ద్వారంపూడి... నీకెందుకంత బలుపు? నీకున్న ప్రజాబలమెంత?

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకికాడ సిటీ ఎమ్మెల్యే... రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రజానాయకుడు అనుకునేరు... కానే కాదంటున్నారు ప్రత్యర్ధులు... ఎందుకంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరూ లేదు... కనీసం గుర్తింపూ లేదని చెబుతున్నారు... రెండుసార్లూ కూడా కేవలం ఆయా పార్టీల గాలి... అధినేతల అండదండలతో మాత్రమే గెలిచాడని... ద్వారంపూడి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా ఈజీగా అర్ధమవుతుందంటున్నారు... 2009లో మొదటిసారి కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలి కలిసొచ్చిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ అండదండలతో ...అప్పటివరకు కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తా గోపాలకృష్ణను కాదని టిక్కెట్ దక్కించుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... బ్రహ్మాండమైన వైఎస్ గాలిలో సైతం కేవలం 9వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఘోర ఓటమి చవిచూసిన ద్వారంపూడి... 2009లో మూడో స్థానానికి పరిమితమైన టీడీపీ అభ్యర్ధి చేతిలో ఏకంగా 24వేల భారీ తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఇక, ఇప్పుడు అంటే, 2019లో మరోసారి వైసీపీ నుంచి పోటీచేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... వైఎస్ జగన్ ప్రభంజనంలో సైతం కేవలం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. 2009లోను, 2019లోనూ ద్వారంపూడికి వచ్చిన మెజారిటీ మంచి మెజారిటీగానే పైకి కనిపిస్తున్నా.... అది కేవలం సాధారణ గెలుపుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి... అనామకులను నిలబెట్టినా కనీసం  పాతికవేలు మెజారిటీ వచ్చింది. వైఎస్ జగన్ ను చూసే ఓట్లు గుద్దేశారు ప్రజలు. కానీ, కాకినాడ సిటీ వరకు వచ్చేసరికి తేడా స్పష్టంగా కనిపించింది. జగన్ సునామీలో సైతం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. అంటే, ద్వారంపూడి ప్రజాబలమున్న నాయకుడు కానే కాదని... కేవలం ఆయా పార్టీల గాల్లో గెలుస్తూ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడని అంటున్నారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ప్రజాబలమున్న నాయకుడు, దేశంలోనే సీనియర్ పొలిటీషన్, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, ప్రస్తుతం ఏపీ అపోజిషన్ లీడర్ గా కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పార్టీలకతీతంగా ప్రజలు మండిపడుతున్నారు. ద్వారంపూడికి నోరా? లేక పెంటకుప్పా అంటూ విరుచుకుపడుతున్నారు.