Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖ వాసుల గుండెల్లో జగనన్న బాణం
posted on: Nov 8, 2013 4:20PM
.jpg)
జగనన్న వదిలిన బాణం షర్మిల ఈమధ్య ఎక్కడా ఎవరికీ కనబడటం లేదు. మళ్ళీ కొంచెం పదును పెట్టుకొన్నతరువాత రివ్వున విశాఖ లోక్ సభ సీటుని లక్ష్యంగా చేసుకొని దూసుకు రాబోతునట్లు సమాచారం. ఎందుకంటే ఆమె ఆశిస్తున్న కడప సీటుని అవినాష్ రెడ్డికి కేటాయించినట్లు సమాచారం. అందువల్ల విశాఖలో పురందేశ్వరితో సర్దుకుపోమ్మని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
అయితే చాన్నాలుగా సుబ్బిరామిరెడ్డి పెడుతున్నపొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నపురందేశ్వరి పక్కనున్న నర్సాపురానికో మరో చోటికో జంప్ అయిపోతే, అప్పుడు ఆమె స్థానంలోకి ‘హరోం హర’ అంటూ సుబ్బి రామిరెడ్డి దూకి శివ తాండవం చేసేయడం ఖాయం. విశాఖ బీచ్ వరకు వేళ్ళు పాకిపోయున్న ఆయనతో డ్డీ కొనాలంటే షర్మిల కూడా ఏదో ఒక కార్డ్ వేయక తప్పదు. లేకుంటే ఆమె నాన్-లోకల్ అని సుబ్బడు శివాలెత్తిపోతాడు.
తన బ్రదర్ జగన్ ప్రజలని ఓ పక్క ఒదార్చుతుంటే, హస్బండ్ అనిల్ కుమార్ చేత ‘అల్లెలూయ’ పాడిస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడమే తడువు దానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేసినట్లు సమాచారం. వచ్చేనెల 6 నుండి ఓ మూడు రోజులపాటు హస్బండ్ అనిల్ కుమార్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సువార్త సభలకి డేట్స్ ఫిక్స్ అవడంతో, స్థానిక వైకాపా నేత రాకుర్తి చక్రధరరావు అందుకు ఓ చేయి వేస్తున్నారని సమాచారం.


.jpg)



