్య కూడా 2014 లో జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాడని జోతిష్యులు కూడా చెబుతున్నారు. మోడీ, బాబులు కలిస్తే అది టీడీపీ, బీజేపీలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే...రాష్ట్రంలో టిడిపిని నడిపించే సారధ్య బాధ్యతలు ఎవరూ తీసుకుంటారు. నారా లోకేషా, నందమూరి బాలకృష్ణా లేక ఎన్టీఆర్ మనవరాలా? అనే దానిపై కూడా రాజకీయవర్గాలలో కూడా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఓ కొల్లిక్కి రావచ్చు.                             
    రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేసేందుకు ఉద్భవించిన ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ చీపురు కట్టను ఎన్నికల చిహ్నంగా కేటాయించడం యాదృచ్చికమే అయినా, ఆమాద్మీకి అదే కలిసి వచ్చిన అంశంగా మారింది. ఆమాద్మీ(సామాన్య పౌరుడు) చేతిలో ఆ చీపురు కట్టే వజ్రాయుధంగా మారి, రాజకీయ దిగ్గజమయిన కాంగ్రెస్ పార్టీని డిల్లీ నుండి పూర్తిగా ఊడ్చిపెట్టేయగా, బీజేపీ అధికారం దక్కించుకోనీయకుండా  ఆ చీపురుకట్టనే ఆమాద్మీ ఇప్పుడు అడ్డువేస్తున్నాడు.   ఆమాద్మీ పార్టీ విజయం వెనుక ఆ పార్టీ కృషి ఎంత ఉందో, అంతకు మించి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలోఉన్నవిముఖత కూడా దానికి ఆ పార్టీకి కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ ఆమాద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ, “ఆమాద్మీ ప్రజలతో మమేకమయ్యి వారి భావాలకు అనుగుణంగా వ్యవహరించినందునే విజయం సాధించిందని, అందువల్ల తమ పార్టీ కూడా నేటి వరకు అనుసరిస్తూ వచ్చిన రాజకీయ కోణం నుండి కాక ప్రజాకోణం నుండే పరిపాలన సాగించవలసి ఉంటుందని” అనడం గమనిస్తే ఆయన తమ పార్టీ చేస్తున్న తప్పులను, నడుస్తున్న దారి తప్పని గ్రహించినట్లే ఉన్నారు. ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు చేయాలి కానీ, రాజకీయాలకు ప్రజా సంక్షేమం బలి చేయకూడదనే సత్యం ఆయన చాలా ఆలస్యంగా గ్రహించారు. అయితే ఆ సత్యం తెలుసుకోవడానికి కాంగ్రెస్ చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది.   అయితే ఇకనయినా కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకొని నిజాయితీగా రాజకీయాలు చేస్తుందని నమ్మకం లేదని ఆయన తల్లి సోనియా గాంధీ మాటలే స్పష్టం చేసాయి. ఈ ఎన్నికలలో అధిక ధరలు మరి కొన్ని ఇతర చిన్న పెద్ద అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని, తమ వైఫల్యాలకు కారణాలను సమీక్షించుకొంటామని, అయితే ఈ ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావమూ చూపించాబోవని” ఆమె అన్నారు. ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికలకి, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకి చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. తగిన సమయంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి పేరు ప్రకటిస్తామని ఆమె అన్నారు.   ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆత్మవిమర్శ చేసుకొంటామని, తమ వైఫల్యాలకు కారణాలు తెలుసుకొని పార్టీని చక్కదిద్దుకొంటామననే పడికట్టు పదాలను వల్లెవేసినట్లే, ఈసారి కూడా ఆమె మరోమారు వల్లె వేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం అవుతోంది.   ప్రతీ ఎన్నికలలో పరాభవం చవి చూస్తున్నా కూడా తన పనితీరు మాత్రం ఎన్నడూ మెరుగు పరుచుకోదు. పాలనలో సమర్ధత కనబరచదు. అవినీతికి దూరంగా ఉండలేదు. అయినప్పటికీ స్వంత డబ్బాకొట్టుకోవడం కూడా మరచిపోదు. బహుశః మిజోరం ఎన్నికలలో సాధించబోతున్నవిజయం గురించి మాట్లాడుతూ తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ అంత త్వరగా తన పాత అలవాట్లను, పద్దతులను, ఆలోచన శైలిని వదులుకోలేదు.   కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో సమర్ధ పాలన అందించినందుకు బీజేపీకి మళ్ళీ మూడోసారి పట్టం కట్టారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ను గద్దె దింపి బీజేపీకి పగ్గాలు అప్పగించారు. డిల్లీలో చీపురు కట్టతో ఊడ్చి బయటకు సాగనంపారు. అందువల్ల యదావిధిగా పడికట్టు మాటలు వల్లే వేసే బదులు, నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని తమ వైఫల్యాల కారణాలను గుర్తించగలిగితే కాంగ్రెస్ పార్టీకే మంచిది. లేకుంటే ఈసారి మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దేశం నుండే ఊడ్చుకుపోయినా ఆశ్చర్యం లేదు.          
      ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంటిమెంట్స్ వుండవని అందరూ అనుకుంటారు. ఆయన కూడా తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెబుతూ వుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదేమో, వర్మ మనసులో ఏదో మూల సెంటిమెంట్ వుందేమో అని ట్విట్టర్‌లో ఆయన పెట్టే కామెంట్లను చూస్తే అనిపిస్తూ వుంటుంది. వర్మ ప్రదర్శించే ఆ సెంటిమెంట్ కూడా తన వ్యక్తిగత విషయాల్లో లేదు... ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విషయంలో వుంది. తెలుగువారందరూ ఒక్కటిగానే వుండాలన్న ఆలోచనలో వుంది.   రామ్ గోపాల్ వర్మ గతంలో అనేక పర్యాయాలు రాష్ట్రం విడిపోకూడదన్న అర్థం వచ్చేలా ట్విట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు.  రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద ట్విట్టర్‌లో చాలా పోస్టులు ట్విట్ చేశారంటే రాష్ట్ర విభజన అంశం ఆయన్ని ఎంతగా బాధిస్తోందో తెలుస్తోంది. ముంబైలో సెటిలైపోయిన వర్మకే ఇంత బాధగా వుంటే, అన్నిటిలోనూ హైదరాబాద్ మీదే ఆధారపడిన సీమాంధ్ర ప్రజలకు ఎంత బాధగా వుంటుంది? విద్యార్థులు, ఉద్యోగులు ఎంత బాధపడతారు? ప్రతి తెలుగు హృదయం ఎంత తల్లడిల్లుతుంది? అన్నట్టు.. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా అమెరికాలో పుట్టి వుంటే ఎలా వుండేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలందరూ ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి వుండేవారు. మరి కేసీఆర్ అమెరికాలో పుడితే.... మన ఒక్క రూపాయికి వెయ్యి అమెరికా డాలర్లు వచ్చేలా పరిస్థితి తయారై వుండేది.  
  సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కేంద్రం చాలా ఆషామాషీగా తూతూ మంత్రంగా పూర్తి చేసేసి చేతులు దులుపుకొంది. అనేక క్లిష్టమయిన అంశాలకు, సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు చూపించి దానితో ఎలాగో సరిబెట్టుకోమని ఉచిత సలహా ఇస్తోంది. నీళ్ళు, విద్యుత్, ప్రాజెక్టులు వంటి క్లిష్టమయిన సమస్యలకు అది ఎటూ సరయిన పరిష్కారం చూపలేకపోయింది. కనీసం హైదరాబాద్ విషయంలో నయినా సరయిన పరిష్కారం చూపుతుందేమోనన్న ప్రజల ఆశ అడియాసగానే మిగిలిపోయింది.   దశాబ్దాల సమిష్టి కృషి కారణంగా రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దబడ్డ హైదరాబాద్ నగరంతో యావత్ రాష్త్ర ప్రజలు ఏదో రూపంగా బలమయిన సంబంధాలు కలిగిఉన్నారు, అధారపడి ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఆ నగరం ఉపాధి కల్పిస్తే, అనేక వేలమంది విద్యారులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అది గమ్యస్థానంగా నిలిచింది. అందువలన  ఈ రాష్ట్ర విభజన వలన అటువంటి విద్యార్ధులు భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.     మొన్న కేంద్రం ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో, “రెండు రాష్ట్రాలలో విద్యార్ధులందరికీ ఉన్నత విద్య అభ్యసించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలలో ప్రస్తుతం అమలులో ఉన్నస్థానిక కోటా పద్దతినినే యదాతధంగా ఐదేళ్ళకు మించకుండా అమలుచేసేందుకు ఆమోదించబడినది,” అని పేర్కొంది.   అయితే హైదరబాద్ ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతున్నపుడు కేవలం ఐదేళ్ళు మాత్రమే ఈవిధానం ఎందుకు అమలుచేస్తున్నట్లు? పదేళ్లు అమలు చేయడానికి అభ్యంతరమేమిటి? ఐదేళ్ళ కోర్సులయిన యంబీబీయస్ వంటి వైద్య విద్యలో వచ్చే సంవత్సరం నుండి ఇతరులకు ప్రవేశం ఇస్తారా, లేదా? ఒకవేళ ఈగడువు ముగిసే సమయానికి కోర్సు మధ్యలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఈ ఐదేళ్ళ గడువు ముగిసే ముందు సంవత్సరంలో ఇటువంటి దీర్ఘకాలిక కోర్సులలో చేరదలచిన వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే కేంద్రం ఎంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొందో అర్ధం అవుతుంది.   ఇక స్థానిక కోటాలను పరిశీలిస్తే, హైదరబాద్ ఉస్మానియా పరిధిలో జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, కరీం నగర్, ఖమ్మం, మెహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలు ఉన్నాయి.   అదేవిధంగా రాయలసీమలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప మరియు నెల్లూరు జిల్లాలున్నాయి.   ఇక విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలున్నాయి.   ఒక విద్యార్ది ఆయా ప్రాంతాలలో కనీసం నాలుగు సం.లకు తక్కువ కాకుండా విద్యాభ్యాసం చేసి ఉంటే, అతడు లేదా ఆమె స్థానిక విద్యార్ధిగా పరిగణింపబడుతారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారి విషయంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనయినా వరుసగా ఏడు సం.లు విద్యాభ్యాసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో స్థానికుడిగా పరిగణింపబడతారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అప్పుడు కూడా ఇదే స్థానిక విధానం ఐదేళ్ళవరకు అమలు చేస్తారా? రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాంత విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వదలచుకొంటే అప్పుడు ఈ స్థానిక విధానం ఏవిధంగా అమలు చేస్తారు? అనే విషయంపై బిల్లులో ఎటువంటి వివరణ లేదు.   ఇటువంటి లోపభూయిష్టమయిన విధానాల వలన రెండు రాష్ట్రాలలో విద్యార్ధులకు అవస్థలు, సమస్యలు తప్పకపోవచ్చును. ఇటువంటి లోపాలు మిగిలిన వ్యవస్థలలోను లెక్కకు మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటివల్ల రెండు రాష్ట్రాలలో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పదు.
      సీమాంధ్రులై వుండీ, రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులను అక్కడి ప్రజలు ఇలా తిడుతూ శాపనార్థాలు పెట్టినా ఎంతమాత్రం తప్పులేదు....   1. మీ పదవులు ఊడిపోవాలి. 2. మీ స్కాములన్నీ బయటపడిపోవాలి. 3. మీరు ఏసీబీ వాళ్ళకి అడ్డంగా దొరికిపోవాలి. 4. మీరు సీబీఐ వాళ్ళ కేసులలో ఇరుక్కుపోవాలి. 5. మీరు డబ్బులు డిపాజిట్ చేసిన స్విస్ బ్యాంకులు ఐ.పీ. పెట్టేయాలి. 6. మీ నామినేషన్లు తిరస్కరణకు గురవ్వాలి. 7. తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు ఇచ్చారని మీమీద అనర్హత వేటుపడాలి. 8. వచ్చే ఎన్నికలలో మీరు డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోవాలి. 9. మీకేకాదు... మీ ఫ్యామిలీ మొత్తానికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవాలి. 10. మీ వ్యాపారాలన్నీ నాశనమైపోవాలి.  11. హైదరాబాద్‌లో మీ ఆస్తులన్నీ పాడుబడిపోవాలి. 12. మీరు కాంట్రాక్టులు చేయకుండా జీవితాంతం బహిష్కరించాలి. 13. విదేశాల్లో మీ కంపెనీలని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి. 14. రాజకీయాలని అడ్డు పెట్టుకుని మీరు సంపాదించిన డబ్బంతా ఎలుకలు కొట్టేయాలి. 15. మీరు ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ దుంపనాశనమైపోవాలి. 16. మీరు లంచాలు తీసుకుంటూ స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిపోవాలి. 17. మీ నియోజకవర్గం రిజర్వేషన్‌లో మీకు దక్కకుండా పోవాలి. 18. నియోజకవర్గాల పునర్విభజనలో మీ నియోజకవర్గం గల్లంతైపోవాలి. 19. మీ పార్టీ సోదిలో కూడా లేకుండా పోవాలి. 20. మీమీద వున్న కేసులన్నిటికీ శిక్షలు పడాలి. 21. మీ అనుచరులు చేసిన నేరాలన్నీ మీ మెడలకి చుట్టుకోవాలి......
      రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన దారుణమైన సంఘటనని ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తూనే వుంటాడు. ఈసారి ఆ బాధ్యత వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ తీసుకున్నట్టుగా వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు తెలుగువారి గుండెను మండేలా చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ జగన్ ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా వున్నాయంటూ ‘కొన్ని’ మీడియాలలో సర్వేలు రావడం రాజకీయ వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేసింది.   రాష్ట్రం విడిపోయే పరిస్థితులొచ్చాయి. తెలుగుజాతి దారుణంగా చులకనకు గురైన విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గండం నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించడం తెలుగువారి ప్రస్తుత కర్తవ్యం. అయితే ఆ విషయాన్ని వదిలేసి జనం ఎవరికి ఓట్లేస్తారన్న విషయం మీద సర్వేలు మీడియాలో ప్రసారం కావడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న సర్వేల వెనుక జగన్ హస్తం వుందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నాయి. దండిగా డబ్బులు ఇస్తే సర్వేలు చేసే సంస్థలు మనకు అనుకూలంగా వుండేలా సర్వే రిపోర్టులు అందజేస్తాయన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి విమర్శలను ఇంతవరకూ నమ్మనివారు ఇప్పుడు జగన్‌కి అనుకూలంగా వస్తున్న సర్వేల ఫలితాలను చూస్తే తప్పకుండా నమ్ముతారని విశ్లేషకులు అంటున్నారు. సర్వే జగనా సుఖినోభవన్తు అని ఆశీర్వదిస్తున్న సర్వేల ప్రకారం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటూ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జగన్ హవా నడుస్తోంది. ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్టమెంటులోనూ జగన్ పార్టీ బోలెడన్ని సీట్లు గెలుచుకుంటుంది. జగన్‌కి ఓట్లు వేయడానికి జనం ఎంతో ఉత్సాహంగా వున్నారు. అయితే, ఏం చూసి జగన్‌ని జనం నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో అడుగంటపోయిన తన ఇమేజ్‌కి బూస్టప్ ఇచ్చుకోవడం కోసమే జగన్ ఇలాంటి సర్వేలను ప్లాన్ చేశాడన్న అభిప్రాయం ఎవరికైనా కలిగితే దాన్ని ఖండించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ట్రిక్కులు జనం దగ్గర పనిచేయవని చెబుతున్నారు.
      కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఫిక్సయిన సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దాని పరిణామమే కేంద్రం ఏకపక్షంగా, పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడమని విశ్లేషిస్తున్నారు. మూడు నెలల క్రితం తెలంగాణ ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కాంగ్రెస్ పార్టీ తాను ఇలా తెలంగాణకు అంగీకారం తెలుపగానే టీఆర్ఎస్ అలా తనలో విలీనం అయిపోతుందని ఆశించింది. అయితే కాంగ్రెస్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి! అప్పటి తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.   విలీనం లేదు తోటకూర కట్టా లేదంటూ షాకిచ్చాడు. తెలంగాణ ఏర్పడితే తన పార్టీకే అధికారం వస్తుందని కలలు కనడం ప్రారంభించాడు. కాంగ్రెస్ దగ్గర తల ఎగరేయడం షురూ చేశాడు. కేసీఆర్ని దారిలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ మొండిఘటం లొంగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ రాజకీయ వికృత క్రీడలో తెలుగు ప్రజలు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో!
