LATEST NEWS
  Indian shooter Heena Sidhu has claimed her second medal in the ongoing commonwealth games. With that she has become the only woman to claim two medals in a row at the present games. Heena grabbed the gold in the women's 25m Pistol category. This takes India's medal count to 20 - 11 Gold, 4 Silver and 5 Bronze. Earlier 16-year-old shooter Manu Bhaker became the youngest Indian athlete to win a gold medal at the Games.
  In a socking accident from Himachal Pradesh, at least 27 children were dead as their school bus plunged into a valley. While 13 children died at the spot, while the rest succumbed to injuries at the hospital. The bus belonged to `Vazir Ram Singh Pathania Memorial School’ in Nurpur town of Himachal Pradesh. There were at least 40 children in the bus during the accident. Reports say that the death toll could be higher. The driver of the bus along with two teachers was also dead in the accident.
  Guess who our new finance minister is! None other than the prime minister Narendra Modi. Jaitley who has been undergoing treatment has requested to take leave for at least three months. Modi would now be taking over the ministry which is getting critical day by day. Sources say that he is going to take some crucial decisions to set right the financial crisis prevailing in the country. One of his key actions might target the banking sector which is a part of the finance ministry.
ALSO ON TELUGUONE N E W S
    Movie Details: Cast: Mahesh Babu, Kiara Advani, Prakash Raj, R. Sarathkumar, Aamani, Sithara, Posani Krishna Murali, Devadas Kanakala, P. Ravi Shankar, Rao Ramesh, Ajay, Brahmaji etc. Direction: Koratala Siva Banner: DVV Entertainments Producers: DVV Danayya Music: Devi Sri Prasad Release Date: Apr 20, 2018 Mahesh Babu and Koratala Siva worked together for the second time after delivering a blockbuster Srimanthudu. While Mahesh’s previous films were super hits, Mahesh is out of form. Let’s see whether Bharat Ane Nenu will live up to the prospects… Story: Bharat Ram (Mahesh Babu) comes to India from London after his father (Sarathkumar), CM of undivided Andhra Pradesh dies due to illness. When he plans to go back to London, his father’s close friend and party president (Prakash Raj) stops him and suggests to take charge as CM as many opportunists were anticipating to occupy the seat. After Bharat takes oath as CM, he has many challenges ahead. How he overcomes them and what happens to his love life with Vasumathi (Kiara Advani) is rest of story… Positives: 1. Plot 2. First Half 3. BGM 4. Dialogues 5. Mahesh Babu Negatives: 1. Second Half 2. Songs 3. Romantic Track Analysis: Political drama films with star cast has less success rate, which is the reason why top stars won’t show much interest to do movies in the genre. Oke Okkadu directed by Shankar was a path-breaking film in Indian cinema history. Sekhar Kammula’s Leader was also a good attempt but unnecessary love track in second half played spoilsport. Bharat Ane Nenu has shades of both these films. While assembly episodes, Mahesh Babu’s resolutions remind us of Leader, his visits to villages, taking severe action against political leaders and government officials are akin to Oke Okkadu. Traffic signal, assembly, cabinet meeting and tea party meeting in party office are major highlights in first half, wherein local governance, press meet to counsel media are high points in second half. While first half was engaging, movie became regular and sluggish in second half. Mahesh Babu and Kiara’s romantic track was biggest drawback of the film. Artists Performances: Mahesh Babu looked charismatic as chief minister. He wore mostly formal costumes and his panche kattu avatar in Vachadayyo Saamy was adorable. Mahesh indeed gave wonderful performance, especially in key sequences. Kiara Advani looked gorgeous as Mahesh Babu’s love interest, though she got very less space to show her acting skills. Though romantic track was usual, chemistry between the lead pair is magical. Prakash Raj is exceptional in the role of party president. Rao Ramesh was good as Kiara’s father. Brahmaji provided some laughs here and there. Ajay was good. Other artists played their role proficiently. Technical Aspect: Koratala Siva’s friend Srihari Nanu provided basic story of the film. In fact, plot of the film and her characterization are biggest assets of the film. There are hardly any boring elements in first half. However, due to regular writing second half appears sluggish. Dialogues are thought provoking. Director Koratala Siva questioned many loopholes in political system. In fact, his views raise many questions among ourselves. Devi Sri Prasad provided wonderful and fascinating background score, though he botched to offer pleasing album. Cinematography by Ravi K Chandran and Tirru is other big asset of the film. Production values of DV Entertainments are top notch. Verdict: Bharat Ane Nenu is definitely a worth-watching film. However, a better second half would further hoist prospects on the film. Box office verdict is sure shot hit. TeluguOne Perspective: He promised and delivered Rating: 3.25
