జగన్ క్షమాపణ చెప్పాలి

 

జగన్ క్షమాపణ చెప్పాలంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేసారు.. చంద్రబాబు నాలుగేళ్లుగా రెండు సినిమాలు చూపిస్తున్నారు అంటూ.. అమరావతి, పోలవరం లను సినిమాలతో పోలుస్తూ జగన్, చంద్రబాబు మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై యనమల మండిపడ్డారు.. పోలవరం, అమరావతి రెండు సినిమాలని జగన్ అనడం బాధ్యతారాహిత్యమని అన్నారు.. ఇలా ప్రాజెక్టులను సినిమా తో పోల్చి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని యనమల డిమాండ్ చేసారు.. మరి దీనికి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.