చర్చా ... రచ్చా ...

Publish Date:Dec 26, 2013

      నూతన సంవత్సరారంభంలోనే సంక్లిష్టమైన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుర్కోబోతోంది. తెలంగాణా ముసాతిడా బిల్లు రూపంలో రానున్న ఆ కీలక సందర్భానికి మా శాసనసభ్యులు సిద్ధమయ్యారా? మా తరపున పదునైన అస్త్రశస్త్రాలు సంధించనున్నారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గాలు నిన్నం ఒన్నటి దాకా సీమాంధ్ర, తెలంగాణాల పేరిట సమాంతరంగా చీలిపోయి ఉన్నట్టు కనపడడంతో ఎవరి ధోరణి ఎలా వుంటుందనేది కనిసం ఊహకు అందేది, అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రెండు ముక్కలు కాకముందే ప్రజాప్రతినిథులు ఇరవై ముక్కలు ఇంకా ఎక్కువగానే అయిపోయినట్టు అనిపిస్తోంది.   ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిథుల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చాక జరిగేది ఏమిటనేది సరైన విధంగా అంచనా వేయడం రాజకీయ విశ్లేషకుల వల్ల కావడం లేదు. వ్యూహాత్మకంగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి చర్చలో కీలకం కానుంది. ఇప్పటికే సి.ఎం. వైఖరి పట్ల తెలంగాణ మంత్రుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, సీమాంధ్ర మంత్రుల్లోనూ కొందరి నుండి అదే స్థాయి వ్యతిరేకత తప్పడం లేదు. నిన్నా మొన్నటిదాకా సిఎంకు అత్యంత అనుకూలంగా వ్యవహరించే కొండ్రు మురళి వంటి మంత్రులు సైతం విభజనకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతుండడం చూస్తుంటే ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో అర్థంకాని పరిస్థితి. మరోవైపు చర్చలో పాల్గొన్నప్పుడు బిల్లులోని విభిన్న అంశాలపై ఆయా రంగాలకు చెందినా మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. విద్యుత్, నదీజలాలు, శాంతిభద్రతలు, రాజధాని ... ఇలా ఒక్కో అంశంపై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటిదాకా సీమాంధ్ర మంత్రులెవరూ ఆయా అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకుంటున్న దాఖలాలు లేవు, అన్నింటికీ ఆయాదే భారం అన్నట్టు ముఖ్యమంత్రిపై నెపం నెట్టేస్తున్నారు. గెలిచినా, ఓడినా .. సమైక్యాంద్ర కోసం పోరాడిన ఏకైన వీరుడి క్రెడిట్ కోసం నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రికి ఇది కూడా ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ మంత్రులు పక్కాగా రెడీ అవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ... మూడున అసెంబ్లీకి రానున్న తెలంగాణ బిల్లుపై చర్చ ... ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.
  అనంతపురంలో కాంగ్రెస్ పార్టీకి జేసీ.దివాకర్ రెడ్డి కుటుంబము, తెదేపాకు పరిటాల కుటుంబము పాతకాపుల వంటివి. వారివల్లనే అక్కడ ఆ రెండు పార్టీలు నువ్వా నేనా? అన్నట్లు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలో రాష్ట్ర విభజన రగిల్చిన చిచ్చుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. వారిలో జేసీ.దివాకర్ రెడ్డి కూడా ఒకరు.   ఈ విభజన చిచ్చుకు తోడు రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన తరువాత దివాకర్ ట్రావెల్స్ సంస్థకు చెందిన అనేక బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాలతో రవాణాశాఖా అధికారులు కేసులు నమోదు చేసి కదలనీయకుండా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఈ సాకుతో బొత్ససత్యనారాయణ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్న, దివాకర్ రెడ్డి నేరుగా సోనియా గాంధీ, బొత్ససత్యనారాయణలపై విమర్శలు ఆరంబించారు. ఈ కధ ఇప్పుడు షో-కాజ్ నోటీసుల క్లైమాక్స్ సీనుకి చేరుకోవడంతో, జేసీ బ్రదర్స్ వేరే పార్టీలోకి మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.   అనంతపురంలో ఇంతవరకు పరిటాల కుటుంబంపైనే ఆధారపడి ఉన్నతెదేపా, ఇదే అదునుగా జేసీ కుటుంబాన్నికూడా పార్టీలోకి రప్పించగలిగితే, ఇక జిల్లాలో తమ పార్టీకి తిరుగే ఉండదని భావించి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ కుటుంబాన్ని తెదేపాలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను పరిటాల కుటుంబం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తాము పార్టీని వీడక తప్పదనే బలమయిన సంకేతాలు కూడా ఇచ్చారు.   అయితే ఎలాగయినా పరిటాల సునీతను ఒప్పించి, కనీసం దివాకర్ కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని తెదేపా ప్రయత్నిస్తోంది. పవన్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరిక దాదాపు ఖాయమయినట్లు తాజా సమాచారం. జేసీ బ్రదర్స్ తెదేపాలో చేరకపోయినా, పవన్ కుమార్ రెడ్డికి తెదేపా టికెట్ కూడా ఇచ్చేందుకు సంసిద్దత చూపుతుండటంతో షాక్ తిన్నజిల్లా తెదేపా ఇన్-చార్జ్ పేరం నాగిరెడ్డి కుటుంబంతో సహా తేదేపాకు గుడ్ బై చెప్పి వైకాపాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన కోడలు సరోజినీ దేవికి టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తాజా సమాచారం.   ఇంతకాలం జిల్లాలో తెదేపాకు వెన్నుదన్నుగా నిలచిన పరిటాలను జేసీ కుమారుడి కోసం తెదేపా వదులుకోగలదా? లేక పరిటాల కుటుంబం తాము తీవ్రంగా వ్యతిరేఖించే జేసీ కుటుంబం వచ్చి పార్టీలో జేరితే వారితో ఇమడగలదా? పరిటాల సునీత ఏవిధంగా స్పందిస్తారో త్వరలోనే తెలియవచ్చును.
  భారత దౌత్యాధికారి దేవయాని కొబ్రాగడే అరెస్ట్ వ్యవహారంలో మొదట భారత్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడటంతో, దేవయాని స్వయంగా కోర్టుకి హాజరవనవసరం లేకుండా అమెరికా మినహాయింపు ఇవ్వడంతో క్రమంగా అంతా సర్దుకొంటోందని అందరూ భావిస్తున్నతరుణంలో, అమెరికా దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్నఉద్యోగుల గుర్తింపు కార్డులను, వారికి భారత్ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను అన్నిటినీ భారత్ రద్దు చేసి, వారికి కూడా భారత్ దౌత్యకార్యాలయాలో పనిచేసే ఉద్యోగులకు అమెరికా ఎటువంటి కార్డులు, సౌకర్యాలు ఇస్తుందో అటువంటివే ఈ రోజు జారీ చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది.   దేవయానిపై అమెరికా పోలీసులు మోపిన కేసుని రద్దు చేసి, ఆమెపట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు అమెరికా క్షమాపణ చెప్పాలని భారత్ కోరుతోంది. అయితే అందుకు అంగీకరించబోమని అమెరికా తెగేసి చెప్పడంతో, దేవయానికి అమెరికా చట్టాల నుండి రక్షణ కల్పించేందుకు ఆమెను ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా శాశ్విత ప్రాతిపాదికన నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానివలన ఆమెపై అంతకు ముందు మోపబడిన కేసుల నుండి విముక్తి కలిగించలేవని అమెరికా చెప్పడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అమెరికా దౌత్య ఉద్యోగులకు భారత్ కల్పిస్తున్న విశేష సౌకర్యాలను అన్నిటిని రద్దు చేసి, భారత్ దౌత్య ఉద్యోగులతో అమెరికా ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో భారత్ కూడా అమెరికా ఉద్యోగులతో అదేవిధంగా వ్యవహరించాలని నిశ్చయించుకొని తదనుగుణంగా చర్యలు చెప్పట్టింది.   ఈగొడవకంతటికీ కారణమయిన దేవయాని ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్తను, భారత ప్రభుత్వానికి తెలియజేయకుండా భారత్ నుండి అమెరికా తన స్వంత ఖర్చులతో రహస్యంగా అమెరికాకు తరలించడంతో అమెరికా కూడా భారత్ కోర్టుల దృష్టిలో నేరం చేసినట్లయింది. దేవయాని అరెస్ట్ తరువాత నుండి రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నపటికీ, అమెరికా ఇసుమంత కూడా వెనక్కి తగ్గేందుకు సముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.   ఈ వ్యవహారం చివరికి ఏ విధంగా ముగుస్తుందో, ఏ పరిణామాలకు దారి తీస్తుందో కాలమే చెప్పాలి. మారుతున్న కాలంతో బాటు అమెరికా కూడా తన పెద్దన్న ధోరణిని వదులుకొని అందరితో సమానంగా మెలగడం నేర్చుకోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్ అన్నారు.
      ఎన్నికల్లోగా తెలంగాణ రావడం అనుమానస్పందంగా మారినట్టే .. కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కూడా సందేహాస్పదంగా మారింది. గత రెండ్రోజులుగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. సోమవారం విలేఖరులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ... తెరాస విలీనంపై అడిగిన ప్రశ్నలకు మండిపడ్డారు.   అసలు విలీనానికి తెలంగాణా అంశానికి సంబంధం ఏముందంటూ రంకెలేశారు. తెలంగాణా ఏర్పటనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ అనీ, విలీనం పార్టీల మధ్య విషయం అనీ గుర్తు చేశారు. అదే తరహాలో మంగళవారం ఏఐసిసి నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. తాము మాత ఇచ్చాం కాబట్టి తెలంగాణా ఇస్తున్నామన్న దిగ్విజయ్ .. దీనికి విలీనానికి సంబంధం లేదన్నారు. మరి ఇప్పుడిలా మాట్లాడుతున్నా ఇదే నేతలు తెలంగాణ ఇస్తామన్న ప్రకటన వెంటనే తెరాస విలీనం గురించి ఎందుకు మాట్లాడారంటూ రాజకీయ వార్తాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ కుట్రలో భాగంగానే విలీనంపై రెండు పార్టీలు వెనక్కి తగ్గాయనే వాదన వినిపిస్తోంది.
      ఇద్దరు లబ్దిప్రతిష్టులైన, తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులనదగ్గ ప్రముఖుల విషయంలో సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సినిమా రంగాన్నే కాకుండా యావత్ రాష్ట్రానికి ఓ షాక్ ఇచ్చింది. నిజానికి పద్మశ్రీ పురస్కారాలను ప్రచారానికి వినియోగించుకోవడం అనేది ఒక్క సినిమారంగానికి మాత్రమే పరిమితం కాదు ... మిగిలిన రంగాలలో కూడా ఉంది. సంస్థ బ్రోచర్ల మీద కూడా పద్మశ్రీలు ముద్రించుకుంటున్నవారున్నారు. తమ పేరుకు ముందు ఈ తరహా పురస్కారాలను రాయకపోతే మీడియా ఆఫీసులకు ఫోన్ లు చేసి మరీ తిట్టే ప్రముఖులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తేర్పుఇ ఇలాంటి వారిలో మార్పుకు దోహదపడుతుందేమో చూడాలి. పురస్కారం పొందిన వ్యక్తి తనకు దక్కిన గౌరవాన్ని పెంపొందించుకునేలా ప్రవర్తించాలే తప్ప దాన్ని మార్కెట్ చేసుకోవాలనుకోవడం తగదనే విషయాన్ని పురస్కారగ్రహీతలు గుర్తుంచుకోవాలి. అలాంటి జ్ఞానోదయం కలిగితే ... ఏటేటా  సదరు పురస్కారాల కోసం ఎగబడే ప్రముఖుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.
      ఏదైతేనేం ఆమాద్మీ అనే సరికొత్త పార్టీ తొలిసారి భారతరాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుల్ని స్వంతం చేసుకుని సగర్వంగా అధికారాన్ని అలంకరించనుంది. సామాన్యుడి పక్షం అనే ఆకర్షణీయమైన నినాదంతో అవినీతిని ఊడ్చేస్తాననే అద్భుతమైన ఆశాదీపం వెలుగుల్లో దూసుకొచ్చిన ఈ పార్టీని జనం ఆదరించిన తీరు ... సంప్రదాయ పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశా నిస్పృహలకు నిలువుటద్దంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారానికి అవసరమైనన్ని సీట్లు రాకపోయినా ప్రజాభిప్రాయం మేరకు పాలనా పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆమాద్మీ ఇకపై ఎలా పనిచేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. విఐపి సంస్కృతికి చరమగీతం పాడడం, ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కలిగించడం, కాలనీల క్రమబద్ధీకరణ, పక్కా ఇళ్ళ నిర్మాణం ... వంటి ఎన్నో జనాకర్షక, విప్లవాత్మకమైన ప్రణాళికలను ప్రకటించిన ఆమాద్మీ ఆచరణలో అదీ మైనారిటీ ప్రభుత్వంతో ఎలా అమలు చేస్తుందనేది ప్రతిఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి అంగీకరించడం ఆమాద్మీకి తొలి మైనస్ పాయింట్. సరే ... ఇప్పుడు తప్పనిసరై తీసుకున్నామనో, ప్రజలు చెప్పారు కాబట్టి అంగీకరించామనో సమర్థించుకోవచ్చు. అయితే అధికారం కోసం భవిష్యతులో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తడం అనేది చేయకుండా, అవసరమైతే పదవుల్ని తృణప్రాయంగా వదులుకోగాలగాలి. అప్పుడే ఆమాద్మీ నిఖార్సయిన సామాన్యుడి పార్టీగా మనగలుగుతుంది. విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పార్టీలు ఎక్కువకాలం కొనసాగడం, పాలనా పరంగానూ విజయవంతం కావడం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవం తెలుసు కాబట్టి ... మిగిలిన పార్టీలు, వాటికి అండగా ఉండే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, మాఫియాలు ... ఆమాద్మీ తరహా రాజకీయం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే భయంతో ఉన్న బలమైన నేతలు... కేజ్రీవాల్ కు అడుగడుగునా అడ్డంకులు సృస్టిస్తారనే విషయంలో సందేహం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, అధికారం అనే ఆకర్షక వలయంలో చిక్కుకోకుండా ఐదేళ్ళ పాటు ఆమాద్మీ స్వచ్చమైన పాలనను, జవాబుదారీ వ్యవస్థను అందించగలిగితే ... అది నిజంగా అద్భుతమే. అలా జరగాలని ఆశిద్దాం. ఆ అద్భుతం భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పాలని కోరుకుందాం.
  సాదారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ పుత్రరత్నాలకు తమ పార్టీ టికెట్స్ ఇప్పించుకొని వారు రాజకీయాలలో స్థిరపడిన తరువాత రిటర్మెంట్ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలులు వీస్తుండటంతో వారే కాదు, వారి పుత్రరత్నాలకు కూడా తెదేపా, వైకాపాలలో టికెట్స్ కోసం మాట్లాడుకొంటున్నారు.   కాంగ్రెస్ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు మరియు సినీ నటుడు కృష్ణకి అల్లుడు అయిన గల్లా జయదేవ్ తెదేపా తీర్ధం పుచ్చుకోనేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనది చిత్తూరు జిల్లా అయినప్పటికీ, అత్తవారిది గుంటూరు కావడంతో అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు ఆయనకు టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి కొడుకు పచ్చ కండువా కప్పుకొంటే, మంత్రిగారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కొడుకు పార్టీని తిట్టడం కష్టం గనుక మరి ఆమె కూడా తెదేపాలోకి జంపయిపోతారేమో చూడాలి. ఇక బావగారి కోసం మహేష్ బాబు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది గనుక, జయదేవ్ కి టికెట్ ఖాయం చేయడం వల్ల తేదేపాకు లాభమే తప్ప నష్టమేమి ఉండకపోవచ్చును.   జయదేవ్ తో బాటు సినీ నటుడు కృష్ణ సోదరుడు మరియు సినీ నిర్మాత అయిన జీ.ఆదిశేషగిరి రావు తెనాలి నుండి తెదేపా టికెట్ పై శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం తెనాలికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు (పశ్చిమం) నుండి పోటీ చేయవలసిందిగా చంద్రబాబు కోరినప్పటికీ, ఆయన తన నియోజక వర్గం వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ యంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చినట్లయితే తెదేపా సైకిల్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు.  
  మన మెగామంత్రి చిరంజీవి మహోదయులు మీడియా ముందుకు వచ్చి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయవలసిన అవసరం గురించి తడబడుతూనే అనర్గళంగా ఒక ఉపన్యాసం ఇచ్చేసి మాయమయిపోతే, ఆ తరువాత ఆ స్థానంలోకి ఏ సబ్బంహరో లేక కిల్లి రాణీగారో ముందుకు వచ్చి మైకు పట్టుకొని సీమాంధ్ర ప్రజలపై తమ కృపా కటాక్షాలు కురిపించి మళ్ళీ కొన్ని రోజులు కనబడకుండా మాయమయిపోతారు. మధ్య మధ్యలో మన లగడపాటి రాజగోపాల్ గారు ప్రత్యక్షమవుతూ గంటలకొద్దీ అనర్గళంగా ఏవేవో మాట్లాడేసి ప్రజలను కన్ ఫ్యుస్ చేసేస్తుంటారు.   వారి మధ్యలోకి టామ్ అండ్ జెర్రీలాగ మన బొత్ససత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి ఎంటరయి కాసేపు హడావుడి చేసి అందరికి కితకితలు పెట్టి మాయమయిపోతుంటారు. ఇక రాష్ట్ర విభజన గురించి గుర్తొచ్చినప్పుడల్లా పాపం! మన ఆనం బ్రదర్స్ వచ్చి తమకు తోచినదేదో మాట్లాడుతూనే ఉన్నారు. గనుక, వారిని తప్పుపట్టడానికి కూడా లేదు. ఈ విధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని జనాలతో పూర్తి టచ్చులో ఉంటూనే మళ్ళీ అదే జనాలకి ఎక్కడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప టెక్నిక్కేనని జనాలు సైతం ఒప్పుకొంటున్నారు కూడా.   పాపం! ఈ టెక్నిక్ ఆకళింపుజేసుకోలేని పెద్దాయన కావూరి సాంభశివరావు వంటి అమాయక మంత్రులు మాత్రం పంచె ఎగేసుకొని జనం మధ్యకి వెళ్లి కోడిగుడ్లతో సన్మానం చేయించుకొని ఆగ్రహంతో “ఒరే! సన్నాసుల్లారా! అర్ధ రూపాయికి కూడా కక్కుర్తి పడే వెదవాల్లారా...ఆ...లంచాలు పెట్టందే ఏ పని చేయని వెదవల్లారా...ఆ...నా మీదే కోడిగుడ్లు విసురుతారా? దమ్ముంటే దగ్గరకి రండి..మీ పని చెపుతాను..”అంటూ పోలీసుల చాటున నిలబడి మైకు పట్టుకొని రంకెలు వేస్తుంటే జనాలు ఆయన తిట్లు విని కోపం తెచ్చుకోకుండా “పాపం! మంత్రిగారు” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటూంటే, ఆయన మాత్రం ఫీలవరూ పాపం!   అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనంత అమాయకులేమీ ఉండరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్న కిల్లి రాణీవారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుని, ఆయన అనుచరులకి “మీ లిమిట్స్ గుర్తుంచుకోండి” అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసిన తరువాత, తను సమైక్యవాదిననే మరో మారు కన్ఫర్మ్ చేసేసి మాయమయిపోయారు. "రాక రాక వచ్చిన కేంద్రమంత్రి పదవిని చస్తే వదులుకోనని" బల్లగుద్ది చెప్పిన మన జేడీ శీలంగారు ఇక తనను రాజీనామా చేయమని ఎవరూ డిమాండ్ చేయరని రూడీ చేసుకోన్నాక, ఈ మధ్యనే మీడియా ముందుకు వచ్చి సమైక్యం కోసం "నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని" డిక్లరేషణ్ ఇచ్చేసి మాయమయిపోయారు.   ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చిన వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరిగారు, “ఉమ్మడి రాజధాని కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోనే లేదు. నేను అన్ని సమస్యలను వివరిస్తూ మా సోనియమ్మకు, మన్మొహనుల వారికి రెండు ఉత్తరం ముక్కలు కూడా వ్రాసిపడేశాను. వాళ్ళు పంపిన టీ-బిల్లులో  ప్రింట్ కూడా సరిగ్గా లేదని వాటిలోనే నాలుగక్షరాలు గీకి పడేసాను. అందువల్ల మీరిక నిశ్చింతగా ఉండండి. ఇదివరకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితేనే వినని మావాళ్ళు ఇప్పుడు నేను వ్రాసి పడేసిన ఈ ఉత్తరం ముక్కలను మాత్రం పట్టించుకొంటారా? వాటిని చింపి చెత్త బుట్టలో పడేయారా? అని వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి నన్ను తికమక పెట్టకండి. ఒకవేళ వారు నాఉత్తరం ముక్కలని పట్టించుకోకపోతే, నేను కూడా తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఓటేయకుండా వచ్చేస్తాను. మదర్ ప్రామిస్! అని సీమాంధ్ర ప్రజలకు ప్రామిస్ చేసేసిన తరువాత, ఆమె  కూడా మళ్ళీ జనాల మధ్య నుండి మిస్ అయిపోయారు. జనాలు.. జనాలు...తరువాత ఎవరు మాట్లాడుతారో మీకేమయినా తెలిస్తే చెప్పి పుణ్యంకట్టుకోరా... ప్లీజ్!
  యువరాజవారు “నాన్సెన్’ అని అన్నంత మాత్రానే ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు సైతం చిరిగి చెత్త బుట్టలోకి తరలిపోతాయి. ఆయన కనుసైగ లోక్ పాల్ బిల్లు ఎగురుకొంటూ పార్లమెంటు ఆమోదం పొందేస్తుంది. ఆయన తీక్షణంగా చూస్తే చాలు...కొమ్ములు తిరిగిన కేంద్ర మంత్రులు కూడా తత్తరపడుతూ తమ పదవులకు రాజీనామాలు చేసేసి, పార్టీ సేవకి బిరబిరా పరుగులు తీస్తారు. మరి ఇంత పవర్ఫుల్ యువరాజవారు మనదేశంలో అనేక వ్యవస్థలు కొంత మంది వ్యక్తుల చెప్పుచేతలలో నడవడం చాలా అన్యాయమని వాపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్‌ఐసిసిఐ -ఫిక్కీ) సమావేశంలో యువరాజవారు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం, వ్యవస్థలో అవినీతి పీల్చిపిప్పి చేసేస్తున్నాయని పాపం! చాలా బాధపడిపోయారు.   ఇంత బాధపడుతున్నమన మోస్ట్ పవర్ఫుల్ యువరాజవారు ఉల్లిపాయలు మొదలు బియ్యం, పప్పులు, నూనెల వరకు ప్రతీ వస్తువుల ధరలు రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతూ సామాన్యుడి బ్రతుకుభారం చేస్తుంటే మరి దానిని అరికట్టడానికి ఆయన ఏమి చేసారు? ఆయన ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నశరత్ పవార్ మహారాష్ట్రలో ఉల్లి, చెరుకు, పంచదార మార్కెట్లను తన గుప్పిట్లో పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తుంటే యువరాజవారు ఎందుకు చూస్తూ ఊరుకోవలసి వచ్చింది?   కోట్లాది ప్రజలు, పసిపిల్లలు ఒకపూట అన్నానికి కూడా నోచుకొక ఆకలి చావులు చస్తుంటే, మరోవైపు గోదాములలో లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలు ముక్కిపోతుంటే కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదిలించినా యువరాజవారు ఎందుకు మేల్కొనలేదు? సమస్యలను గుర్తించినప్పుడు వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, పేదరికం గురించి, సామన్యుల సమస్యలు, కష్టాల గురించి ఎంతో బాధపడిపోతూ ఎన్నిఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా వాటివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు.   అధికారం, ప్రభుత్వం అన్నీతన చేతిలో ఉంచుకొని, “సమస్యలు తీర్చవలసి ఉంది. అవినీతిని తొలగించవలసి ఉంది. అధిక ధరలు తగ్గించవలసి ఉంది. ప్రభుత్వం పనిచేయవలసి ఉంది” అంటూ ప్రజల వద్దకు వచ్చి చెప్పడం తమ చేతకాని తనాన్ని ప్రదర్శించుకోవడమే.   ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహ ప్రయోగంలో విఫలమయితే, అది ఎందుకు విఫలమయిందో తెలుసుకొని ఆలోపాలను సవరించుకొంటూ ముందుకు సాగుతున్నందేనే నేడు వారు మనదేశానికి గర్వకారణమయిన ‘మంగళ యాన్’ న్ని దిగ్విజయంగా ప్రయోగించగలిగారు. మరి అదేవిధంగా దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేటికీ తమ ప్రభుత్వంలో, వ్యవస్థలలో లోపాలను సరిచేయడంలో ఎందుకు అశ్రద్ద వహిస్తోంది? అంటే దానికి చిత్తశుద్ది కొరవడటమే కారణమని చెప్పవచ్చును.   ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నమన యువరాజవారు, తను గుర్తించిన ఈ సమస్యలను సవరించడానికి, సరిద్దదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా మైకు, ప్రేక్షకులు, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వలన ఏమి ప్రయోజనం? మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆ మాటలకు కూడా ఎటువంటి విలువ ఉండదు. అదే పొంతన ఉంటే అది అమాద్మీలా తిరుగులేని ప్రజామోదం పొందుతుందని రుజువయింది కూడా. ప్రజలలో ఇంత రాజకీయ చైతన్యం చూసిన తరువాత కూడా వారిని ఇంకా ఇంకా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో మెప్పించగలమని ఆయన భావిస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీయే నష్టపోవడం తధ్యం.
