జగన్ పై పార్టీ నేతల అసహనం....మావోడికి ఆ సోయి లేదు...

 

పాదయాత్ర అయినా... ప్రెస్ మీట్ అయినా.. జగన్ టార్గెట్ మాత్రం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడిపై దుమ్మెత్తిపోయడమే. గతంలోనే చంద్రబాబు నాయిడిని కాల్చి  పారేయాలి... ఉరితీయాలని ఇలా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన... ఇప్పుడు మరోసారి ఆయనపై వ్యక్తిగత దూషణలు చేసి నేనింతే అని రుజువు చేశారు. ఇక పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా నాలుగు సెటైర్లు వేశారు. 'పవన్‌' సినిమాకు తక్కువ...ఇంటర్‌వెల్‌కు ఎక్కువ...అని అన్నారు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌'పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.

 

ఎందుకంటే... జనసేన పార్టీ ఆవిర్భావం రోజు వరకూ పవన్ కళ్యాణ్ టీడీపీ కీలుబొమ్మ అని.. చంద్రబాబు-పవన్ ఒకటే అని గతంలో జగన్ పలుమార్లు విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం రోజు పవన్ ప్రసంగం విన్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. కారణం..పవన్ టీడీపీ పై పెద్దఎత్తున ఆరోపణలు చేయడమే. దాంతో పవన్ టీడీపీకి వ్యతిరేకమయ్యారు. అంతేకాదు.. తాను అవసరమైతే....వచ్చే ఎన్నికల నాటికి వైకాపాను సమర్థిస్తాను తప్ప...'టిడిపి'వైపు ఉండనని తేల్చిచెప్పేశారు కూడా. అలాంటింది... పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసి మరోసారి సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నాడని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అంతేకాదు...అవసరానికి పనికి వచ్చే వాళ్లను.... ఆదుకునేవాళ్లను...తన నోటి దురదతో మరోసారి దూరం చేసుకుంటున్నాడని... 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 'పవన్‌'పై వ్యాఖ్యానించి...ఈయన ఒరగబెట్టేదేముంది...? వచ్చే ఎన్నికల నాటికి 'చంద్రబాబు' వ్యతిరేకులంతా..ఒకవైపు చేరితే...అంతిమంగా లాభపడేది...తమ పార్టీ...అని...ఆ సంగతి తెలుసుకోకుండా...ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న 'పవన్‌'ను విమర్శించి...'చంద్రబాబు' వ్యతిరేక ఓటు చీలిపోవడానికి మా నాయకుడే దారి చూపిస్తున్నారని అనుకుంటున్నారు. ఇదేం తెలివో...అర్థం కావడం లేదు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు...'జగన్‌', 'పవన్‌'ల మధ్య చీలితే...చివరకు... లాభపడేది...'చంద్రబాబే' అన్న సోయి...మావోడి లేదు...ఏం చేస్తాం...అంతా మా ఖర్మ'...అంటూ ఆ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

 

అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో..లక్ష కోట్లు...తిన్నాడని...తండ్రి ముఖ్యమంత్రి అయితే....కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలా...? అని ప్రశ్నించిన 'పవన్‌'పై కోపం చల్లారకే...'జగన్‌' అసహనాన్ని ప్రదర్శించారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ నోటి దురుసుకాస్త తగ్గించుకొని.. కాస్త రాజకీయాల గురించి.. అవగాహన తెచ్చుకుంటే పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకుంటే బెటర్ అని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.