  తెలుగులో పొలిటిక‌ల్ డ్రామాలు తీయ‌డం చాలా అరుదు. ఓ పెద్ద హీరో న‌టించ‌డం ఇంకా... త‌క్కువ‌. అలాంటిది... మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్‌తో  అలాంటి సినిమా తీయాల‌నుకోవ‌డం వెనుక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాప‌త్ర‌యం, ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గిన‌వి. ఏకంగా ముఖ్య‌మంత్రి పోస్టే క‌ట్టుబెడుతూ - టైటిల్ కూడా `భ‌ర‌త్ అనే నేను` అంటూ పెట్టుకోవ‌డం... ఆక‌ట్టుకున్నాయి. పైగా మ‌హేష్ - కొర‌టాల అనగానే `శ్రీ‌మంతుడు` లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ గుర్తొస్తుంది. అప్పుడు గ్రామాల ద‌త్త‌త అనే కాన్సెప్ట్‌పై ప్ర‌యాణం సాగిస్తే - ఈసారి `ఇచ్చిన మాట‌`పై నిల‌బ‌డే క‌థానాయ‌కుడిగా మ‌హేష్ క‌నిపించాడు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎలా సాగింది?  భ‌ర‌త్ త‌న ప్రామిస్‌ని నిల‌బెట్టుకున్నాడా? * క‌థ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాఘ‌వ (శ‌ర‌త్ కుమార్‌) త‌న‌యుడు భ‌ర‌త్ (మ‌హేష్ బాబు). లండ‌న్‌లో చ‌దువుకుంటుంటాడు. తండ్రి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇంటికి తిరిగొస్తాడు.  తిరిగి వెళ్లిపోతుంటే... రాఘ‌వ స్నేహితుడు వ‌ర‌ద‌రాజు (ప్ర‌కాష్ రాజ్‌) అడ్డుకుంటాడు. ముఖ్య‌మంత్రి స్థానంలో భ‌ర‌త్ ని బ‌ల‌వంతంగా కూర్చోబెడ‌తాడు. భ‌ర‌త్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌... ప‌రిపాల‌న‌లో కొన్ని మార్పులు తీసుకొస్తాడు. విద్యా విధానాన్ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తాడు. గ్రామాలకు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పిస్తాడు. ఈ మార్పుల‌న్నీ పార్టీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌వు. అందుకే భ‌ర‌త్‌ని సీఎమ్ కూర్చీ నుంచి దింపేయాల‌ని కుట్ర ప‌న్నుతారు. మ‌రి భ‌ర‌త్‌ని దించేశారా?  ఈ కుట్ర‌ల నుంచి త‌న‌ని తాను ఎలా కాపాడుకున్నాడు?రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌ర‌త్ చేసిన మేలేంటి?  అనేదే భ‌ర‌త్ అనే నేను సినిమా. * విశ్లేష‌ణ‌ ఈ క‌థ‌ని చూచాయిగా చ‌ర్చించుకుంటుంటే.. లీడ‌ర్ సినిమా గుర్తుకురావ‌డం స‌హ‌జం. భ‌ర‌త్ అనే నేను లైన్ కూడా అలాంటిదే. ఓ హీరో ముఖ్య‌మంత్రి అయితే త‌ప్ప‌కుండా మంచి ప‌నులే చేస్తాడు. ఈసినిమాలోనూ అంతే.  రాష్ట్రంలో స‌మ‌స్య‌ల‌పై నిజాయ‌తీగా పోరాడ‌తాడు. ఆ క్ర‌మంలో ఎదుర‌య్యేఎదురు దెబ్బ‌లేంటి?  అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ప‌్ర‌జ‌ల మ‌న‌సు ఎలా గెలుచుకున్నాడు?  అనేదే క‌థ‌. ఈ పాయింట్‌ని ఇలానే చూపిస్తే జ‌నం ఎందుకు చూస్తారు?  స‌ర‌దాగా కాసేపు ఏ టీవీ 9 లోనో వార్త‌లు చూస్తే చాలు. మ‌హేష్ ఫ్యాన్స్ ఇలా అనుకుంటార‌నే, దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించాడు. కైరా అద్వానిని తీసుకొచ్చి ఓ ల‌వ్ స్టోరీ క‌లిపాడు. ముఖ్య‌మంత్రి ఫైటింగులు చేస్తాడా?  అనే అనుమానాలు రాకుండా... భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని ఇమిచ్చాడు. పాట‌లు పెట్టాడు. సీఎమ్‌తో స్టెప్పులు వేయించాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై, మీడియా వ్య‌వ‌స్థ‌పై కౌంట‌ర్లు వేశాడు. చివ‌ర్లో ఓ ట్విస్టు పెట్టాడు. రివైంజ్ డ్రామా న‌డిపాడు.  అలా మొత్తానికి.. దీన్నో మాంఛి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసేశాడు. `ప్రామిస్ ఇస్తే దాన్ని నిల‌బెట్టుకోవాలి` అనేది మంచి పాయింటు. నేటి రాజ‌కీయ నాయ‌కులంతా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన పాయింట్‌. క‌థ ప్రారంభం అలానే సాగింది. అక్క‌డ‌క్క‌డ `ప్రామిస్‌` అంటూ గుర్తు చేస్తూ ఆ థ్రెడ్‌ని మిస్ అవ్వ‌కుండా చూసుకున్నాడు.  అయితే... అంతకు మించి బ‌ల‌మైన డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే మ‌రింత బాగుండేది. క‌థానాయ‌కుడి ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల‌కు మంచి ప‌నులు చేసి పెట్ట‌డ‌మే. సీఎం అయిన ద‌గ్గ‌ర్నుంచి చివ‌రి వ‌ర‌కూ అదే ప‌ని. దాంతో చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో బ్ర‌హ్మాజీని అడ్డుపెట్టుకుని కాస్త కామెడీ న‌డిపాడు. సెకండాఫ్‌లో అందుకు ఆస్కార‌మే లేకుండా పోయింది. భ‌ర‌త్ రాజీనామా చేయ‌డం వెనుక కూడా బ‌ల‌మైన పాయింట్ లేదు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఓ ప‌ది నిమిషాల సీన్ చూపించారు. దాని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన మార్పేంటో క‌నీసం ఒక్క ఫ్రేములో అయినా చూపించ‌లేదు. ద్వితీయార్థం మొద‌లైన చాలా సేప‌టి వ‌ర‌కూ హీరోయిన్ క‌నిపించ‌దు. క్లైమాక్స్ పైపైన తేల్చేయ‌డం.. కొర‌టాల బ‌ల‌హీన‌త‌. ఇక్క‌డా అదే క‌నిపించింది. లాజిక్కులు మిస్ అయిన స‌న్నివేశాలు కోకొల్ల‌లు. క్లైమాక్స్‌లో `అత‌డు` ఛాయ‌లు క‌నిపిస్తాయి. * న‌టీన‌టులు శ్రీ‌మంతుడులా మ‌రో మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో ఈ చిత్రం. ప్ర‌తీ ఫ్రేములోనూ మ‌హేష్ క‌నిపిస్తాడు. అల‌రిస్తాడు. మ‌హేష్‌లో గ్లామ‌ర్ రోజురోజుకీ రెట్టింపు అవుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. అత‌ని న‌వ్వుకి మ‌రోసారి దాసోహం అయిపోతాం. డైలాగులు చెప్పే విధానంలోనూ చాలా మారాడు. అత‌ని ఎమోష‌న్‌, ల‌వ్ ఫీల్‌, ఫ‌న్‌.. ఇవ‌న్నీ న‌చ్చేస్తాయి. సీఎమ్ ప‌దవికి రాజీనామా చేసిన సంద‌ర్భంలో ఓ ప్రెస్ మీట్ పెడ‌తాడు మ‌హేష్‌. సుదీర్ఘంగా సాగిన ఆస‌న్నివేశంలో మ‌హేష్‌న‌ట‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.  కైరా అడ్వానీ అందంగా ఉంది. మ‌హేష్‌తో కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ల‌వ్ సీన్లు కూడా పండాయి. కానీ.. ద్వితీయార్థంలో ఆమె ఎక్కువ సేపు క‌నిపించ‌దు. మొత్తంగా చూసినా స్క్రీన్ టైమ్ చాలా త‌క్కువ‌. బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ ఓకే అనిపిస్తారు. ప్ర‌కాష్ రాజ్ చాలా రోజుల త‌ర‌వాత స‌హ‌జంగా న‌టించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. * సాంకేతిక వ‌ర్గం టెక్నిక‌ల్‌గా ఈ సినిమా చాలా చాలా బాగుంది. సంగీతం, కెమెరా వ‌ర్క్‌, సినిమాలో క్వాలిటీ.. ఏ విష‌యంలోనూ వంక పెట్ట‌లేం. ఫైట్లు రెండే రెండు.కానీ వాటిని డిజైన్ చేసిన ప‌ద్ధ‌తి బాగుంది. కొర‌టాల శివ ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. ద్వితీయార్థంలో టెంపో మిస్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. చాలా చోట్ల సంభాష‌ణ‌ల‌తో సినిమాని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. లీడ‌ర్‌, ఒకే ఒక్క‌డు ఛాయ‌లు పోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నించినా... అక్క‌డ‌క్క‌డ దొరికేశాడు. * ప్ల‌స్ పాయింట్స్‌ మ‌హేష్‌ ల‌వ్ సీన్లు సాంకేతిక వ‌ర్గం * మైన‌స్ పాయింట్స్‌ ద్వితీయార్థం * చివ‌ర‌గా... ప్రామిస్ నిల‌బెట్టుకున్నాడు రేటింగ్:  3.25
  Tollywood star Mahesh Babu’s Bharat Ane Nenu will open in cinemas this Friday. Directed by Kortala Siva, the film has a huge star cast including Bollywood actor Kiara Advani, who will be making her debut in Telugu with this film. Expectations are quite high on the project which will have grand release worldwide. Here are the biggest positives for BAN: 1. Mahesh Babu: He’s one of the biggest actors in Tollywood with immense fans frenzy. Though his last couple of films bombed at box office, he is always a superstar when it comes to create records. 2. Koratala Siva: Director Siva’s previous films were blockbusters. In fact, his earlier movie Srimanthudu with Mahesh Babu was a runaway hit. He is known for narrating message oriented films engagingly incorporating commercial values. 3. Solo Release: No noted film is releasing this week except for Bharat Ane Nenu. So, there will be no competition for the film until another biggie Naa Peru Surya starring Allu Arjun hits screens on May 4th. 4. Music: Composer Devi Sri Prasad has already impressed the audience with his compositions for Bharat Ane Nenu, a slick political thriller. The background scores and the musical numbers of his previous film called Rangasthalam, a rural drama, also became a big hit with the audience. DSP has also got Bollywood filmmaker-actor Farhan Akhtar to sing a song in Telugu for the movie. 5. Pre-Release Business And Buzz: Bharat Ane Nenu made exceptional pre-release business. In fact, buzz surrounding the project is also quite encouraging. Let’s see how all these positive factors help BAN to create records at ticket window.
In a shocking revelation through a video message, maverick director Ram Gopal Varma has confessed to have asked controversial actress Sri Reddy to say all that she said about Pawan Kalyan. The filmmaker has been supporting the actress in her fight against sexual exploitation of women in the Telugu Film Industry. However, when Pawan Kalyan suggested that Sri Reddy should go to the police and fight a case in court instead of protesting on the streets,  he earlier thanked him for his support and acknowledgement and later, to everyone’s shock abused him and used M word against him which didn’t go down well with mega fans. Sri Reddy, too took to social media soon after to confirm that RGV was behind her comments. He had asked her do so since that would help her garner huge attention. Now it is confirmed that the filmmaker was behind all this ugly mess. RGV pointed out in the video that he has asked Sri Reddy to use the M word. But it had become a ‘Catch Word’ in Telugu States when used in Arjun Reddy and therefore it was not any abuse to Pawan’s mother but for the star himself. Coming back to Sri Reddy Leaks, RGV said that she should get all the credit for highlighting casting couch.
  Mega prince Varun Tej who is riding high with back to back hits is teaming up with director Sankalp Reddy whose debut directorial film Ghazi won critical accolades, besides becoming a commercial hit. The film won many awards including a National Award. The yet to be titled film has been launched today in style. While hero Varun Tej’s father Nagababu sounded the claps for first muhurtham shot, director Sankalp Reddy’s father Sahadev Veer Reddy switched the camera and star director Krish who is also co-producing the film directed the first shot. Heroines Lavanya Tripathi and Aditi Rao Hydari also attended the muhurath ceremony along with other core team of the film. Varun Tej will be seen playing an astronaut in the science thriller film which will be made on grand scale. VFX will play key role in the film which will be shot in huge sets erected in different studios. Rajeev Reddy Yeduguru, Radha Krishna Jagarlamudi (Krish) and Sai Babu Jagarlamudi are producing the film under First Frame Entertainment Pvt. Ltd. It is sixth film from the production house that earlier made several films with innovative and strong content-driven films.
  శ్రీరెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామా తెరపైకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన వ్యవహారం ఆఖరికి రాజకీయాల వరకూ వచ్చింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అసలు ఎక్కడ మొదలైంది... ఎక్కడివరకూ వెళ్లింది ఈ వ్యవహారం అని అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే పవన్ ను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగారు అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. పవన్ అభిమానులు, సినీ ప్రముఖులు సామాన్య ప్రజలు సైతం శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై చర్చలు జరుగుతుండగానే ఆడియో లీక్స్ ఒకటి బయటకు వచ్చాయి. దీని సూత్రధారి రామ్ గోపాల్ వర్మ అని బయటపడింది. అంతేకాదు దీని వెనుక వైసీపీ కుట్ర కూడా ఉందని బయటకు రావడంతో అసలు ఇష్య్చూ మొత్తం ఒక్కసారిగా రాజకీయాలవైపు మళ్లింది.   ఇక ఏ విషయంపైనా పెద్దగా స్పందించని పవన్ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మధ్యరాత్రి ట్విట్టర్ వేదికగా చాలా భావోద్వేగంగా కొన్ని ట్వీట్లు కూడా పెట్టారు. అయితే ఆ ట్వీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. ‘నా తల్లిపై ప్రయోగించిన అభ్యంతరకర భాషని పదేపదే ప్రసారం చేసిన వార్తను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లేదా ప్రతిపక్షనేతల తల్లిపై కూడా వాడి ఉంటే మీ మీడియా సంస్థలు ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని సూటిగా ప్రశ్నించారు. కేవలం పవన్ కల్యాణ్ తల్లి, ఎవరికీ, ఏనాడూ అపకారం తలపెట్టని పవన్ కల్యాణ్ తల్లిపై వాడిన అసభ్యకరమైన భాషను మాత్రం పదేపదే టెలీకాస్ట్ చేసి, దానిపై విశ్లేషణలు, చర్చలు చేపడతారు... అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెప్పండి శక్తిమంతమైన, ధనిక మీడియా శక్తులారా? పవన్ కల్యాణ్ కే ఈ ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఎందుకు?’ అని ఆయన నిలదీశారు. అంతేకాదు దీనిపై ఆయన లీగల్ కూడా యాక్షన్ తీసుకోనున్నట్టు సమాచారం.   ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ ట్వీట్ వ్యాఖ్యలపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ వారి నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఈరోజు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష పక్క దారిపడుతుందని...చంద్రబాబు దీక్షా సమయంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టిన దీక్షకు తగిన ప్రాధాన్యత లభించకపోవచ్చనే టీడీపీ అధిష్టానం ఈ మేరకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెన్నిఈ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో... పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. దానికి టీడీపీ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం..
  రాజకీయాల్లో జంపింగ్ లు కామన్. ఒకప్పుడైతే పార్టీకి కట్టుబడి ఉండి.. పార్టీ మీద ప్రేమతో అధికారంలో ఉన్నా.. లేకపోయినా అదే పార్టీలో ఉండేవారు. కానీ రోజులతో పాటు అలాంటి ప్రేమలు, పద్దతులు కూడా మారిపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవ్వడం.. అప్పటి వరకూ వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండే పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినా.. ఎలాంటి మొహమాటం లేకుండా వేరే పార్టీలోకి వెళ్లడం.. వారితో కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే...   అధికార పార్టీ అయిన టీడీపీలోకి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ టీడీపీపై అసంతృప్తితో రగిలి పోతున్నారట.  తమను పార్టీలో చేర్చుకునే ముందు… చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కాని వచ్చాక కూరలో కరివేపాకులా తీసేస్తున్నారని మండిపడుతున్నారట. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులిచ్చారు చంద్రబాబు. అందులో ప్రధానంగా రెడ్డి వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురికి స్థానం కల్పించారు. మరో నలుగురికి మంత్రి పదవులిచ్చారు.. అయితే  మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు ప్రాధాన్యం కల్పించలేదని మండిపడుతున్నారట. దీంతో సైకిల్ పై వెళితే.. తమకు భవిష్యత్ ఉండదని గ్రహించి.. ఫ్యాన్ కిందకు వచ్చేయాలని ఆరాటపడుతున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో.. పదిమంది ఎమ్మెల్యేలు జగన్ తో చర్చలు జరిపారట.   మరి జగన్ వైఖరి అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్నవాళ్లే జగన్ కు భయపడుతుంటారు. తాను చెప్పిందే వినాలనుకుంటాడు జగన్. అలాంటిది..ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయి ఇప్పుడు వస్తా అంటే అంత ఈజీగా ఓకే అంటాడా..? తాము ఏదో అనుకుని పార్టీ మారామని, కానీ, ఇక్కడ తాము అనుకున్నంత లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినా... వారి మాటలు విన్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదట. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చి గెలుపించుకోగలనన్న దీమాతో ఉన్నారట జగన్. పాపం మరి రెంటికి చెడ్డ రేవడిలా.. పాపం అటు టీడీపీలో ఉన్నా ఉపయోగం లేదు.. ఇటు జగన్ కనికరించక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారట. ఆయన ఎప్పుడు ఊ అంటే.. అప్పుడు గోడదూకేందకు సిద్ధంగా ఉన్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో...
మొత్తానికి ఏపీ రాజకీయాలు మాత్రం రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త అంశంతో వేడి వేడిగా తయారవుతున్నాయి. ఎవరికి వాళ్లు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం తెగ కష్టాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు. తమ వల్లే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పేసిందనుకోండి. అయినా భగీరధ ప్రయత్నం చేస్తున్నారు ఏపీ నేతలు. ఇక ఇప్పటికే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందబ్బా అని అయోమయంలో ఉన్న సామాన్య ప్రజలకు...అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇంకా అయోమయంలో పడేస్తుంటారు  హీరో శివాజీ.   ఈ మధ్య ఆపరేషన్ గరుడ అంటూ.. దాని గురించి ఏకంగా ఓ బ్లాక్ బోర్డ్ పెట్టి.. ఆ ఆపరేషన్ గురించి చెప్పి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండు మూడు రోజులు దానిపై చర్చలు జరిగినా..తరువాత దాని గురించి మరిచిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రత్యేక హోదా’ సాధించే ఉద్దేశం రాజకీయ నేతలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ లేదని, వాళ్ళందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారని, ఎవరికీ ప్రత్యేక హోదా సాధించే చిత్తశుద్ధి లేదని అంటున్నారు. అంతేకాదు... కొందరు నేతలైతే రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు డబ్బులు కూడా తీసుకున్నారని, వాళ్ళందరి గుట్టు విప్పుతానని మండిపడ్డారు. మరో పది రోజుల్లో అందరినీ నడిరోడ్డుపై నిలబెట్టి జనాలు రాళ్ళు వేసి కొట్టేలా చేస్తానని చెప్పిన శివాజీ, తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ‘స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం’ వంటి కీలకమైన అంశాల కోసం రాజకీయ నాయకులే పోరాటానికి దిగని సందర్భంలో... సినీ హీరోలను ఎలా విమర్శిస్తామని శివాజీ లాజికల్ గా ప్రసంగించారు. మరి  శివాజీ ఏం గుట్టు విప్పుతారో... ఎవరిపై ఏం బాంబు పేల్చుతారో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.
  ఈ మధ్య  రాజకీయ నాయకులకు ఒక్కరోజు నిరాహారదీక్షలు చేయడం.. ఒక్కరోజు పాదయాత్రలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది.  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పాదయాత్ర చేశారు. అంతేనా ప్రధానమంత్రి మోడీ కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. మోడీ ఒక్కరోజు నిరాహార దీక్ష ఎందుకు చేశారో తెలుసుకదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఇక చేయాల్సింది అంతా చేసి కేంద్రం డ్రామాలు ఆడి దానిపై చర్చ జరగకుండా చేసింది. పైగా విపక్షాలు చర్చలు జరగకుండా అడ్డుకున్నాయని... దానిని నిరసిస్తూ ప్రధాని మోడీ దీక్ష చేశారు. ఇక తమిళనాడులో కూడా కావేరి బోర్డు యాజమాన్యం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే పేరుకే ఆమరణ నిరాహార దీక్ష అని తేలిపోయింది. దీక్ష పేరుతో నేతలు ఎంచక్కా పక్కకు వెళ్లి ఫుల్ గా కుమ్మేయడం కెమెరాల కంటికి చిక్కి పరువు పోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కూడా నిరాహారదీక్షను చేయబోతున్నానంటూ ప్రకటన చేశారు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధాని మోదీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంటు జరగకపోవడానికి కారణం మీరే కదా? అని ఆయనను తాను అడుగుతున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. అంతేకాదు... ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను తెస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. మరి ఈ ఒక్కరోజు దీక్షలు ఏంటో అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కరోజు దీక్ష చేస్తే ఆ ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుందో వాళ్లకే తెలియాలి అని అంటున్నారు. అసలు ఏం తినకుండా ఒక్కరోజు ఉండటం పెద్ద మ్యాటరేం కాదు.. అలాంటిది ఒక్కరోజు దీక్ష చేసి ఏం సాధిస్తారో ఏమో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు ఒక్కరోజు దీక్షతో సాధిస్తారేమో..!
  కర్ణాటక ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ... బీజేపీకి ఈ ఎన్నికలు ఇంకా కీలకంగా మారాయి. కారణం.. దీనికి బీజేపీ పై దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతే. ఇప్పటికే వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుండటంతో.. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమ సత్తా చూపించాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా తమ వ్యూహాలు తాము రచించుకుంటున్నారు.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఎన్నికల్లో తెలుగు వాళ్ల ప్రచారానికి బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రధానంగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో, బెంగళూరు సిటీలో తెలుగు స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం కోసం కన్నడ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించుకోవడానికి జేడీఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చిరంజీవితో ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ ప్రచారానికి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారని... కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి ఆయన వస్తారని అక్కడి కాంగ్రెస్ నేతలు అంటున్నారు.   అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి పదవికాలం ఇటీవలే ముగిసింది. చిరును మళ్లీ రాజ్యసభకు పంపడానికి తగిన బలం కాంగ్రెస్ కు లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మరీ ఏపీలో ఉన్నంత వీక్ గా లేదు. చిరంజీవి వచ్చి ప్రచారం చేస్తే సినీ గ్లామర్ కలిసి వస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. అధిష్టానం చేత చెప్పించి, చిరంజీవిని ప్రచారానికి రప్పించేయత్నాల్లో ఉన్నారట అక్కడి కాంగ్రెస్ నేతలు. మరి చిరంజీవి వెళతారో లేదో చూడాలి. ఒకవేళ చిరంజీవి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ ను చిరంజీవి కి మధ్య పోటీ ఏర్పడుతుందేమో.
