తమ రోడ్ బాగుచేయాలని వింతగా నిరసన తెలిపిన స్థానికులు...

విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు జాతీయ రహదారి పై స్థానిక గ్రామాల ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. పిల్లల్ని స్కూలుకు ఎడ్లబండి లో పంపి స్ధానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా విద్యార్థులను ఎడ్ల బండిపై పాఠశాలకు పంపిస్తూ నిరసన తెలిపారు.

రోడ్లు పాడవడం తో ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని స్థానికులు అంటున్నారు. నిరసనలో భాగంగా స్థానికులు మాట్లాడుతూ, ద్వారపల్లెం నుండి కూనేరు, కొమరేడు వరకూ నాటు బళ్ళతో పది రూపాయల చార్జీలు పెట్టి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఎందుకంటే పిల్లలు చదువులకు వెళ్ళడానికి ఇబ్బందులు పదుతున్నారని, గిరిజనులు వైద్యం అందక అవస్థలు పడుతున్నారని, రోడ్లకు బస్సులు రాని కారణంగా ఈరోజు ఇలా ప్రయాణం చేస్తున్నామని అన్నారు.

తమపై ప్రభుత్వం మొండి వైఖరిని చూపకుండా చిత్తశుధ్ధి ఉంటే వెంటనే తమ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేపట్టాలని, మరమత్తులు చేసి వెంటనే ఆర్టీసి బస్సులలో ప్రజలను ప్రయాణించేలా చేసి వారు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తుల్ని చేయమని విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.