ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప..


కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. "బీఎస్ యడ్యూరప్ప అనే నేను..." అంటూ ఆయన ప్రమాణ స్వీకారం కన్నడలో సాగింది. అయితే పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. ఆపై ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.