కర్ణాటక ఎన్నికల బరిలోకి వైకాపా..!

 

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా దూకుడు పెంచారు. దూకుడుగా వ్యవహరిస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నారు, అంతే దూకుడుగా ఉంటూ ఆ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో జగన్ పేరు మారుమోగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ను అభిమానించే వ్యక్తులు ఎక్కువయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది వైకాపా లో జాయిన్ కావాలని చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నాయకులు కోరుకుంటున్నారు.

ఆ దిశగా జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా సమాచారం అయితే, వైకాపా, తెరాస పార్టీల మధ్య నుంచి అనుబంధముంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తరచుగా కలుసుకుంటున్నారు. సహాయ సహకారాలు అందించుకుంటున్నారు, ఈ సమయంలో జగన్ తెలంగాణ నుంచి పోటీ చేయడమంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. జగన్ పోటీ చేస్తారని ఇప్పట్లో అనుకోవడానికి వీలు లేదు, ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టిడిపి ఏదయినా పుంజుకొంది అనుకుంటే జగన్ తెలంగాణలో అడుగుపెట్టొచ్చు.

ఇదిలా ఉంటే జగన్ కు బెంగళూరు లో మంచి ఫాలోయింగ్ ఉంది, రాజశేఖర్ రెడ్డి ఉన్న రోజుల్లో జగన్ ఎక్కువగా కర్ణాటకలో వ్యాపారాలు చేశారు. బెంగళూరులో ఆయనకు బలగం కూడా ఉంది. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయబోతున్నట్టు సమాచారం. వైసీపీ పోటీ చేస్తుందని దాని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేతలు కూడా జగన్ పార్టీ కర్ణాటకలో పోటీ చేస్తే ఆ పార్టీలో చేరేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత మేర వైకాపా ఓటింగ్ సాధిస్తోంది, ఒకవేళ వైకాపా పోటీకి దిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి, ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన పొజిషన్ లో ఉంది. జేడీఎస్ కొంత మేరకు బలంగా ఉంది, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ అనుసరించిన విధానాల వల్ల జేడీఎస్ కు పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది.

దీంతో కాంగ్రెస్ నేతలు కొంత మంది అసంతృప్తితో ఉన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండటంతో కాంగ్రెస్ కు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది, మరి ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.