2 కోట్లు కొట్టింది..జైల్లో రాణిలా బతుకుతోంది..!

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైళ్లో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్‌కు అక్కడ సకల భోగాలు అందుతున్నాయట..ఈ విషయంపై కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్ ఉన్నతాధికారులకు రాసిన లేక ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జైళ్ల శాఖలోని ఓ సీనియర్ అధికారి శశికళ వద్ద నుంచి రూ.2 కోట్ల లంచం తీసుకుని సకల సదుపాయాలు కల్పించారని..ప్రత్యేక వంటగది, పడుకునేందుకు మెత్తని పరుపులు ఇలా ఇంట్లో ఉండే సకల సౌకర్యాలు కల్పించారని ఆమె రాష్ట్ర డీజీపీ రూప్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.