ఎన్డీఏలోకి నై అంటే.. జైలుకు సై

వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చలో ఉన్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఛార్జిషీటులో భారతి పేరు.. ఈ విషయం బయటికి తెలిసినప్పటి నుండి వైసీపీ కిందామీద పడుతుంది.. నిజానికి ఛార్జిషీటులో భారతి పేరు జత చేసి నెలరోజులు అవుతుంది.. కొద్ది రోజుల కిందట, విజయసాయిరెడ్డి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు.. అఫ్ కోర్స్ చివరికి యూటర్న్ తీసుకున్నారు.. కాని ఏం లాభం?.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. విజయసాయిరెడ్డి ఆ ప్రకటన చేసినప్పుడే, ఈడీ కోర్టులో చార్జిషీట్ పడింది.. అది ఇప్పుడే బయటకు తెలిసింది.. ఈ ఈడీ చార్జిషీట్ ద్వారా జగన్ కు, బీజేపీ స్పష్టమైన సందేశం పంపిందంటున్నారు.. ఎన్డీఏలోకి వస్తే సరే, లేదంటే కుటుంబసమేతంగా జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు ఈ చార్జిషీటు ద్వారా వచ్చాయంటున్నారు.

 

 

ఇంత కాలం బీజేపీతో సన్నిహితంగా ఉండటంతో, కేసుల విషయం ఎక్కడిదక్కడే నిలిచిపోయిది.. కానీ ఎప్పుడైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారో అప్పుడే ఆట మొదలైంది.. కానీ జగన్ ను పట్టి పీడిస్తున్న ఆవేదన ‍ఒక్కటే.. బీజేపీతో కలిస్తే కేసుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ తన జీవితాశయం అయిన ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం అసాధ్యం.. ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్రప్రేదశ్ లో ప్రజల ఆగ్రహం అంతా బీజేపీపై ఉంది.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే 'తమ గోతిని తామే తీసుకున్నట్టు' అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.. ఈ విషయంపై జగన్ కి కూడా అవగాహన ఉంది.. అందుకే ఆయన ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి వస్తామనే సందేశాన్ని పంపించారు.. అబ్బే బీజేపీ అంత అమాయకమైన పార్టీ కాదు కదా.. ఇంత దాకా వచ్చి ఎన్డీఏలోకి రామంటే బీజేపీ ఊరుకుంటుందా? కన్నెర్ర చేస్తుంది.. పాపం ఇప్పుడు జగన్ పరిస్థితి 'కరవమంటే కప్పకు కోపం.. వదలమంటే పాముకు కోపం' అన్నట్టు తయారైంది.. ఎన్నికలకు ముందే ఎన్డీఏలోకి వెళ్తే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుంది.. పోనీ ఎన్నికల తరువాత వెళదామంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది.. అయితే విజయసాయిరెడ్డి లాంటి వారు మాత్రం.. ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి వస్తామంటే, అంతకంటే ముందే బీజేపీ జైలుకు పంపించడం ఖాయమని.. ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరితే కేసులూ తప్పించుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ సాయంతో సీఎం పదవి కూడా దక్కవచ్చని సలహాలు ఇస్తున్నారట.. కానీ జగన్ మాత్రం డైలమాలో ఉన్నారు.. జైలుకెళ్లడం కన్నా, ఏదీ ఉత్తమం కాదని ఆయన చివరికి భావించే అవకాశం ఉంది.