Publish Date:Jan 23, 2014

EDITORIAL SPECIAL
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ఫలితాన్ని పక్కనపెట్టి ముందుకు కదిలాడు. హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేస్తున్నాడు. నిర్మాతగా అక్టోబర్ 2న విడుదల కానున్న 'సైరా నరసింహారెడ్డి' పనుల్లో తలమునకలై ఉన్నాడు. దర్శకుడు బోయపాటి కూడా 'వినయ విధేయ రామ'ను మర్చిపోయేలా బాలకృష్ణతో చేయనున్న సినిమా కథపై దృష్టి పెట్టాడు. ప్రేక్షకులూ దాదాపు ఆ సినిమాను మర్చిపోయినట్టే. ఇటువంటి సమయంలో 'వినయ విధేయ రామ'ను, అందులో ప్రేక్షకులు హేళన చేసిన ఓ సన్నివేశాన్ని 'తెనాలి రామకృష్ణ' టీజర్ మళ్లీ గుర్తు చేసింది. 'వినయ విధేయ రామ'లో విలన్ వివేక్ ఒబెరాయ్ మనుషుల తలలను రామ్ చరణ్ నరకడం, గాల్లోకి లేచిన ఆ తలలను గద్దలు ఎత్తుకు వెళ్లడం తెలిసిందే. ఆ సన్నివేశంపై అప్పట్లో సోషల్ మీడియాలో సెటైర్స్ పడ్డాయి. కామెడీగా ఉందని కొందరు కామెంట్ చేశారు. 'తెనాలి రామకృష్ణ' టీజర్లోనూ దాన్ని కామెడీ చేశారు. 'వాడి తల ఎగరాల్సిందే.. గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే' అని  కమెడియన్ సప్తగిరి చేత ఓ డైలాగ్ చెప్పించారు. సినిమా జయాపజలకు ఎవరైనా సమిష్టి బాధ్యత తీసుకోవాలి. కానీ, సినిమా క్రియేటివిటీ దర్శకుడిది చెందుతుంది. ఈ డైలాగ్ బోయపాటి క్రియేటివిటీపై సెటైర్ అనుకోవాలేమో. దీనిపై 'తెనాలి రామకృష్ణ' హీరోలు ఏమంటారో?
తెలుగులో నందితా శ్వేత కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రామిసింగ్ హీరోయిన్ల లిస్టులో ఒకరు అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు విజయాలు దక్కలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా పేరు తెచ్చుకుంటూ, అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతానికి తెలుగులో విడుదలైన నందితా శ్వేత లాస్ట్ సినిమా 'కల్కి'. అందులో రాజశేఖర్ హీరో. హీరోయిన్ అదా శర్మ. ముస్లిమ్ యువతిగా నందితా శ్వేత కీలక పాత్ర చేసింది. ఈసారి మాత్రం రాజశేఖర్ పక్కన ఆమెకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. అందులో నందితా శ్వేతను  హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశారని టాక్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదొక థ్రిల్లర్ సినిమా. స్క్రీన్ ప్లే ఎగ్జైటింగ్ గా ఉంటుందట.
  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'సైరా.. నరసింహారెడ్డి' కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి 2' రికార్డుల్ని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బిలీవ్ చేసిన 'సాహో'.. ఆ పని చేయలేకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టీ 'సైరా'పై నిలుస్తోంది. టాలీవుడ్‌లో 'బాహుబలి 2' క్రియేట్ చేసిన కలెక్షన్ల బెంచ్ మార్కుని 'సైరా' చెరిపేస్తుందని మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై 'సైరా' బొమ్మ పడుతుందా.. అని వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రాంచరణ్‌తో 'ధృవ' మూవీ చేసి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ను చేయనున్నట్లు ప్రకటన రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒక చారిత్రక పురుషుడు, తొలితరం ఫ్రీడం ఫైటర్ స్టోరీని సురేందర్ రెడ్డి చేతుల్లో పెట్టడం ఏమిటన్నవాళ్లున్నారు. ఇలాంటి కథలకు రాజమౌళి, గుణశేఖర్, క్రిష్ వంటి దర్శకులు సరిగ్గా సరిపోతారనేది చాలామంది అభిప్రాయం. అయితే 'ధృవ' మూవీని తీసిన విధానమే సురేందర్ రెడ్డికి 'సైరా'ను డైరెక్ట్ చేసే అవకాశం లభించేట్లు చేసింది. అప్పటికీ సురేందర్‌కు చిరంజీవి ఒక పరీక్ష పెట్టారు. అది.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్. ఆ స్క్రిప్టును తను ఆశించిన విధంగా సురేందర్ తయారు చేయగలిగితే ముందుకు వెళ్లాలనీ, లేకపోతే మరో కమర్షియల్ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యాలనీ మెగాస్టార్ భావించారు. మొత్తానికి 'ఖైదీ నంబర్ 150' తర్వాత సురేందర్ డైరెక్షన్‌లోనే సినిమా చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు సురేందర్. అప్పటికే పరుచూరి బ్రదర్స్ వంటి సీనియర్ మోస్ట్ రైటర్స్ చిరంజీవి కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్టును రెడీ చేసి పెట్టినప్పటికీ, దానితో సురేందర్ రెడ్డి తృప్తి చెందలేదు. తను స్వయంగా స్టడీ చేసి, ఎంతో మెటీరియల్ సేకరించి దానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టులోని అంశాలను కూడా జోడించి, తను సొంతంగా స్క్రిప్టు రెడీ చేసి, చిరంజీవికి వినిపించాడు. వినడం ఆలస్యం.. సురేందర్‌ను కావలించుకొని, "మనం ఈ సినిమా చేస్తున్నాం" అని చెప్పేశారు మెగాస్టార్. అలా పట్టాలెక్కింది 'సైరా' ప్రాజెక్ట్. అయితే పేపర్‌పై ఉన్న స్క్రిప్టును ఉన్నదున్నట్లు ఫిల్మింగ్ చెయ్యడం అంత ఈజీ కాదు. అదీ.. చారిత్రక కథకైతే మరీ కష్టం. 