విశాల్, దీపాకు ఈసీ షాక్... నామినేషన్ తిరస్కరణ..

 

సెడన్ గా ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటికి దిగి అందరికీ షాకిచ్చిన విశాల్ కు ఇప్పుడు ఈసీ షాకిచ్చింది. విశాల్ కే కాదు.. జయ మేనకోడలు దీపా జయకుమార్ కు కూడా ఈసీ షాకిచ్చింది. విశాల్ నామినేషన్ ని ఈసీ తిరస్కరించింది. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్ధికి మద్దతుగా 10 మంది స్థానిక ఓటర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అలా విశాల్ నామినేషన్ పత్రాల మీద సంతకం చేసిన ఇద్దరు అది తమ సంతకం కాదని రిటర్నింగ్ అధికారి ముందు చెప్పడంతో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు సదరు అధికారి నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు దీపా జయకుమార్ నామినేషన్ ను తిరస్కరించింది. నామినేషన్ పత్రాన్ని అసంపూర్తిగా రాసినందునే తిరస్కరిస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఆస్తుల డిక్లరేషన్ కి సంబంధించిన 26 వ ఫామ్ లోని కొన్ని కేటగిరి లను ఆమె పూర్తి చేయకుండా వదిలేశారని తెలిపారు.