చెవిలో పూలతో రోజా..

 

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంలో ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు. అలాగే.. తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీనినిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న ఆమె... చెవుల్లో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలు దక్కడంలేదని ఆమె ఆరోపించారు. కుప్పం నుంచి కూడా నిరుద్యోగులు వలసవెళ్తున్నారంటే.. సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగుల హామీ ఏమైందని....అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు.