కేశినేని క్లారిటీ ఇచ్చేశారా? అధిష్టానమే అర్ధంచేసుకోవడం లేదా?

 

అధికారంలో ఉంటే ఒకరకంగా... ప్రతిపక్షంలో మరోరకంగా కొందరు నేతలు మారిపోతుంటారు. మరికొందరు పవర్ కోసం బట్టలు మార్చినట్టు పార్టీలే మార్చేస్తుంటారు. అయితే, సరైన నాయకుడిని, భవిష్యత్తున్న పార్టీని నమ్ముకుని, లాయల్ గా ఉన్నోళ్లకే పొలిటికల్ గా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇది ఎన్నోసార్లు రుజువైంది. గుప్పిగంతులేసే నేతలకు ఒక్కోసారి అప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు లభించినా, అసలైన లబ్ధి దక్కాల్సిన టైమ్ లో చేచేతులా పోగొట్టుకుంటారు. రాజకీయాల్లో పైకి రావాలంటే కొంత ఓపిక కూడా అవసరం. ఇలాంటి ఓపికలేకే 2014 తర్వాత పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఆ తర్వాత భవిష్యత్తును పోగొట్టుకున్నారు. ఇదంతా ఇఫ్పుడెందుకు చెబుతున్నానంటే, ఇదే పరిస్థితి ఇప్పుడు టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. 

తెలుగుదేశంఘోర పరాజయం తర్వాత పలువురు నేతల వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎన్నడూ అధిష్టానాన్ని తలెత్తి చూడని లీడర్లు... ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. పార్టీలో ఉంటామంటూనే పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి లీడర్లపై ఇటీవల జరిగిన టీడీపీ కీలక సమావేశంలో విస్తృత జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలిపై పలువురు లీడర్లు మండిపడ్డారు. అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాలో తిట్లదండకం అందుకుంటోన్న కేశినేనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు డిమాండ్ చేశారట. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవాళ్లు, వెళ్లిపోవాలి కానీ, ఇలా వ్యవహరించడం సరికాదని ఫైరయ్యారట. అయితే, కేశినేనిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై చంద్రబాబు మౌనం వహించినట్లు తెలిసింది.

అయితే, విజయవాడలోనే ఉన్నా, అక్కడ జరిగిన టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్ కి కేశినేని రాకపోవడంపై సీనియర్లు సీరియస్ అయ్యారు. అయితే, కేశినేని తన గైర్హాజరుతో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారనే మాట కూడా వినిపిస్తోంది. కేశినేని బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలకు ఇది ఊతమిచ్చినట్లే అంటున్నారు.