కాంబ్లీ గుండెపోటు నిజమేనా?

 

 

 

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి గతంలో ఒకసారి గుండెకి సంబంధించిన సమస్య వచ్చింది. దానికి సంబంధించి చికిత్స కూడా జరిగింది. తాజాగా ఈమధ్య మరోసారి కారులో వెళ్తున్న కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. సమయానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే వుండటంతో ఆయన కాంబ్లీని అర్జెంటుగా హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కాంబ్లీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడు. ఇది అందరికీ తెలియని విషయమే..

 

అయితే కాంబ్లీ గుండెపోటు విషయంలో ఆయన గురించి బాగా తెలిసున్నవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంబ్లీ అగ్రశ్రేణి క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ  కాంబ్లీ కేరెక్టర్ ఎవరూ హర్షించే విధంగా వుండదన్న అభిప్రాయాలున్నాయి. సకల దుర్గుణాలూ, అవలక్షణాలూ వున్న కాంబ్లీ కుటుంబం నుంచి మాత్రమే కాకుండా సమాజం నుంచి స్నేహితుల నుంచి కూడా దూరమైపోయాడు. తన బాల్యమిత్రుడు సచిన్ టెండూల్కర్ కూడా కాంబ్లిని దూరంగా పెట్టాడు. గతంలో కాంబ్లి మీద ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. అన్ని రకాలుగా పతనమైపోయిన కాంబ్లి ఇప్పుడూ ఎవరికీ అవసరం లేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. సచిన్ తనను పట్టించుకోవడం లేదని గతంలో కామెంట్లు చేయడంతో సచిన్ అతన్ని పూర్తిగా కట్ చేశాడు.


తాజాగా సచిన్ రిటైరైన తర్వాత జరిగిన విందుకు కూడా సచిన్ కాంబ్లీని ఆహ్వానించలేదు. సచిన్ తనను పిలవలేదని కాంబ్లీ టీవీలో ఎక్కి మరీ బాధపడ్డాడు. కెమెరాల ముందు కన్నీరు కార్చాడు. ఇలాంటి ట్రిక్కులు ప్రదర్శించడంలో కాంబ్లి సిద్ధహస్తుడని, ఈ ఏడుపు గానీ, గుండెపోటు ఎపిసోడ్ గానీ కాంబ్లీ ట్రిక్కుల్లో భాగమేనని ఆయన గురించి తెలిసినవాళ్ళు అంటున్నారు. తనను దూరం చేసిన సచిన్‌కి మళ్ళీ చేరువ కావడానికే కాంబ్లీ గుండెపోటు ట్రిక్ ప్లే చేసి వుంటాడన్న అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్‌లో వున్న తనను పరామర్శించడానికి సచిన్ తప్పకుండా వస్తాడన్న ఉద్దేశంతోనే ఈ ట్రిక్ ప్రయోగించి వుంటాడని అంటున్నారు. కాంబ్లీని పరామర్శించడానికి సచిన్‌ని హాస్పిటల్‌కి తెచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరిగాయి. కాంబ్లీకి గుండెపోటు నిజంగా వచ్చిందో  లేదో గానీ, జనం మాత్రం ఇది ఒక డ్రామా అని అనుకుంటున్నారు. మొత్తమ్మీద ‘ట్రిక్ మాస్టర్’ కాంబ్లీ పరిస్థితి ‘నాయనా పులివచ్చే’ కథమాదిరిగా తయారైంది.