నేను హిందువును...రంజాన్ ఎందుకు జరుపుకోవాలి..?

 

బీజేపీ అంటే హిందుత్వానికి మారుపేరు అని అందరికీ తెలిసిందే. పలు సందర్బాల్లో అది నిజమే అన్న సంఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మరోసారి అది నిజమనేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుందని, నమాజ్ నిత్యమూ వస్తుందని ఇటీవలే  సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి... మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "నేను హిందువును. ఈద్ జరుపుకోను. అసలు రంజాన్ ను నేనెందుకు జరుపుకోవాలి? నా మతం నాకు గర్వకారణం. నేను వారిలా మత విశ్వాసాలతో ఆడుకునే వ్యక్తిని కాదు... ఓ వైపు గుడిలో కాశీదారాలు కట్టించుకుని, మరోవైపు నెత్తిన టోపీ పెట్టుకుని, ఇంకోవైపు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేయను, చేయబోను" అని అన్నారు. ఇక ఇప్పుడు యోగి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి.