దేవుడి దగ్గర కూడా ఇంత రచ్చ అవసరమా...


వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మారదు. మారదు కాక మారదు... అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే తన నోటిదూలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నంద్యాల ఉపఎన్నికల్లో జరిగింది చాలదు అన్నట్టు ఇప్పుడు తాజాగా మరోసారి రోజా ప్రభుత్వంపై విరుచుకుపడింది. కనీసం తాను ఎక్కడ ఉందో కూడా చూసుకోకుండా నానా యాగి చేసింది.  రోజా రాజ‌కీయాలు అసెంబ్లీలోను, మీడియాలోనే కాకుండా చివ‌ర‌కు ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన దేవాల‌యాల్లోను ఆగ‌డం లేదు.

 

రోజా ఇటీవల నగరి నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా ఆమె తిరుమ‌లలో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోసం కావాల్సిన ఎల్‌-1 టిక్కెట్ల విష‌యంలో నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు. వీఐపీల‌కు ఇచ్చే ఎల్‌-1 ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను కేవ‌లం 10కి మాత్ర‌మే పరిమితం చేశారు. అయితే రోజా త‌న‌తో పాటు పాద‌యాత్ర చేసిన 40మందికి పైగా ఎల్ -1 టిక్కెట్లు కావాల‌ని నానా హంగామా చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా ప్ర‌భుత్వంతో పాటు అధికారుల‌పై నోటికొచ్చిన‌ట్టు విరుచుకుప‌డ్డారు. తాను ఉన్న‌ది పవిత్ర‌మైన దేవాల‌యం అన్న సంగ‌తి కూడా రోజా మ‌ర్చిపోయి వ్య‌వ‌హ‌రించారు. దీంతో రోజా తీరుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అంతేకాదు రోజా చేసిన రచ్చపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా అతి చేస్తున్నారని, ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఆయన హెచ్చరించారు. తిరుమలకు అనుచరులతో వచ్చి ఎల్ -1 టిక్కెట్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారని, దేవుడి ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. మొత్తానికి రోజా.. ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ అన్న అందరూ అనుకుంటున్నారు అంటే ఇందుకే మరి. వారి మాటలను రోజా సార్ధకత చేస్తుంది. మరి ఎప్పుడు మారుతుందో.. ఏమో రోజా..