19వ శతాబ్దం నాటి వాతావరణాన్ని సృష్టించడానికి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పడిన కష్టం అంతా ఇంతా కాదని 'సైరా' యూనిట్ చెప్పింది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా, సాధ్యమైనంతగా అప్పటి వాతావరణంతో సెట్స్ వేసి, సన్నివేశాలు తియ్యాలని ప్రొడ్యూసర్ రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ డిసైడ్ అవడంతో.. ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు రాజీవన్. కత్తి మీద సాము లాంటి ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. సహజ వాతావరణం ఉట్టిపడేలా సెట్స్ వేసి, అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఆ సెట్స్‌లో తను అనుకున్న విధంగా సన్నివేశాలు తీసి మెగాస్టార్ మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. రాబిన్ హుడ్ అనగానే మనకు గుర్రంపై స్వారీ చేస్తూ, ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదిలే వీరుడు మనసులో మెదిలినట్లే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైతం గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఆయన అయుధాలు విల్లంబులు కావు, రెండు కరవాలాలు. వీపున ధరించే ఆ ఖడ్గాలు నరసింహారెడ్డి చేతుల్లోకి వచ్చాయంటే, ఎదుటివాళ్ల తలలు తెగి పడాల్సిందే. అరవై ఏళ్ల వయసంటే ఉద్యోగం నుంచి రిటైరై, కాలక్షేపం చేసే వయసు. కానీ 64 ఏళ్ల వయసులో గుర్రంపై స్వారీ చేస్తూ, కత్తి యుద్ధం చేయడమంటే మాటలా! ఎంత ఎనర్జీ, ఎంత స్టామినా కావాలి! ఎంతగా దమ్ము పట్టాలి! కానీ మెగాస్టార్ ఆ పని చేశారు. యుద్ధ సన్నివేశాల్లో అతి తక్కువగా మాత్రమే బాడీ డబుల్‌ను.. అంటే డూప్‌ను వాడేందుకు ఒప్పుకొని, దాదాపు అన్ని సన్నివేశాల్నీ తానే వీరోచితంగా చేశారు. ఆ వార్ సీన్స్‌లో చిరంజీవి చెలరేగిన తీరు చూసి, ఆయన స్టామినా చూసి.. డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ సహా యూనిట్ అంతా సంభ్రమం చెందారంటే.. ఆ సన్నివేశాలు ఎలా వచ్చి ఉంటాయో ఊహించుకోవాల్సిందే. వాటికి సంబంధించిన శాంపిల్స్‌ని మనం టీజర్‌లో చూశాం. మూవీలో పూర్తి స్థాయిలో ఆ వార్ ఎపిసోడ్స్ చూస్తే మతులు పోవడం ఖాయమంటోంది 'సైరా' సైన్యం. 'సైరా'లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటిలో క్లైమాక్స్ ఉద్విగ్నభరితంగా, గుండెలు పిండేసేలా ఉంటుంది. కారణం.. అది.. నరసింహారెడ్డిని ఉరితీసే సన్నివేశం కాబట్టి. అలాగే ఇంటర్వెల్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, కోట ముట్టడి సన్నివేశాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని యూనిట్ మెంబర్స్ అంటున్నారు. 'సైరా'కు సంబంధించిన అతి కీలక అంశం ఒకటుంది. ఇది కేవలం వార్ ఫిల్మ్ కాదు. ఇది కేవలం స్వాతంత్ర్య సమర గాథ కాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమర రంగాన కదం తొక్కే వీర యోధుడు మాత్రమే కాడు. ఆయన ఒక కుటుంబ పెద్దగా కూడా దర్శనమిస్తాడు. భార్యను అమితంగా ప్రేమించే, గౌరవించే ఒక భర్తగా కనిపిస్తాడు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ఈ మూవీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు డైరెక్టర్. చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన సన్నివేశాలు భావోద్వేగంతో కొనసాగి ఆకట్టుకుంటాయి. అంతేనా.. నరసింహారెడ్డిలోని ఒక ప్రేమికుడిని కూడా ఇందులో మనం చూడబోతున్నాం. అందులో భాగంగా చిరంజీవి, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయనేది యూనిట్ సభ్యుల మాట. ఇక అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ వంటి స్టార్ యాక్టర్స్ చేసిన పాత్రల గురించి ఇదివరకే మనం పరిచయం చేసుకున్నాం. వాళ్లు చెయ్యడం వల్లే 'సైరా'కు ప్యాన్ ఇండియా లుక్ వచ్చింది. ఫలితమే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండటం. అన్నట్లు ఒక విషయం చెప్పడం మరిచాను.. ఝాన్సీ లక్ష్మీబాయిగా కొద్దిసేపు కనిపించి ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని రేకెత్తించే పాత్రలో అనుష్క వీర విహారం చేయనున్నది. మూవీ ప్రారంభంలోనూ, ముగింపులోనూ ఆమె కనిపించనున్నది. ఇన్ని విశేషాలు, విశిష్ఠతలూ ఉన్న 'సైరా.. నరసింహారెడ్డి'ని చూడొద్దనుకొనే సినీ ప్రియులు ఉంటారా? అందుకే అందరూ అంత అత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూడ్డం. ఆ రోజు.. అక్టోబర్ 2.. వచ్చేస్తోంది.. ఈ లోగా ట్రైలర్‌తో సరిపెట్టుకుందాం.
  విశాల్ హీరోగా సుందర్ సి. డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'యాక్షన్'. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌. రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి 'యాక్షన్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాస్‌ హీరో విశాల్‌. ఈ మూవీ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్‌ సీక్వెన్సులు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్‌ పార్ట్‌ను విశాల్ ఎంతో డెడికేటెడ్‌గా చేశాడని తెలుస్తోంది. టీజర్‌ని చూస్తుంటే ఒక విజువల్‌ ఫీస్ట్‌గా 'యాక్షన్' ఉంటుందని అర్థమవుతోంది. టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. హిప్‌హాప్‌ తమిళ అందించిన మ్యూజిక్.. టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది. మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్‌, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. నిర్మాత ఆర్‌. రవీంద్రన్‌ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే సుందర్‌ సి. టేకింగ్‌ ఓ స్టైలిష్‌ లుక్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నాడు. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా 'యాక్షన్' తయారవుతోంది. కబీర్ దుహన్ సింగ్, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పురి, యోగిబాబు, రాంకీ, ఛాయా సింగ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: ఆర్‌.రవీంద్రన్‌, కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
  తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన 'కాప్పాన్' మూవీ తెలుగు వెర్షన్ 'బందోబస్త్'.. ఒరిజినల్‌తో పాటే సెప్టెంబర్ 20న తెలుగునాట రిలీజవుతోంది. తిరుపతి ప్రసాద్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ పిలుచుకొనే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ ఈ మూవీని తెలుగు స్టార్ హీరోల సినిమా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకు అగ్రెసివ్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఆయనిస్తున్న ప్రమోషన్‌కు ఆ మూవీ ప్రి రెలీజ్ ఈవెంట్‌లో సూర్య సైతం తెగ పొగిడేశారు. అయితే 'బందోబస్త్'ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారా?.. అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ తమిళ స్టార్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అంతెందుకు.. ఆ మధ్య ఎంతో ఆర్భాటంతో, ప్రచారంతో విడుదల చేసిన సూర్య మునుపటి సినిమా ‘ఎన్‌జీకే’ తెలుగులో డిజాస్టర్ అయింది. అదే సినిమా తమిళంలో హిట్టవడం గమనార్హం. కొంత కాలం క్రితం తమిళ అనువాద చిత్రాలు తెలుగు తెరపై సృష్టించిన అలజడిని ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోలేదు. రజనీకాంత్, కమలహాసన్ మొదట్నుంచీ తెలుగు హీరోల మాదిరిగానే ఆదరణ పొందుతూ రాగా, ఆ తర్వాత వారికి విక్రం, సూర్య, శింబు, సిద్ధార్థ్, విశాల్, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్ వంటి హీరోలు తోడయ్యారు. దాంతో ఒక్కొక్కప్పుడు తెలుగు సినిమాలకే తగినన్ని థియేటర్లు లభించని స్థితి ఏర్పడింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాను విడుదల చేసినట్లుగానే వాళ్ల సినిమాలను కూడా ఇక్కడ భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే మన హీరోలకు వీళ్లు పక్కలో బల్లేల్లా తయారయ్యారు. ఓ వైపు మన యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, మరోవైపు తమిళ యువ హీరోల సినిమాలు శరపరంపరలా దూసుకువచ్చి థియేటర్లను ఆక్రమించేవి. అంతేనా.. అవి ఆడుతున్న థియేటర్లు యువతరం ప్రేక్షకులతో కిటకిటలాడేవి. దాంతో సహజంగానే వాళ్ల చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. ‘అపరిచితుడు’, ‘గజిని’, ‘పందెంకోడి’, ‘ప్రేమిస్తే’, ‘మన్మథ’, ‘ఆవారా’, ‘రఘువరన్ బీటెక్’, ‘తుపాకి’, ‘రెమో’, ‘అభిమన్యుడు’ తదితర అనువాద చిత్రాలు ప్రేక్షకుల ఆదరాన్ని బాగా పొందాయి. ఆ హీరోల్లో సిద్ధార్థ్ అయితే ఏకంగా టాలీవుడ్‌లోనే కొంత కాలం తిష్ఠవేశాడు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'అనగనగా ఓ ధీరుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇదివరికటిలా తమిళ హీరోల సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రజనీకాంత్ ‘పేట’ తమిళంలో బ్లాక్‌బస్టర్ కాగా, ఇక్కడ అంతంత మాత్రంగానే ఆడింది. దానితో పాటు విడుదలైన అజిత్ సినిమా ‘విశ్వాసం’ సైతం తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కానీ తమిళంతో పాటు తెలుగులో విడుదల చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు రాలేదు. చివరకు చాలా రోజుల తర్వాత విడుదల చేస్తే, మొదటి రోజే ఈ సినిమాకి ప్రేక్షకులు లేకపోవడంతో రెండో రోజు నుంచే కొన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా మాయమైంది. ఇక సిద్ధార్థ్, శింబు వంటి హీరోల సినిమాలను తెలుగులో విడుదల చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొంత కాలం క్రితం తెలుగు హీరోలా మారిపోయాడనిపించిన కార్తీ సినిమాలకు సైతం తెలుగులో డిమాండ్ తగ్గిపోయింది. అతడు హీరోగా నటించీన 'కాష్మోరా', 'చెలియా', 'ఖాకీ', 'చిన్నబాబు', 'దేవ్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇదివరకటిలా ధనుష్, విశాల్ ప్రాభవం తెలుగునాట కనిపించడం లేదు. దీనికి కారణం.. కొంత కాలంగా తెలుగులోనూ యువ హీరోల సంఖ్య బాగా పెరగడమే. దీంతో అరవ హీరోలు వెనుకబడిపోయారు. తెలుగునాట ఇదివరకటిలా వాళ్ల పప్పులు ఉడకడం లేదు. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'బందోబస్త్'ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఆసక్తి టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది.
  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.
  టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి. అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!
  వరుసగా రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డీలాపడిన కాంగ్రెస్ కు పునరుజ్జీవం తెచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. జవజీవాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పరపతిని పెంచేందుకు సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పూనుకున్న సోనియా... ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్ లతో వార్ రూమ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తరహా మోడల్ అనుసరించాలని భావిస్తున్నారట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని సోనియా థింక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ఒక్కటే సరిపోదని... ప్రజాసమస్యలపై స్పందిస్తూ నేరుగా ప్రజలతో అనుసంధానం కావాలని, అప్పుడే పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాకొచ్చిన సోనియా.... ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని డిసైడయ్యారట.  అతిత్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కు పెనుసవాలుగా మారాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి, కాంగ్రెస్ ను మళ్లీ రేసులో నిలిపేందుకు సోనియా సవాలుగా తీసుకున్నారట. మరి సోనియా ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.... కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో రాదో... మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్టు... 14రోజుల రిమాండ్‌ విధించింది. దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తోపాటు 143, 341, 324, 323, 506, 148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సెప్టెంబర్ 25వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు. 2017లో దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన కేసులో 12రోజులక్రితం చింతమనేనిని అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న చింతమనేని... అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.... 14 పోలీస్ బృందాలు పశ్చిమగోదావరి జిల్లాను జల్లెడపట్టడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు. అయితే సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడంతో, అప్పటికే ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులకు చింతమనేని చుక్కలు చూపించారు. కారు దిగనంటూ హైడ్రామా సృష్టించారు. అదే సమయంలో చింతమనేని అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చింతమనేనిని చేతులపై ఎత్తుకున్న అనుచరులు కొద్దిసేపు అలజడి సృష్టించారు. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దాంతో అనుచరులు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారని, జగన్ ప్రభుత్వం... తనపై కక్షగట్టిందని,  తనను అంతమొందించేందుకు కుట్ర చేసిందని చింతమనేని ఆరోపించారు. ఇదిలాఉంటే, చింతమనేని బాధితులు... పోలీసుల ముందు క్యూకడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు. అట్రాసిటీ, భూకబ్జా, బెదిరింపులు ఇలా... చింతమనేనిపై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, చింతమనేని అరెస్ట్‌‌తో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, దుగ్గిరాలలో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.
జగన్మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 41ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, అనాగరిక పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ హయాంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి టైమ్ లో కేవలం ఒకే ఒక్క జిల్లాకు హింస పరిమితమైతే, ఇప్పుడు రాష్ట్రమంతటా రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. దాడులు, కేసులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం... ఇలా వంద రోజుల్లోనే వందలకొద్దీ దౌర్జన్యాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ నేతలపై 38 అట్రాసిటీ కేసులు పెట్టారన్న చంద్రబాబు... ఈ వంద రోజుల్లోనే తెలుగుదేశం శ్రేణులపై 565 కేసులు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 21మంది ఉద్యోగుల తొలగింపు, 15 భూకబ్జాలు, 65 ఆస్తుల ధ్వంసం, 10 హత్యలు, 28 చొప్పున 28 పర్సనల్ అండ్ సోషల్ మీడియా కేసులు పెట్టగా, వైసీపీ వేధింపులు భరించలేక 8మంది ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గుంటూరు జిల్లాలో 500మందిని గ్రామాల నుంచి తరిమికొట్టారని లెక్కలతో సహా బాబు బయటపెట్టారు. ఇక పోలీసులు సైతం టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని, తెలుగుదేశం వాళ్ల ఫిర్యాదులను తీసుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజలు తమ సొంత ఇళ్లల్లో ఉండటానికి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. దాడులు, అక్రమ కేసులే కాకుండా తోటలు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇంతటి రాక్షస పాలనను తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాక్షసుల గురించి వినడమే గానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, వైసీపీ నేతలు... రాక్షసులను మరిపిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదని చంద్రబాబు ఫైరయ్యారు. అమ్మాయిని వివస్త్రను చేసి కారం చల్లుతారా? 545మందిని గ్రామాల నుంచి వెలేస్తే చిన్న సమస్యా? బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అంటూ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, తమకు అడ్డే లేదు... ఏమైనా చేస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ వైసీపీ దౌర్జన్యాలు ఇక సాగనివ్వబోమంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదిఏమైనా ఛలో ఆత్మకూరు ఆగదని, ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని బాబు తేల్చిచెప్పారు.
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసైపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైపోయింది. తమిళిసై ప్రమాణస్వీకారం చేసిన రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం దీనికి కేంద్రమైంది. సర్కారియా కమిషన్ సిపార్సులను ఊటంకిస్తూ రాసిన వ్యాసంలో... తమిళిసై నియామకంపై పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు అయిష్టతను బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా రాసిన ఈ వ్యాసంలో... రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్లగా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సిఫార్సులను ప్రస్తావించారు. గవర్నర్ వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో విశ్లేషణ సాగింది. అయితే సీఎం సీపీఆర్వో ఆర్టికల్ పై బీజేపీ మండిపడుతోంది. అసలు సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు గవర్నర్ ను గౌరవిస్తామని చెబుతూనే, మరోవైపు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యాసాలు రాయించడమేంటని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా సీఎం సీపీఆర్వో... రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ పై అనుమానాలు, అపోహలు ఉన్నాయంటూ, ఆర్టికల్ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్టికల్ రాసిన వ్యక్తికి సర్కారియా కమిషన్ సిఫార్సులు గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోన్న బీజేపీ... సీపీఆర్వోను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ పై అనుచిత ఆర్టికల్ రాసిన సీఎం సీపీఆర్వోపై చర్యలు తీసుకోకపోతే, క్రిమినల్ కేసు పెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అయినా, గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుని 24గంటలు కూడా గడవకముందే ఇలా విషం కక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ గా తమిళిసైకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్న కేటీఆర్... ఆమె మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. మరోవైపు మిగతా గవర్నర్లకు భిన్నంగా బాధ్యతలు స్వీకరించినరోజే తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తమిళిసై... కేసీఆర్ పరిపాలనను, అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశంసించారు. బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి, తెలంగాణకు కొత్త గవర్నర్ రాక సందర్భంగా, సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, రాజకీయ కోణంలోనే తమిళిసైని తెలంగాణకు గవర్నర్ గా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆమె నియామకం.... సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టం లేదనే చర్చ నడుస్తోంది. మరి ముందుముందు ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.
