చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు.  ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే. పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.
Publish Date: Apr 17, 2024 6:35PM

ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 
Publish Date: Apr 17, 2024 2:55PM

రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ 

ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.  దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
Publish Date: Apr 17, 2024 2:52PM

జగనే ఎందుకు ?

ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు?  ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల జ్ణాపకశక్తి చాలా తక్కువ అన్న నమ్మకంతో కావచ్చు  ధైర్యంగా వైనాట్ 175 అంటూ స్వయంగా జగన్ ఒక ప్రశ్నను సంధించి రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజల జ్ణాపకశక్తిపై జగన్ కు ఉన్న నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు కానీ నడుస్తున్న చరిత్ర , పడుతున్న కష్టాలు, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలనను జనం క్షమిస్తారనీ, పట్టించుకోరనీ ఆయన భావించడం అయితే అతి విశ్వాసం లేదా అహంభావం అయి ఉండాలి. లేదా అమాయకత్వం అయ్యి ఉండాలి. కానీ జనగ్ ను అమాయకుడని ఎవరూ భావించజాలరు. వైనాట్ 175 అన్న తన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికీ జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి బోలెడు ఉదాహరణలు ఉణ్నాయి   నిజానికి ఐదేళ్ల  జగన్  పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే, అరాచకం రాజ్యమేలింది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు . యువత వలసబాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.   అవి చాలవన్నట్లు, జగన్ రెడ్డి, కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. వేధింపులు, అరాచకాలు తప్ప జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో ఇంకేం లేకుండా పోయింది. దీంతో జగన్  కి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.  దీంతో వారు  చేసిన తప్పు  మళ్ళీ చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్ ను అధికారం నుంచి దింపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ప్రజాభిప్రాయమే సర్వేలలో ప్రతిఫలిస్తోంది.   జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే  కాదు, చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులెట్టేలా చేయాలన్న జనం నిశ్చయాన్ని కూడా సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.  ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా జనం ఇంకా నెలరోజులా అని భావిస్తున్నట్లుగా వారిలో ఆవేశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వై నాట్ 175 అన్న తన ఆశ పగటి కలేనని జగన్ కే తెలిసిపోయినట్లుంది. దీంతో  గత ఎన్నికలలో తనకు లబ్ధి చేకూర్చిన సెంటిమెంటుపై పడ్డారు. గులకరాయి దాడిని తనపై హత్యయత్నంగా చూపి సానుభూతి పొందడానికి చేసిన యత్నం నవ్వుల పాలు కావడానికి జనం కోడికత్తి దాడి డ్రామాను జనం ఇంకా మరచిపోకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు.   దీంతో మళ్ళీ జగనే ..ఎందుకు కావలి?’ అని వైసీపీ రూపొందించిన ప్రచార కార్యక్రమం  అవును జగనే ఎందుకు ? వద్దే వద్దు అన్న జనవాక్యంగా మారిపోయిందని చెబుతున్నారు. 
Publish Date: Apr 17, 2024 2:01PM

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ... రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ 

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.సీఎం రేవంత్​రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్​ టెలికాస్ట్​ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
Publish Date: Apr 17, 2024 12:46PM

మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు.. విపక్షాల వైఫల్యమే!

కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే  ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో  సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్  విజయాల కోసం, కాంగ్రెస్ రెండు ఓటముల తరువాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో  చెమటోడుస్తున్నాయి. ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంత వీజీ కాదంటున్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే.. పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరో వైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనుకలాడుతున్నాయి. దీంతో సహజంగానే ఎన్డీయే బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్ గా లేదనీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  2004లో బీజేపీ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన   బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నదీ ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కార్ కంటే వాజ్ పేయి సర్కారే బెటరనీ పరిశీలకులు చెప్పడమే కాదు. అప్పటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి  సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్ పేయి  ప్రభుత్వం పై వ్యతిరేకత  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తరువాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు.  ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్ధ ఉందనీ, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎన్నికలలో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయోధ్య రామమందిర ని్మాణం,  హిందూత్వ అజెండా,  ఉమ్మడి పౌరస్మృతి వాగ్దానం, తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరో సారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది. అయితా ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వ కంటే సర్వమత సామరస్యాన్నే కోరుకుంటున్నారనీ, రామ భక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారనీ తేల్చింది. జనాభాలో దాదాపు 79శాతం మంది బీజేపీ అజెండా హిందుత్వ అయినా తాము బహు మత భారత ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తాజా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లంది. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి  పార్టీలూ పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజలలో రామ మందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే  దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా మధ్యతరగతి ప్రజలలో మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టిపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు.  నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి.వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.  ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాయి.వారికి ప్రభుత్వం అండ ఉండడంతోపాటు ఆర్ధికవ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.ఫ లితంగా వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. దీంతో అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీనితో అన్ని వర్గాలలోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో  ఈ విషయాలపై ప్రజలలోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయి.   పంజాబ్,హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు బాటు ధర,రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సీఏఏ   అమలులోకి తేవడం వల్ల పౌరసత్వం పై మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లు గా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యక్తమౌతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలూ విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
Publish Date: Apr 17, 2024 12:39PM