కేజ్రీవాల్ నోటి దురద

 

 

 

ఈసారి ఎన్నికలలో తనకి, తన పార్టీకి అంత సీన్ లేదని అర్థం కావడంతోపాటు ఎక్కడకి వెళ్ళినా నిరసనలు, అవమానాలు ఎదురవుతూ వుండటంతో అరవింద్ కేజ్రీవాల్‌కి అయోమకంగా వున్నట్టుంది. తిరిగేకాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. ఆమ్ ఆద్మీ పార్టికి ఓట్లేయండంటూ అడగడానికి ఢిల్లీలోని గల్లీగల్లీలో తిరుగుతున్న కేజ్రీవాల్ కాళ్ళు హ్యాపీగా వున్నాయి. అయితే ఎవరో ఒకర్ని తిట్టందే ఊరుకోని నోరు మాత్రం సందర్భం కోసం ఎదురుచూస్తూ వుంటుంది. అందుకే కేజ్రీవాల్ వీలు దొరికితే తన నోటి దురద తీర్చుకుంటూ వుంటారు. సోమవారం ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనం నుంచి తప్పించుకని పారిపోవడానికి తానేమీ ఎవరి కూతుర్నీ లేవదీసుకుని పోలేదని అన్నారు. విద్యావంతుడు, సంస్కారవంతుడని కేజ్రీవాల్‌ విషయంలో కొంతమందికి వున్న భ్రమలు ఈ వ్యాఖ్యలతో తేలిపోయాయి. రాజకీయ పరంగా ఘాటైన విమర్శలు చేయవచ్చుగానీ, మరీ నేలబారు తరహాగా మాట్లాడ్డం కేజ్రీవాల్ లాంటి వ్యక్తికి తగదని పలువురు అంటున్నారు.