జగన్ కు షాక్.. పార్టీకి రాజీనామా..!

 

వైకాపా పార్టీ నుండి ఇప్పటివరకూ 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల వైకాపా కీలక నేత గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువా కప్పుకున్నారు. మరో నేత గుర్నాథ రెడ్డి కూడా టీడీపీలో జంప్ అయ్యే ఆలోచలనో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో నేత వైసీపీకి రాజీనామా చేసి చేసి జగన్ కు షాకిచ్చాడు. ఆయనెవరో కాదు... చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి. సుబ్రహ్మణ్యం రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైకాపాలో అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నానని చెప్పారు. అంతేకాదు కార్యకర్తల ముందు కంటతడి కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పార్టీతో ఇన్నాళ్ల అనుబంధాన్ని తెంచుకునే ముందు ఎంతో ఆలోచించానని చెప్పిన ఆయన, రాజశేఖరరెడ్డి హయాంలో తన స్థాయి నుంచి, ప్రస్తుతం జగన్ తనను దూరం పెట్టడం వరకూ జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో పార్టీకి అండగా నిలిచిన తనపై నిందలు వేశారని, తనకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో తాను వైకాపాను ప్రారంభించగానే చేరానని, జగన్ కు విధేయుడిగా ఉన్న తనకు లభించిన గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. అయితే ఈయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.