ప్రత్యేక హోదా ఇచ్చి ఏపీని నిలబెట్టండి: సీఎం జగన్

 

 

మొట్టమొదటి సారిగా నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొన్న ఎపి సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఢిల్లీ లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం లో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియ చేస్తూ ఒక నివేదికను ప్రధాని, నీతి ఆయోగ్ సభ్యుల ముందు సమర్పించారు.  గత ఐదేళ్ళలో ఎపి రెవిన్యూ లోటు 66,632  కోట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రానికి లక్ష 18  వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉందని సీఎం తెలిపారు.  అలాగే అత్యధిక రాబడి వచ్చే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయ్యిందని, ఎపి రాజధాని, రాబడి లేని రాష్ట్రం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి ఉపాధి అలాగే ఆదాయం కూడా పెరుగుతుందని జగన్ ప్రస్తావించారు. ఎపి ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.