మంత్రులుగా 17 మంది ప్రమాణస్వీకారం..  గాలి అనుచరుడు కూడా!

 

కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రబుత్వం ఈరోజు మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేష్ సహా 17 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీజేపీ ఎమ్మెల్యే బి.శ్రీరాములు కూడా ఉన్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు.

బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.