యోగికి మద్దతుగా ముస్లింల భారీ ర్యాలీ

ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న యోగి ఆదిత్యనాథ్‌ హిందూ పక్షపాతి అని..ముస్లింల వ్యతిరేకి అంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తుండటంతో ఇవాళ ఆ రాష్ట్రంలోని ముస్లింలు రోడ్లపైకి వచ్చారు. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న గోరఖ్‌పూర్‌లో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిత్యనాథ్ హిందువులను, ముస్లింలను ఒకేలా చూస్తారని..సీఎంగా ఆయనను ఎంపిక చేయడం కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 14 సంవత్సరాలుగా ఆయన్ను చూస్తున్న మాకు ఈ విషయం తెలుసన్నారు. యోగిని ముస్లిం వ్యతిరేకిగా ముద్రవేయడం తప్పు అని ర్యాలీలో పాల్గొన్న కొందరు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.