జగన్ కు కొత్త అనుమానం మొదలైందట..!

 

ప్రస్తుతం వైసీపీ జగ్మోహన్ రెడ్డి పరిస్థితి... అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. ఎప్పుడు ఎటు నుండి ఏ వార్త వస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే నంద్యాల ఉపఎన్నిక ఓటమి దెబ్బకు జగన్ కోలుకోలేకపోయాడు. దాని నుండి తేరుకోక ముందే.. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఓటమి..  దానికి తోడు బెజవాడ ఇష్యూ.. వంగవీటి రాధా, గౌతం రెడ్డి వివాదంలో జగన్ పాత్ర ఉందన్న వార్తలు.. మరోపక్క అక్రమాస్తుల కేసులో హైకోర్టు కూడా జగన్ కు షాకిచ్చింది.. ఇప్పుడు వాటితో పాటు మరో టెన్షన్.. కొంత మంది వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా ఒకదాని తరువాత మరొకటిగా వరుస పెట్టి వస్తున్న ఇబ్బందులు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే జగన్ బంధువులను, పార్టీ నేతలను కాదు కదా... సొంత కుటుంబసభ్యులనే నమ్మే పరిస్ధితిలో ఉన్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా అనుమానం కూడా మొదలైంది అని అనుకుంటున్నారు. అనేది కూడా ఎవరో కాదు... సొంత పార్టీ నేతలేనట.

 

ఎందుకంటే... వైసీపీ నుంచి మరో ఆరుగురు అధికార టీడీపీ లోకి జంప్ కావడానికి రెడీగా ఉన్నారన్న వార్తలు జగన్ చెవిన పడ్డాయట. దీంతో ఆయన వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఓ మెట్టు దిగి అయినా బతిమాలాడానికి కూడా జగన్ రెడీ గా ఉన్నారట. అంతేకాదు కొంద‌రు ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ నేరుగా ఫోన్ చేసి పార్టీ మారుతున్న విష‌యంపై ప్ర‌శ్నించారాట‌. దీంతో వారు మమ్మల్ని అనుమానిస్తున్నారా అని జ‌గ‌న్‌పైనే సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో జ‌గ‌న్ అస‌లు ఎవ‌రిని అనుమానించాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై స్పందించిన పార్టీ నేతులు.. ఇంకొన్ని రోజులు ఆగితే ఆ ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరతారు కదా అప్పుడు వారి పేర్లు జగన్ కి ఇద్దాం అని సైటర్లు వేశారట. మొత్తానికి జగన్ కు కాలం ప్రస్తుతానికి కలిసిరానట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.