మాది కోడి కత్తి పార్టీ..మీది కట్టప్ప కత్తి పార్టీ

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేడని, బాబును మించిన అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. పవన్ కల్యాణ్ వచ్చి నాతో కలవాలని  చంద్రబాబు అంటారు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా? మిమ్మల్ని రోజూ తిడుతున్న వ్యక్తి వచ్చి మధ్దతు ఇవ్వాలని కోరుతున్నావు. కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలని అంటావు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి సోలోగా పోటి చేస్తానని ప్రకటించారు. 

చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ చంక నాలుగు సంవత్సరాలు నాకాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎన్నికలలో గుడ్డలూడదీసి పంపారంటూ ఎద్దేవా చేశారు. మొన్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు సూట్‌కేసులతో డబ్బులు మోశారని ఆరోపించారు. బాబు ఎప్పుడు దిగిపోతాడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు భారీ స్పందన వచ్చిందని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యాత్రను విజయవంతం చేశారన్నారు. పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి మీరు  365 రోజులు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారా? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని మిగిలిన రోజులకు మీరు జీతాలు ఇచ్చేస్తే మేం కూడా జీతాలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ 20 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా సమాధానం చెప్పలేదు. చంద్రబాబు దగ్గరున్న ఊర కుక్కలతో మొరిగించాడు. చంద్రబాబూ నీ టైమ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించు. ఎన్నికలు వస్తున్నాయ్ అని చెప్పి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద సైకో. మాది కోడి కత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీయా అంటూ కొడాలి నాని విమర్శించారు.