EDITORIAL SPECIAL
  ఇప్పుడంటే పొలిటీషన్లు అందరూ టెక్నాలజీని మంచినీళ్లలా వాడేస్తున్నారు గానీ, ఒకప్పుడు టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా!. ఎందుకంటే, అభ్యర్ధుల ఎంపిక కోసం నైన్టీస్ లోనే ఐవీఆర్ఎస్ సిస్టమ్ వాడిన తెలివైన పొలిటీషియన్ చంద్రబాబు. అయితే, పదేళ్ల నిరీక్షణ తర్వాత 2014లో అధికారాన్ని అందిపుచుకున్న చంద్రబాబు... ప్రజల నాడిని తెలుసుకునేందుకు కూడా అదే టెక్నాలజీని వినియోగించారు. ఏకంగా తన గొంతుతోనే ప్రజలకు ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచేవారు. నమస్కారం, నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా... అంటూ మొదలయ్యే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ తో ప్రభుత్వ పనితీరు ఉలా ఉంది?, మీ ఎమ్మెల్యే మీరు అందుబాటులో ఉంటున్నారా? అంటూ ఇలా పలు ప్రశ్నలు అడిగి అడిగేవారు. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి స్వరంతో ఫోన్ కాల్ వచ్చేసరికి... ప్రజలు ముందు ఆశ్చర్యానికి, ఆ తర్వాత భయానికి లోనయ్యేవారు. పరిపాలన బాగాలేదంటే ఏమవుతుందో ఏమోనని అన్నీ బ్రహ్మాండగా ఉన్నాయంటూ ఆప్షన్స్ ను నొక్కేవారు. ఇక అధికారుల గానాభజానా సరేసరి. 90శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ బాబును మెప్పించేవారు. ఇదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కొంప ముంచింది. అటు ఐవీఆర్ఎస్ సర్వే... ఇటు అధికారుల మాట నమ్మిన చంద్రబాబు... ప్రజల అసంతృప్తిని పసిగట్టలేకపోయారు. ఆఖరి సమయంలో పసిగట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి టీడీపీ చరిత్రలో ఎన్నడూలేనంతా దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిదంతా ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి పాలనకు వంద రోజులు కూడా పూర్తికాలేదు... కానీ, అప్పుడే 90శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ అధికారులు చెప్పుకొస్తున్నారట. ముఖ్యంగా స్పందన కార్యక్రమం టెలీకాన్ఫరెన్సుల్లో అధికారుల నుంచి ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయట. దాంతో ప్రజల అసంతృప్తిస్థాయి ఒక్క శాతానికి తగ్గించాలంటూ సీఎం జగన్ సైతం సూచించినట్లు తెలుస్తోంది. అయితే, సేమ్ టు సేమ్ ఇలాంటి మాటలే చంద్రబాబుకి కూడా చెప్పారట, అధికారుల లెక్కల్లో టీడీపీ పాలనపై 85శాతం హ్యాపీగా ఉన్నారని తేలిందట. అధికారుల మాటలను నమ్మిన చంద్రబాబు సైతం 85శాతంపైగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ అనేకసార్లు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం. అధికారుల చెప్పిన 85శాతం హ్యాపీకి 23 సీట్లే వచ్చాయి. మరి అప్పుడే జగన్ పాలనకు 90శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉంటే, అది రానురానూ 99శాతానికి చేరితే ఎన్ని సీట్లు వస్తాయో?. ఎందుకంటే 85శాతానికి 23 సీట్లు వస్తే... ఈ లెక్కన  99శాతానికి ఎన్ని సీట్లు వస్తాయో! ఏదేమైనా అధికారుల లెక్కలు నమ్మితే అధోగతే...అంతేమరి!
  యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులలోను అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతం కాగా ఇపుడు జమ్మూ కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ తో తలపడటానికి జిహాద్ తప్ప వేరే మార్గం లేదని అలాగే అణు యుద్ధం కూడా తప్పదని మొన్న పాక్ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా రాజనాధ్ పాక్ కు ఇలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అని, ఇప్పటివరకూ భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉందని ఐతే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అయన అన్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.
  రాజకీయాల్లో అతని రూటే సెపరేటు... పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది అతని ఫిలాసఫీ... ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది... కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది.... అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన... ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా..అంటూ తెగ మధనపడిపోతున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా... లేక రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా... తిన్నావా అంటూ పలకరిస్తున్నా, మరోవైపు సీఎం రమేష్‌ రారమ్మంటూ పిలుస్తున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. అయితే గలగల గంట మోగించే ఆయన, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టారనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇతనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... ఇంకెవరు గంటా శ్రీనివాసరావే.... ఇంతకీ ఇతని గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? ఎందుకంటే, టీడీపీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి జరిగిన కీలక సమావేశానికి ఈ గంటా సారు డుమ్మాకొట్టారు. గంటా సారుకి ప్రతిపక్షంలో కూర్చోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందుకే పార్టీ మారైనా సరే పదవి సంపాదిస్తారని అంటారు. అందుకే వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేయాల్సిందేనన్న జగన్‌ నిబంధనతో చేసేదేమీలేక ఆగిపోయారట. ఇక మిగిలింది బీజేపీ. అయితే, తనతోపాటు పది పదిహేను మంది ఎమ్మెల్యేలతో కమలం గూటికి వెళ్తారంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా, రూమర్లు మాత్రం ఆగలేదు. రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గానికి దూరంగా ఉండటంతో, పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఇప్పుడు టీడీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే పదవి లేకపోతే ఉండలేరు... పైగా పీఏసీ ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో, మరింత అసంతృప్తితో ఉన్నారట.  మొత్తానికి గంటా డుమ్మాపై టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్లో వాడివేడి చర్చ జరిగిందట. గంటాపై వేటు వేయాల్సిందేనని పలువురు నేతలు చంద్రబాబును గట్టిగా కోరారట. మరి గంటా మౌనం వీడతారా? లేక అంతకంటే ముందే బాబు నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకరు మౌనం వీడితే తప్ప ఈ గంట మోగుతుందో లేక సైలెంట్ గా అలాగే కంటిన్యూ అవుతుందో తేలుతుంది.
ALSO ON TELUGUONE N E W S
విజయాలతో కంటే పరాజయాలతో వార్తల్లో నిలిచే హీరో రాజ్ తరుణ్. అతడు నటించిన గత నాలుగైదు సినిమాలు ఏవీ సరైన విజయాలు సాధించలేదు. కొత్త సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అటువంటి రాజ్ తరుణ్ ఉన్నట్టుండి ఈ రోజు వార్తల్లోకి వచ్చాడు. అదీ సినిమా కబుర్లతో కాదు. కార్ యాక్సిడెంట్ వార్తతో! రాజేంద్ర నగర్ పరిధిలో సోమవారం రాత్రి వాల్వో కార్ ఒకటి ప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం... మద్యం మత్తులో కార్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే... ఈ కారు రాజ్ తరుణ్ పేరు మీద లేదు. నిర్మాత రామ్ తాళ్లూరికి‌ చెందిన కంపెనీ పేరు మీద ఉంది. దాంతో యాక్సిడెంట్ చేసినది ఎవరనే విషయమై కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొదట హీరో తరుణ్ పేరు కూడా వినపడింది. టీవీల్లో తరుణ్ యాక్సిడెంట్ చేశాడని వార్తలు వచ్చాయి. వెంటనే తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. తను ఏ యాక్సిడెంట్ చేయలేదని, ఇంట్లో ఉన్నానని ప్రకటన చేశాడు. తర్వాత కాసేపటికి రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేశాడని క్లారిటీ వచ్చింది. ఈ వార్త బయటకు రాకుండా చేయడం కోసం రాజ్ తరుణ్ పీఆర్ టీమ్ శతవిధాల ప్రయత్నించింది. కానీ, కుదరలేదు. ఇప్పుడు కేసులు లేకుండా చేయడం కోసం ఏం చేయాలని చూస్తున్నారు. రాజకీయ నాయకుల అండ కోసం ప్రయత్నిస్తున్నారు.
