వొడాఫోన్-ఐడియా మెగా విలీనం..

 

వచ్చిన తక్కువ కాలంలోనే జియో ఎంత ఆదారణ పొందిందో అందిరికీ తెలిసిందే. జియో ఇచ్చిన ఉచిత ప్యాకేజీలకు ఫిదా అయిపోయిన జనాలు మిగిలిన నెట్ వర్క్ లను సైతం మరిచిపోయారు. ఇక జియో ధాటికి తట్టుకోలేని నెట్ వర్క్ లు.. ఫ్రీ ఆఫర్లు ఇస్తూ జనాల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు మరో మెగా డీల్ యూజర్ల ముందుకు రానుంది. అదే  వొడాఫోన్-ఐడియా విలీనం.

 

ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా ఐడియా సెల్యులార్ అవతరించింది. దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో  దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఈ సంస్థ అవతరించబోతుంది. ఇన్ని రోజులు వొడాఫోన్ రెండో స్థానంలో, ఐడియా మూడో స్థానంలో ఉండగా.. టెలికాం లీడర్ గా భారత్ ఎయిర్ టెల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. ఇప్పుడు వచ్చిన జియో కూడా అన్ని నెట్ వర్కలకు గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఇటు ఎయిర్ టెల్ స్థానాన్ని దక్కించుకుని, రిలయన్స్ జియో దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వొడాఫోన్, ఐడియాలు విలీనానికి తెరలేపాయి. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే  ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్.  కొత్త సంస్థలో వోడాఫోన్ కు 45 శాతం వాటాలుంటాయని, ఐడియా ప్రమోటర్లకు 26 శాతం వాటాలు, ఏబీ గ్రూప్ నకు 9.5 శాతం వాటాలుంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు సంస్థలూ విలీనమైన తరువాత 40 శాతం మార్కెట్ వాటా, రూ. 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నమోదవుతుందని బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. మరి జియోను దెబ్బతీయడానికి వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం..