జగన్‌ను భయపెడుతున్న అమరావతి

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏంటా అని అందరూ ఆలోచిస్తుండగా.. చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి అని చెప్పారు, అలానే అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానని మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారమే ప్రపంచ స్థాయి కంపెనీల చేత అమరావతి డిజైన్లు వేయించారు.. గొప్ప రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇదంతా బాగానే ఉంది.. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? రాజధానిగా అమరావతి ఉంటుందా? లేక కొత్త రాజధాని తెర మీదకు వచ్చి మళ్ళీ రాజధాని వ్యవహారం మొదటికొస్తుందా? అంటూ ఏపీ ప్రజల్లో భయం మొదలైంది.. ఆ భయం వెనుక కూడా కారణం ఉందిలేండి.

 జగన్ మొదటినుండి అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. రాజధానిగా అమరావతి భూమి పూజ కార్యక్రమానికి  దేశ వ్యాప్తంగా ఎందరో నేతలొచ్చారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం రాలేదు.. అదీగాక జగన్ పలు సందర్భాల్లో అమరావతి గురించి తన వైఖరి వెల్లడించారు.. రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములను తాను అధికారంలోకి రాగానే తిరిగిస్తానని జగన్ అన్నారు.. దీన్నిబట్టి జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండటం కష్టం, రాజధాని వ్యవహారం మళ్ళీ మొదటికొస్తుందని ప్రజల్లో భయం మొదలైంది.. అయితే ఇప్పుడు అమరావతి భయం జగన్ లో కూడా మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అందుకే జగన్ ఆచి తూచి మాట్లాడుతున్నాడట.. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేదు.. జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధానిని మారుస్తా అంటే.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని ప్రజలంతా జగన్ కి వ్యతిరేకమవుతారు.

తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశలకు జగన్ గండి కొట్టాడన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది.. ఇది రాజకీయంగా జగన్ కి చాలా దెబ్బ.. అందుకే ఇప్పుడు జగన్ అమరావతి విషయంలో సతమతం అవుతున్నాడట.. రాజధాని మారుస్తా అంటే రెండు జిల్లాల్లో అసలు పార్టీనే లేకుండా పోయే ప్రమాదం ఉంది, మరో వైపు రాష్ట్ర అభివృద్ధి మరో ఐదేళ్లు వెనక్కెళ్తుందని యువత జగన్ ని వ్యతిరేకించే ప్రమాదం ఉంది.. పోనీ అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటే మాట తప్పినట్టు ఉంటది, అదీకాక బాబు సెలెక్ట్ చేసిన రాజధాని కాబట్టి జగన్ కి మనస్సు ఒప్పదు.. అందుకే జగన్ అమరావతి విషయంలో సతమతమవుతూ కాస్త భయపడుతున్నాడట.. చూద్దాం మరి అమరావతి విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తాడో.