      ఇళ్ళు కాలి ఒకడేడుస్తుంటే...చలిమంట వేసుకుంటాం అన్నట్టుంది దేశంలో రాజకీయ పార్టీల తీరు. మనదేశపు మహిళా దౌత్యాధికారి 'దేవయాని'కి జరిగిన అవమానం అమెరికా భారత్ ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే౦త స్థాయికి చేరిన విషయం తెల్సిందే. 'దేవయాని'పై అమెరికా అధికారులు తీరును నిరసించిన భారత్, క్షమాపణతో పాటు ఆమెపై అక్రమ౦గా బనాయించిన కేసుల్ని సైతం ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది.   మరోవైపు తన కూతురి పట్ల అగ్రరాజ్యం వ్యవహరించిన పద్దతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 'దేవయాని' తండ్రి ఉత్తమ్ క్షమాపణ,కేసుల ఉపసంహరణ కోరుతూ ఆమరణ దీక్షకు సైతం దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు అమెరికా వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాయి. ఇంత గందరగోళ౦ నేలకొంటుంటే..సమాజ్ వాదీ పార్టీల అవన్నీ  వదిలేసి 'దేవయాని'కి పార్టీ టిక్కెట్ ఆఫర్ చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ చూడడం సిగ్గుచేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు...ఇటీవల సచిన్ టెండూల్కర్ ను సైతం రమ్మంటూ సమాజ్వాదీ పార్టీ ఆహ్వానించడాన్ని వీరు గుర్తు చేస్తూ పార్టీ సిద్దాంతాల మీద కాకుండా వ్యక్తుల పాప్యులారీటీ మీద ఆధారపడి ఆ పార్టీ నడవాలనుకుంటో౦దని అంటున్నారు.                                                                                   
  ట్వీట్ వీరుడు నారా లోకేష్ అప్పుడప్పుడు జనాల మధ్యకు కూడా వచ్చిహడావుడి చేస్తుంటారు. నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ వర్కుషాపులో పాల్గొన్నఆయన తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్, వైకాపా, తెరాసలపై సునిశితమయిన విమర్శలు చేసారు. నిత్యం తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే వైకాపా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, “తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో చంద్రబాబు చొరవ వల్ల రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తరలి వచ్చిఎనలేని సంపదను సృష్టిస్తే, ఆ తరువాత వచ్చిన వైయస్సార్ ప్రభుత్వం వెనుకుండి కధంతా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ధాటికి కొత్తగా ఒక్క ఐటీ కంపీనీ కూడా రాష్ట్రానికి రావడానికి భయపడ్డాయని, వైయస్స్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఫ్యాబ్ సిటీలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేకపోయినా, అనేకమంది అధికారులను, మంత్రులను వ్యాపారవేత్తలను కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాయని లోకేష్ ఎద్దేవా చేసారు. వైయస్స్ మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు వల్ల కూడా ప్రజలకు ఎటువంటి లాభం కలగకపోయినా, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నివిధాల లాభపడ్డారని ఆరోపించారు.   జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.   తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు.   తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేసారు. తెదేపా-కాంగ్రెస్-వైయస్సార్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై తెదేపా చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు.   సమావేశంలో పాల్గొన్న యువత నుద్దేశించి మాట్లాడుతూ అవినీతిపరుడయిన జగన్ కావాలో, లేకపోతే డిల్లీ నుండి పిలుపు రాగానే చేతులు కట్టుకొని పరుగులుపెట్టే కాంగ్రెస్ నేతలు కావాలో లేకపోతే తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్దికి కృషి చేసే తెదేపా కావాలో మీరే నిర్ణయించుకోండని సలహా ఇచ్చారు.
    Vijaya Kumar Ponnada   'ఇవాళ చాలా సుధినం అని నేను మనవి చేస్తా వున్నాను. భారతదేశంలోనే అతి పెద్దయిన మా పార్టీ అధ్యక్షురాలికి గుడి కట్టడానికి ఇవాళ శంఖుస్థాపన చేసే భాగ్యం నాకు దక్కింది. ' అని వూపిరి ఓ సారి గట్టిగా పీల్చుకుని, మళ్ళీ మొదలెట్టాడు భజనరావు. 'నిజానికి ఆవిడ గారు మనకి చేసిన సేవలు ఇంతా అంతా కాదు. ఆ మాటకొస్తే ఆవిడ అసలు మనకి ఎందుకు చేయాలీ అని నేను ఈ సభా ముఖంగా మిమ్మల్నందరినీ ప్రశ్నిస్తా వున్నాను? ఆవిడదేమయినా మన పేటా? మన వూరా? మన రాష్ట్రమా? పోనీ మన దేశమా? కాదు ఎక్కడో ఇటలీలో పుట్టి ఇక్కడకొచ్చి మనల్ని వుద్దరిస్తున్నారు. మొన్న యన్నీబీసేంట్ అనే ఆవిడా, నిన్న మథర్ తెరెస్సా, ఇవాళ ఇక ఈవిడా. రేపు ఇక ఎవ్వరూ వుండరని నేను నొక్కి వొక్కాణిస్తున్నను.' మన దేశానికి వచ్చి, రాజీవుగాంధిగారి మరణాంతరం తిరిగి ఇటలీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నాలాంటి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలూ, చెల్లేళ్ళు ఆవిడకి అడ్డంగా నిల్చుని, మీకు మేమున్నాము, అని చెప్పి వొప్పించి, ఖాళీగా వుండకుండా, ఏదో కాలక్షేపానికి వారు వొద్దంటున్నా అందరం కలసి, పార్టీ అధ్యక్షపదవి ఇచ్చాము. ఇవాళ ఆవిడ అలా పార్టీ కుర్చీకి అత్తుక్కు పోయారంటే ఆవిడ నిరంతర కృషే అని వేరే చెప్పనక్కర్లేదు. గిట్టని వాళ్ళు, విపక్షాల వాళ్ళు ఆవిడకి పదవి కాంక్ష ఎక్కువంటారు. అదే నిజమయితే ఆవిడ ఈనాడు మన్మోహనంగారి స్థానంలో ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చునేవారు. నాకు తెలుసు ఆవిడ ప్రధాని మంత్రి అభ్యర్ధికోసం ఎంత శ్రమ పడ్డారో.' అని కళ్ళలోంచి వచ్చే నీళ్ళని చొక్కాతో తుడుచుకుంటూ, 'ఎన్నికలయ్యాకా ప్రధానిగ ఎవరిని కూర్చోపెట్టాలా అని ఆవిడ చాలా వ్యధ చెందారు. ఒకరోజు ఆవిడ తన డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు లోపల నుంచి మాటలు వినిపించాయి. 'లాభంలేదు సింగు గారు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పైగా వృధాప్యం వల్ల కాస్త చూపు మందగించింది, వినికిడి కూడా తగ్గింది. ఇక రెస్టు తీసుకోండి ' అన్న మాటలు వినిపించాయి. అప్పుడే సింగు గారు చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ, ఇక ఆగలేక పరిగెత్తుకుంటు వెళ్ళిపోయారు. అది చూసిన అమ్మాగారు, వెంటనే 'యూరేఖా ' అని అర్కెమిడిసులా అరచి 'నేను అనుకున్న లక్షణాలున్న ప్రధాన మంత్రి దొరికాడోచ్ ' అని ఆయన వెనకాలే పరిగెత్తుకెళ్ళి, ఆయన్ని పట్టుకుని ప్రధానిని చేసారు ' అన్నాడు భజనరావు. 'మన దేశానికి మన వారే ప్రధాని కావలన్నది ఆవిడా ఆకాంక్ష. ఆవిడ త్యాగనిరతికి ఓ తార్కాణం.' 'ప్రణభ్ ముఖర్జీ గారు రాజీవగాంధీగారితో పడక వేరే వాళ్ళ వూరెళ్ళిపోయి ఓ కుంపటి కొనుక్కుని, దానికి 'రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ ' అని పెట్టుకుని, స్వయం పాకం మొదలెట్టారు. అప్పుడు సొంతగా చెయ్యి కాల్చుకునే ఆయన్ని చూసి సదరు రాజీవ్గాంధీగారే జాలి పడి 'వేరే కుంపటి ఎందుకు, 'చెయ్యి ' కాలుతుంది, మాతో చెయ్యి కలిపేయండి ' అనేసరికి, ఆయన కుంపటి ఆర్పెసి, వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలసి పోయారు. మరి అలా సమయానికి వచ్చి చేరినా ఆతరువాత, నాకు ఇది కావాలీ అది కావాలీ అని పెచీ పెట్టలేదు. అది చూసి అమ్మగారు తాను 'భారతరత్న ' తీసేసుకోగల స్థితిలో వున్నా, అలాకాదని ప్రణబ్గారికి, 2008లో 'పద్మ విభూషణ్ ' బిరుదుని ఇచ్చేసారు. 'ఆతరువాత, ప్రధాని పోస్టు ఇవ్వరూ అని అడిగితే, చస్! వల్ల కాదు. కావస్తే రాష్ట్రపతి పదవి తీసేసుకోండి ' అని త్యాగం చేసారు ' అని మళ్ళీ చొక్కతో కళ్ళనీళ్ళు తుడుచుకుని, చొక్క తడిసిపోయిందని అది తీసేసి, మరో చొక్క వేసుకున్నాడు, భజనరావు.  'ఇవాళ కూడా ఆవిడ చాలా సాదా సీదాగానే వున్నారు. వాళ్ళబ్బాయి పదవిలేక, చేసేది ఏమీలేక, మీటుంగులు గట్రాలు పెట్టుకుని, వచ్చిన వారికి పలాయన వేగం గురించి మరియు ప్రయాగ శాస్త్రములో పాటాలు చెప్పి, కాలక్షేపం చేస్తున్నా అతనికి ప్రధాన మంత్రి పదవి ఇవ్వటానికి ససేమిరా వొప్పుకోటల్లేదు. మళ్ళీ గిట్టని వాళ్ళు 'అబ్బే అదేంలేదు, అతగాడిది ఇంకా కుర్ర తనం. పైగా అతన్ని ప్రధానిని చెయ్యలంటే చాలా కష్టం. అతను చెప్పింది వినిపించుకోడు తప్ప, చెముడు లేదు. ముందు చూపు లేదు తప్ప, అతని చూపు బానే వుంది, ఇక మాట్లాడం మొదలెడితే ఆపడు ' అని అంటారు.   ఈ మధ్యన ఓ వెబ్సైట్ వాళ్ళూ ఈవిడగారికి 12 వేల పైచిలుకు కోట్లున్నాయని రాసి పారేసారు. అయితే కొంచం అటూ ఇటుగా అన్నారు. దాంటో అమ్మగారు కుమిలి పోయారు. 'ఆ దిక్కుమాలినాళ్ళకి లెక్కలు రావా? సరిగ్గ లెక్కెట్టి చెప్పమను ' అని కోప్పడ్దరు. దాంతో వాళ్ళూ నాలిక్కరుచుకుని, మళ్ళీ లెక్కలెట్టడం మొదలెట్టారు. ఈ సారి గిట్టని వాళ్ళు 'నిజమే వాళ్ళకి బుద్దిలేదు. సరిగ్గ లెక్కెట్టకుండా చెప్పేసారు. వాళ్ళు చెప్పినదానికంటే ఇంకా చాలా ఎక్కువే వుంటుందన్నారు.' 'ఏది ఏమయినా మన దేశం చాలా గొప్పదేశం. లేక పోతే ఆంగ్లేయులని తరిమి కొట్టి, ఇటలీ వాళ్ళకి పీటేస్తారా చెప్పండి? ఈవిధంగా మనం ప్రపంచంలోనే ఓ కొత్త వొరవడికి నాంది పలికాము. ఏ దేశం వారయినా, ఏ దేశంలోనయినా తమ సత్తా చూపొచ్చని, దానికి మా అమ్మగారి తరువాతే ఎవరినయిన చెప్పుకోవాలి. ఆవిడని నేను కోరుకునేది ఒక్కటే. ఇలా మన దేశంతో ప్రారంబించినా ఆవిడ ప్రస్థానం, పక్క దేశాలకి కూడా పాకి, వచ్చే పుట్టిన రోజుకి ఆవిడ మరో మాలుగు దేశాలకి అధిపత్యం వహించాలని ఈ సభా ముఖంగా ఆవిడకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పక్క దేశాల్లోను ఇలా ఆవిడకి గుడి కట్టే అదృష్టం నాకే దక్కాలని, ఇప్పుడు కట్టబోయే గుడి తాలూకా దేవతని వేడుకుంటున్నాను.' అని కళ్ళలో నీళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి అవి ఆనందంతో వచ్చినవిలెండీ!
  డిల్లీలో 15 ఏళ్లుగా అధికారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నఈ కీలక తరుణంలో ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బలు తిని అధికారానికి దూరమయింది. డిల్లీ ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవాలంటే వారి మద్దతు ఉన్నఆమాద్మీకి తను మద్దతు ఈయడం మంచిదనే ఆలోచనతోనో, లేక నాలుగు రాష్ట్రాలలో తలకు బొప్పి కట్టినందునో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా సాగిస్తున్న తన సాంప్రదాయ రాజకీయ పద్దతులను పక్కనబెట్టి, మళ్ళీ ఆమాద్మీకే బేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది.   అయితే కాంగ్రెస్ ఊహించినట్లు ఆమాద్మీ ఎగిరిగెంతేయలేదు. పైగా కాంగ్రెస్ హయాంలో గత 15ఏళ్లుగా జరిగిన కుంభకోణాలను త్రవ్వితీస్తాము. విద్యుత్ మీటర్ల గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి నేరం రుజువయిన వారినందరినీ కటకటాల వెనక్కి పంపిస్తాము. కాంగ్రెస్, బీజేపీ నేతలు డిల్లీలో సాగిస్తున్న అక్రమ నీటి మాఫియా వ్యాపారాలకు అడ్డుకట్టవేసి వారి చేత ఇంతవరకు బొక్కినదంతా కక్కిస్తాము. ఎవరు పడితే వారు ఎర్రబుగ్గ కార్లేసుకొని డిల్లీ వీదుల్లో తిరగడాన్ని నిషేదిస్తాము,” అంటూ కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీనే భయపడే విధంగా లేఖ వ్రాసి వాటికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు మద్దతు ఇవ్వచ్చునంటూ ఒక లేఖ వ్రాసి ఆమాద్మీ చేతులు దులుపుకొంది.   అదే అమాద్మీ కాక మరొక పార్టీ అయితే కాంగ్రెస్ మరోలా వ్యవహరించేది. కానీ నాలుగు రాష్ట్రాలలో తల బొప్పికట్టిన తరువాత, ఇంత ప్రజాదారణ కల ఆమాద్మీతో కొంచెం సంయమనంగానే వ్యవహరించాలని నిశ్చయించుకొని, ఆ పార్టీ వ్రాసిన లేఖకు జవాబు ఇచ్చింది.   కాంగ్రెస్, డిల్లీ ఇన్-చార్జ్ షకీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ తన లేఖలో లేవనెత్తిన 18అంశాలలో 16 పూర్తిగా పరిపాలనా సంబందమయినవే. గనుక వాటి గురించి మేము ఎటువంటి వివరణ ఈయవలసిన అవసరం లేదు. మిగిలిన రెండు అంశాలలో డిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఈయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది గనుక, ఆమాద్మీ దాని గురించి ప్రభుత్వంతో చర్చించవలసి ఉంటుంది. ఇక డిల్లీలో ఇప్పటికే బలమయిన లోకాయుక్తా వ్యవస్థ ఉంది. దానిని ఇంకా బలపరచాలని ఆమాద్మీ భావిస్తే దానికోసం మమ్మల్ని సంప్రదించనవసరం లేదు,” అని అన్నారు.   అంటే అమాద్మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత కాలంగా కాంగ్రెస్ కప్పెట్టిన కుంభకోణాలను వెలికి తీసి చర్యలు చేపడితే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అంగీకరించినట్లే భావించవలసి ఉంటుంది. ఇటువంటి షరతులకి అంగీకరించడం కొరివితో తల గోక్కోవడమేనని తెలిసి ఉన్నపటికీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం చాలా విడ్డూరమే. అయితే, తన పార్టీ నేతలను ఆమాద్మీ జైలుకి పంపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొంటుందని ఆశించడం అవివేకం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహ స్థితి ఏమీ బాగాలేనందునే కనీసం ఆమాద్మీ చీపురు దెబ్బలు తింటేనయినా ఆ దోషం పోతుందేమోననే చిన్న ఆశతోనే బహుశః ఇందుకు అంగీకరించి ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీకి తను షాక్ ఇస్తే, కాంగ్రెస్ కూడ ఈవిధంగా తన అన్ని షరతులకి అంగీకరిస్తూ ఈవిధంగా జవాబీయడంతో ఆమాద్మీ కూడా షాకయింది. అందుకే ఆ పార్టీ నేతలందరూ మళ్ళీ ఈరోజు అత్యవసరంగా డిల్లీలో తమ పార్టీ కార్యాలయంలోఈరోజు సమావేశమవుతున్నారు. రేపటితో డిల్లీ శాసనసభ కాలపరిమితి ముగియనుండటంతో, ఒకవేళ ఆమాద్మీ పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకి చొరవ తీసుకోకపోతే డిల్లీపై రాష్ట్రపతి పాలన విదింపబడవచ్చును. అయితే, ఆమాద్మీ తనను తాను నిరూపించుకొనేందుకు దొరికిన ఈ అపూర్వమయిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోదని ఆశిద్దాము.
  ధర్మాన ప్రసాదరావు సీబీఐ కేసుల పుణ్యామాని తన మంత్రి పదవి ఊడగొట్టుకొన్నారు కానీ, లేకుంటే నేటికీ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతూనే ఉండేవారు. ఆయనను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోవడంతో ఇక చేసేదేమి లేక ధర్మాన రాజీనామా చేసి బయటపడ్డారు. పదవిలో ఉన్నంత కాలమే ఎవరినయినా అందరూ గుర్తిస్తారు. అవి పోయిన మరుక్షణం వారిని కాంగ్రెస్ పార్టీలో పలకరించేవారు ఉండరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, ధర్మాన, సబిత వంటి వారే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.   అటువంటప్పుడు వారు మళ్ళీ ఒంటరి పోరాటానికయినా సిద్దపడాలి, లేకుంటే వేరే పార్టీలలోకయినా మారిపోవలసి ఉంటుంది. ఎన్నికలు తరుముకొస్తున్నఈ తరుణంలో మొదటి ఆప్షన్ కంటే రెండవదే ఆచరణీయంగా ఉంటుంది గనుక ధర్మాన కూడా వైకాపాలోకి దూకేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అయితే పార్టీ మారేందుకు నిశ్చయించుకొన్నతరువాత ఈ జంపింగ్ ప్రక్రియలో శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన తంతు, అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం, జగన్మోహన్ రెడ్డికి గొప్పదనం గురించి బాకా ఊదడం తదితర కార్యక్రామాలను ఆయన అందరి కంటే కొంచెం విభిన్నంగా నిర్వహించారు ఆయన తన అనుచరులతో కలిసి మొన్న శ్రీకాకుళంలో బహిరంగ సభకు తక్కువ, కార్యకర్తల సమావేశానికి ఎక్కువ అనదగ్గ ‘సమాలోచన’ అనే బహిరంగసమావేశం ఏర్పాటు చేసి ఆ తంతు శాస్త్ర ప్రకారం పూర్తి చేసేసారు.   ఆయన ఈ సమావేశంలో తన కాంగ్రెస్ కళ్ళద్దాలను తీసి పక్కకు పడేయగానే అంతవరకు దేవతలా కన్పించిన సోనియా గాంధీ ఆయనకు దయ్యంలా, 125 సం.లచరిత్ర గల గొప్ప పార్టీ అని స్వయంగా పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా కనబడింది. ఇక వైకాపా ఇచ్చిన కళ్ళద్దాలను పెట్టుకోగానే అంతవరకు స్పష్టంగా కనబడిన జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ రికార్డులు, అక్రమ సంపాదన చరిత్రలు ఏవో అర్ధం పర్ధం లేని పిచ్చిరాతలులా కనబడటం మొదలయ్యాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు తను చూడలేకపోయిన గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా వైకాపా కళ్ళద్దాలు ధరించాగానే స్పష్టంగా కనబడతునట్లు ఆయన సభా ముఖంగా ప్రకటించారు.   ఇక శాస్త్రోక్తంగా తన ధర్మం తను నిర్వహించారు గనుక ఇక జగన్ వచ్చి వైకాపా కండువా కప్పడమే ఆలస్యం. మరీ ఆలస్యం చేస్తే అందరూ ‘ఇదేమి ధర్మం ధర్మానా?’ అంటే అనుకొంటే అనుకోవచ్చునేమోగానీ ఆయన మాత్రం మళ్ళీ ఇదే తంతు మరొకమారు నిర్వహించేసి ఏ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకో జంపయిపోయే ప్రమాదం ఉంది. లేకుంటే సబ్బంహరిలాగే ఆయన కూడా తన కాంగ్రెస్ కండువాను ఓసారి గంజి పెట్టి ఉతికించేసుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశము లేకపోలేదు.
  జగన్మోహన్ రెడ్డి తనను తాను సమైక్య ఛాంపియన్ గా ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో రాష్ట్ర విభజనపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ, తనతో ఎవరూ కూడా కలిసి రావడం లేదంటూ ఆవేదన పడిపోతుంటారు. తనొక్కడే మిగిలిన వారందరి కంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు పదేపదే గట్టిగా చెప్పుకొంటారు. పనిలోపనిగా తనకు ప్రధాన పోటీదారులయిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను ప్రజల ముందు దోషులని సర్టిఫై చేయడం కూడా మరిచిపోరు.   కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఎంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, ఆయన ఆ ప్రక్రియకు ఎక్కడా అడ్డుతగలకుండా పరోక్షంగా సహకరిస్తున్నందున ఆయనను అనుమానించక తప్పదు.   అయితే చంద్రబాబు నోట ఇంతవరకు సమైక్యాంధ్ర రాలేదనే జగన్ ఆరోపణ కేవలం ఆయనను సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకే. రాష్ట్ర విభజనకు తెదేపా అంగీకరించిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు వ్యక్తిగతంగా, మానసికంగా కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖమనే సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే ఆయన ఇంతవరకు జై తెలంగాణా! అనిగానీ, జై సమైక్యాంధ్ర! అనిగానీ అనలేకపోతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే తెదేపా తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతున్నదని చంద్రబాబుకి తెలిసి ఉన్నపటికీ, ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.   కానీ, తెలంగాణాలో రాత్రికి రాత్రి దుకాణం బంద్ చేసుకోచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్య లేదు గనుక ఒట్టొట్టి సమైక్యరాగామాలపిస్తూ చంద్రబాబుని కూడా తనతో కోరస్ పాడమని బలవంతం చేస్తూ, ఆయన పాడట్లేదు గనుక ఆయన సీమాంధ్ర ద్రోహి అని ప్రచారం చేసుకొని, తనొక్కడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ప్రజలు ఇంతకంటే ఎక్కువగానే అసహ్యించుకొంటున్న సంగతి ఆయనకి కూడా తెలిసే ఉంటుంది.   రాష్ట్ర విభజనకు మానసికంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, దానివల్ల తన పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నపటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు విభజనకు అంగీకరిస్తే, రాష్ట్ర విభజన జరిగితేనే తనకు రాజకీయ లబ్ది కలుగుతుందని మనసులో తీయని కలలు కంటూ, పైకి మాత్రం జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. నిజానికి నేతి బీరకాయలో నెయ్యి వంటిది జగన్ సమైక్యవాదం. అందువల్ల అసలయిన విభజనవాది ఎవరో ప్రజలే తేల్చి చెప్పాలి.          మడమ తిప్పని వంశమని, విస్వసనీయత తమ ఇంటి పేరని, నీతి నిజాయితీలు తన లోటస్ పాండ్లో విరబూసే కలువలని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటలు పలికేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలకి హ్యాండిచ్చేసి ఇప్పుడు సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి కంటే రాష్ట్ర విభజనను అయిష్టంగా అంగీకరిస్తున్న చంద్రబాబే మేలు కదా!    
  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విడిపోతున్నందుకు చాలా ఆందోళన చెందుతున్నట్లు, దానిని అడ్డుకొనేందుకు తనొక్కడే చాలా కృషి చేస్తున్నట్లు, తనతో ఎవరూ కలిసి రావడం లేదని ఆవేదన చెందుతున్నట్లు చాలా చక్కగా నటిస్తున్నపటికీ, నిజానికి వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రకు దూకేయడంతోనే రాష్ట్ర విభజనకు ఆ పార్టీ సిద్దమని స్పష్టమయిన సంకేతం ఇచ్చింది. జగన్ చేస్తున్నవాదనలు, ప్రయత్నాలను కాసేపు పక్కన బెట్టి ఆలోచిస్తే, తెలంగాణాను పూర్తిగా వదులుకొన్న వైకాపాకు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే సీమాంధ్రలో ఎంతో కొంత లబ్ది పొందగలదనేది ఎవరూ కాదనలేని సత్యం.   ఇంతవరకు జగన్ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ కూడా సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదే తప్ప, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాదు. రాబోయే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే, వైకాపా ప్రజలలో పేరుకుపోయున్న ప్రభుత్వ వ్యతిరేఖతను, వారిలో జ్వలించే సమైఖ్య సెంటిమెంటును ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందగలదు. అప్పుడే అది చేస్తున్న సమైక్య పోరాటాలకు ఫలితం ఆశించలదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి మనసులో రాష్ట్ర విభజనను కోరుకొంటున్నపటికీ, పైకి మాత్రం అవసరమయిన దానికంటే చాలా బిగ్గరగా సమైక్యాంధ్ర అంటూ నినదిస్తున్నారు. ఎన్నికలవరకు సీమాంధ్ర ప్రజలలో ఈ సమైక్య సెంటిమెంటును బలంగా ఉండేట్లు జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే వైకాపా లబ్ది పొందగలదు.   తెరాస తెలంగాణా సెంటిమెంటును ఏవిధంగా ఉపయోగించుకొని రాజకీయంగా ప్రయోజనం, పైచేయి సాధించిందో అదేవిధంగా వైకాపా కూడా సమైక్య సెంటిమెంటుతో 2014ఎన్నికలలో లబ్ది పొందాలని భావిస్తోంది. అందుకే జగన్ కేవలం 30యంపీ సీట్లు సాధించడం గురించి, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత కొంతకాలంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాధినేతలను, పార్టీ నేతలను కలుస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో తనకు, తన పార్టీకి ఒక గుర్తింపు ఏర్పరచుకొని, వారితో సంబంధాలు పెంచుకోవడానికి, తాను కాంగ్రెస్ వ్యతిరేఖిననే భావన రాష్ట్ర ప్రజలకు కలుగజేయడానికి తిప్పలు పడుతున్నారు. అయితే అతను కలిసిన రాజకీయ నేతలలో ఎంతమంది అయన మాటలను, ప్రయత్నాలను నిజంగా నమ్ముతున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆయనకున్నరహస్య అనుబందం గురించి వారికి తెలియదని అనుకోలేము.   ఏమయినప్పటికీ, జగన్ స్వయంగా చెప్పినట్లు కడదాకా అంటే 2014ఎన్నికల వరకు ఈ సమైక్యపోరాటం చేస్తూనే ఉంటారు.
  నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి, స్వంత యంపీలే యూపీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, కనీసం తాము అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేసుకోలేని దుస్థితి. మిగిలిన మూడు రాష్ట్రాలలో పరాజయం కంటే గట్టిగా ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బకి డిల్లీలో పరువుపోవడం కాంగ్రెస్ ను చాలా కలవరపరుస్తోంది. ఇది సరిపోనట్లు జనలోక్ పాల్ బిల్లుకోసం అన్నాహజారే నిరాహార దీక్ష మొదలుపెట్టడం మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడ్డట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఒకేసారి చుట్టుముట్టిన ఇన్నిసమస్యలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, తన సహజసిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మాత్రం మానుకోలేదు.   ఈరోజు యువరాజు రాహుల్ గాంధీ తన భజన బృందాన్ని వెంటేసుకొని డిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ జనలోక్ పాల్ బిల్లు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడం విశేషం. అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ జన లోక్ పాల్ బిల్లుపట్ల మొదటి నుండి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని, అందుకే ఈసారి పార్లమెంటులో ఈబిల్లును ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని అన్నారు.   ఆమాద్మీ చేతిలో తమ పార్టీ ఓడిపోయినందునో లేకపోతే అన్నాహజారే రాలెగావ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారనో తామీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, ఈ బిల్లు వల్ల దేశంలో అవినీతిని సమర్ధంగా నియత్రించవచ్చని భావించినందునే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, ఈ బిల్లు ఆమోదానికి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ బిల్లుతో దేశంలో అన్ని సమస్యలను పరిష్కారమయిపోతాయని తాము భావించడం లేదని, కానీ ఆదిశలో ఇదొక మంచి ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు.   అన్నాహజారే జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు ఎన్నడూ ఒక్కసారి కూడా మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు జనలోక్ పాల్ బిల్లు గురించి వఖల్తా పుచ్చుకొని మాట్లాడటానికి కారణాలు ఆయనే స్వయంగా చెప్పకనే చెప్పుకొన్నారు. అయితే అవినీతిలో మునిగి తేలుతున్నతమ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తోందని చెప్పడం ఈ సం.లో అతిపెద్ద జోక్ అని అందరూ అంగీకరించక తప్పదు.
  వాపును చూసి బలుపని భావిస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తాము చేసిన పోరాటాల వల్ల యావత్ తెలంగాణాలో పార్టీ చాలా బలపడిందని, అందువల్ల వచ్చేఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచేయవచ్చని భ్రమలో ఉన్నారు. అందుకే తెదేపాతో పొత్తులని ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అటువంటి వెర్రి భ్రమలలోలేదు. అందుకే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలలో పొత్తులు తదితర అంశాలపై పార్టీలోని కొందరు తటస్థ వ్యక్తుల ద్వారా ఒక రహస్య నివేదిక రప్పించుకొంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ నివేదికలోని కొన్ని ఆసక్తికరమయిన అంశాలు బయట పడ్డాయి.   ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఈసారి కాకపోయినా వచ్చేసారి ఎన్నికలకయినా పార్టీ బలోపేతం అవుతుందనే కిషన్ రెడ్డి వంటి కొందరు నేతల ఆలోచనలు కేవలం కాకి లెక్కలు కట్టుకోవడం వంటిదేనని ఆ నివేదికలో పేర్కొనబడింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణా కోసం ఎంత పోరాటం చేసినప్పటికీ, ప్రజలు కాంగ్రెస్, తెరాస, తెదేపాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారని, ఇక హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, మరియు నల్గొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నసీమాంధ్ర ప్రజల తొలి ప్రాధాన్యత తెదేపాకే ఇస్తారనేసంగతి గత ఎన్నికలలోనే రుజువయిందని, అందువల్ల తెలంగాణాలో సైతం బీజేపీ ఒంటరిగా పోటీచేయడం శ్రేయస్కరం కాదని నివేదికలో పేర్కొనబడింది.   జంట నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలో దాదాపు 34 నియోజక వర్గాలలో విస్తరించి ఉన్నారు. ఈజిల్లాలు, నియోఅజక వర్గాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. అయితే నేరుగా వారి ఓట్లను బీజేపీ పొందడం అసంభవం గనుక, వారి మద్దతు కలిగి ఉన్నతెదేపాతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బీజేపీ కూడా లాభపడుతుందని, నివేదికలో పేర్కొనబడింది.   ఇక తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నవరంగల్, కరీంనగర్, మరియు మెదక్, నిజామాబాద్, నల్గొండ కొన్ని ప్రాంతాలలో తెరాసకు మంచి బలం ఉన్నకారణంగా అక్కడ బీజేపీ తనంతట తాను పోటీ చేసి గెలిచే అవకాశాలు అంతగా లేవని పేర్కొంది. గత ఉప ఎన్నికలలో బీజేపీ 11 స్థానాలకు పోటీ చేస్తే కేవలం మెహబూబ్ నగర్ సీటు మాత్రమే గెలుపొందడం బీజేపీ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొంది.   అప్పుడు పరకాల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధికి కేవలం 9,000 ఓట్లు మాత్రమే రాగా, తెదేపా బలపరచిన అభ్యర్ధి తెరాస అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చి 31,000 సాధించగా, తెరాస కేవలం 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, అందువల్ల బీజేపీ చాలా బలంగా ఉందని భావిస్తున్న చోట కూడా తమకంటే తెదేపా బలపరచిన అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు రావడం గమనిస్తే వచ్చేఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే కంటే తెదేపాతో పొత్తుల వలెనే ఇరువురికీ ప్రయోజనం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.   ప్రస్తుతం తెలంగాణా ప్రాంతాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల ఓట్లన్నీతెదేపాకే పడే అవకాశాలు బాగా ఉన్నాయని, అందువల్ల కాంగ్రెస్, తెరాసలకు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణాలోఎదగాలంటే తెదేపాతో పొత్తులు మేలని, తద్వారా తరువాత ఎన్నికలకి పార్టీ మరింత బలపడవచ్చని నివేదిక స్పష్టం చేసింది.   తమ పార్టీ చెప్పటిన తెలంగాణా ఉద్యమాల వలన సీమాంధ్రలో తన ఉనికిని కోల్పోయిన బీజేపీని కాపాడుకోవాలంటే, అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తులు పెట్టుకోక తప్పదని, తద్వారా అటు తెదేపా, ఇటు బీజేపీ ఇరువురు ప్రయోజనం పొందవచ్చని నివేదికలో పేర్కొనబడింది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసతో, సీమాంధ్రలో వైకాపాతో అవగాహనకు వచ్చినట్లయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేయాలనుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది.   తెలంగాణా కోసం బీజేపీ చేసిన పోరాటాలు, ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా బీజేపీకి చాలా లబ్ది చేకూరే అవకాశం ఉంది. గనుక, ఇటువంటి సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని పూర్తి ప్రయోజనం పొందాలంటే బీజేపీ తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మేలని నివేదికలో పేర్కొనబడింది.
      ఇప్పటి పరిస్థితులు చూస్తోంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 ఎన్నికల లోపు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. విభజన ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ గురువారం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి పంపించింది. బిల్లుపై శాసనసభలో అభిప్రాయ సేకరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్ఠంగా ఆరు వారాలు సమయమిచ్చారు. 'జనవరి 23వ తేదీలోపు' అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాటిని క్రోడీకరించి ఢిల్లీకి పంపించేందుకు మరో మూడు రోజులు అదనంగా గడువు ఇచ్చినట్లు సమాచారం. అంటే... జనవరి 26వ తేదీ వరకు సమయం ఉన్నట్లే. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదు.  దీనిని బట్టి చూస్తే శీతాకాల సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ బిల్లు పార్లమెంట్ చేరడం కష్టంగా కన్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 ముగియనున్నాయి. అయితే కేంద్రం కనుక పార్లమెంటు సమావేశాలు పొడిగించడమో,లేక మళ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమో చేస్తే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టం కావచ్చు. కేంద్రం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ పై మరీ పట్టుదలతో ఉంటే తప్ప ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమో, లేక సమావేశాలలను పొడిగించడమో చేయకపోవచ్చు. అసెంబ్లీ లో బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత తెలంగాణ ముసాయిదా బిల్లు హోంమినిస్ట్రీరికి.. తిరిగి రాష్ట్రపతికి వెళ్లి , అక్కడ నుంచి పార్లమెంటుకు ఆమోదానికి వెళ్ళుతుంది.

బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.

అధ్య‌క్షా.. నాకు సెల‌వు కావాలి!

పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు.    ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా? -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

జ‌యా బ‌చ్చ‌న్‌ అగ్గిమీద‌ గుగ్గిలం!

జ‌యాబ‌చ్చ‌న్‌..డెబ్బ‌య్ రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్యురాలు..అంటే పెద్ద‌ల స‌భ‌లో స‌భ్యురాల‌న్న మాట‌. అంటే ఆమె ఏమి చెప్పినా పెద్ద‌రికంతో చెప్పిన‌ట్ట‌న్న‌మాట‌! పెద్ద‌రికంతో చెప్పాలి కాబ‌ట్టి..క‌నీసం అలా చెప్పిన‌ట్ట‌యినా అనిపించాలి కాబ‌ట్టేమో ఆమె ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆమాట‌కొస్తే ఆచితూచే స‌భ‌కూ వ‌స్తుంటారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఏదైనా చెప్పాల‌నుకున్న‌ప్పుడే స‌భ‌కు వ‌స్తుంటార‌ని అనుకునేవాళ్లూ ఉన్నారు! అలానే మంగ‌ళ‌వారం నాడు స‌భ‌కి వ‌చ్చారు. ఆమె వ‌చ్చారంటే ఏదో పెద్ద విష‌య‌మే ఆమె మాట్లాడ‌తార‌ని అనుకోవ‌చ్చు. అలాగే ఒక పెద్ద విష‌య‌మే లేవ‌నెత్తారు. ఏదో కొంద‌రి కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ,భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ మీద అగ్గిగుగ్గిల‌మే అయ్యారు. సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే సోష‌ల్ మీడియా ఒంటికాలికి మీదికి లేస్తుంద‌ని, ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు వీస‌మెత్తు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.   బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగి సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఆమె ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్న‌ది. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఎవ‌రో కొంద‌రు వాడుతున్నంత మాత్రాన మొత్తం ప‌రిశ్ర‌మ‌నే వేలెత్తి చూపుతారా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. అంత సీనియ‌ర్ స‌భ్యురాలు స‌భ‌లో ఈ అంశాన్ని ఈ కోణంలో ప్ర‌స్తావించ‌డాన్ని సినీ అభిమానులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని డ్ర‌గ్స్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసి ఉంటే యావ‌త్ ప్ర‌జానీకం సంతోషించి ఉండేవారు. సుశాంత్ లాంటి యువ‌త‌రాన్ని బ‌ల‌గొంటున్న డ్ర‌గ్స్ మాఫియా ఊసెత్త‌కుండా దాన్ని ఎవ‌రో కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశంగా ఆమె భావించ‌డం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె స్ధాయికి త‌గిన‌ట్టుగా లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌రో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించి, వారు ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ఇచ్చిన పిలుపికి జ‌యాబ‌చ్చ‌న్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. కంగ‌నా ర‌నౌత్ బ‌హిరంగంగా పేర్లు ప్ర‌స్తావించిన‌ప్పుడు యావ‌త్ బాలీవుడ్ మౌన‌మే వ‌హించింది. అంటే దాన‌ర్ధం ఏమిటి? ఆ పెద్ద‌వాళ్ల గొడ‌వ‌లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌నా? లేక కంగ‌నా లేవ‌నెత్తిన అంశంలో వాస్త‌వం ఉంద‌నా? ఇంకా చెప్పాలంటే సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ మాఫియా గురించి కంగ‌నాయే ధైర్యంగా నోరెత్తింది. ఆమెకి త‌గినంత మ‌ద్ద‌తు రాలేదు.    ఇంక మ‌రో విష‌యం. కంగ‌నా ర‌నౌత్ ముంబాయి ఆఫీసు వివాదాస్ప‌ద‌మై ఇర‌వై నాలుగ్గంట‌ల్లో ముంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆమె ఆఫీసు భ‌వ‌నంలో కొంత భాగాన్ని ఆగ‌మేఘాల మీద కూల్చివేసిన‌ప్పుడూ జ‌యాబ‌చ్చ‌న్ నోరు మెద‌ప‌లేదు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌గా ఎదిగింది. త‌న‌కంటూ సొంత వ్య‌క్తిత్వంతో బాలీవుడ్‌లో నిల‌బ‌డింది. అటువంటి న‌టికి సంఘీభావంగా నిల‌బ‌డాల్సిన స్ధాయిలో ఉండి కూడా జ‌యాబ‌చ్చ‌న్ అస‌లా అంశం త‌న‌కు సంబంధించ‌నిదిగానే వ్య‌వ‌హ‌రించారు. కంగ‌నా ర‌నౌత్ మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే యుద్దానికి త‌ల‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే కుమారడు ఆదిత్య థాక్రేకు మాద‌క ద్ర‌వ్యాల మాఫియాతో లింకులు న్నాయ‌ని ఆమె నేరుగా ఆరోపించారు. అయితే అది ప్ర‌భుత్వంతో ముడిప‌డి ఉన్న అంశం అయినందున జ‌యాబ‌చ్చ‌న్ ఆ విష‌యం జోలికి వెళ్ల‌లేదు. నిజానికి రాజ్య‌స‌భ‌లో ఆమె ఈ అంశాన్ని కూడా ప్ర‌స్తావించి ఉండాల్సింది. ద‌ర్యాప్తుకి డిమాండ్ చేసి ఉండొచ్చు. కంగ‌నా ర‌నౌత్ మీద రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని నిలువ‌రించాల‌ని గొంతెత్తి ఉండాల్సింది. కాని ఇవేమీ జ‌ర‌గ‌లేదు. సినీ ప‌రిశ్ర‌మ గురించి ఒక సినీ న‌టుడే అలా మాట్లాడ‌టం శోచ‌నీయం అంటూ ర‌వి కిష‌న్ వ్యాఖ్య‌ల గురించి ప్ర‌స్తావించారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీవ్ర‌త గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ప్ర‌సారం చేస్తున్న ప్ర‌సార మాధ్య‌మాల‌ను ఆమె త‌ప్పుబ‌డుతున్నారు.    జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను అర‌చెయ్యి అడ్డుపెట్టా ఆపాల‌ని ఆమె భావిస్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. సుశాంత్ మ‌ర‌ణం కేసు ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌దో ఆమెకి తెలీద‌ని అనుకోలేము. అలా మ‌లుపులు తిర‌గ‌డంలోని ఉచితానుచితాల గురించీ ఆమెకు ప్రాథ‌మిక స‌మాచారమైనా తెలీద‌నీ భావించ‌లేము. సుశాంత్ కేసులో అది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తేల్చాల్సిన త‌రుణంలో కేసు ఆ ప‌రిధిని ఎప్పుడో దాటిపోయిన‌ట్టు అనిపిస్తున్న‌ది. ఎందుక‌లా జ‌రిగిందో ఎవ్వ‌రూ అడ‌గ‌డం లేదు. ఇప్పుడ‌ది మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కం ద‌గ్గ‌ర‌కొచ్చి రియాను, ఆమె సోద‌రుణ్ని అరెస్టు ఘ‌ట్టం ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి ఆపింది. ఇన్ని మ‌లుపుల నేప‌థ్యంలో జ‌యాబ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ ద‌య‌నీయ‌ప‌రిస్థితి గురించి ఆందోళ‌న ప‌డ‌టం క‌న్నా, నిజానిజాల వెలికితీత‌కు ప‌ట్టుబ‌ట్టి ఉండాల్సింది! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

ప్ర‌భాస్‌ ఫిల్మ్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా సింగీతం శ్రీ‌నివాస‌రావు

  యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఎపిక్ ఫిల్మ్‌కు ప‌నిచేయ‌డానికి ప‌లువురు క్రియేటివ్ పీపుల్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా వ‌స్తున్నారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ దీపికా ప‌డుకోనే ఇప్ప‌టికే ఎంపిక‌య్యారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే త‌న కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాత్మ‌క బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను రూపొందించిన‌ లెజండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సినిమాపై ప‌నిచేస్తున్న సింగీతం.. క్వారంటైన్ పీరియ‌డ్‌లోనూ చిత్ర బృందంతోనే ఉంటున్నారు. "సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కల ఎట్ట‌కేల‌కు నిజ‌మ‌వుతోంది. మా ఎపిక్‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు గారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీల‌వుతున్నాం. ఆయ‌న క్రియేటివ్ సూప‌ర్‌ప‌వ‌ర్స్ క‌చ్చితంగా మాకు మార్గ‌ద‌ర్శ‌క శ‌క్తిగా ఉంటుంది." అని సోష‌ల్ మీడియా ద్వారా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ప్ర‌క‌టించింది. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌కు చెందిన ఈ ఫిల్మ్‌.. ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న అత్యంత ఆస‌క్తిక‌ర చిత్రాల్లో ఒక‌ట‌నేది నిస్సందేహం. లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీస్‌తో, భారీ బ‌డ్జెట్‌, భారీ తారాగ‌ణంతో నిర్మించే చిత్రాల‌తో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ ఎపిక్ ఫిల్మ్‌ను మ‌రింత భారీ వ్య‌యంతో, దేశవ్యాప్తంగా పేరుపొందిన తారాగ‌ణంతో నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కొత్త హీరోతో 'అల్లుడు శీను'ను ఎందుకు తీశాడు?

