మీరెన్ని తప్పుడు వార్తలు రాయించినా.. నేను పార్టీ విధేయుడినే

కొద్ది రోజులుగా వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం పై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిస్ కు జవాబుగా పార్టీ పేరుతో సహా అనేక అంశాల పై ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా రఘురామ రాజు తాను పార్టీకి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌న‌ని, సీఎం కనుక సమయం ఇస్తే ఆయనను కలిసి అన్ని విషయాలు చెపుతానని అన్నారు. తాను వైసీపీ పార్టీని కానీ, సీఎంను కానీ వ్య‌తిరేకించ‌లేద‌ని, ఐతే తన గురించి మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విజయ్ సాయి రెడ్డి పై మండి పడ్డారు.

తనకు, పార్టీ అధ్య‌క్షునికి మ‌ధ్య గొడ‌వ పెట్టొద్ద‌ని… వీలైతే త‌న‌కు ఇచ్చిన నోటీసు వెన‌క్కి తీసుకోవాల‌ని అయన విజ‌య‌సాయి రెడ్డి ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే త‌న‌కు వ‌చ్చిన షోకాజ్ నోటీసుల‌పై లీగ‌ల్ ఓపీనియ‌న్ కూడా తీసుకున్నాన‌ని అన్నారు. కేంద్ర‌మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిష‌న్ రెడ్డిల‌ను క‌లిసిన తరువాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు.