విక్రమ్ గౌడ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత..

 

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకొని పెద్ద డ్రామా నడింపించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించింది. అయితే ఇప్పుడు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ కోసం విక్రమ్ గౌడ్ లాయర్లు కోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారించిన కోర్టు.. పిటిషన్ ను తిరస్కరించింది.