'పైసా వసూల్'లో నందమూరి బాలకృష్ణను పూరి జగన్నాథ్ స్టైలిష్ గా చూపించారు. ఆ సినిమా మినహా ఇటీవల వచ్చిన ఏ సినిమాలోనూ బాలకృష్ణ అంత స్టైలిష్ గా కనిపించలేదు. ఆఖరికి గత ఏడాది సంక్రాంతి 'జై సింహా'లోనూ ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. మామూలుగానే ఉన్నారు. కానీ, 'జై సింహా' తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యను చాలా స్టైలిష్ గా దర్శకుడు చూపిస్తున్నారు. కావాలంటే పైన ఉన్న ఫోటోను ఒకసారి చూడండి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బ్యాంకాక్ లో జరుగుతోంది. హీరోయిన్ సోనాల్ చౌహాన్, కమెడియన్లు రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, కారుమంచి రఘు, ధనరాజ్ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అక్కడ దిగిన సెల్ఫీ ఇది. బాలకృష్ణ హెయిర్ స్టైల్, గడ్డం... కొత్తగా ఉన్నాయి. నందమూరి నటసింహం చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. అందులో ఇది ఒకటి. మరో ఎలా ఉండబోతోందో? ఈ చిత్రానికి 'రూలర్' టైటిల్ ఖరారు చేశారట.
  త్వరలో  డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన 'కిల్లర్' సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్   డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు 'క్షణం' ను శిబిరాజ్ తో 'సత్య'గా తీయటంతో పాటు 'బేతాళుడు'  సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరో్యిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు. సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకె చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ధనుంజయన్. తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన 'యు టర్న్' సినిమాతో పాటు ను విజయ్ ఆంటోని 'కొలైకారన్' ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచు తో రాధామోహన్ దర్శకత్వంలో 'కాట్రిన్ మొళి' సినిమాను నిర్మించారు ధనుంజయన్. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు.
  బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా `అల్లుడు శ్రీను` సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.  తాను నాలుగైదు సినిమాలు చేసినా ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటీవల చేసిన `రాక్షసుడు` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి శ్రీనివాస్. ఇదిలా ఉంటె బెల్లకొండ తన రెండో  కుమారుడు సాయి గణేష్ ని హీరో గా పరిచయం చేస్తూ పవన్ సాధినేని డైరేక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కూడా బెల్లం కొండ సురేష్  తన రెండో కుమారుడు హీరో గా సినిమా చేయబోతున్నట్లు హింట్  ఇచ్చాడు. ఇక ఈ సినిమా లవ్ స్టోరీ  గా తెరకెక్కనున్నట్లు సమాచారం. బెక్కం వేణుగోపాల్ తో  కలిసి బెల్లంకొండ ఈ  చిత్రాన్ని నిర్మించనున్నారట. దసరాకు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరి సాయి శ్రీనివాస్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి సన్ స్ట్రోక్ తెచ్చుకున్న సురేష్ తన రెండో కొడుకు విషయం లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అంటున్నారు సినీ జనాలు.
ప్రెజెంట్ బన్నీ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో `అల వైకుంఠపురం లో` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం . ఇదిలా ఉంటే బన్నీ , సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఇక ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు ఆగష్టు 22 న ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ కావొచ్చాయట.  రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. సుక్కు , బన్నీ కాంబినేషన్ లో గతం లో ఆర్య , ఆర్య -2 చిత్రాలు వచ్చాయి.  రెండు సినిమాలకు మంచిపేరొచ్చింది. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నాడట.  హీరోయిన్ గా రష్మిక మందన్న నటించే అవకాశాలున్నాయట.  ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
  దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది. విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.
  జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది. పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
  జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.
  ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది. సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.
  అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!
  ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.
  కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రబుత్వం ఈరోజు మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేష్ సహా 17 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీజేపీ ఎమ్మెల్యే బి.శ్రీరాములు కూడా ఉన్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.
  ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్ల పేరుతో వైసీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చి, ఎందరినో రోడ్డుపాలు చేస్తుందని.. టీడీపీ నేత నారా లోకేష్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్ల పుణ్యమా అని రేషన్ డీలర్లు, మీ సేవ సిబ్బంది, ఆశా వర్కర్లు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా ఇదే విషయమై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ పై విమర్శల దాడి చేశారు.  "అనగనగా ఒక శాడిస్టు బాస్, ఉద్యోగిని పిలిచి 'నీకు జీతం రెట్టింపు చేశా' అన్నాడట. అతను సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే, 'నీకింకో విషయం చెప్పాలి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేసా' అన్నాడట. 'మరలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు' అని అడిగితే ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి అన్నాడట. వైఎస్ జగన్ గారు కూడా అదే చేస్తున్నారు. యానిమేటర్లకు జీతం పదివేలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కనీసం ఒక్క నెలయినా పెరిగిన జీతం ఇవ్వకుండా గ్రామ వాలంటీర్లను వారి మీదికి పంపి మీ ఉద్యోగాలు ఊడపీకారు పొమ్మంటున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి పది ఉద్యోగాలు పీకడం... ఏంటీ అన్యాయం జగన్ గారూ?" అని లోకేష్ విమర్శించారు.
  జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు జాప్యంతోపాటు నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఒకవైపు పోలవరం అథారిటీ చెప్పినా, మరోవైపు కేంద్రం హెచ్చరించినా వినకుండా పాత కాంట్రాక్టును రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవడంపై మండిపడింది. పోలవరం కాంట్రాక్టు రద్దును పార్లమెంట్ సాక్షిగానే తప్పుబట్టిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.... తాజా పరిణామాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పోలవరం అథారిటీని ఆదేశించారు. అసలు రివర్స్ టెండరింగ్ కి దారి తీసిన కారణాలేంటో చెప్పాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ...నివేదికపై కసరత్తు మొదలుపెట్టింది. అయితే, పోలవరం కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్ పై గుర్రుగా ఉన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్... అన్నీ గమనిస్తున్నాం... ఏం జరుగుతుందో చూద్దామంటూ జగన్ ప్రభుత్వానికి దాదాపు హెచ్చరిక సంకేతాలు పంపారు. అయితే, రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని విరమించుకోవాలని... అటు కేంద్రం... ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా ఖాతరు చేయకుండా, కనీసం కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా జగన్ సర్కారు కొత్త టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంతో... మొత్తం పరిణామాలపై కేంద్ర జలవనరులశాఖ నివేదిక కోరడం కీలకంగా మారింది. మొత్తానికి, పోలవరం వివాదంపై రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎంతమేర జరిగింది? ఎంతమొత్తంలో బిల్లులు చెల్లించాలంటూ పలు అంశాలపై నివేదిక కోరింది. అయితే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నివేదిక తర్వాత జగన్ సర్కారు షాకిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముందనే మాట వినిపిస్తోంది.
  Dates are sodium-free, fat-free, cholesterol-free, and a good source of fiber -- all of which are important factors in keeping a watch on the weight. Dates are a better substitute for candy or a packaged sweet, when satiating a sweet tooth or serving as an instant glucose supplement. Dates can provide lot of health benefits. Dates are high in iron content and fluorine. Dates are rich source of vitamins and minerals The benefits of dates include relief from constipation, intestinal disorders, heart problems, sexual dysfunction, diarrhoea, abdominal cancer, etc Loaded with fibre -- both soluble and insoluble -- dates are able to fill you up and keep your bowel habits regular. They are an excellent source of potassium and provide numerous other important vitamins and minerals -- quite a powerhouse packed in a tiny, portable package. Go grab a pack of dates in any form, whole dates or syrup. They are available off the shelf, aren’t they? - Radha Krishnaveni
Five Healthy skin foods!   A healthy skin signifies a healthy body and there are five foods which can add that glow and rejuvenate your skin! Lemon juices: A simple ingredient which can brighten up your skin like no other! Lemon juice tightens up the skin pores, gets rid of the oil, resulting a squeaky clean and shiny face. Eggs: Take the whole egg or simply the white, which when applied on your skin will give an enhanced moisturising effect. The white part firms up the skin. Gently rub the egg white over the skin surface and wash off. Honey: Honey can be applied daily on the face. It has a great moisturising effect and also fights infections and skin acne imparting the skin with soft and supple properties. Take some honey, mix it with few spoons of lemon juice and sandalwood powder and you can apply it for the face followed by rinse off. Strawberries: The fruit acts a very effective cleanser as it contains antioxidants, Vitamin C, and exfoliants. Crushed strawberries can be used a mask and also can be rubbed over your skin. Simply observe the glow! Bananas: The tropical fruits are a great moisturiser which also imparts a refreshed feeling to your skin. - Kalam Dhari  
      Feeling tired and irritated ?Are you prone to frequent allergies and infections? Having menstrual or digestive problems? Going through a feeling of disorientation and mental fatigue? In all probabilities your body could be saying I am tired and I need a break! As we get caught up with our daily house-work-family routine we just go off track with our health and when the toxins in our body get accumulated and its time to flush it out and feed it healthy nutrients. All you need is a good Detox to get you back on track and feel energetic again. Detoxification  involves clearing impurities from the blood boosting the liver function and thereby eliminating impurities from the blood. It is necessary to detox once a year like we do in our religious rituals and customs. This has been the ancient practice recommended by Ayurveda also as a good system cleansing practice to be followed by adults. Note: Pregnant and feeding mothers, children below 12 and people suffering with terminal and chronic diseases should not do it. Try this One-Day Veg &Fruit detoxification program Choose one day in  a week other than the weekend to detox. Step 1-Pick any of your favourite fruits and vegetables. Keep some whole fruits like apple, kiwi, pears and the seasonal ones available at that time to eat as it as and choose the high water content ones like melons pineapples , oranges and musk melons  for making into juices.Do not mix sugar or use any of those sugar free pellets. If the you think the juices are thick you could dilute them with water. Step 2- Pick you favourite veggies like carrots, cucumber, beetroot and tomatoes-these can be made into juices and you could keep some long with radishes and capsicum and  celery for salads. You could also look at adding some raisins and nuts and for the burst of freshness. Try combining some fruits and vegetables if you like. Avoid too much of dressing with oils or mayo- may be  some lemon juice with salt and pepper or a spoon of honey for improving the taste should do. Step-3- Green tea or herbal tea bags and hot water for the in between drinking .Since the juices are cold the herbal tea would be used as a warm drink to keep you active. Green tea is wonderful detoxifying- agent and can be had regularly. Step Detox -Now that you have your juices and cut fruit and vegetables ready .You can start the Detox session. You can start with a juice first and alternate that way with a juice and bowl of cut fruit or salad. Drink and eat as much as you want so you do not get hungry. Tea in Between: The herbal or green teas are for drinking in-between and for the evenings. But remember just 2 hours before you go to bed stop the juices and sip only herbal tea. Drinking juices which have sugar in them may stop you from falling asleep in the night. And your dose of H2O should also be had in between to clean your system. Drink at least 2 litres of water throughout the day if you can and complete your detox program. Try this for one day and feel the benefits of this internal cleansing regime!     
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.