లైటెనింగ్ రాడ్ - విటమిన్ ఈ

 

 

 

మన శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే కాని అందులో విటమిన్ 'ఈ' కి పెద్ద పీట వెయ్యాలి. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అందుకే దీనిని లైటెనింగ్ రాడ్ అంటారు. అంతేకాదు యాంటి ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. రక్తకణాలని వృద్ది చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే విటమిన్ ఈ వల్ల వచ్చే లాభాలు ఎన్నెన్నో.


విటమిన్ ఈ ముఖ్యంగా కొవ్వులో కరిగిపోయే విటమిన్. స్థూలకాయుల రక్తంలోనూ  విటమిన్ ‘ఈ’ ఉంటుంది, కానీ కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ ‘ఈ’ లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్తునారు. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే విటమిన్ ఈ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామా.

 

 

ఊబకాయానికి:

కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ ‘ఈ’ అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే దీనికి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. ఇలాంటివారు పొద్దుతిరుగుడు ఉత్పత్తులు, తృణ ధాన్యాలు ఎక్కువ శాతం తీసుకుంటే మంచిది.

 

చర్మ సంరక్షణకి:

సాధారణంగా అన్ని సౌందర్య ఉత్పత్తుల తయారిలోనూ విటమిన్ ఈ ని వాడతారు. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి దీనిలో ఎక్కువగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు విటమిన్ ఈ ని తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. విటమిన్ ఈ కాప్సుల్ ని మొహానికి రాసుకుని పావుగంట తర్వాత మొహం కడుకుంటున్నా మోహంలో నిగారింపు వస్తుందిట.

 

యాంటి ఆక్సిడెంట్:

దీనిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కేన్సర్ కారకాలను దూరం చేస్తాయి. రోగానిరోధకశక్తిని  పెంచుతాయి. మతిమరపు సమస్య కూడా దూరం అవుతుంది. కంటి చూపు స్వస్థతకి కూడా ఉపయోగపడుతుంది.

 

 

రక్తకణాల వృద్ధి కోసం:

విటమిన్ ఈ తీసుకోవటం వల్ల ఒంట్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్త నాళాలలో రక్తం ముద్దగా  కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు మెనోపాజ్ స్టేజ్ లో మహిళలకు వచ్చే సమస్యలని కూడా తగ్గిస్తుందిట.

 

కీళ్ళ నొప్పులకు:

ఈ రోజుల్లో ఈ కీళ్ళ నొప్పులు అందరిలోనూ కామన్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ ఈ లోపించటమే. విటమిన్ ఈ ఈ నొప్పులను తగ్గించటమే కాదు కండరాలని  కూడా ద్రుఢ పరుస్తుంది. వయసు పైబడుతున్నవారు విటమిన్ ఈ ని ఎక్కువగా తీసుకోవాలాట. అది ఎదిగే పిల్లలకు కూడా ఎంతో అవసర పడుతుందని చెప్తున్నారు నిపుణులు.

 

ఆలివ్ నూనెలో, ఆకుకూరల్లో, పోద్దుతిరుగుడులో, నట్స్ లో, గుమ్మడికాయలో, చిలకడదుంప లో, రాక్ ఫిష్ లో, బొప్పాయి వంటి వాటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. చక్కగా ఇవన్ని తిని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ హాపీగా జీవిద్దాం.

- కళ్యాణి