వైఎస్ వివేకా హత్యకేసు.. ఇకపై రోజువారీ విచారణ

 

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక పై రోజువారీ విచారణ కొనసాగించాలని సిట్ నిర్ణయించింది. డ్రైవర్లు ప్రకాష్, దస్తగిరిని విచారించిన పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ బీటెక్ రవికి కూడా నోటీసులిచ్చారు. అటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు వివేక కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు మాజీ సీఎం చంద్రబాబు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

2019, మార్చి 15 న పులివెందుల లోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తుల ఆధ్వర్యంలో 3 దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేశాయి. ఇంతవరకు కూడా ఎవరు నిందితులు అనేది ఇంత వరకూ ఎవరూ కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైయస్ కుటుంబీకులతో పాటు అనుమానితులందర్నీ కూడా రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ విషయం పైన విజృంభంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సిట్ బృందం మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది.