యువతి కడుపులో 150 బతికున్న వానపాములు...

 

ఉత్తరప్రదేశ్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓయువతికి ఆపరేషన్ చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 బతికున్న వానపాములను తీశారు. అసలు సంగతేంటంటే.. ఉత్తరప్రదేశ్ లో నేహా బేగం(22) అనే యువతికి తరచూ కడుపునొప్పి, వాంతులతో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా... ఎన్ని మందులు తీసుకున్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయేది. అలా ఆస్పత్రులు చుట్టూ తిరిగి, తిరిగి ఆఖరికి  కేజీ నందా ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి చూడగా.. పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించారు. దీనికి గాను ఆపరేషన్ నిర్వహించగా... ఒక్కసారిగా వైద్యులు షాకైనంత పనైంది. ఆమె పేగుల్లో వానపాములు చూసి అవాక్కయ్యారు.  దాదాపు 4 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములు బయటికి తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ తివారీ మాట్లాడుతూ...రక్తప్రవాహంలో ప్రవేశించి అనంతరం శరీరంలోపల  పెరుగుతాయని డాక్టర్ తివారీ చెప్పారు. ఈ జీవులు ఆమె మెదడులోకి ప్రయాణించి ఉంటే.. ప్రాణానికే  ముప్పు వచ్చేదన్నారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు.


నేహా మాట్లాడుతూ.. భరించలేని కడుపునొప్పి, వాంతులతో విలవిలలాడిపోయేదాన్నని, ఎన్నోనిద్రలేనిరాత్రుళ్లు గడిపానని  నేహ తెలిపింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.