యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని కాన్షీరామ్ స్మృతివన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన చేత గవర్నర్ రామ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. యోగితో పాటు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ఉపముఖ్యమంత్రులుగా, కొందరు ఎమ్మెల్యేలు మంత్రులగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌కి 21వ ముఖ్యమంత్రి. బీజేపీ తరపున సీఎం అయిన వారిలో యోగి నాలుగో వ్యక్తి.