బలే కామెడీ జగన్.. మరి రోజా ఎంటమ్మా..?


ఏపీలో నాలుగు రోజుల టూర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాలుగు రోజుల్లో ఆయన చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లోనే వేడిని పుట్టించాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి మొదలు పెట్టి... అందరిపైనా కౌంటర్లు వేశారు. ఇంకా ఎప్పటినుండో మరుగుపడిన కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించి.. అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు వారసత్వ రాజకీయాలపై కూడా ఆయన కామెంట్లు చేశారు. ఇక సునామి వచ్చి వెళ్ళినట్టుగా.. ఎప్పటిలాగే నాలుగు రోజులు హడావుడి చేసి వెళ్లిపోయాడు. అయితే ఈసారి మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. పెద్ద పెద్ద డిబేట్ లే జరుగుతున్నాయి.

 

అయితే ఇక్కడివరకూ ఓకే.. కానీ పవన్ వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలనే అందరికంటే ఎక్కువ వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక రోజా సంగతి అయితే చెప్పనవసరం లేదు. తన అన్న జగన్ ను అన్నందుకు.. రెచ్చిపోయి మరీ పవన్ పై తిట్ల పురాణం దండుకుంది. పవన్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేముందు.. తాను వారసత్వ సినిమాల గురించి మాట్లాడాలని.. తన అన్న చిరంజీవి లేనిదే పవన్ కళ్యాణ్ లేడని.. చిరంజీవి వల్లే పవన్ రాగలిగాడని అబ్బో ఒకటా రెండా ఎన్నో డైలాగ్స్ వేసింది. ఇక జగన్ కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించి కౌంటర్లు విసిరాడు. తాజాగా మరోసారి పవన్, చంద్రబాబు పై సెటైర్లు విసిరాడు. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని.. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ముందుకు వస్తున్న సినీ నటులను నిలదీయాలంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను విమర్శించారు. మనలో చైతన్యం రావాలని, అప్పుడు చంద్రబాబులాంటి వాళ్లు బంగాళాఖాతంలో కలసిపోతారని చెప్పారు. తాను చాలా కష్టపడుతున్నా, కేంద్రమే సహకరించడం లేదని చంద్రబాబు చెబుతుంటారని అన్నారు.

 

మరి చంద్రబాబుపై, పవన్ పై జగన్ విమర్శలు గుప్పించాడు సరే. బాగానే ఉంది. ఇక్కడ ఓ చిన్న లాజిక్ ను ఎందుకు మర్చిపోయినట్టు ఉన్నాడు జగన్ అని అంటున్నారు. అదేంటంటే.. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడినందుకే రోజా, జగన్ ఓ గింజుకుంటూ.. వారిపై కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారసత్వ సినిమా రంగ ప్రవేశం గురించి చెబుతున్నారు. అలాంటిది.. జగన్ సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంటున్నారు.. మరి రోజా ఎవరు..? సినిమా యాక్టర్ కాదా జగను అని ప్రశ్నిస్తున్నారు...? పవన్ అంటే ఆవేశంలో ఏదో మాట్లాడాడు అనుకుందాం... మరి మీరు తెలివిగల్లవాళ్లు కదా... అన్ని తెలిసినవారు కదా.. మీ పక్కనే ఓ సినిమా యాక్టర్ ని పెట్టుకొని.. పక్కన వాళ్లను అనడం.. మీ అమాయకత్వమా.. లేక ఇంకేదైనా అని అంటున్నారు. మరి నిజమే కదా.. చంద్రబాబు పక్కనేమో కానీ... రోజానే పక్కనే పెట్టుకొని జగన్ ఇలా మాట్లాడటం కామెడీనే..