      రాష్ట్ర విభజనకు నిజాయితీతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంగా కృషి చేసినవాళ్ళు ఎవరని ప్రశ్నించుకుంటే సమాధానం ఏ టీఆర్ఎస్ నాయకులనో, వివిధ పార్టీల తెలంగాణ నాయకులనో సమాధానం రాదు.. సీమాంధ్ర కేంద్ర మంత్రులేనన్న సమాధానం ఎవర్నడిగినా వస్తుంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన వాళ్ళు బర్త్ డే కేక్ కోసినంత ఈజీగా రాష్ట్ర విభజన జరగడానికి సహకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? రాష్ట్ర విభజను ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సింది పోయి పదవులే పరమార్థమని నోళ్ళు మూసుకుని కూర్చున్నారు.   సమైక్య గళాన్ని, నిరసనను కేంద్రానికి వినిపించాల్సింది పోయి మీ ఇష్టమొచ్చినట్టు విభజించి పారేయండి... మాకు మాత్రం వచ్చే ఎన్నికలలో సీట్లు, మంత్రి పదవులు మాత్రం రిజర్వ్ చేసేయండని తమ ప్రవర్తనతో చెప్పకనే చెప్పేశారు. దీనికితోడు రాష్ట్ర విభజన జరగదని, రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్రకు అన్యాయం జరగదని, అదని, ఇదనీ చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టేశారు. ఉప్పెనలా లేచిన సమైక్య ఉద్యమాన్ని చల్లబరచడానికి తామవంతు కృషి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వాళ్ళని నానా మాటలూ అన్నారు. నిన్నగాక మొన్న ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు మీద చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికొక ఉదాహరణ. అశోక్ బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసే సమయంలో కేంద్ర మంత్రి  చిరంజీవి గారి హావభావాలు చూస్తే నిజంగానే రాష్ట్ర విభజన జరగదేమో, ఈయనగారే కేంద్రం మనసు మార్చే ప్రయత్నంలో సీరియస్‌గా వున్నారేమో అన్న నమ్మకం కలిగింది. ఎంతైనా మెగాస్టార్ కదా! ఇక పనబాక లక్ష్మి, పురంధేశ్వరి, కావూరి.. ఇలా ఎవరికి వారు విభజన డ్రామాలో తమ తమ కేరెక్టర్లని విజయవంతంగా పోషించి రక్తి కట్టించారు. సీమాంధ్ర ప్రజల కళ్ళలోంచి రక్తం కారేలా చేశారు. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ విభజన డ్రామాలో రాజీనామాల అంకానికి తెర లేపారు. అయితే సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి వీళ్ళ డ్రామాలను చూస్తూ ఊరుకోరు.
      రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రుల బృందం చేసిన నిర్వాకమంతా కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుంది. రాష్ట్ర విభజన మీద మూడు నెలలపాటు రకరకాల కసరత్తులు చేసి సాధించిందేంటయ్యా అంటే గుండు సున్నా! రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజున ఏదయితే ప్రకటించిందో అదే నిర్ణయం అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రుల బృందం తన నివేదిక ద్వారా చెప్పకనే చెప్పింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నది, ఆలోచించినదంతా మంత్రుల బృందం ద్వారా అధికారికంగా తెలుగు ప్రజల మీద రుద్దుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారిక కలరింగ్ ఇవ్వడానికే మంత్రుల బృందం రకరకాల సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, ప్రశ్నపత్రాలు, లీకులు... ఇలా నానా హడావిడి చేసిందన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగోళ్ళని ఏ రకంగా పిచ్చోళ్ళని చేయొచ్చో  ఆ రకంగా చేసిపారేసింది. చర్చలూ అవీ ఇవీ అని తెలుగు ప్రజల్ని తన చుట్టూ తిప్పుకుంది. భవిష్యత్తులో రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో ‘జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఆడించుట ఎలా?’ అనే లెసన్ కనుక ప్రవేశపెడితే కేంద్ర మంత్రుల బృందం వ్యవహారశైలిని అందులో తప్పకుండా పెట్టాలి. అపార అనుభవజ్ఞులు, రాజకీయరంగంలో ఉద్ధండ పిండాల్లాంటి వాళ్లు ఈ మంత్రుల బృందంలో వున్నారు కదా..  ఒకదాంట్లో కాకపోయినా ఒకదాంట్లో అయినా రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోద యోగ్యంగావుండే అంశాలను పొందుపరుస్తారులే అనే నమ్మకం కొందరిలో వుండేది. ఇప్పుడు తెలంగాణ వైపు ఏకపక్షంగా రూపొందించిన నివేదిక ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేసింది. రాష్ట్ర విభజన విషయంలో నిరంకుశంగా, నిర్దయగా, పూర్తి స్వార్థపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ, పైపైకి సంప్రదింపులు, చర్చలనే చక్కర రాసిన విష గుళికని తెలుగు ప్రజల చేత మింగించే ప్రయత్నం చేసింది. తెలుగువారిని విజయవంతంగా మోసం చేసింది. ఏ ఒక్క విషయంలో కూడా సీమాంధ్రుల సమస్యలను పట్టించుకోని కేంద్ర మంత్రుల బృందాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలున్నారు.
      ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ వివరాలు బయటకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు, ఎన్నికల సర్వేల సంస్థలు కలసి నిర్వహించిన సర్వేలన్నీ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని, ఈశాన్య భారతంలోని మిజోరాం స్టేట్‌లో మాత్రం కాంగ్రెస్ చావుతప్పి కన్ను లొట్టపోయే అవకాశం వుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్ నౌ, సీఎన్ఎన్-ఐబీఎన్ లాంటి మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలు అందరూ ఊహించిన విధంగానే వచ్చాయి.   మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆల్రెడీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వున్న రాజస్థాన్  రాష్ట్రాన్ని భారతీయ జనతాపార్టీ సొంతం చేసుకునే అవకాశం వుందని తేలింది. అలాగే ఢిల్లీలో కూడా బీజేపీ హవా నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం వుండటం వల్ల ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తీసుకోవాల్సిన అవసరం వుండొచ్చని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు కాబట్టి ఢిల్లీ పీఠం కూడా కాంగ్రెస్ చేజారినట్టే లెక్క! ఇక కాంగ్రెస్ అధికారంలో వున్న మిజోరాంలో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కే అవకాశం వుందని సర్వేలు చెప్పాయి. మిజోరాం లాంటి చిన్న రాష్ట్రంలో గెలవటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా ఢిల్లీ పీఠం కోల్పోయే పరిస్థితి రావడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే. పదిహేను సంవత్సరాలుగా ఢిల్లీని శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడుపడని వ్యవహారమే. మొదటి నుంచీ సర్వేలు తనకు వ్యతిరేకంగా వుండటంతో కాంగ్రెస్ పార్టీకి సర్వేల పేరు చెబితేనే మండిపడుతోంది. డబ్బులు ఎవరు ఇస్తే సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వస్తాయని అడ్డంగా వాదిస్తోంది. అయితే ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థలు జరిపిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందనడానికి ఈ సర్వే ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
  కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దమయినప్పుడు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కానీ అసలు రాష్ట్ర విభజనకే అంగీకరించమని సీమాంధ్రలో మొదలయిన ఉద్యమాల ఒత్తిడితో, పది జిల్లాల తెలంగాణా తప్ప వేరే ఏ ప్రతిపాదనకు అంగీకరించబోమని తెలంగాణావాదులు గట్టిగా నిలబడటంతో, రాయల తెలంగాణా ప్రతిపాదన తెర వెనక్కు వెళ్లిపోయింది.   అయితే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చల్లబడటం, అదే సమయంలో తెలంగాణా ఖాయమనే ఉద్దేశ్యంతో తెలంగాణావాదులు వెనక్కి తగ్గడంతో, విభజన ప్రక్రియ జోరందుకొంది. ఆ సమయంలో సీమాంధ్రకు ప్యాకేజీలు సాధించుకోనేందుకు కాంగ్రెస్ నేతల ఒత్తిడి పెరిగింది. వారిలో కొందరు హైదరాబాద్, భద్రాచలం, నదీ జలాలు వంటి అంశాలపై గట్టిగా పట్టుబట్టడంతో కాంగ్రెస్ అటువైపుకు మొగ్గడం చూసి, వెంటనే తెలంగాణా నేతలు కూడా ఒత్తిడి పెంచారు.   ఈసమస్యల నుండి గట్టెక్కాలంటే మధ్యే మార్గంగా రాయల తెలంగాణా ఒక్కటే చక్కని పరిష్కారమని కొందరు సీమ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి బ్రెయిన్ వాష్ చేసారు. ఆ ప్రతిపాదనకు మరికొందరు నేతల మద్దతు కూడగట్టడమే కాకుండా, అందుకు అనుగుణంగా కొందరు నేతలు అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి 1500 గ్రామ పంచాయితీ తీర్మానాలు చేసి కేంద్రమంత్రుల బృందం ముందుంచి, తమ రెండు జిల్లాలను తెలంగాణా కలిపితే ఆ రెండు జిల్లాల ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదు గనుక ఎవరూ దానిని వ్యతిరేఖించరని వారు భరోసా ఇచ్చారు.   సీమాంధ్రలో మిగిలిన ప్రాంతలకంటే అన్ని విధాల వెనుకబడి, విద్యా ఉద్యోగాలకు హైదరాబాద్ పైనే ప్రధానంగా ఆధారపడిన ఆ రెండు జిల్లాల ప్రజలు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలత చూపుతుండటంతో జనం నాడి పసిగట్టిన మిగిలిన నేతలు కూడా క్రమంగా రాయల తెలంగాణా ప్రతిపాదనకు మొగ్గు చూపడంతో, అప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న సమైక్యవాదంతో ఇబ్బంది పడుతున్నకాంగ్రెస్ అధిష్టానానికి, ఈ ప్రతిపాదన ఒకే చేస్తే దాదాపు 28మంది సీమ కాంగ్రెస్ నేతలు కిరణ్ శిభిరం నుండి విభజనకి ‘సై’ అంటూ తెలంగాణా బిల్లుని శాసనసభలో ఆమోదం పొందేలా చేయగలమని హామీ ఈయడంతో ఇక కాంగ్రెస్ దీనికే ఫిక్స్ అయిపోయింది.   ఈవిధంగా చేస్తే హైదరాబాద్ పై సీమాంధ్ర నేతలు ఇక పట్టుబట్టబోరు గనుక తెలంగాణావాదులు కూడా దీనికి అభ్యంతరం చెప్పరని కాంగ్రెస్ భావించింది.అంతే గాక ఈ ప్రతిపాదనతో తన రాజకీయ ప్రత్యర్ధులైన తెరాస, తెదేపా, వైకాపా, బీజేపీ అందరికీ ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ ‘సర్వరోగనివారిణి’ని మళ్ళీ తెరపైకి తెచ్చింది.
  నాణేనికి ఒకవైపే చూసిన కాంగ్రెస్ పార్టీ, తెరాస నేతలు, టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రజలు, బైరెడ్డి వంటి అసలు సిసలయిన సీమ నేతలను, రాయలసీమలో మిగిలిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించుకొంటూ అడుగు ముందుకు వేసింది. తత్ఫలితం ఏవిధంగా ఉంటుందో ప్రత్యక్షంగా కనబడుతోందిప్పుడు.   తామే అసలు సిసలయిన రాయలసీమ ప్రతినిధులమని జేసి దివాకర్ రెడ్డి వంటి వారు తమ భుజాలు తామే చరుచుకొంటున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా తమ ప్రతిపాదనకు మొగ్గు చూపడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు కూడా.   అయితే, రాయలసీమలో మిగిలిన జిల్లాల ప్రజల మనోభావాలను, వారి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ స్వార్ధ రాజకీయ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఒక గొప్ప, బలమయిన సంస్కృతిగల తమ రాయలసీమలో కొంత ముక్కను చీల్చుకొని తమ సంస్కృతికి, బాషకి, యాసకి, ఆచార వ్యవహారాలకి, జీవన శైలికి పూర్తి విరుద్దమయిన తెలంగాణాలో కలిసేందుకు సిద్దమయిపోయారు.   ఇంతకంటే బైరెడ్డి వంటి వారు కోరుతున్నట్లుగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్నిఅడిగినా న్యాయంగా ఉండేది. లేకుంటే తమ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలని డిమాండ్ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉందేది కాదు. కానీ, తమ స్వార్ధ రాజకీయ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి సదరు నేతలు తమ రాయలసీమకు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనకదకపోవడం చాలా విచారకరం.   సీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇటువంటి నేతల సలహాలను కాంగ్రెస్ అధిష్టానం చెవికెక్కించుకోవడం అంతకంటే పెద్ద తప్పు. దాని ఫలితమే ఇప్పుడు కళ్ళెదుట కనబడుతోందిప్పుడు.   సమయం కాని సమయంలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టి పెద్ద తప్పు చేసిన కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా ప్రతిపాదనతో ఇప్పుడు రెండో తప్పు చేస్తోంది. అందుకు ఆ పార్టీ ఫలితం అనుభవించక తప్పదు.
      రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తాను చేసిన రిస్క్ కి తగిన ప్రతిఫలం వుండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. తెలంగాణను ప్రకటించగానే కేసీఆర్ టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో కలిపేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా మారుస్తాడని ఆశించిన కాంగ్రెస్ అధిష్ఠానం అలా జరగకపోవడంతో నిరాశకు గురైంది.   తెలంగాణ వచ్చాక తానే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష టీఆర్ఎస్  వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తనకు అధికారం దక్కనప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ఇచ్చినా తనకు మేలు జరిగేలా వుండేలా వ్యూహాన్ని కాంగ్రెస్ రచించింది. ఆ వ్యూహమే ‘రాయల తెలంగాణ’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం తగ్గించడం ద్వారా తాను అధికారంలోకి రావాలని కాంగ్రెస్ యోచిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ అనుసరించే విభజించు, పాలించు సిద్ధాంతంలో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే విభజించే వ్యూహాన్ని ఆలోచిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేటీఆర్‌తో తనకున్న రాజకీయ విభేదాల కారణంగా గతంలో హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశాలు కనిపించడంలో హరీష్, కేటీఆర్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావును ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం వల్ల తెలంగాణలో విశేషమైన స్థాయిలో ఓటుబ్యాంకు సాధించుకోవడంతోపాటు టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా చావుదెబ్బ తీసే అవకాశం వున్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హరీష్‌ని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.  
      విభజన వాదులకు తమకు అనుకూలంగా లేని ప్రతి విషయాన్నీ సీమాంధ్రుల కుట్రగా అభివర్ణించడం సాధారణమైపోయింది. రాష్ట్ర విభజనకు సంబంధించి తమకు వ్యతిరేకంగా ఏ చిన్న పరిణామం జరిగినా దాన్ని ‘సీమాంధ్రుల కుట్ర’ అనడానికి టీఆర్ఎస్ నాయకుల దగ్గర్నుంచి ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ఎంతమాత్రం మొహమాటపడటం లేదు. గతంలో తెలంగాణవాదులు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలలో ‘సీమాంధ్రుల కుట్ర’ అనే మాటను ఉపయోగించాలో చెప్పాలంటే పెద్ద భారతమంత గ్రంథం రాయాల్సి వుంటుంది.   రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వంతో మొరపెట్టుకోవడం కూడా ‘సీమాంధ్రుల కుట్ర’ అకౌంట్‌లో పడిపోతోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నామధ్య శాంతిభద్రతలకు సంబంధించి ఐపీఎస్ అధికారి విజయకుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఎందుకోగానీ పేర్వారం రాముల్ని మీటింగ్‌కి పిలవలేదు. అది కూడ సీమాంధ్రుల కుట్రే అయి కూర్చుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతోందన్న వార్తలు వస్తున్నాయి.  దీన్ని కూడా తెలంగాణవాదులు సీమాంధ్రుల కుట్రగానే డిసైడ్ చేసేశారు. ఇలా ప్రతిదాన్నీ ‘సీమాంధ్రుల కుట్ర’ అనడంలో విభజనవాదుల వితండవాద ధోరణి బయటపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటోందని భావిస్తే దాన్ని ఎదుర్కోవడంలో తప్పులేదుగానీ, ప్రతిదాన్నీ సీమాంధ్రుల కుట్రగా అభివర్ణిస్తూ సీమాంధ్రులను అవమానిస్తున్నట్టు మాట్లాడ్డం భావ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. తమకు ఎదురైన సమస్య లోత్లులోకి వెళ్ళి విశ్లేషించుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవడం, సహేతుకంగా మాట్లాడ్డం మానేసి నోటికొచ్చిన ఆరోపణలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం సీమాంధ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రాయలసీమ వాసులైతే ఈ ప్రతిపాదనను ఒక అర్థంపర్థం లేని ప్రతిపాదనగా పేర్కొంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ‘రాయల తెలంగాణ’ రాయిని సీమాంధ్రుల నెత్తిన వేయడం విభజనవాదులకు భావ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