  మాస్ సినిమాల డైరెక్ట‌ర్ వి.వి. వినాయక్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండ‌గా ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయిశ్రీ‌నివాస్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ ఇయిన 'అల్లుడు శీను' సినిమాని డైరెక్ట్ చేయ‌డానికి ఒప్పుకోవ‌డం అప్ప‌ట్లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌. 2013లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఆయ‌న రూపొందించిన 'నాయ‌క్' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి హిట్ట‌యింది. దాని త‌ర్వాత మ‌రో స్టార్ హీరోతో సినిమా చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ 'అల్లుడు శీను'తో సాయిశ్రీ‌నివాస్‌ను ఇంట్ర‌డ్యూస్ చెయ్య‌డానికే ఆయ‌న మొగ్గుచూపాడు. "నా శ్రేయోభిలాషులు కొంత‌మంది 'ఎందుకు విన‌య్‌.. ఇప్పుడు నీకు ఈ సినిమా అవ‌స‌ర‌మా?' అన్నారు. ఈ విష‌యం బెల్లంకొండ సురేశ్‌కూ తెలుసు. కానీ నేనిప్పుడు ఈ సినిమా చెయ్య‌డం నా ధ‌ర్మం. ధ‌ర్మం ఎప్పుడూ ఓడిపోలేదు" అని వినాయ‌క్ ఆ రోజు చెప్పాడు. ధ‌ర్మం అనే మాట ఆయ‌న ఎందుకు వాడాడంటే అస‌లు వినాయక్‌ను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేసింది బెల్లంకొండ సురేశ్ కాబట్టి. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన 'ఆది' మూవీతో వినాయ‌క్ డైరెక్ట‌ర్ అయ్యాడు. దాన్ని బెల్లంకొండ ప్రొడ్యూస్ చేశారు. త‌న కొడుకు సాయిశ్రీ‌నివాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చెయ్యాల‌ని బెల్లంకొండ నిర్ణ‌యించుకున్న‌ప్పుడు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న మ‌న‌సులో మెదిలిన ఒకే ఒక ఆప్ష‌న్ వినాయ‌క్‌. "సాయిని నువ్వు హీరోగా ప‌రిచ‌యం చెయ్యాలి విన‌య్" అని ఆయ‌న అడిగారు. చేస్తాన‌ని మాటిచ్చాడు వినాయ‌క్‌. ఒక బాధ్య‌త‌తో 'అల్లుడు శీను'గా అత‌డిని తెర‌మీద ప్రెజెంట్ చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌. కానీ స్టార్ హీరోల సినిమాల‌కు వ‌చ్చే స్థాయిలో రూ. 40 కోట్ల దాకా ఆ సినిమా వ‌సూలు చేసిందంటే చిన్న విష‌యం కాదు. సాయిశ్రీ‌నివాస్‌తో వినాయ‌క్ డాన్సులు, ఫైట్లు చేయించాడు. కామెడీ, సెంటిమెంట్ సీన్లు చేయించాడు. బ్ర‌హ్మానందం, ప్ర‌కాష్‌రాజ్ లాంటి టాప్ యాక్ట‌ర్ల‌తో క‌లిసి న‌టించిన సాయి మెప్పించాడంటే అది చిన్న విష‌యం కాదు. ఆ విష‌యంలో త‌న వంతు బాధ్య‌త‌ను, ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించి స్నేహానికి నిజ‌మైన అర్థం చెప్పాడు వినాయ‌క్‌. ఆరేళ్ల క్రితం ఆయ‌న ప‌రిచ‌యం చేసిన సాయిశ్రీ‌నివాస్ వ‌న్ ఫిల్మ్ వండ‌ర్‌లా మిగిలిపోలేదు. త‌న‌కంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. న‌ట‌న‌లో త‌న‌దైన శైలిని ఏర్ప‌ర‌చుకున్నాడు. ప్రామిసింగ్ హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నాడు.

అనురాగ్‌ను అరెస్ట్ చేయాలంటున్న కంగనా!

హిందీ సినిమాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన కథానాయిక, నటి  పాయల్ ఘోష్‌కి కంగనా రనౌత్ అండగా నిలిచింది. అనురాగ్‌ను అరెస్ట్ చేయాలని కంగనా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కరి మాటలను గౌరవించాలని ఆమె పేర్కొన్నారు.  "నాకు తెలిసినంతవరకు అనురాగ్ కశ్యప్ వివిధ వ్యక్తులతో వివాహ బంధంలో ఉన్నప్పటికీ... ఒక్కరితోనే శారీరక, లైంగిక సంబంధాలు పెట్టుకోలేదని అనురాగ్ కశ్యప్ కూడా అంగీకరిస్తాడు. పాయల్‌తో అనురాగ్ చేసినది బాలీవుడ్‌లో సర్వ సాధారణ విషయమే. బయట నుండి ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను అమ్మాయిలను సెక్స్ వర్కర్లలాగా చూడటం సహజమే. పాయల్ చెప్పినట్టు అనురాగ్ చేయగలడు. తన పార్ట్‌నర్స్ అందరినీ అనురాగ్ చీట్ చేశాడు" అని కంగనా రనౌత్ ట్వీట్లు చేశారు. బాలీవుడ్ అంతా లైంగిక వాంఛలతో కూడిన వ్యక్తులతో నిండినదనీ, బాలీవుడ్ లో మీటూ పెద్ద ఫెయిల్యూర్ అనీ కంగనా రనౌత్ అన్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలను నోళ్లు ఎలా చేశారో కూడా అలాగే నొక్కేసి ఉండవచ్చని కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు.

తూచ్ ... మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

తూచ్ ... మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున రెండో ఎలిమినేటర్ పై చివరి వరకు సాగిన ఉత్కంఠ బిగ్ హౌస్ డోర్ దాక వెళ్ళి వెనుతిరిగిన దేత్తడి హారిక దేత్తడి కోసం ఇంటి సభ్యుల కంటతడికి కరిగిపోయిన నాగ్ వచ్చేవారం ఎలిమినేషన్ లో నాగవల్లి దేవి ని చేర్చిన కళ్యాణి పోతూపోతూ కూడా దేవిపై కళ్యాణి కసి చూపించింది బిగ్ బాస్ 4 సీజన్  వీకెండ్ సన్ డే ఎపిసోడ్ ఫన్ గా సాగింది. ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున పేల్చిన బాంబు తుస్సుమంది. రెండు రోజులుగా ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల లో, టీవీల ముందుఉన్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ చివరకు  కరాటే కళ్యాణి ఒక్కరే రెండోవారం  ఇంటిదారి పట్టారు. దాంతో నాగార్జున ఇంటి సభ్యులతో భలే గేమ్ ఆడుతున్నారు అనిపించింది. మొదటివారం మీలో కట్టప్ప ఉన్నాడు అంటూ కంటెస్టెంట్ల మధ్య టాస్క్ లు ఇచ్చి చివరికి తూచ్ కట్టప్ప ఎవరూ లేరు అంటూ తేల్చి చెప్పారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి.. చివరికి తూచ్ మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ జోక్ చేశారు. దాంతో కంటెస్టెంట్లు అంతా ఊపిరి పీల్చుకున్నా ప్రేక్షకులు మాత్రం ఇంటి సభ్యులతో నాగార్జున భలే గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కళ్యాణి నాగార్జున తో కలిసి స్టేజ్ పై ఈ రెండువారాలు బిగ్ హౌస్ లో తన  రోల్  రీప్లే చూసింది. హౌస్ లో తాను ఉండలేకపోయానని అందుకే తాను సెల్ప్ నామినేట్ అయ్యాను అంది. హౌస్ నుంచి వెళ్ళిపోతున్న ఆమెకు నాగార్జున ఇచ్చిన టాస్క్ లో భాగంగా బిగ్ హౌస్ కంటెస్టెంట్లలో టాప్ 5, బాటమ్ 5 వారి ఫొటోలను బోర్డ్ పై అమర్చింది. టాప్ 5గా హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ ఫొటోలను, బాటమ్ ఫైవ్ గా గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహైల్ ఫొటోలను పెట్టింది. దేవి బ్రిలియంట్‌, అవినాష్- అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి, మెహ‌బూబ్- ఇంటిలిజెంట్‌, లాస్య - ఇన్నోసెంట్‌,అఖిల్‌కు కోపమెక్కువ‌ని చెప్పింది.హౌస్‌లో క‌ట్ట‌ప్ప‌లు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌పడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. వచ్చేవారం ఎలిమినేషన్ లో దేవి నాగవల్లిని చేర్చుతూ బిగ్ బాంబ్ వేసింది. స్టేజీపై  రాగయుక్తంగా కళ్యాణి చెప్పిన డైలాగ్స్, ఆమె ఫర్మామెన్స్ తో నాగార్జున ఆశ్చర్యపోయాడు. ఆమెను అభినందిస్తూ షో నుంచి వీడ్కోలు చెప్పారు. ఇక రెండో ఎలిమినేటర్ ఎవరూ అని చెప్పడానికి ముందు కంటెస్టెంట్లకు ఫన్నీ టాస్క్ లు ఇచ్చారు. నామినేషన్ లో ఉన్న ఏడుగురు సభ్యుల అదృష్టాన్ని బెలూన్స్ తో పరీక్షించారు. ఈ టాస్క్ లో అభిజితి , కుమార్ సాయి సేఫ్అయ్యారు. దాంతో అప్పటివరకు నెక్ట్స్ ఎలిమినేటర్ కుమార్ సాయి అనుకున్నవారి అంచనా తప్పింది. ఆ తర్వాత బోస్ రింగ్ గేమ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యుల‌ జంట‌లు ఆడిన ఈ గేమ్ లో అఖిల్ గెల‌వ‌గా ఓడిపోయిన అభిజిత్ పుష‌ప్స్ చేశాడు. గెలిచిన మోనాల్‌ను ఓడిపోయిన హారిక నోరు మూయకుండా పొగిడింది. మెహ‌బూబ్ గెల‌వ‌గా ఓడిన‌ సోహైల్ ప‌చ్చి ఉల్లిపాయ తిన్నాడు. నాగవల్లి దేవి గెలిస్తే ఓడిపోయిన అమ్మ రాజ‌శేఖ‌ర్ ప‌చ్చి మిర్చి క‌ర‌క‌రా న‌మిలేశాడు. సుజాత గెల‌వ‌గా, ఓడిన లాస్య చిన్న‌పిల్ల‌లా మారాం చేసింది. దివి గెలిస్తే  ఓడిపోయిన అరియానా పోల్ డ్యాన్స్ చేసింది. గంగ‌వ్వ గెల‌వ‌గా, ఓడిన ‌కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్ర‌య‌త్నించాడు. అవినాష్‌ గెలిచి ఓడిపోయిన‌ నోయ‌ల్‌కు లిప్‌స్టిక్ రుద్దాడు. ఈ టాస్స్ లో గంగవ్వ, కుమార్ సాయి తో పోటీ పడి మరీ గెలిచింది. చాలా హుషారుగా హౌస్ లో గంగవ్వ టాస్క్ పూర్తి చేసింది. రాజశేఖర్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. ఇక ఎలిమినేషన్ నుంచి సోహైల్, నోయల్ సేఫ్ అని దేవి రాజపత్రం చదివి వినిపించింది. దాంతో ఫైనల్ గా హారిక, మోనాల్ మిగిలిపోయారు. అయితే ఈ రోజు హౌస్ నుంచి హారిక ఎలిమినేట్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమెను ఎలిమినేట్ చేసి ఆ తర్వాత సీక్రెట్ రూంలో ఉంచి టాస్క్ లు ఇచ్చి ఆ తర్వాత తిరిగి బిగ్ హౌస్ లోకి తీసుకువస్తారని రకరకాల కథనాలు వచ్చాయి. దాంతో ప్రేక్షకులు హారిక ఎలిమినేట్ అని డిసైడ్ అయ్యారు. ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు. నామినేష‌న్‌లో లేని ఏడుగురిలో హారిక ఎలిమినేట్ కావాల‌ని అఖిల్‌, మెహ‌బూబ్, లాస్య హారిక ముందున్న నీటిని జార్ లో పోశారు. మోనాల్ ఎలిమినేట్ కావాలంటూ దేవి, అరియానా, దివి మోనాల్ ముందున్న నీటిని జార్ లో పోశారు. ఇద్దరూ సమానం కావడంతో చివరగా సుజాత ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఆమె మోనాల్ వైపు మొగ్గు చూపడంతో మెజారిటీ ప్ర‌కారం హారిక ఎలిమినేట్ అయిన‌ట్లు నాగార్జున చెప్పాడు. ఇంటి స‌భ్యులు ఆమెకు  వీడ్కోలు చెప్తూ గేట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. హారిక అంద‌రికీ గుడ్‌బై చెప్పింది. సరిగ్గా అదే సమయంలో  హారికను బిగ్ హౌస్ లోకి రావాలని ఆదేశించారు. దాంతో అభిజిత్, నోయల్ హారికను చేతులపై ఎత్తుకుని హౌస్ లోకి తీసుకువచ్చారు. దేత్తడి కోసం హౌస్ మేట్స్ అంతా కంట తడి పెట్టుకుంటున్నారని అంటూ ఎలిమినేషన్ ను సీరియస్ గా తీసుకుంటూ ఆట ఆడండి. ఇకపై సెల్ఫ్ నామినేషన్లు ఉండవు అని చెప్పడానికే ఇదంతా  అంటూ  డబుల్ ఎలిమినేషన్ ఫేక్ అని తేల్చారు. దాంతో రెండోవారం బిగ్ బాస్ 4 సీజన్ వీకెండ్ ఫన్ కు తెరపడింది. మొదటివారం కట్టప్ప అంటూ, రెండో వారు డబుల్ ఎలిమినేషన్ అంటూ ఉత్కంఠను రేకెత్తించి చివరికి అంతా ఉత్తిత్తునే అన్నాడు నాగార్జున. మరి మూడోవారంలో ఏం ముచ్చట తీసుకువస్తాడో చూడాలి.

