రేవంత్‌రెడ్డి ఇంటిలో ఎమ్మెల్యే హరిప్రియ

 

తన రాజకీయ గురువు, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కలిశారు. తనకు టికెట్ ఇప్పించినందుకు, తనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలపటానికి మాత్రమే వచ్చినట్లు ఆమె మీడియాకు వివరించారు. ఆమెతో పాటు మండల కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లెంపాటి శ్రీనివాసరావు, పలువురు నాయకులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జరిగిన తాజా ఎన్నికల్లో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా బాణోత్‌ హరిప్రియ ఎన్నిక కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ కేటాయించిన ఏకైక మహిళ అభ్యర్థి హరిప్రియ మాత్రమే కావడంతోపాటు.. ఆమె ఘన విజయం సాధించి ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో తన శిష్యురాలు హరిప్రియ ఘన విజయం సాధించగా, రేవంత్ మాత్రం గోరాతి గోరంగా ఓటమి పాలైన సంగతి మీకు తెలిసిందే.