  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకూ మోడీ ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ఎన్నో విదేశాలు తిరిగేసి ఉంటారు. కానీ ఈరోజు ఆయనకు జరిగిన అవమానం ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. మోడీకి అవమానం జరిగింది ఎక్కడో కాదు...ప్రాంతీయతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడు రాష్ట్రంలో. అసలు సంగతేంటంటే... డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వెళ్లారు. అయితే అక్కడ మోదీకి నిరసనలతో స్వాగతం లభించింది. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని గత కొద్దికాలంగా తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్న సమయంలో ఆయన చెన్నైకు రాగా... ఆయన రాకను నిరసిస్తూ, వేలాది మంది నిరసనలకు దిగారు. విమానాశ్రయం సమీపంలోనే ఆయన్ని అడ్డుకునేందుకు  పెద్దఎత్తున నిరసనకారులు ప్రయత్నించారు.   దీంతో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో మోడీకి చేదు అనుభవం ఎదురైందని అంటున్నారు. అంతేనా సోషల్ మీడియాలో అయితే మోడీపై సెటైర్లు మామూలుగా వేయలేదు తమిళ ప్రజలు. మీరు ప్రధానిగా పనికిరారని, ఇంతకు ముందు మీరు చేసిన టీ అమ్ముకునే పనే చేసుకోవాలని ఘాటుగా సోషల్ మీడియాలో సలహా ఇస్తున్నారు. మీ మొసలి కన్నీళ్లకు కరిగిపోవడానికి ఇది ఉత్తర భారతదేశం కాదని తమిళనాడు అని తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... మోడీ గో బ్యాక్ అనే నినాదాలు సోషల్ మీడియా ట్రెండింగ్ లో భారత్ నెంబర్ 1గా, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 4 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. నిజంగా ప్రధానిగా మోడీకి ఏప్రిల్ 12వ తేదీ గురువారం బ్లాక్ డే అని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తమిళ ప్రజలు అంటున్నారు.   ఇంకా కొంతమంది అయితే ఏకంగా...ప్రధాని పదవికి మోడీ  అనర్హుడు వెనక్కి వెళ్లిపోండి...మీరు మళ్లీ టీ అమ్మడం మొదలుపెట్టండి. మీరు టీ అమ్మడానికి కచ్చితంగా సరిపోతారు, ముందు ఆ పని చెయ్యండి అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. మీ మీద వ్యతిరేకతను తెలియజేయడానికి మేము కూడా అదే సోషల్ మీడియానే ఉపయోగించాము.. అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు విసురుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే...  మోడీ తమిళనాడుకు రావడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఓ ఆందోళన కారుడు ఏకంగా ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి మోడీకి ఇన్ని రోజులకు దక్షిణాది రాష్ట్రాల సెగ తగిలినట్టుంది. దక్షిణాది రాష్ట్రాలే కదా అని చిన్న చూపు చూస్తున్న ఆయనకు... వారు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది.
  చిన్న కథలైనా కొన్ని మనసుకి హత్తుకుపోతాయి. గుర్తుండిపోతాయి. అలాంటి ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఓ గురువుగారు తన పదిమంది శిష్యులతో కలసి దూర ప్రయాణం మొదలుపెట్టారు. చాలా రోజుల ప్రయాణం. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేర్లు దాటాల్సి వుంటుంది అని ముందుగానే శిష్యులందర్నీ హెచ్చరించారు గురువుగారు. సరే అంటే సరే అంటూ శిష్యులంతా తలలూపారు. అన్ని రోజుల ప్రయాణానికి కావలసిన సరుకులని, తిండిగింజలని మూటకట్టి తటొకటి ఇచ్చారు గురువుగారు. దాంతోపాటు సుమారు ఆరడుగులు వున్న ఓ పొడవైన దూలంలాంటిదాన్ని కూడా ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఆ దూలం ఎందుకో శిష్యులకు అర్థం కాలేదు. కానీ గురువుగారిని అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. మొత్తానికి ఒకవైపున దూలం, మరో వైపు సరుకుల మూటలతో వారి ప్రయాణం మొదలైంది. శిష్యులతోపాటు గురువుగారు కూడా సరుకుల మూటలు, దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. కొంతమంది శిష్యులు ఆ దూలాన్ని కూడా మేమే మోస్తాం ఇవ్వండి గురువుగారూ అని అడిగారు. అయినప్పటికీ గురువుగారు వద్దంటూ తానే ఆ దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. ఇలా కొంతదూరం నడిచారు. రోజులు గడుస్తున్నాయి. రాను రాను దూలాన్ని మోస్తూ నడవటం కష్టంగా మారిపోయింది శిష్యులకు. ‘‘అసలు ఈ దూలం ఎందుకు మనకి? అనవసరమైన బరువు తప్ప. ఆహారాన్ని మోస్తున్నామంటే అర్థం వుంది. ఈ గుదిబండ మోస్తూ కష్టపడటంలో అర్థం లేదు’’ అంటూ శిష్యులు తమలోతాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.  ఈ మాటలు గురువుగారి చెవిన కూడా పడ్డాయి. అయినా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా వున్నారు. మళ్ళీ వారి ప్రయాణం మొదలైంది. పెద్ద ఎడారిలో వేడి ఇసుకలో పాదాలు కాలిపోతూ, భుజాలపై బరువుతో నెమ్మదిగా కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నారు శిష్యబృందం. ఎడారిలో నడిచీ నడిచీ శిష్యుల్లో కొందరి ఓపిక అయిపోయింది. ఇన్నాళ్ళూ గురువుగారిపై గౌరవంతో  వాళ్ళు ఏం మాట్లాడకుండా వున్నారు. కానీ, ఇక ఆగలేక ధైర్యం చేసి గురువుగారిని అడిగారు. ఈ బరువు ఎందుకు అనవసరంగా. మోయలేకపోతున్నాం. ఈ దూలాన్ని ఇక్కడే వదిలేస్తాం అన్నారు. అది విన్న గురువుగారు నెమ్మదైన స్వరంతో దాని అవసరం వుంది కాబట్టే ఇంత దూరం మోశాం. వదలటానికి వీల్లేదు అన్నారు. దాంతో శిష్యుల్లో ఓపిక నశించింది. పోనీ కొంచెం పొడవు తగ్గిస్తాం. సులువుగా భుజం మీద మోయగలుగుతాం అన్నారు. గురువుగారు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవడంతో సరే మీ ఇష్టం అంటూ ముందుకు నడిచారు గురువుగారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా దూలాన్ని మోస్తూ ముందుకు నడిచారు. మిగిలిన ఆరుగురు మాత్రం వారి దూలాల పొడవు తగ్గించుకోవడం మొదలుపెట్టారు.  దూలం పొడవు కొంచెం తగ్గించాక ‘హమ్మయ్య’ అనకుంటూ ముందుకు నడిచారు ఆ ఆరుగురు శిష్యులు. అయితే కొంచెం దూరం నడిచాక అది కూడా బరువుగా అనిపించి, మరికొంత కోద్దాం అనుకుని మరికొంత కోసేశారు. ఇలా చివరికి ఆ దూలం భుజం మీద పెట్టుకుని నడిచేందుకు వీలుగా ఓ అడుగు వరకు చేసుకున్నారు. దాంతో ఆ ఆరుగురు సులువుగా దాన్ని మోస్తూ, గురువుగారిని, మిగతా శిష్యలని దాటుకుని హుషారుగా ముందుకు వెళ్ళిపోయారు. గురువుగారు వారిని నిర్లిప్తంగా చూశారు. మిగిలినవాళ్ళు గురువుగారి మీద నమ్మకంతో ఆ బరువుని మోస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఎడారి పూర్తయి ఒక నది దాటాల్సి వచ్చింది. గురువుగారు, పూర్తి దూలాన్ని మోసిన నలుగురు శిష్యులు నదిలో తమ భుజాల మీద వున్న దూలాలను వేసి ఒక్కొక్కరు ఒక్కో దూలం మీద కూర్చుని అవతలి వైపుకి వెళ్ళిపోయారు. మిగిలిన ఆరుగురు వారి దగ్గరున్న అడుగు దూలంతో నదిని ఎలా దాటాలో తెలియక ఇవతలే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది గురువుగారు దూలం పొడవు ఎందుకు తగ్గించవద్దన్నారో. అవతలి ఒడ్డుకు చేరిన గురువుగారు, నలుగురు శిష్యులు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సాధన ప్రారంభించారు. నదికి ఇవతలే గురువు గారి వెంట వెళ్ళలేక నిలబడిపోయిన శిష్యులు బాధతో వెనక్కి తిరిగారు. ఇదీ కథ... చాలాసార్లు మనం మనకెదురయ్యే సమస్యలు, పరీక్షలకి విసిగిపోయి, నాకే ఎందుకిలా జరుగుతోంది. వీటన్నిటితో నేను ముందుకు ఎలా నడవాలంటూ బాధపడుతూ వుంటాం. అయితే మోసే ప్రతి బరువూ మనకు సహాయపడేదే అనుకుంటే అది బరువుగా తోచదు. అలాగే చాలాకాలంపాటు ఓపికపట్టి, చివరి నిమిషంలో నావల్ల కాదంటూ పక్కకి తప్పుకుంటాం. అంతవరకూ పడ్డ శ్రమకి విలువ లేకుండా చేసుకుంటాం. ప్రతీ అనుభవం మనకి ఎంతో కొంత నేర్పిస్తుంది. దానిని గ్రహిస్తూ మన వ్యక్తిత్వంలోకి చేర్చుకుంటూ ముందుకు నడిస్తే పరిపూర్ణమైన ఆ వ్యక్తిత్వం అనే దూలంతో మన లక్ష్యం చేరచ్చు. -రమ ఇరగవరపు  
  మనసులోని ప్రేమ మనసులోనే ఇతరులకు కనిపించకుండా వుండిపోవడమేంటి.. తమ శరీరం మీద కనిపించాలని ఈకాలంలో కుర్రకారు కోరుకుంటున్నారు. అందుకే ఎప్పటికీ చెరిగిపోని విధంగా తమ ప్రేమభావాన్ని శరీరం మీద పచ్చబొట్టు రూపంలో పొదువుకుంటున్నారు. ఈ ప్రేమారాధన ప్రస్తుతానికి ఇతర దేశాల్లోనే ఎక్కువగా వుంది. మన దేశానికి రావడానికి ఇంకా ఎంతోకాలం పట్టకపోవచ్చు.. చెరిగిపోని ప్రేమ టట్టూ శాంపిల్స్ ఇవిగో... 
  యూపీ ఉన్నావ్ రేప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షాక్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఉన్న  ‘వై’ కేటగిరీ భద్రతను తొలగించింది. ఉన్నావ్ జిల్లా బంగర్మావ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఇప్పటిదాకా ఇద్దరు కమెండోలు, పోలీసులు సహా మొత్తం 11 మందితో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. అయితే ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో  ఆయన భద్రతను తొలగించేశారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే కుల్దీప్ సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ అధికారులు ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేశారు.
  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్ ను అనవసరంగా ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగానే శ్రీరెడ్డి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి కూడా విదితమే. దీంతో పవన్ మీడియాపై మండిపడ్డారు. టీఆర్పీలను పెంచే షోల కోసం ఛానళ్లు చచ్చిపోతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. దానికి మించిన షోను తాను ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన మరో ట్వీట్ చేశారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబు గారు... ఈ ఛానళ్లు అన్నింటికీ ప్రత్యేక హోదా కంటే వ్యభిచారం యొక్క చట్టబద్ధతే ముఖ్యం. మీడియాను కంట్రోల్ చేసే శక్తి గల మీరు... ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యతను ఇస్తారు? ఒక్క విషయాన్ని చెప్పడం మర్చిపోయా. టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావును నారా లోకేష్ ఎంతో ప్రేమతో అంకుల్ అని పిలుస్తుంటారు' అని ట్వీట్ చేశారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములని... కానీ, ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములని... వారు చెప్పిందే వేదం, పాడిందే నాదమని ఎద్దేవా చేశారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూద్దాం...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేష రంభ అంటారని...ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, అద్వాణీని గౌరవించలేని వ్యక్తి మీరు అని విమర్శించారు. అంతేకాదు.. కట్టుకున్న భార్యను కూడా మీరు గౌరవించడం లేదని...ముందు భార్యను ప్రేమించడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. అమిత్ షా లాంటివారు పక్కన ఉండి డప్పు కొడుతుంటే... రోజులు గడిపేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉండటానికి ఎన్టీఆర్, చంద్రబాబులే కారణమని బాలయ్య చెప్పారు. ఏపీకి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పారు.
    కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి... అంటూ స్త్రీలకు ఓ హెచ్చరిక చేస్తున్నారు అధ్యయనకర్తలు. ‘‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్’’ ఓ అధ్యయనం నిర్వహించింది. సుమారు మూడువేల మంది మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిశాయి. 1. ఉద్యోగం చేసే మహిళల్లో 70 శాతం మంది కన్నా ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అదీ 32 సంవత్సరాల వయసు  నుంచేనని తెలిసింది. 2. ఊబకాయం, నడుం నొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు కూడా తెలిసింది. 3. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య ఇంచుమించు 22 శాతంగా వుంటే, 14 శాతం మహిళలు తీవ్ర సమస్యలతో పోరాడుతున్నట్టు వెల్లడైంది. 4. ఇక శారీరక అనారోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా మహిళలు తక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన వంటివన్నీ మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టే అంశాలని, వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా మహిళలకి కొన్ని సూచనలు చెప్తున్నారు. అవి ఏంటంటే... 1. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. 2. వ్యాయామం, ధ్యానం వంటివి జీవన శైలిలో భాగం కావాలి.   కుటుంబాన్ని, ఉద్యోగాన్ని రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే మహిళలు తప్పకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. మరి ఆలోచించండి. మహిళల ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అధ్యయనాలు చెబుతున్నప్పుడు ఆరోగ్యకర జీవనశైలిని ఆచరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే... మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తూ, వారికి ఇంటి పనుల్లో సహాయపడితే ఇంటి ఇల్లాలు ఆరోగ్యం వుంటుంది. -రమ
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.    నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి
వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, టీవీ సీరియల్స్, బుక్ రీడింగ్ ఒకటేమిటి అన్నిటినీ ఆస్వాదిస్తూ మన కళ్ళకి పని చెప్పి వాటిని అలిసిపోయేలా చేస్తున్నాం. దాని ఫలితమే చిన్నపిల్లలకి కూడా ఈ రోజుల్లో కళ్ళద్దాలు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు మూసుకుని ఒక పావుగంట ఉండమంటే చాలు ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటి  కళ్ళని జాగ్రత్తగా చూసుకోవటానికి మనం తీసుకోవలసిన కొన్ని ఆహారపదార్థాల మీద దృష్టి పెడితే చాలు, కంటి చూపు మెరుగుపడి మీకు ఎంత వయసు పైబడ్డా కళ్ళద్దాలే అవసరం లేకుండా హాయిగా ఉండచ్చు. కేరెట్ కళ్ళకి మంచిదన్న సంగతి అందరికి తెలిసిందే. దీనిలో ఉండే బీటా కరోటిన్ కంటిలోని కణాలు ఆరోగ్యంగా పెరగటానికి దోహదపడుతుంది.రేచీకటి కూడా రాకుండా కాపాడుతుంది. వారంలో రెండు సార్లయినా పిల్లలు కేరట్ జ్యూస్ తాగేలా చూసుకుంటే చాలు.     సిట్రస్ ఫ్రూట్స్ - ఈ నిమ్మ జాతికి చెందిన పళ్ళల్లో విటమిన్ సి హెచ్చు మోతాదులో ఉండటం వల్ల కళ్ళకి కేటరాక్ట్ రాకుండా రక్షణ కవచంలా ఉంటుంది. క్రమం తప్పకుండా ఏదో ఒక పండు తినటం అలవాటు చేసుకోవటం మంచిది. వాల్నట్స్ - వీటిలో అధికంగా ఉండే ఒమేగా 3 ఆమ్లాలు కంటిని పూర్తీ స్థాయిలో కాపాడతాయి. అలాగే బాదం, పిస్తాలు, జీడిపప్పులలో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వలన  మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిరు ధాన్యాలు - చాలా మందికి  ఈ చిరుధాన్యాలంటే చిన్నచూపు ఎక్కువ. కాని వీటిలో నిక్షిప్తమై ఉన్న జింక్ కంటి రెటీనాని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. రెటీనాకి బలాన్నిస్తుంది. చిలకడదుంప - చిలకడదుంపలని ఈ మద్య కాలంలో ఎక్కువగా ఎవరి తినటం లేదు.కాని ఇవి కళ్ళకిఎంతో మేలు చేస్తాయి. కేరట్ లో ఉన్నన్ని గుణాలు ఈ దుంపల్లో కూడా ఉన్నాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఈ చిలకడ దుంపలు తినటం వల్ల కంటిచూపు బాగుంటుంది. వీటితో పాటు రెగ్యులర్ గా ఆకుకూరలు, సాల్మన్ చేపలు, స్ట్రాబెర్రీ, గుమ్మడికాయ మొదలైన వాటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మన కంటి చూపు గురించి ఇక ఆలోచించాల్సిన పనే లేదు. తగిన పౌష్టిక ఆహారంతో పాటు కళ్ళకి తగినంత విశ్రాంతిని కూడా ఇస్తూ ఉండాలి. ఏకదాటిగా ఒకే వైపు చోస్తూ ఉన్నట్లయితే కళ్ళు ఎక్కువగా అలసిపోతాయి. ఏదైనా పని చేస్తూ మద్యలో కళ్ళని ఆర్పుతూ ఉండాలి. కంటికి చిన్న పాటి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండాలి. రెండు చేతులని గట్టిగా రుద్ది వాటిని కళ్ళపై పెడుతూ ఉన్నా కళ్ళకి మంచిదే. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకి వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా సన్ గ్లాసెస్ పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి రాగానే చల్లనీళ్ళని కళ్ళపై చల్లుకోవాలి.  ఇలా కాస్తంత శ్రద్ద పెడితే చాలు కలువల్లాంటి కళ్ళను చక్కగా కాపాడుకోవచ్చు. ..కళ్యాణి