"1980స్ మిల‌ట‌రీ హోట‌ల్‌"ను ప్రారంభించిన 'మ‌జిలీ' నిర్మాత‌లు

  నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా 'మ‌జిలీ' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని నిర్మించి, ప్ర‌స్తుతం నాని హీరోగా 'ట‌క్ జ‌గ‌దీష్' చిత్రాన్ని నిర్మిస్తోన్న‌ షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది హోట‌ల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. పాపుల‌ర్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ సోద‌రుడు ఫ‌ణి వ‌ర్మ‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో "1980స్ మిలట‌రీ హోట‌ల్‌" (1980's Military Hotel)ను స్టార్ట్ చేశారు. ఖాజ‌గూడ-నానక్‌రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ద‌గ్గ‌ర ఏర్పాటుచేసిన ఈ హోట‌ల్‌ను సోమ‌వారం ఉద‌యం టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల‌ మీదుగా ప్రారంభించారు. హోట‌ల్ పేరు వింటేనే నోరు ఊరుతోంద‌ని, త‌ప్ప‌కుండా ఈ హోట‌ల్‌కు మంచి పేరు వస్తుంద‌నే ఆశాభావాన్ని వారు వ్య‌క్తం చేశారు. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన, నోరూరించే తెలుగింటి రుచుల‌తో, అత్యంత ప‌రిశుభ్ర‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన‌ ఆహార ప‌దార్థాల‌ను త‌మ హోట‌ల్‌లో అందిస్తామ‌ని "1980స్ మిలట‌రీ హోట‌ల్" య‌జ‌మానులు తెలిపారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

Health Hacks!!.

Here are some simple inclusions to be made into our lifestyles to lead a healthy life! Here goes the list :   Get rid of the Soda of your diet instead opt for a glass of water. Self cooking is yet another way to sparing yourself some bucks and yet serving yourself some health on the plate. Avoid the onsumption of pre-packed food. Try shopping on full stomach, all the junk will barely end up in your shopping basket. Make time for exercise, may it be walking or bikeride atleast for 20-30 minute. If you are way too busy to make some time to sweat it out, then make it up by standing on one leg while brushing by doing so you can improve your balance and musculature of your legs. A beast of our-times is the mobile phone, turn it off from time to time. As it can induce Psychological stress and lead to many more problems beyond our understanding. Swap desserts and candies for fruits and fruit juices, and white breads for wheat or multigrain ones! Follow the age-old saying 'Early to bed, early to rise , makes the man healthy, wealthy and wise'   Rise early and meditate for about 20 minutes, doing  some deep breathing and doing Yoga can wonders for you! Take a shower with cold water after you done using warm water, cold water is good for skin, hair and overall circulation is improved greatly. Eat only when hungry and chew down slowly, it takes about 20 minutes for your brain to signal that you are full! Make it a point to wash your hand before evry meal. Never skip your meals especially your breakfast1 It is breakfast that defines your day ahead! These are some well-known facts that need to be implemented into our routines!! Stay healthy!!   SIRI

చెయ్యికి చెయ్యి, కాలికి కాలు విరగ్గొడతారు.. కొడాలి నానికి రఘురామరాజు సీరియస్ వార్నింగ్

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో స్పందించారు. విగ్రహాలు విరిగిపోతే ఏంటని మంత్రి కొడాలి అనడం నిజంగా సిగ్గుచేటని అయన అన్నారు. అసలు కొడాలి వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో... అందరికీ తెలుసని.. దీనిపై పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని తాను ఆ శక్తికి చేతులు ఎత్తి మొక్కుతున్నానని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ‘‘కొడాలి వేంకటేశ్వర రావు (నాని) అలాగే అయన వెనుక ఉన్న అదృశ్య శక్తికి స్పష్టంగా చెబుతున్నా... రాబోయే రోజుల్లో చెయ్యి విరగ్గొడితే చెయ్యి.. కాలు విరగ్గొడితే కాలు విరగ్గొడతారు ఖబడ్దార్’’ అని మండి పడ్డారు .   ఢిల్లీలో ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఎంపీ రఘురామరాజు ‘‘అయ్యా.. కొడాలి వేంకటేశ్వరరావు.. ఎదో విరిగిపోతే దేవుడికి ఏంటి నష్టమని అడుగుతున్నారు. అయ్యా దేవుడి పరమ భక్తుడైన కొడాలి నాని గారు నష్టం దేవుడికి కాదు. మాకు నష్టం. మన హిందువులకు నష్టం.. మొత్తం మన హిందువుల మనసులను గాయపరుస్తున్నారు. అక్కడ తగలబెట్టింది రథాలను కాదు.. భక్తుల మనోరథాలను, విరగొట్టింది విగ్రహాలను కాదు.. భక్తుల మనోభావాలను గాయపరిచారు. మతోన్మాదంతో మీరు చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నన్ను బహిష్కరించానని చెప్పుకొనే శక్తి లేని నిస్సహాయ స్థితిలో మీరున్నారు. దేవాలయాలపై పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే మీ సాటి కులస్థుడితో.. మీ సాటి మతస్తుడితో అల్లరి చేయిస్తారా? ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలారా.. కులాన్ని కులంతో.. మతాన్ని మతంతో... అదే మతంలో అతి పవిత్రంగా తిరుమల ఆచారాలను పాటించే కేబినెట్ సహచరుడితో ఇలా నాపై విమర్శలు చేయించడం అత్యంత హేయమైన చర్య. మీరు ప్రవేశపెట్టిన నాన్న బుడ్డి పథకాలకోసం... మీకు రివర్స్ వచ్చే పథకాలు చాలక... ఎక్కడా అప్పు పుట్టక మీ బంధువు ద్వారా స్వామి డబ్బుపై దృష్టి పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీలో ఇద్దరు ఉన్నతాధికారులను మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.’’అని ప్రభుత్వాధినేతల పై దుమ్మెత్తిపోశారు.   హిందువైన కొడాలి నాని కానీ, క్రిస్టియన్ అయిన సీఎం జగన్ కానీ... ఎవరూ కూడా మక్కాలో అడుగుపెట్టలేరు. ఎందుకంటే అది ముస్లింలకు పవిత్ర స్థలం. మసీదుల గురించి నానిమాట్లాడటం విచారకరం. మీ ఏరియాలో మీరు హీరోనే.. మీరు మాట్లాడితే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టం అని మీరు అంటున్నారు. మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం లేదు కదా. నష్టం మాకు. రథం చేయంచుకుంటే ఎవరికి లాభం.. మీకు ఉండొచ్చు. అంతేకాకుండా వెండి పోతే కొనుక్కుంటారని మీరు చెబుతున్నారు. పోయింది కేవలం వెండి కాదండి... అది అమ్మవారి వెండి. మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తున్నారు. మా దృష్టిలో దేవుడు. అక్కడ పోయిన సొమ్ము అమ్మవారికి చెందినది. మీరు ఒక హిందూ అయ్యి ఉండి.. ఓ క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల్లో గెలవాలంటే హిందూ మతం కావాలి. ఇంట్లో ఓ హిందూ దేవుడి ఫొటో ఉండదు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎవరెవరు చర్చిలకు వెళుతున్నారో రాష్ట్రపతికి రిపోర్టు ఇచ్చాను. త్వరలో వివరాలు అందరికి తెలుస్తాయి. హిందువులు అంటే శాంతస్వభావులు. పెద్దగా తిరగబడరు. మా స్వభావం అలాగే ఉంటుంది. మీ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తికి చెబుతున్నా.. మా మతం జోలికి రాకండి. భరతమాత ముద్దుబిడ్డ ఇక్కడే మా వెనక ఉన్నారు. మీరు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ అవమానించకండి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దలు మాడభూషి శ్రీధర్ ఇప్పటికే ఓ లేఖ రాశారు. అది చదివితే అన్నీ తెలుస్తాయి. ఇక దేవుడి సొమ్మును కొట్టేసినోడు బాగుపడినట్టు ఈ ప్రపంచంలో లేదు. మేము మీ దేవుణ్ణి గౌరవిస్తాం. మీరు మా దేవుణ్ణి గౌరవించండి’’ అని వ్యాఖ్యానించారు.

హిందువుల మనోభావాలు కించ పరిచిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయలా ? వద్దా ?

ఈ లింక్ ఓపెన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. https://www.youtube.com/user/teluguone/community      

కరోనా డేంజర్ బెల్స్... లక్షణాలు లేని రోగులతో మరింత ప్రమాదం

కరోనా మహమ్మారి మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అయితే ఈ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వచ్చి జనాన్ని భయపెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సర్వేలో కొన్ని ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ చేసిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే ఎటువంటి లక్షణాలు లేని వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఎటువంటి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) రోగుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉందని ఈ సర్వేలో స్పష్టమైంది. గత మే, జూన్ నెలల్లో హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా సోకిన 210 మంది రోగుల డేటాను విశ్లేషించిన తరువాత తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా వీరిలో 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం కరోనా వైరస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.   ఎటువంటి లక్షణాలు లేని రోగుల్లో ఇటు వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా బయటకు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంటారని ఈ తాజా సర్వేలో తేలింది. ఈ రోగుల నుండి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు తాజా సర్వే లో తేలింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. మిగిలిన 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. దీంతో వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుండి పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.

పసుపుతో మతిమరుపు మాయం

ప్రతి ఇంట్లో పసుపు తప్పని సరిగా ఉంటుంది. కూరల్లో రంగు కోసం తప్పని సరిగా వాడే పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మన పెద్దవారు గాయమైనా, జబులైనా పసుపుతో నయం చేసేవారు. ఆడపిల్లలకు నెలసరి సమయంలో చిన్న పసుపు ముద్ద మింగమని చెప్పేవారు. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్స్ ను నివారించడంతో దీనికి ఇదే సాటి.  పురాతన కాలం నుంచి మన సంప్రదాయంలో, ఆహారపు అలవాట్లలో భాగమైన పసుపు వల్ల కలిగే లాభాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరగుతున్నాయి. ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పసుపు మెదడు పనితీరుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తోందో తెలుసుకోవడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్  శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 50 నుంచి 90ఏండ్ల మధ్య వయసు ఉన్న వారికి  ఆహారంలో ప్రతిరోజూ 90మిల్లీగ్రాముల పసుపు ఇచ్చారు. ఆరునెలలకు ఒకసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 18నెలల తర్వాత వారిలో జ్ఞాపకశక్తి పెరగడాన్ని గమనించారు. పసుపు రక్తంలో కలిసి మెదడుకు చేరి కణాలను ఉత్తేజం చేస్తుందని తెలుసుకున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మతిమరుపును దూరం చేస్తుందని గమనించారు. దాంతో పసుపు మతిమరుపుతో బాధపడేవారికి ఒక వరం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అల్జీమర్స్  వ్యాధి నివారణలో పసుపు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలతో స్పష్టమైంది. ఈ పరిశోధన వల్ల పసుపు గొప్పదనం మరోసారి రుజువైంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.