  సలహా ఇవ్వడం కూడా ఒక కళే     ప్రపంచంలో అతి సులువుగా లభించేది ఏమన్నా ఉంటే సలహానే! అందుకనే ఎవరికి వారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ ఒకోసారి మనం ఆచితూచి ఇచ్చే సలహానే మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుంది. అందుకనే అనువైన సలహాని ఇవ్వడం కూడా ఒక కళగా భావించవచ్చు. ఇందుకోసం కొన్ని మెలకువలు పాటిస్తే సరి...   అడగనిదే! అవతలివారి సమస్య మీకెంత సామాన్యంగా తోచినా, దానికి ఖచ్చితమైన సలహా మీ దగ్గర ఉందని అనిపించినా... అడగకుండా ఇచ్చే సలహాకి అంత ఉపయోగం ఉండదు. సరికదా! వారు నొచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు... తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టడానికే అవకాశం ఉంది. అందుకే అడగకుండా సలహా ఇవ్వకూడదంటారు పెద్దలు. ఒకవేళ అతని సమస్యకు మీ దగ్గరే పరిష్కారం ఉందని తోస్తే అతని అనుమతి తీసుకునో, ఒంటరిగా ఉన్నప్పుడో, మధ్యవర్తుల ద్వారాలో మీ సలహాను అందిస్తే సరి.   సావధానంగా విన్నాకే! సమస్య ఉన్నవారే సలహా కోసం అభ్యర్థిస్తారు. సమస్య ఉంది కాబట్టి దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడి కొంత ఉపశమనాన్ని పొందాలని అనుకుంటారు. కాబట్టి సలహా ఇవ్వాలనుకుంటూ వారి మాటలను సావకాశంగా వినితీరాలి. మనకి కాస్త విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా సంభాషణను సాగించాలి. వీలైతే మరిన్ని ప్రశ్నలు వేసి, సమస్యలోని భిన్న కోణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.   మనదిగా భావించి! సమస్య మనది కాకపోవచ్చు. కానీ మనం ఇచ్చే పరిష్కారంతో అది ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోతుపాతులు తెలుస్తాయి. అలా కాకుండా కేవలం ఒక మూడో వ్యక్తిగానే ఉంటే, సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. ‘ఇదే ఇబ్బంది నాకు తలెత్తితే, నేను ఏం చేయగలను? నేను తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎలాంటి సావకాశాలు ఉన్నాయి?’ అని ఆలోచిస్తేనే సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం లభిస్తుంది.   చర్చించండి! సలహా అడిగారు కదా అని అవతలివారిని ఊదరగొట్టేస్తే సరిపోదు. సలహాలదేముంది! సవాలక్ష చెప్పేయవచ్చు! అవతలివారు కూడా మొహమాటానికి పోయి ఊరకుండిపోవచ్చు. కానీ సమస్య గురించి మీకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు... అన్నీ కూడా అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం అనేది ఒక కాలక్షేపంగా కాకుండా కార్యాచరణకు మార్గంగా నిలుస్తుంది.   నిజాయితీతో! సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలివారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద ఒక భరోసాతో వచ్చారన్న బాధ్యతని గుర్తుంచుకోరు. అలాంటి భేషజాలకు పోకుండా సమస్యను సానుకూలంగా విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వడం అవసరం. ఒకవేళ సమస్య పరిథి మనల్ని దాటిపోతోందని అనిపిస్తే... ఫలానా వ్యక్తినో, నిపుణుడినో కలిస్తే మంచిది అని చెప్పేయడం మంచిది.   - నిర్జర.
HANDWRITING IS MORE THAN A CHILDS PLAY     Children Handwriting   Raise your child’s grades, levels of confidence and self-esteem, discover their hidden talents; improve positive skills, power of concentration and memory. Understand better and help shy/emotionally disturbed/ difficult children and do much more … through Handwriting. Sounds hard to believe but it is true. But you can do all these and more. How much do you really know about your children? Do you at times wonder why are they so difficult to deal with? Do you ever wish you could know their deeper feelings and desires, their moods and silences, which can often be disturbing to you, to say the least? To understand their attitudes, character and psychological make-up and to help them improve in all aspects is easier than you think, through Graphology (the study of handwriting and handwriting analysis). A single page of a child’s handwriting can tell the Graphologist volumes about the child’s personality, character, fears, frustrations, etc, even without a personal encounter. WHAT IS GRAPHOLOGY? Graphology is a science, which deals with handwriting analysis. Handwriting is the psychological imprint of a person on paper. It is as unique as a fingerprint. No two handwriting samples are alike. Applied Graphology is a science wherein handwriting reveals character; where handwriting rewrites character. Handwriting Analysis combined with traditional training in handwriting can make subtle yet powerful shifts in the child’s mind, resulting in better attitude, better behavior and performance both at home and at school. Research conducted at the University of California Los Angeles (UCLA) in 1991, on the actual movements of the hand and it’s relationship to the stimulation of the brain, has successfully established a link between hand and brain. It has been ascertained that by changing handwriting one could change one’s attitude and personality. Most of the beliefs, values and habit patterns that are the basis of long-term success or failure, seem to take a concrete shape between 7-14 years of growing children. In this process, parents will be able to monitor and guide their children better, and give the right direction to the amazing potential all children possess. Your child will no longer be an unfathomable mystery to you! You will know and understand how he or she thinks and reacts, and you will know best how to deal with them. Basic tips on how to improve your handwriting: (A few practical points that can make a lot of difference). 1.You must have good lighting. 2.You must be sitting comfortably. 3.The surface that you put your paper on is important too. 4.Your arm needs to be able to move freely if it is to work at its best. 5.You need to be relaxed. 6.Lines. Well spaced, even lines of writing create an immediate impression of clarity and legibility. 7.The way you hold your pen will affect the letters that you write, there is no correct method of holding pen so hold the pen in the way you’re most comfortable. There are certain ways to improve your personal characteristics through your handwriting. Following tips applicable to children as well adults • If you want to be expressive, make sure that your right margins align all down the page. • To develop your confidence cross your t-bars above the stem. • Letters should be equally spaced in the words and lines to improve social life. • Always write upright or sloping (slanting) towards right to improve memory. • Apply medium pressure to improve your concentration power, avoid light and heavy pressure in your handwriting. • If you want to develop leadership qualities let the first letter in your signature dominate others. Write everyday a full page of handwriting. You cannot go wrong if you “write” right!
కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc
  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. కోడెల మరణవార్త విని పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు.. కోడెల మృతి పట్ల వారు సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘‘కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.     కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.     కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.     కోడెల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.  
  ఈ రోజు పల్నాడులోని గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా ఎపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో నిరసనగా ఈరోజు గురజాల బహిరంగ సభకు సిద్ధమవుతుండగా సభకు అనుమతి లేదన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి గెస్ట్ హౌస్ కు తరలించారు. గురజాలలో బీజేపీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కన్నా ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కన్నాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున సత్తెనపల్లి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. పల్నాడులో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మొన్న 11న చలో ఆత్మకూర్ అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుతో టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేయగా ఈ రోజు బీజేపీ నేత కన్నా ను అరెస్ట్ చేయడం తో అక్కడ నెలకొన్న పరిస్థుతుల తీవ్రత అర్థమౌతోంది.
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
బ్రెడ్‌తో క్యాన్సర్‌... ఎంతవరకూ నిజం!     ఏదన్నా ఆహారపదార్థం గురించి వార్త రానంతవరకూ దానిని విచక్షణారహితంగా వాడేయటం, ఏదో ఒక వార్త రాగానే బెంబేలెత్తిపోవడం వినియోగదారులకు ఉండే అలవాటే! దానికి గొప్ప ఉదాహరణగా నూడిల్స్ గురించి చెప్పుకోవచ్చు. మ్యాగీ వంటి ప్రముఖ బ్రాండ్‌ నూడిల్స్‌లో సైతం MSG అనే ప్రమాదకరమైన రసాయనం ఉందని తెలియగానే దేశం నూడిల్స్ ఉడికినట్లు ఉడికిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రెడ్‌ల గురించి కూడా వస్తున్న ఇలాంటి వార్తలు భారతీయులని కలవరపరుస్తున్నాయి. వివాదం ఏమిటి! దిల్లీకి చెందిన CSE అనే ఓ సంస్థ చేసిన పరిశోధనే ప్రస్తుత వివాదానికి కారణం. CSE చెబుతున్న వివరాల ప్రకారం, దిల్లీలో సేకరించిన దాదాపు 38 రకాల బ్రెడ్‌ నమూనాలలో దాదాపు 84 శాతం నమూనాలలో ప్రమాదకరమైన పొటాషియం బ్రోమైట్‌, అయోడైట్‌ అనే పదార్థాలు కనిపించాయి. ఈ నమూనాలు ఎక్కడో మారుమూల ఉన్న బేకరీల్లోంచి సేకరించినవి కావు. బ్రిటానియా దగ్గర్నుంచీ KFC వరకూ ప్రఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన నమూనాలు కూడా ఈ పరీక్షలో తేలిపోయాయి.   ఎందుకువాడతారు! బ్రెడ్‌ కోసం కలిపిన పిండి చక్కగా సాగేందుకు, బ్రెడ్‌ ఉబ్బెత్తుగా వచ్చేందుకు, మంచి రుచితో ఉండేందుకు ఈ పదార్థాలను వాడతారు. నిజానికి బ్రెడ్‌ లేదా బేకరీ పదార్థాల తయారీలో వీటిని ఉపయోగించకూడదన్న చట్టమేమీ మన దేశంలో లేదు. కాకపోతే ఒక మోతాదు మేరకే వీటిని వాడాలన్న నిబంధనలు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు బ్రెడ్‌ తయారీలో 50 PPM వరకూ ఈ పదార్థాలను వాడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే తాము బ్రెడ్‌లను ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్తిదారులు చెబుతున్నారు   సమస్య ఏమిటి! ఉత్పత్తిదారులు చెబుతున్న మాట వాస్తవమే. బ్రెడ్‌ తయారు చేసే సమయంలో పొటాషియం బ్రొమైట్‌ను కలపినా కూడా ఉత్పత్తి దశలో అది పొటాషియం బ్రోమైడ్‌గా మారిపోతుంది. బ్రోమైడ్ ఏమంత హానికారక పదార్థం కాదు. కానీ అలా జరగకపోవడమే అసలు సమస్య. CSE అందించిన గణాంకాల ప్రకారం... ప్యాక్‌ చేసిన బ్రెడ్‌లో కూడా పొటాషియం బ్రోమైట్‌ ఆనవాళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. బ్రెడ్‌ను ఉత్పత్తి చేసే సమయంలో లోపాలు ఉండటం, బ్రెడ్‌ మరింత ఉబ్బెత్తుగా కనిపించడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ పాళ్లు కలపడంతో.... మన చేతిలో ఉండే బ్రెడ్‌లో కూడా బ్రోమైట్‌ ఉంటోంది.   బ్రోమైట్‌ ఉంటే ఏంటట! బ్రోమైట్‌ గురించిన భయాలు ఈనాటివి కావు. బ్రోమైట్‌ ఒక క్యాన్సర్‌ కారకమంటూ దశాబ్దాల తరబడి పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీ, థైరాయిడ్ వంటి అనేక క్యాన్సర్లను ఇది కలిగించే ప్రమాదం ఉందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే ఆస్ట్రేలియా మొదలుకొని బ్రెజిల్‌ వరకూ దీనిని ఆహారపదార్థాల తయారీలో వాడవద్దంటూ నిషేధించారు. అంతదాకా ఎందుకు? మన పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలలో సైతం ఈ నిషేధం అమలులో ఉంది. కానీ నిరంతరం తన నిర్ణయాల కోసం అమెరికా వైపు చూసే మన దేశం మాత్రం, అక్కడిలాగే ఇక్కడ కూడా బ్రోమైట్‌ గురించి చూసీ చూడనట్లు ఉండిపోయింది. ఇక అయోడైట్ గురించి కూడా ఇలాంటి భయాలే ఉన్నాయి. థైరాయిడ్‌ పనితీరుని అయోడైట్ దారుణంగా ప్రభావంతం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.     ఇప్పుడేం చేసేది! బ్రోమైట్‌ క్యాన్సర్‌ కారకం అన్న మాట నిజమే కానీ... దానిని ఎలా, ఏ స్థాయిలో తీసుకుంటే క్యాన్సర్‌ కారకమో అన్న విషయం మీద స్పష్టత లేదు. పైగా ఇక నుంచి బ్రెడ్‌ ఉత్పత్తిలో బ్రోమైట్‌ను నిషేధిస్తామంటూ Food Safety Standards Association of India (FSSAI)  ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడినట్లే. కానీ మొన్నటి వరకూ నూడిల్స్, ఇప్పుడు బ్రెడ్‌కు సంబంధించిన వివాదాలతో మనకు ఓ పాఠం తెలిసొచ్చినట్లు అయ్యింది. ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉండే పళ్లు, కూరగాయల వంటి ఆహారాన్ని కాదని... బద్ధకంతోనో, జిహ్వచాపల్యంతోనో, గొప్ప కోసమో కృత్రిమమైన ఆహారం మీద ఆధారపడితే, అది ఎప్పటికైనా, ఎలాగైనా ఆరోగ్యానికి నష్టం కలిగించక మానదు. మరమరాల దగ్గర్నుంచీ మినప బజ్జీల వరకు మన సాంప్రదాయకమైన ఆహారాలు ఇన్ని ఉండగా పాశ్చాత్య ధోరణుల కోసం పాకులాడితే బొక్కబోర్లా పడకా తప్పదు.
  Health benefits of neem juice: 1. Due to its anti-inflammatory ingredients, neem juice extract is best to get rid of acne or pimples. Neem juice also improves the complexion. 2. By drinking neem juice, the toxins from the system are flushed out. This improves the hair quality, skin complexion and digestion. 3. Neem juice is considered effective for diabetic patients. By having neem juice everyday, you control the sugar levels in the body. 4. Neem juice reduces vaginal pain during pregnancy. Many pregnant women massage with neem juice to get rid of labor pain. Use of Neem Leaf for Dental Problems: Dry Neem leaves in shade and grind to make powder. Use it to massage your gums to treat pyorrhoea. It will also strengthen the gums. You may add a pinch of clove powder and peppermint powder to make it more refreshing.
  One of the most common and widely used method of detoxification is the juice fasting or also known as juice cleansing, in this regime the person deletes the solid food consumption and practically survives on fruits and vegetables juice for his nutritional survival. The are quite a few reason for the uptake of this juice diet, spiritual or religious reasons, alleged detoxification, weight loss, as a part of rehabilitation post the indulgence into smoking or or caffeine addiction, binge-eating or excessive soda consumption. Many believe that this to cure chronic pain, cancer, depression, arthritis, autoimmune diseases and severe infections that are resistant to antibiotics. One of the proven method is the bi-anually of week long periods which synchronize with the nature thus aiding and fastening the process of purification.  As a known fact, no diet is foolproof, this diet has some issues too. The juice has no fiber, thus flushing out of the slush from intestines. Yet another issue is the is the shelf life of maximum 72hours. Certain juices like grapefruit might interact with drugs causing reactions. And most importantly salt deficiency, as the content is low in fruits and vegetables, it may cause symptoms of headaches, light-headedness and nausea.      The best fruits for juice dieting are apples they are packed with antioxidants, reduces cholesterol and boost immunity. Pineapple add a tropical  flavor and have anti-inflammatory, antiviral and antibacterial; might also aid in the dissolution of blood clots; pineapple has a Bromelain protein for good digestion. Papaya is yet another option good for people for with weak digestion. Tomatoes are packed with lycopene which reduces the risk of cancer and cardiovascular diseases. This is great way of detoxification and weight loss. But we should bear in mind about the vitamin and mineral deficiencies; also keep away unhealthy regain of fat after the detox ends!    
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.