ఈ దాహం తీరనిది..

Publish Date:Dec 4, 2013

      కర్నాటక జలదాహం అంత ఈజీగా తీరేట్టు కనిపించడం లేదు. అటు కావేరీ నది విషయంలో తమిళనాడు నోరు కొడుతోంది. ఇటు కృష్ణానది విషయంలో ఆంధ్రప్రదేశ్ గొంతు ఎండేలా చేస్తోంది. అయినా ఇంకా నీళ్ళ కరువు తీరనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో మిగులు జలాల విషయంలో ఆంధ్రకు అన్యాయం. కర్ణాటకకు అపాత్రదానం జరిగిపోయింది.   ఈ విషయంలో తప్పు ఎవరిదన్న విషయంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరిమీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నప్పటికీ మొత్తమ్మీద తెలుగువాడికి అన్యాయం జరిగింది. ఈ విషయంలో కేంద్రంతో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం వుంది. రాజకీయాలకు అతీతంగా తెలుగువారందరూ ఒక్కటై ఈ విషయంలో మనకున్న హక్కును సాధించుకోవాల్సిన అవసరం వుంది. బ్రిజేష్ కుమార్ తీర్పు ఇప్పటికే తెలుగు ప్రజల గుండె మండిపోయేలా చేస్తుంటే, కర్నాటక ప్రజలు సంబరాలు చేసుకునేలా చేసింది. ఇప్పటికే అదనంగా దక్కిన నీటి వాటాతో సంతృప్తి చెందని కర్ణాటక ఇప్పుడు మరో వివాదాన్ని పైకి తీసుకొచ్చింది. నీటి విషయంలో తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి పంపిణీ చేస్తున్న నీటిలో నాలుగు టీఎంసీల నీటి మీద తనకు హక్కు వుందని, ఆ నాలుగు టీఎంసీలను ఆంధ్రకు పంపడం ఆపి వాటిని తనకే కేటాయించాలని కర్ణాటక భావిస్తోంది. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. మరి ఈ విషయంలో అయినా తెలుగు ప్రజలు కలసి కట్టుగా పోరాటం చేస్తారో లేక తమలో తాము కలహించుకుంటూ కర్ణాటక ఈ విషయంలోనూ గెలిచేలా చేస్తారో చూడాలి.

ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలు

సోషల్ మీడియా వేదికగా కొందరు సన్నాసులు రెచ్చిపోతున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చీప్ పబ్లిసిటి కోసం, సొంత ప్రయోజనాల కోసం ప్రముఖులను బద్నాం చేస్తున్నారు. ఏపీలో కొన్ని వర్గాలే టార్గెట్ గా ఈ కుట్రలు చేస్తున్నారు. కావాలని బురద చల్లుతూ సిగ్గు లేని వెధవలు సంతోష పడుతున్నారు. అనారోగ్యంతో చనిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మరణంపైనా పిచ్చోళ్లలా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై బురద చల్లుతూ వికృత చేష్టలకు దిగారు బుద్ది, జ్ఞానం లేని చిల్లరగాళ్లు. ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలకు దిగారు. రామోజీ రావు బలవంతం మీదే ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలసుబ్రమణ్యం హైదారాబాద్ వచ్చారని.. రామోజీ ఫిల్మ్ సిటీకి రావడంతోనే బాలుకి కరోనా సోకిందని  ప్రచారం చేస్తున్నారు. ఈటీవీ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది కళాకారులకు కరోనా సోకిందని.. బాలు తప్ప అందరూ కోలుకున్నారని ఫేస్ బుక్ పేజీల్లో, వెబ్ సైట్లలో ఇష్టమెచ్చినట్లుగా రాసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్  సిటీకి వెళ్లడం వల్లే బాలు చావు తెచ్చుకొన్నాడని, ఈ పాపం రామోజీ రావుదే నంటూ పైశాచికత్వం ప్రదర్శించారు.    అయితే సోషల్ మీడియాలో సన్నాసులు  ప్రచారం చేస్తున్నదంతా పచ్చి బూటకమని తేలిపోయింది. ఇటీవల కాలంలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఈటీవీ ప్రోగ్రామ్స్ ఏమి జరగలేదు. కరోనా సమయంలో ఈటీవికి సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరగలేదు. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాల్గొన్నది ఈటీవీ ప్రోగ్రామ్ కానే కాదు. జూలై 18న హైదరాబాద్ వచ్చిన ఎస్పీ బాలు, చరణ్ లు మౌనరాగం మురళీ 100వ ఎల్పీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ఈటీవికి  ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంపై కావాలనే కుట్రపూరితంగా రాతలు రాస్తున్నారు కొందరు వెధవలు. ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు రామోజీరావు బలవంతం మీద.. బాల సుబ్రమణ్యం హైదరాబాద్ వచ్చారని  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.    ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఎస్పీ బాల సుబ్రమణ్యం మీద ఎంతో అప్యాయత చూపేవారు. పాడుతా తీయగా కార్యక్రమంటే రామోజీ రావుకు అత్యంత ఇష్టం. అందుకే ఎస్పీ బాలుతో నిర్వహించేవారు. బాలూనే ఈ విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు. రామోజీరావు తనకెంతో ఇచ్చారని, తానే ఆయనేమి ఇవ్వలేదని చెప్పుకునేవారు. పాడుతా తీయగా కార్యక్రమంతో తన గౌరవం మరింత పెరిగిందని తెలిపేవారు బాలు. ఈ కార్యక్రమంతో తన పేరు కూడా ఎస్పీ బాలు కాకుండా పాడుతా తీయగా బాలుగా మారిందని చెబుతూ నవ్వుకునేవారు. అంతేకాదు ఓ ఈవెంట్ లో వేదికపైనే రామోజీ రావుకి సాష్టాంగ నమస్కారం చేశారు బాలసుబ్రమణ్యం. రామోజీ కూడా బాలును ఎంతో అప్యాయతతో ఆలింగనం చేసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాని రామోజీ రావు.. బాలు మరణంపై మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సంతాపం తెలిపారు. తన జీవిత కాలంలో రామోజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మార్గదర్శి మీద అప్పటి వైఎస్సార్ సర్కార్ కుట్ర పూర్వక కేసు పెట్టినపుడు తమ ఖాతాదారులకు భరోసా కల్పించడానికి మెుదటి సారి రామోజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చిన్న కొడుకు చనిపోయినపుడు కూడా మీడియా ముందుకు రాలేదు రామోజీ రావు. దీన్ని బట్టే చెప్పవచ్చు రామోజీకి, ఎస్పీ బాలు మీద ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ.    రామోజీ, ఎస్పీ బాలు మధ్య మంచి అనురాగ బంధాలుండగా.. కొందరు దుర్మార్గలు చావులోనూ చిల్లర చేష్టలకు దిగడం తెలుగు ప్రజలను విస్మయపరుస్తోంది. అయితే రామోజీరావుపై అసత్య ప్రచారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఏపీలో కొంత కాలంగా కమ్మ నేతలు, కమ్మ వ్యాపారులు, కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖుల టార్గెట్ అయ్యారు. ఆ వర్గం వారిపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మరల్చడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని తెలుస్తోంది. బ్రహ్మణ, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్నదే  చిల్లర కుట్రదారుల పన్నాగమని సమాచారం. ఎస్పీ బాలు బ్రహ్మణుడు కావడంతో అతని చావుకు రామోజీ రావు కారణమనే చిల్లర రాతలకు దిగారు. తమ ప్రచారంతో బ్రహ్మణులంతా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది వారి ప్లాన్ లో భాగమని భావిస్తున్నారు.   ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని రామోజీ రావుకు అంటగడుతూ చేస్తున్న ప్రచారంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై చిల్లర ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.

జగన్ సర్కార్ కి కొడాలి గండం.. త్వరలో ఏపీలో ప్రభుత్వం మారనుందా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.   గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.   గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.   తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు.

బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.

ఎన్సీబీ ఇంట‌రాగేష‌న్‌.. మూడుసార్లు భోరుమ‌న్న దీపిక‌!

  బాలీవుడ్ డ్ర‌గ్ కేసుకు సంబంధించిన ఎన్సీబీ చేసిన ఇంట‌రాగేష‌న్‌లో టాప్ యాక్ట్రెస్ దీపికా ప‌డుకోనే మూడుసార్లు భోరుమ‌ని ఏడ్చింద‌ని ఇండియా టుడే క‌థ‌నం తెలిపింది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీతో లింకులున్న ఒక పెద్ద డ్ర‌గ్ పెడ్ల‌ర్‌పై ద‌ర్యాప్తును మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భావిస్తోంది. ఇంట‌రాగేష‌న్‌లో తార‌లు ఇస్తున్న స్టేట్‌మెంట్స్‌ను కోర్టుకు అంద‌జేయ‌నున్న‌ట్లు ఎన్సీబీ డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎం.ఎ. జైన్ తెలిపారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఆ ఏజెన్సీ అందులో డ్ర‌గ్ కోణానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 19 మందిని అరెస్ట్ చేసింది. ఎన్సీబీ మాత్ర‌మే కాక సుశాంత్ మృతి కేసును సీబీఐ, ఈడీ కూడా ద‌ర్యాప్తు జ‌రుపుతున్నాయి. ఇదివ‌ర‌కే సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్ప‌గించింది. డ్ర‌గ్ కేసులో దీపికా ప‌డుకోనేతో పాటు శ్ర‌ద్ధా క‌పూర్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, సారా అలీఖాన్‌ల‌ను ఎన్సీబీ విచారించింది. ఎన్సీబీ ఇంట‌రాగేష‌న్‌లో డ్ర‌గ్ చాట్ చేసిన‌ట్లు ఒప్పుకున్న దీపిక‌, తానెప్పుడూ డ్ర‌గ్స్ వాడ‌లేద‌ని వాదించిన‌ట్లు స‌మాచారం. ఆఖరుకి సారా అలీఖాన్ కూడా తాను డ్ర‌గ్ వాడిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నింటినీ తోసిపుచ్చి, తానెప్పుడూ ఎలాంటి డ్ర‌గ్స్‌నూ వాడ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు అధికారులు గుచ్చిగుచ్చి అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక దీపిక భోరున ఏడ్చింద‌ని ఇండియా టుడే త‌న క‌థ‌నాల్లో తెలియ‌జేసింది.

గంగ‌వ్వ కెప్టెన్ ఎలా అయ్యిందంటే..!

  బిగ్ బాస్‌ హౌస్ లో సభ్యుల కదలికలపై ఓ కన్నెసి ఉంచిన కెమెరాలపై గంగవ్వ రెండు కళ్లేసి ఉంచింది. మొదటివారంలోనూ కెమెరాలకు ప్లయింగ్ కిస్ లు ఇస్తూ ఆకట్టుకుంది. శుక్ర‌వారం దివిని కెమెరాల ముందుకు తీసుకుపోయి "నా మనుమరాలు.. రాత్రి కిడ్నాప్ చేశాం. నేనే అన్నం తినిపించి కిడ్నాప్ చేసినం. ఇటు తిరుగూ" అంది. "ఈ కెమెరా బాగాలేదు అవ్వ" అంటూ దివి మరో కెమెరా ముందుకు తీసుకుపోయింది. ఆ కెమెరా కూడా మూవ్ కాలేదు. "నేను నచ్చలేదా?" అంటూ గంగవ్వ చిన్నబుచ్చుకుంది. ఫిజికల్ టాస్క్ సందర్భంగా దివిని కిడ్నాప్ చేసినప్పుడు మనుషుల టీమ్ లో సభ్యులు హౌస్ డోర్ వద్ద ఎలా ప్రవర్తించాలో గంగవ్వ ఇమిటేట్ చేసి చూపిస్తూ పొట్టచెక్కలయ్యేలా ఇంటి సభ్యులను, ప్రేక్షకులను నవ్వించింది. కెప్టెన్ పోటీలో ఉన్న అభిజిత్, హారిక, అవినాష్, గంగవ్వ రంగునీళ్ళు ఉన్న బౌల్ ను పటుకుని లాస్ లోకి వెళ్లామని చెప్పాడు బిగ్ బాస్‌. చివరి వరకు ఎవరి బౌల్ లో నీళ్ళు ఉంటే వారే కెప్టెన్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. దాంతో అభిజిత్ బౌల్ లోని నీళ్ళు దివి కింద పోసేసింది. అవినాష్ బౌల్ లోని రంగునీళ్ళు నోయల్, అమ్మ రాజశేఖర్ కలిసి వొలకపోశారు. హారిక ఒకచోట దాగున్నా హారిక చేతిలో ఉన్న రంగునీళ్ళను మోనాల్, నోయల్, సోహైల్ కలిసి కిందపోయేాలా చేశారు. గంగవ్వ బౌల్ లోని నీళ్ళు కిందపడకుండా సుజాత, లాస్య రక్షణగా నిలబడ్డారు. బజర్ మోగే సమయానికి గంగవ్వ బౌల్ లోని నీళ్ళు ఒక్క చుక్క కూడా కిందపడకపోవడంతో "గంగవ్వ గెలిచింది" అంటూ కేరింతలు వేస్తూ స్పెపులేసిన సభ్యులపై గంగవ్వ రంగునీళ్ళు చల్లి ఆనందాన్ని పెంచారు. "గంగవ్వ మా అవ్వ" అంటూ అమ్మ రాజశేఖర్ గొడుగు పట్టగా, ఇంటి సభ్యులంతా స్పెపులతో హాడావుడి చేస్తూ ఇంటిలోకి వచ్చారు. రాత్రి లాన్ లో కూర్చున్న సభ్యులు ఆటవిడుపుగా అమ్మ రాజశేఖర్‌ను ఎత్తుకువెళ్లి స్మిమింగ్ ఫూల్ లో పడేశారు. మరికొందరు సభ్యులను కూడా తోసేశారు. దాంతో బిగ్ హౌస్ లో 18వ రోజు కేరింతలతో గడిచిపోయింది.

బ‌రువు త‌గ్గాల‌ని 10 లీట‌ర్ల నీళ్లు తాగుతూ వ‌చ్చిన విద్యా బాల‌న్‌!

  ప్ర‌స్తుతం దేశంలోని అత్యంత ప్ర‌తిభావంతులైన ఫిమేల్ యాక్ట‌ర్స్‌లో విద్యా బాల‌న్ ఒక‌ర‌నే విష‌యం అంద‌రూ అంగీక‌రిస్తారు. కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా, త‌న జీవ‌న విధానం ద్వారా, క్లిష్ట కాలంలో తీసుకొనే నిర్ణ‌యాల ద్వారా ఆమె మ‌న‌ల్నెప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఇటీవ‌లే 'శ‌కుంత‌లాదేవి' మూవీలో టైటిల్ రోల్‌లో ఆమె ప‌ర్ఫార్మెన్స్‌ను ఇప్పుడ‌ప్పుడే మ‌ర‌చిపోగ‌ల‌మా! 2012లో సంప్ర‌దాయ బ‌ద్ధంగా జ‌రిగిన వేడుక‌లో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది విద్యా బాల‌న్‌. ఆమెను పెళ్లికి ముందూ, పెళ్లికి త‌ర్వాతా చాలా కాలం పాటు వేధించిన స‌మ‌స్య.. బ‌రువు! ఈమ‌ధ్య ముంబై టాబ్లాయిడ్ మిడ్‌-డేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లావు స‌మ‌స్య‌ను త‌గ్గించుకోడానికి సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎలాంటి పోరాటం చేస్తూ వ‌చ్చిందో వివ‌రంగా చెప్పుకొచ్చిందామె. "చాలా కాలం పాటు నేను నా బాడీని ద్వేషించాను. కార‌ణం, 'ఫ్యాట్ గాళ్‌'గా న‌న్నెప్పుడూ అంద‌రూ అభివ‌ర్ణించ‌డం. చిన్న‌ప్పుడు బొద్దుగా ఉన్న‌ న‌న్ను క్యూట్‌గా ఉన్నావ‌నేవాళ్లు. అలా అన‌డాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. నేను పెద్ద‌దాన్ని అవుతున్న‌కొద్దీ, ఇంత అంద‌మైన ముఖం పెట్టుకొని బ‌రువెందుకు త‌గ్గ‌వ‌ని జ‌నం అన‌డం మొద‌లుపెట్టారు. నా సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోతే, అది నా బ‌రువైన బాడీ వ‌ల్లేన‌ని భావించేదాన్ని. ఒకానొక స‌మ‌యంలో నా జీవితంలో నా శ‌రీర‌మే అతిపెద్ద స‌మ‌స్య‌గా నాకు క‌నిపించింది." అని చెప్పింది విద్య‌. దాంతో బ‌రువు త‌గ్గ‌డానికి ఏం చేసిందో వెల్ల‌డిస్తూ, "దెయ్యం ప‌ట్టినదానిలా వ‌ర్క‌వుట్స్ చేస్తూ, నాకిష్ట‌మైన తిండిని త్యాగం చేశాను. అనేక సంవ‌త్స‌రాలు అలా చేసినా, బ‌రువు పెరుగుతూనే ఉన్నాను కానీ త‌గ్గ‌లేదు. ఎప్పుడైనా బ‌రువు త‌గ్గితే, లావుగా ఉన్న‌ప్పుడే బాగున్నాన‌నిపించేది. కానీ మ‌ళ్లీ బ‌రువు పెరిగితే అదొక నైట్‌మేర్‌లా మారేది. నాకు 17 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న‌ప్పుడు రోజుల‌కు 10 లీట‌ర్ల నీళ్లు తాగితే బ‌రువు త‌గ్గుతాన‌ని ఎవ‌రో చెప్పారు. అలా చేయ‌డం మొద‌లుపెట్టాను. దాంతో దాదాపు ప్ర‌తి రోజూ రాత్రి వాంతి చేసుకొనేదాన్ని. మావాళ్లు భ‌య‌ప‌డిపోయి న‌న్ను డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకుపోయారు. నేనేం చేస్తున్నానో చెప్పిన‌ప్పుడు ఆయ‌న నాపై బాగా కోప్ప‌డ్డారు. నీళ్లు తాగ‌డం ఆప‌గానే, మ‌ళ్లీ లావైపోయాను. నా బాడీ టైప్‌ అలాంటిది. దాన్ని నేను మార్చ‌లేను." అని ఆమె చెప్పింది. చివ‌ర‌కు 2019లో త‌న హార్మోన్ల వ‌ల్లే ఇది జ‌రుగుతోంద‌ని రియ‌లైజ్ అయ్యింది విద్యా బాల‌న్‌. "యాక్ట‌ర్‌గా కొన‌సాగ‌డాన్ని నేను ఇష్ట‌ప‌డుతున్నాన‌నీ, మిగ‌తావేవీ ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేద‌నీ 2019లో అర్థం చేసుకున్నాను. నా శ‌రీర‌మే న‌న్ను లైవ్‌గా ఉంచుతోంది కాబ‌ట్టి అదేప‌నిగా ఎక్స‌ర్‌సైజ్‌లు చెయ్య‌డం మానేశాను. నాకేది తినాల‌నిపిస్తే అది తిన‌డం మొద‌లుపెట్టాను. దాంతో, నా హార్మోన్లు బ్యాలెన్స్ అవ‌డం ప్రారంభించాయి. నాకు తినాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా హ‌ల్వా తింటూ వ‌స్తున్నా. చాలా కాలం త‌ర్వాత ఇప్పుడు రెండు కిలోల బ‌రువు త‌గ్గాను." అంటూ త‌న వెయిట్ లాస్ అండ్ వెయిట్ గైన్ స్టోరీ చెప్పుకొచ్చింది విద్యా బాల‌న్‌.

ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని ఛాలెంజింగ్ రోల్‌లో స‌మంత‌!

