ట్రంప్ ఎఫెక్ట్.. 2వేల మంది తొలగింపు..

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసిన సంగతి తెలసిందే. అయితే ఈ ఎఫెక్ట్ తొందరగానే భారతీయ ఉద్యోగులపై పడినట్టు కనిపిస్తోంది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 2 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ అధికారులు మాట్లాడుతూ.. కంపెనీ భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతలు, క్లయింట్ల అవసరాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, పనితీరు మదింపు తరువాతే, సంతృప్తి కలిగించని ఉద్యోగులనే తొలగించామని పేర్కొంది. తొలగించబడ్డ వారిలో అత్యధికులు అమెరికాలో పని చేస్తున్న వారేనని సమాచారం. మరి ముందు ముందు ఇంకెన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.