వైసీపీలో కిడ్నాప్ కలకలం....

 

వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరగా.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ నుండి మరికొంత మంది నేతలు టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. వాటికి తగ్గట్టు తాజాగా ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరుక్కుంటూ పార్టీ ప‌రువు తీసేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యకు యత్నించారనే అభియోగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. పుణ్యమంతుల కాళీ, ఆయన అనుచరులు సూరిబాబు, సిరగం జగతలు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యకు యత్నించారని అభియోగాలు వచ్చాయి. ఇక ఈ కేసుపై స్పందించిన కాళీ.. తనకూ.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించిన.. పోలీసులు దగ్గర సాక్ష్యాలు ఉండటంతో అడ్డంగా బుక్కాయ్యాడు. ఇక పోలీసుల దగ్గర సాక్ష్యాలు ఉండటంతో వైసీపీ నేతలు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. అసలే కోన‌సీమ‌లో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరువు కిడ్నాప్ వ్యవహారంతో మరింత పోయిందని తలలు పట్టుకున్నారు. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూద్దాం..