  ద‌క్షిణాది టాప్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. త‌న ప‌ర్ఫార్మెన్స్‌తోనే కాకుండా త‌న అంద‌చందాల‌తోనూ మెస్మ‌రైజ్ చేసే న‌టి. చివ‌ర‌గా ఆమె 'జాను' సినిమాలో టైటిల్ రోల్‌లో క‌నిపించింది. త‌మిళ హిట్ ఫిల్మ్ 96కు అది రీమేక్‌. అయితే త‌మిళ ఆడియెన్స్‌కు మాదిరిగా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆ సినిమా అల‌రించ‌లేక‌పోయింది. కార‌ణం.. అందులోని కంటెంట్‌, స్లోగా ఉన్న నెరేష‌న్ అనేది విమ‌ర్శ‌కుల అభిప్రాయం. కాగా త‌మిళ డైరెక్ట‌ర్ అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్‌తో ఓ హార‌ర్ మూవీ చేయ‌డానికి ఆమె అంగీక‌రించింద‌నే విష‌యం మ‌న‌కు తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివ‌రాలు తాజాగా వెల్ల‌డ‌య్యాయి. స్నేహ భ‌ర్త ప్ర‌స‌న్న ఓ కీల‌క పాత్ర చేస్తోన్న ఈ థ్రిల్ల‌ర్‌లో స‌మంత ఓ దివ్యాంగురాలిగా క‌నిపించ‌నున్న‌దని స‌మాచారం. స్త్రీ ప్ర‌ధాన చిత్రంగా త‌యార‌య్యే ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొంద‌నున్న‌ది. కొంత కాలం క్రితం తాను ఈ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌స‌న్న వెల్ల‌డించ‌గా, ఇటీవ‌ల స‌మంత సైతం "ఇది కేవ‌లం హార‌ర్ ఫిల్మ్ మాత్ర‌మే కాదు, దానికి మించింది." అని ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదివ‌ర‌కు ఓంకార్ డైరెక్ట్ చేసిన హార‌ర్ ఫిల్మ్‌ 'రాజుగారి గ‌ది 2'లో ఆత్మ‌గా క‌నిపించిన స‌మంత‌, ఈ మూవీలో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రోల్‌లో క‌నిపించ‌నుండ‌టం ఖాయం.

సుశాంత్‌తో బ్యాంకాక్‌కు వెళ్లిన‌ట్లు ఒప్పుకున్న సారా!

  దీపికా ప‌డుకోనే, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, సారా అలీఖాన్ లాంటి పేరుపొందిన తార‌లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) ఇంట‌రాగేష‌న్‌కు హాజ‌రై అధికారులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కొత్త అంశాలు, ర‌హ‌స్యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని రిపోర్టులు తెలియ‌జేస్తున్నాయి. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో డ్ర‌గ్స్ తీసుకున్నారా అనే ప్ర‌శ్న‌కు తాము తీసుకోలేద‌ని ర‌కుల్‌, శ్ర‌ద్ధ తెలిపారు. అయితే త‌న మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాష్‌తో డ్ర‌గ్ చాట్స్ చేసిన‌ట్లు దీపికా ప‌డుకోనే అంగీక‌రించింద‌నే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అలాగే, సుశాంత్‌తో అనుబంధం విష‌య‌మై సారా అలీఖాన్ సైతం ఓ విష‌యం అంగీక‌రించింద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఎన్సీబీ ఇంట‌రాగేష‌న్ సంద‌ర్భంగా, బ్యాంకాక్‌ ట్రిప్‌కు సుశాంత్‌తో క‌లిసి వెళ్లిన‌ట్లు ఆమె ఒప్పుకుంద‌ని టైమ్స్ నౌ తెలిపింది. అయితే అత‌నితో క‌లిసి డ్ర‌గ్ తీసుకోలేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. స్నేహితుల‌తో క‌లిసి వెళ్ల‌డానికి బ్యాంకాక్‌ ట్రిప్ కోసం సుశాంత్ ఓ చార్ట‌ర్ ప్లేన్ బుక్ చేశాడ‌నీ, వాళ్ల‌తో పాటు సారా కూడా వెళ్లింద‌నీ, సుశాంత్ ఫ్రెండ్స్ వెల్ల‌డి చేసిన విష‌యంపై ఎన్సీపీ దృష్టి సారించింది. దానిపై సారాను ప్ర‌శ్నించింది. ఆ టైమ్‌లో సుశాంత్‌, సారా డేటింగ్‌లో ఉన్నార‌ని కూడా ఫ్రెండ్స్ వెల్ల‌డించారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

బాలు కోసం వెంకయ్య హోమం.. అందుకే ప్రకటన ఆలస్యం?

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎస్పీ బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. తెలుగు సినీ లోకమైతే ఎస్పీ బాలు మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.    ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది ఆయన అభిమానులు పూజలు చేశారు. సినీ తారలు బాలు క్షేమం కోసం ప్రత్యేక హోమాలు, వ్రతాలు చేశారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎస్పీ బాలు కోలుకోవాలని ఎంతో తపించారు. ఆయన కోసం పూజలు చేశారు. ఇక బాలు ఆరోగ్యం క్షిణించదన్న వార్తతో వెంకయ్య నాయుడు తీవ్ర మనో వేదనకు గురయ్యారట. బాలు కోసం ఆయన శుక్రవారం రోజున ప్రత్యేక హోమం చేశారని తెలుస్తోంది. అందుకే బాలసుబ్రమణ్యం మరణవార్తను అధికారికంగా ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలసుబ్రమణ్యంను రక్షించడం ఇక కష్టమని డాక్టర్లు చెప్పినా.. వెంకయ్య నాయుడు హోమం చేస్తుండటంతో కొన్ని గంటల పాటు అందరూ వెయిట్ చేశారని తెలుస్తోంది. చివరకు రెండు గంటలు ఆలస్యంగా బాలు చనిపోయారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారని చెబుతున్నారు. బాలు ఆరోగ్యం క్షేమం కోసం వెంకయ్య నాయుడు ప్రత్యేక హోమం చేశారంటే.. ఆయనపై వెంకయ్యకు ఎంతో అప్యాయత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత!!

అధికార పార్టీలోకి వలసలు సహజం. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని తెలుస్తోంది. కాగా, మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్న వేళ.. టీడీపీలో వలసలు ఊపందుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అదీగాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎల్బీనగర్‌ కు చెందిన నేత పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరడం.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టిదెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమరావతికి పట్టిన పీడ విరగడైందట.. జీవీఎల్ పై నెటిజన్ల సెటైర్లు 

బీజేపీ అధిష్టానం కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలనుండి డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్ పుత్రిక పురందేశ్వరి ఉన్నారు. అయితే ఇప్పటివరకు వివిధ పదవులలో ఉన్న రామ్ మాధవ్, మురళీధర్ రావులకు మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ప్రస్తుతానికి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజా లిస్ట్ లో జీవీఎల్ పేరు కనిపించకపోవడం తో సోషల్ మీడియాలో దీని పై అపుడే పెద్ద చర్చ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ ఉన్న సమయంలో ఇసుక పాలసీ నుండి.. అమరావతి వరకు అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వం పై అయన ఇలా విమర్శలు చేయగానే అలా డీల్లీనుండి ప్రత్యక్షమై అబ్బే అలాంటిదేం లేదు.. జగన్ ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తోంది.. అసలు తప్పంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే అంటూ విరుచుకుపడిన సీన్లు గుర్తుకు తెచ్చుకుని మరీ హమ్మయ్య అమరావతికి పట్టిన పీడా విరగడైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమరావతి విషయంలో అయన వ్యవహరించిన తీరుతో ఏపీ ప్రజలలో బీజేపీకి ఉన్న కాస్త సపోర్ట్ కూడా పోయి.. ఆ స్థానంలో ద్వేషం ఏర్పడేలా చేయడంలో అయన సక్సెస్ అయ్యారని కూడా సెటైర్లు పడుతున్నాయి. జీవీఎల్ తెలుగువారైనా యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ.. తాజాగా స్పైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన విషయం తెల్సిందే. దీంతో ఇప్పటి నుండి అయన ఏపీ పైన పెద్దగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని దీంతో ఏపీలో బీజేపీ కూడా కోలుకునే అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో కొందరు ఆశావహుల అభిప్రాయం.

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.